27, మార్చి 2016, ఆదివారం

సమస్య – 1985 (కాంతుని సేవించు నాతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా.

42 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కార ములు
    మీకు విశ్రాంతి ముఖ్యము ఆరోగ్యము పట్ల జాగరూకత వహించండి

    ఎంతటి యాశ్చర్యమ్మా
    కాంతుని సేవించునాతి గయ్యాళి కదా
    వింతే! యనగను తెలిపితి
    నంతేగద భారతీయ యతివల మనసుల్ .

    రిప్లయితొలగించండి
  2. సొంతము తనకను పతినిల
    కాంతుని సేవించు నాతి,గయ్యాళికదా
    పంతము బూనిన పతిగని
    వింతగ పోట్లాడు నంట వేడుక యనుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      పద్యం పూర్వార్ధంలో ‘పతి’నిల ‘కాంతుని’ సేవించు... అని పునరుక్తి. ‘సొంతము తనకని తలచుచు’ అందామా?

      తొలగించండి
  3. శుభోదయం


    శాంతుడు శంకరు డొకపా
    దాంతము నిచ్చును జిలేబి దానికి మరి రా
    ద్ధాంతము మూడన జేర్చున్
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా‌ ! :)

    రిప్లయితొలగించండి
  4. సొంతము తను నా వాడను
    పంతమ్మున 'పారిజాత' ప్రాప్తియె కరువై
    చింతించు సత్య మన శ్రీ
    కాంతుని సేవించు నాతి! గయ్యాళి కదా!

    రిప్లయితొలగించండి
  5. ఇంతి వెరపింతయు గనకఁ
    బంతము బూని తన మాట పాడియ యనుచున్
    వింతగ దూషించుచు నిక
    కాంతుని సేవించు నాతి! గయ్యాళికదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. సుంతయు జాలిని జూపక
    వింతగ సినిమాల సూర్యకాంతము నిలుచున్
    శాంతిని నిజజీవితమున
    కాంతుని సేవించు నాతి! " గయ్యాళి " కదా!

    రిప్లయితొలగించండి
  7. కాంత లలో మిన్నయె యిల
    కాంతుని సేవించు నాతి ,గయ్యాళి గదా
    సాంతము చిరుబురు లాడుచు
    సుంతైనా శాంతి యీని సుదతులు భువినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘గయ్యాళి’ ఏకవచనం కదా! ‘సుంతైనను శాంతి నీని సుదతి యీ భువిన్’ అనండి.

      తొలగించండి
  8. ఇంతులతో తిరిగెడు తన
    కాంతుని పద సేవనమని, కట్టడి జేయన్
    వింతగ పద తాడనమున
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా

    రిప్లయితొలగించండి
  9. శాంతియు సుఖమును గోరెడి
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా
    పంతము చేయక యుండిన
    సంతసమున నాలు మగల సౌఖ్యము హేచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. శాంతిని గోరుచు సతతము
    కాంతుని సేవించు నాతి;గయ్యాళి కదా
    సాంతము చెప్పెడిది వినక
    పంతముతో ననవరతము పతినిల తిట్టున్.
    సంతసమనునది లేకయె
    కాంతుని సేవించునాతి గయ్యాళి కదా
    పంతంబులు మాని మనిన
    సంతోషము సొంత మగును సరసత హెచ్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. . అంతా శివమయ మనుకొని
    చింతించక గంగ శివుని శిరమున జేరన్
    పంతంబందున పార్వతి
    కాంతునిసేవించు నాతిగయ్యాళికదా| {పరుగులుబెట్టుచుఅరచెడిగంగమ్మగయ్యాళిగదా?}
    2.బ్రాంతి|తులాభారమ్మున
    కాంతునిసేవించు నాతి గయ్యాళి కదా?
    పంతంబందున పతినే
    చింతించక నమ్మె సత్య శ్రీ కృష్ణుడినే|

    రిప్లయితొలగించండి
  12. సుంతయు ప్రేమను జూపక
    పంతము లాడుచును సతము పతియన మర్యా
    దింతయు ప్రకటించక పర
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా

    రిప్లయితొలగించండి
  13. శాంతపు మూర్తియగు పతికి
    సుంతయు గౌరవ మిడక ను శుంఠగ గనుచున్
    చింతించుచు సతతము పర
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. సంతతము పతిని దూరుచు
    నింతేనియు లోకరీతి నెరుగడటంఛున్
    మెంతులు మిరియపు పొగతో
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. నిన్నటి సమస్యకు పూరణ
    సౌమిత్రీ మూర్ఛ నొందగ
    రాముడు కన్నీరు గార్చె.రావణుడలరన్,
    ప్రేముడి సంజీవ కరణి
    నా మారుతి తెచ్చె.రాము డను మోదించెన్.

    రిప్లయితొలగించండి
  16. శాంతముతో నడచుకొనుచు
    కాంతుని సేవించు నాతి, గయ్యాళి కదా
    వంతులు పోవుచు సతతము
    పంతము నెగ్గించుకొనెడి భార్యామణియే!!!



    సంతస మన్నదిలేకను
    చింతలు కలిగించుచుండు చిడిముడిపడుచున్
    పంతము నెగ్గించుకొనుచు
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా!!!

    రిప్లయితొలగించండి
  17. వింతయగు రోగ మొక్కటి
    యెంతయొ బాధింప మంచమే గతి కాగా
    చింతింపక గొణుకుకొనుచుఁ
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ కరుణా రసపూరితమై కమనీయముగనున్నది. కొనుచుఁ / “కాం” ని “గాం” గా మార్చుట మరచినట్టున్నారు.

      తొలగించండి
  18. కొంతయు సేవను జేయక
    పొంతము పొత్తుయును లేక పోరుచు నెపుడున్
    వింత కషాయమ్మోయన
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా!

    సేవించు =
    1. కొలుచు
    2. త్రాగు

    రిప్లయితొలగించండి


  19. శాంతము నకు పేరగునా
    కాంతుని సేవించు నాతి, గయ్యాళి కదా,
    గెంతును నటునిటులు సుమీ
    బంతి వలె దొరలుచు పొరలు పతినిగ నంగన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. పంతులును పెండ్లి యాడుచు
    గంతుల తోడన్ పరిపరి గాఢపు ప్రేమన్
    జంతువు వోలుచు పైబడి
    కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా

    రిప్లయితొలగించండి