29, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1987 (ధర్మజునకుఁ గన్నతల్లి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధర్మజునకుఁ గన్నతల్లి ద్రౌపది యందున్. 
ఈ సమస్యకు ప్రేరణ నిచ్చిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. 

43 కామెంట్‌లు:

  1. మర్మము తెలియని కుంతియె
    ధర్మజునకుఁ గన్నతల్లి , ద్రౌపది యందున్
    ధర్మసతి పాండవులకట
    నిర్మలమగు మనసు తోన నెమ్మిని కొలువన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మనసుతోడ.... అనండి.

      తొలగించండి
    2. మర్మము తెలియని కుంతియె
      ధర్మజునకుఁ గన్నతల్లి , ద్రౌపది యందున్
      ధర్మసతి పాండవులకట
      నిర్మలమగు మనసు తోడ నెమ్మిని కొలువన్ !

      తొలగించండి
  2. గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములతో నేటి సమస్యకు నా పూరణలు

    1.
    పేర్మిని గలిగిన కుంతియె
    ధర్మజునకు గన్నతల్లి ద్రౌపది యందున్
    దుర్మతులగు కౌరవ దు
    ష్కర్మల కేవగచినట్టి కాంతయే గాదే.

    2.
    పాండవులు వనవాసమునకు బయలుదేరిన వేళ కుంతి ద్రౌపదికి హితోపదేశము చేసినదను ఊహతో

    నిర్మల చరితను గలిగిన
    ధర్మజునకు గన్నతల్లి ద్రౌపది యందున్
    పేర్మిని వీడక తా సతి
    ధర్మముబోధించె నంట దైన్యము తోడన్

    పేర్మి = గౌరవము

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  4. నిర్మల మనస్కుడగ్రజు
    ధర్మజునకుఁ గన్నతల్లి, ద్రౌపది యందున్
    కర్మజులందున్, ఆ కృత
    కర్ముల యందున్ అపార కరుణయు లావే !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కర్మలయందును నారాయణ.. అనండి.

      తొలగించండి
  5. ధర్మముఁ దప్పక సతి ష
    ట్కర్మల సేవించి మిగులఁ గమ్మగఁ గుడుపన్
    నిర్మలముగ నగుపించెను
    ధర్మజునకు కన్నతల్లి ద్రౌపతి యందున్(నందున్)!

    రిప్లయితొలగించండి
  6. నిర్మల మనస్వి కుంతియ
    ధర్మజునకు గన్న తల్లి, ద్రౌపది యందున్
    వర్మా !ద్రుపదుని సుతనే
    ధర్మ జుని న్బెండ్లి యాడి తనయుల గనియెన్

    రిప్లయితొలగించండి
  7. ధర్మము లెరిగిన కుంతియె
    ధర్మజునకుఁ గన్నతల్లి, ద్రౌపది యందున్
    దుర్మతులగు కౌరవులను
    ధర్మముగా మట్టుబెట్టు ధర్మజు సతియే!!!

    రిప్లయితొలగించండి
  8. ధర్మ విహీనుడు ద్రౌణుని
    కర్మ హతుండు ప్రతివింధ్యు కాల వివశునిన్
    మర్మ విహీను, కుమారుడు
    ధర్మజునకుఁ, గన్నతల్లి ద్రౌపది యందున్.

    రిప్లయితొలగించండి
  9. నర్మము పాలౌదుననుచు
    మర్మము దాచినది యెవరు? మరి సభ నెవరో
    దుర్మతిచే నీడ్వబడెను?
    ధర్మజునకుఁ గన్నతల్లి, ద్రౌపది యందున్.

    రిప్లయితొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ( ఒక నాట్యమ౦డలి వారి నాటకములో
    కొడుకు = ధర్మరాజుగా | అతని తల్లి ద్రౌపది గా నటి౦చి జీవి౦చిరి }

    " ధర్మన " యను సుతు డాడెను

    ధర్మజునకు | కన్న తల్లి ద్రౌపది య౦దున్

    నిర్మలముగ జీవి౦చెను

    " వర్మానాటకము " వారి భారత కథలో

    { సుతుడాడెను ధర్మజునకు = కొడుకు ధర్మరాజు పాత్ర పోషి౦చెను ; ద్రౌపది య౦దున్ = ద్రౌపది పాత్రలో }

    రిప్లయితొలగించండి
  11. మర్మము గాదిది కుంతియె
    ధర్మజునకు కన్నతల్లి|”ద్రౌపది యందున్
    నిర్మల ప్రేమను బెంచిన
    ధర్మాత్ముడు ధర్మరాజుధరణీ పతియే”|

    రిప్లయితొలగించండి
  12. నిర్మల చిత్తము గల్గిన
    ధర్మజునకు కన్నతల్లి;ద్రౌపది యందున్
    ధర్మము గురించి యట దు
    ష్కర్ముల గూర్చినిలదీసె సభలో పేర్మిన్.

    రిప్లయితొలగించండి
  13. నిర్మలముగ కనిపించెను
    ధర్మజునకుఁ గన్నతల్లి ద్రౌపది యందున్.
    ధర్మము తప్పక నడవిని
    కూర్మిని తన కర్మ గతులు కొనసాగించెన్.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులందఱకు నమస్సులు!

    [ఉపాధ్యాయుఁడు పాండవుల సుతుల గుణగణములనుం గూర్చి తెలిపి, ధర్మరాజు కొడుకుం గూర్చి తెలుపుమని యొక బాలకుని నడుగఁగా, నా బాలుఁడు వచించిన సందర్భము]

    "ధర్మనిభుఁడు ప్రతివింద్యుఁడు!
    ధర్మజ సుతుఁ డతఁడు! తండ్రి తదుపరి తానే
    ధర్మజుఁ డన! నా యభినవ

    ధర్మజునకుఁ గన్నతల్లి ’ద్రౌపది’ యందున్!"


    రిప్లయితొలగించండి
  15. మర్మం బెరుగని కుంతియె
    ధర్మజునకుఁ గన్నతల్లి; ద్రౌపది యందున్
    నిర్మలు లైదుగురు గలిగి
    కర్మంబని కాళ రాత్రి గాంచిరి మిత్తిన్

    రిప్లయితొలగించండి
  16. కర్మకు వగవక దెల్పెను
    ధర్మజునకు కన్నతల్లి,ద్రౌపది యందున్
    నిర్మలబుద్ధిని జూపుచు
    ధర్మప్రవర్తనముతోడ ధరనేలుమనెన్.
    ఇదోసారి చూడండన్నయ్యగారూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  17. నిర్మల మనమున రాగా
    కర్మము నొనరించి గెలిచి కౌరవతతినే
    శర్మా ! హారతినిచ్చిరి
    ధర్మజునకుఁ గన్నతల్లి, ద్రౌపది యందున్.

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులకు మనవి...
    నా ఆరోగ్యం దినదినం క్షీణిస్తున్నది. మందులు వాడుతున్నా తగ్గడం లేదు. కొన్ని రోజులు కేవలం సమస్యను మాత్రమే ఇవ్వగలను. సమీక్షించడం వీలుకాకపోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. సాధ్యమైనంత వరకు నేను మీ పూరణలను సమీక్షిస్తాను. సహకరించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  19. కర్మమ్మున బెంగాలున
    శర్మముతో పెరిగి నేను శాస్త్రము లందున్
    మర్మమ్ముల తెలియకనే
    ధర్మజునకుఁ గన్నతల్లి ద్రౌపది యందున్ :)

    శర్మము = ఆనందము

    రిప్లయితొలగించండి


  20. మర్మంబేమియు లేదయ
    ధర్మజునకుఁ, గన్నతల్లి, ద్రౌపది, యందున్,
    నైర్మల్యంబైన మమత
    శర్మా గానదగు చూడ చక్కగ సుమ్మీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి