21, మార్చి 2016, సోమవారం

సమస్య – 1979 (వైధవ్యము ప్రాప్తమగుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.
(దయచేసి ద-ధ-థ ప్రాస ప్రయోగించకండి)
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. వేధించెడి పతుల వలన
    బాధలనుభవించు చుండె పత్నులు భువినీ
    బాధల సైచుట కన్నను
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘బాధ లనుభవించుచుండ్రి’ అనండి.

      తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు

    వైధేయుడు నీచుండగు
    వ్యాధుని భార్యగ నిరతము పతిచేతులలో
    బాధల నోర్చుట కంటెను
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్

    రిప్లయితొలగించండి
  3. సాధువు వలెనటి యించుచు
    వేధించగ భార్య నెపుడు వేశ్యల వెంటన్
    సాధించు భర్త కంటెను
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్

    రిప్లయితొలగించండి


  4. ఔరా! ప్రొటెస్ట్ చేస్తున్నాం :)

    బోధన జేసిరి గురువులు
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్!
    సాధన జేసె రమణులు, ధ
    నాధన బట్టిరి బడితను నాధుని వేయన్ :)

    సావేజిత
    జిలేబి


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      _/\_
      మీ పూరణ బాగున్నది.
      ‘సాధన జేసిరి సతులు ధ|నాధన...’ అనండి.

      తొలగించండి
  5. సాధించెను సావిత్రియె
    బాధాతప్త హృదయమునఁ బతికై యమునిన్
    మేధావియౌచు! తొలగెన్
    వైధవ్యము ప్రాప్తమగుట!! వరము తరుణికిన్!!!

    రిప్లయితొలగించండి
  6. వైధవ్యపు జాతకమున
    బాధను తొలగింప నొక నుపాయము గలదే !
    ఆధవు మేకను జేయగ
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. వేదననొందెడి పతిగని
    బాధను దిగమ్రింగుచుండి పతికిన్ ముక్తిన్
    సాదరముగనొసగుమనగ
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘ద-ధ’ ప్రాస ప్రయోగించవద్దని మనవి చేసాను. మీరు గమనించలేదేమో!

      తొలగించండి
  8. నాధవతి పుణ్యవతి యే
    నాధుఁడు సౌభాగ్య దాత నారీ మణికిన్
    బాధా కరమే, కాదిల
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. రాధా !నీ దురదృష్టము
    వైధవ్యము ప్రాప్త మగుట ,వరము తరుణికిన్
    దా ధవునకు ముందుగనే
    మాధవుని న్జేరు కొనుట, మంచిది కూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    బాధా పూరిత విషయము

    వైధవ్యము ప్రాప్త మగుట | వరముతరుణికిన్

    నాధుని స౦క్షేమమె | కా

    నీ ధాత లిపి యెటు గలదొ నెలత నుదుటి పై !!

    …………………………………………………………

    " బాధ పడుచు నే , దీర్ఘ

    వ్యాధి గ్రస్తు౦డ నగుచు , భార్యను గూడన్

    బాధి౦చు చు౦టి ఛీ ఛీ !

    వైధవ్యముప్రాప్తమగుట.వరము తరుణికిన్ "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. బాధాకరమే నాతికి
    వైధవ్యము ప్రాప్త మగుట.వరముతరుణికిన్,
    ఆధునిక చట్టములలో
    వైధవ్యమునన్ పునర్వివాహము కలుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. అధముడు,వ్యసనములందున
    ప్రధముడు,వ్యభిచారుడగు భర్తయుజావన్
    బుధులనిరి చిన్నిపాపకు
    వైధవ్యము ప్రాప్త మగుట వరము తరుణికిన్ {బాల్యవివాహాలుతగవనిఅనర్థాలతో చదువుసాగదని చదువుకొనటకుమార్గమైన దేవునివరమనిభావనతో నాపూరణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో గణదోషం. ‘వ్యభిచారుడైన’ అంటే సరి. ‘థ-ధ’లకు ప్రాస వేయవద్దన్నాను. అది ప్రథముడు కదా! ప్రధముడు కాదు.

      తొలగించండి
  13. సాధుజనమ్ముల దూరుచు
    బాధల బెట్టెడువిభుండు వ్యసనమ్ము లతో
    వ్యాధులతో డుతను సమయ
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. గురువర్యులకు నమస్కారములు,
    మొన్నటి నా పూరణమును కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాను. దయ చేసి చూడగలరని కోరుచున్నాను.
    ధన్యవాదములు.

    బాధించు నదియె మహిళకు
    వైధవ్యము ప్రాప్తమగుట! వరము తరుణికిన్,
    వేధించని భర్తయు నట
    సాధించని యత్త దొరకు సంసారమ్మే!

    జారి పడిన యొకడు జట్టును వీడంగ
    తలుపు తట్టు వాడు తనకు పిలుపు
    తప్పదనుచు, మదిని తలబోసె - 'నవ్వాని
    నడుము నొప్పి తెచ్చె కడు ముదమ్ము '

    రిప్లయితొలగించండి
  15. క్రోధము మోహము లోభము
    సాధన సంపత్తులనుచు సతిని కుటిలుడై
    బాధించు భర్త కంటెను
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    మాధవునకు సాత్రాజితి
    యోధనమున సాయపడు మహోద్దేశ మిదే!
    బాధల నిడు "నరకు సతికి
    వైధవ్యము ప్రాప్తమగుట" వరము, తరుణికిన్!

    రిప్లయితొలగించండి
  17. వేధించెను తలిదండ్రుల
    బాధించెను చెల్లి నకట బంధము వీడన్,
    మాధవు డాకంసు దునుమ
    వైధవ్య ము ప్రాప్త మగుట వరము తరుణికిన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. బాధాకర గతి యెయ్యది
    సాధనతో మాన్పుకొంద్రు సాధ్వులు భువిలో?
    నీ ధర నా గతి తప్పిన?
    వైధవ్యము ప్రాప్తమగుట; వరము తరుణికిన్

    రిప్లయితొలగించండి
  19. ఒక పాత పూరణ కూడా.
    కురువరుల గెలువంగను కోరి వచ్చి
    నరవరుండు తా నిలువంగ నమ్మి తోలె
    యరదమునొడుపుతోడుత, నద్భుతముగ
    నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. బాధించు పతిని బొందియు
    గాధల వివరింప బోవ గా నూరి జనుల్
    "బాధలు సహజ"మ్మన నిక
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్ .

    రిప్లయితొలగించండి
  21. క్రోధము కామాదులునౌ
    బాధించెడి యారు ధవుల భరియింపంగన్
    సాధుత్వము నొందుటకై
    వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్ :)

    రిప్లయితొలగించండి


  22. బాధా తప్త హృదయమగు
    వైధవ్యము ప్రాప్తమగుట, వరము తరుణికిన్
    రాధనము జేర్చు రీతిగ
    బోధనుడై మగడు చెంత పొందుకొనంగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి