21, జులై 2016, గురువారం

సమస్య - 2093 (సన్యాసికిఁ బిల్ల నిచ్చి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
“సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్”

105 కామెంట్‌లు:

  1. ధన్యమగును జీవితమని
    కన్యాదానమ్ము జేసి కామితమందన్
    అన్యోన్యతకై దెలిసిన
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మొదటి రెండు పాదాలు సరే... కాని ‘అన్యోన్యతకై దెలిసిన సన్యాసికి...’ అర్థం కాలేదు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు... తెలిసిన సన్యాసికి పిల్లనిస్తే...వారిరువురి మధ్య అన్యోన్యత వుంటుంది గదా యని నా యుద్దేశ్యము... అన్యోన్యత అంటే పరస్పరత, సఖ్యత అనుకున్నాను...వాడుకలో "వారిరువురి అన్యోన్యంగా వున్నారు" అంటారుగదా.

      తొలగించండి
    3. సన్యాసికి పెళ్ళేమిటనా.... సరిగా చెప్పలేకపోయానేమో... మన్నించండి

      తొలగించండి
    4. ‘సన్యాసి’ అనే పేరు గల మేనల్లునకు ఇచ్చినట్లు వ్రాద్దామా? ‘మాన్యుఁడు మేనల్లుం డగు| సన్యాసికి...’ అందామా?

      తొలగించండి
  2. మాన్యంబు,నాదు కవితా
    కన్యను మీకిత్తుననుచు గౌరవమెసఁగన్
    ధన్యతఁ శంకరులకునిడె
    సన్యాసికిఁ బిల్లనిచ్చి సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సన్యాసికిఁ బిల్లనిచ్చు సాహసమిదియే అన్న నరంసింహారావు గారి సాగరఘోష పద్యాన్ని గుర్తు చేశారు. ధన్యవాదములు

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      సన్యాసికి కావ్యకన్య నిచ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ధన్యత’ తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు. అక్కడ ద్రుతలోపం జరుగదు.

      తొలగించండి
    3. ఊకదంపుడు గారూ,
      మీ జ్ఞాపకశక్తికి జోహార్లు! నిన్న సాయంత్రం గరికిపాటి వారి ‘సాగరఘోష’ చదువుతున్నపుడు వారు తమ కావ్యాన్ని ఆదిశంకరాచార్యుల వారికి అంకితమిస్తూ చెప్పిన పద్యం నా సమస్యకు ఆధారమయింది. ఆ పద్యం ఇది...

      కన్యాదానము చేసెడి
      ధన్యత చేకూరలేదు; తప్పదు కవితా
      కన్యాదానము చేసెద;
      సన్యాసికి పిల్లనిచ్చు సాహస మిదియే.

      తొలగించండి
    4. శ్రీఊకదంపుడు గారికి,
      నమస్సులు, ధన్యవాదాలు.

      గురువుగారికి నమస్సుమాంజలి.
      అర్ధానుస్వారముల మీద కొంచెము గట్టిగానే కష్టపడవలసి ఉన్నది.

      తొలగించండి


  3. కన్యామణి బెండ్లిన నా
    కన్యాయము చేయవలదు కాశీ యాత్రన్
    సన్యాసి విడవలె యనుచు
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పెండ్లి తంతులో ఆహ్లాదకరమైన ఘట్టాన్ని గుర్తు చేస్తూ మంచి పూరణ చెప్పారు.
      కాకుంటే కొంత అన్వయలోపం ఉంది. పూరణలో కర్తృపదం లోపించింది. ‘పెండ్లిని’, ‘వలె ననుచు’ అనాలి. పద్యాన్ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది?

      కన్యాజనకుం డల్లున
      కన్యాయము చేయవలదు కాశీయాత్రన్
      సన్యాసము విడవలె నని
      సన్యాసికిఁ బిల్లనిచ్చి సంబరపడియెన్.

      తొలగించండి
    2. ఎందుకో నా పద్యంకూడ సంతృప్తికరంగా లేదు. ఏదో లోపం ఉన్నట్టుంది!

      తొలగించండి


    3. ధన్యవాదాలండీ కంది వారు !

      అయ్యరు, జిలేబి లేకుంటే పెండ్లి శోభించదు మరి :)


      మాన్యుడగు నయ్యరడిగెను
      కన్యామణి యీ జిలేబి కావలెను !అసా
      మాన్యుడగు శర్మయు అరవ
      సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్


      జిలేబి

      తొలగించండి
    4. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. సన్యాస మేల వలదని
    కన్యా దానమ్ము జేసి కానుక నీయ
    న్నన్యాయము గాశి యాత్ర
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మంచి అంశంతో పూరణ చెప్పారు.
      మూడవపాదంలో గణదోషం. ‘కానుక లీయన్| మాన్యుండగు నా కుహనా| సన్యాసికి..’ అందామా?

      తొలగించండి
  5. మాన్యుం డా హిమవంతుడు
    ధన్యత్వము నందగోరి, తన్మయుడయి తా
    నన్యుల కందక తిరిగెడు
    సన్యాసికి పిల్లనిచ్చి సంబరపడియెన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  6. అన్యాయము నొంటరనే
    విన్యాసములాడ కుక్కపిల్లను జూపెన్,
    పుణ్యమొసగును గలిపినని
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుతున్నది.
      పద్యం లక్షణంగా ఉంది. కాని ‘ఒంటరనే.. గలిపినని’ అన్న పదాలు అన్వయం కుదరక భావం అర్థం కాకుండా ఉంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు.ప్రయత్నిస్తానండీ. "జూసెన్" అంటే సరిపోతుంది అంటారా?

      తొలగించండి
    3. అన్యాయము నొంటరనెడి
      విన్యాసములాడ కుక్కపిల్లను జూసెన్,
      పుణ్యమొసగు తోడుంచిన
      సన్యాసికి, బిల్లనిచ్చి సంబరపడియెన్!

      తొలగించండి
    4. మల్లేశ్వర రావు గారూ,
      ఇప్పుడు పద్యం కొంత గాడిన పడింది. సంతోషం! తోడుంటుందని సన్యాసికి కుక్కపిల్ల నిచ్చారన్న మాట... బాగుంది. ‘అన్యాయముగా నొంటిగ...’ అనండి.

      తొలగించండి
    5. మీ చేయూతకు ధన్యవాదములండి.
      అన్యాయముగా నొంటిగ
      విన్యాసములాడ కుక్కపిల్లను జూసెన్,
      పుణ్యమొసగు తోడుంచిన
      సన్యాసికి, బిల్లనిచ్చి సంబరపడియెన్!

      తొలగించండి
  7. కన్యామణి పెండ్లి దలప
    మాన్యుండొక వరుడు దొరికె మరకతమల్లే
    సన్యాసియె నామమటన్
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మరకతమల్లే’ అనడం గ్రామ్యం. ‘మరకతము వలెన్’ అనండి.
      మీ పూరణ ‘పూజ్యులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు’ గారిని గుర్తుకు తెచ్చింది.

      తొలగించండి
    2. గురువుగారూ, ధన్యాలు. మారుస్తాను మీరు చెప్పినట్టుగా. మా స్నేహితుడు, తూ.గో.జిల్లా వాసి, సన్యాసి రావుని గుర్తుతెచ్చుకుని పద్యము వ్రాసాను.

      తొలగించండి
  8. సన్యాసి పేర నొప్పుచు
    విన్యాసము లెన్నియో వి విధరకములుగన్
    ధన్యత నొందగ జేయుత
    సన్యాసికి బిల్ల నిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జేయుత’ను ‘జేయగ’ అనండి.

      తొలగించండి
  9. కన్యా రత్నము నివ్వను
    అన్యాయము నేను యొప్పననగా; పట్టున్
    మన్యానికి జనె పార్వతి;
    సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్
    (శివుని కొరకు పట్టుబట్టి తపము జేసిన కుమార్తెను
    పరమేశ్వరునితో వివాహము జరిపించెనను అర్ధముతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటప్పయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఇవ్వను అన్యాయము’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘రతమ్ము నొసగ| నన్యాయము..’ అనండి.

      తొలగించండి
  10. ధన్యత నందగ సేవలు
    కన్య సభద్ర సరి జేయ కరివరదుండా
    యన్యోన్యుడు ఫల్గుణుడౌ
    సన్యాసికిఁ బిల్లనిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుభద్రాకళ్యాణ ఘట్టాన్ని తీసికొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి

  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { తన ఏకైక పుత్రిని అన్యున కియ్య నిష్టపడని మేనమామ , అ౦తట వెదకి , సన్యాసత్వము విడిచిన మేనల్లునికే పిల్ల నిచ్చెను }


    మాన్యు డగు మాతులు డొసగ

    డన్యున కేకైక పుత్రి | న౦త వెదకుచున్ ,

    సన్యాసత్వము వదలిన

    సన్యాసికి బిల్ల నిచ్చి స౦బరపడియెన్ !


    { మాతులుడు = మేన మామ }

    రిప్లయితొలగించండి
  12. సన్యాసి వేషధారియై
    విన్యాసముజూపు" నరుడు"వేడగ హరియే
    ధన్యత జెందసుభద్రన్
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సముద్రాల వారూ,
      సుభద్రా కళ్యాణం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'వేషధరుడై' అనండి.

      తొలగించండి
  13. ధన్యుండా జనకుడు ధన
    ధాన్యము లెంచకయె శారదా దేవిని స
    న్మాన్యుండు రామకృష్ణకు
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      శారదా రామకృష్ణ పరమహంసల వివాహం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీకు జ్వరము తగ్గినట్లు తలుస్తాను. మన మీ వయస్సులో ఆహార విషయములో జాగ్రత్త వహించిన సరిపోతుంది.

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారూ,
      కొద్దిగా నెమ్మదించింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  14. ధన్యుండనౌదు నంచును
    మాన్యుంండగు మాధవయ్య మహితకు వరునిన్
    అన్యుండెయైన దుర్గుణ
    సన్యాసిని బిల్లకిచ్చి సంబరపడియెన్.

    రిప్లయితొలగించండి
  15. పొరబాటుగా...సన్యాసికి బదులు సన్యాసిని. అని పడినది.

    రిప్లయితొలగించండి
  16. నాల్గవపాదం మొత్తము. మరల వ్రాస్తున్నాను. క్షమింపగలరు.
    సన్యాసికి పిల్లనిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
  17. కన్యామణికి వరు వెదికి
    ధన్యుండయ్యెను పుడమిన తండ్రియు తానున్
    సన్యాసి పేరుగల యా
    సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పుడమిని అనండి.

      తొలగించండి
  18. సన్యాసి / సన్న్యాసి రెండు రూపములు సరియైనవేనా విజ్ఞులు తెలియజేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుత్త్రుడు - పుత్రుడు ; పుత్త్రిక - పుత్రిక; మిత్త్రుడు - మిత్రుడు వలె సన్న్యాసి - సన్యాసి సాధువే (అని నా అభిప్రాయం).

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారు పొరబడినట్లున్నారు. "సత్+న్యాసి=సన్న్యాసి" వర్గానునాసికాదేశమున నగును. సన్యాసి కాదు.

      సన్యాసము, సన్న్యాసము రెండును సాధువులేయని గురువు గారి యభిప్రాయము తో ఏకీభవిస్తున్నాను.
      న్యాసము నకు ఉంచ బడిన, విడిచిపెట్టిన (వేదాంత పరముగ) అని రెండర్థములు గలవు.
      ఉపన్యాసము; విన్యాసము; కరన్యాసము; అంగన్యాసముల వలె సన్యాసము కూడ అర్థవంతమైన పదము.
      "సత్+న్యాసి=సన్న్యాసి కూడా సాధువే
      పుత్ +త్ర = పుత్త్ర; పుత్త్రుడు
      మిత్త్రుడు విషయము బోధపడుట లేదు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ‘మిత్రుడు’ శబ్దం విషయంలో నేను పొరబడ్డాను. మన్నించండి.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మిత్రుడు శబ్దమున సందేహము తీరినది. ధన్యవాదములు.
      మల్లీశ్వర రావు గారు ధన్యవాదములు.

      తొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. 'సన్యాసి జ్ఞానవంతుడు' అనండి.
      రెండవ పూరణలో 'సూన్యుని'?

      తొలగించండి
  20. అన్యులు వలె గాకను జన
    మాన్యుడు తన సుతను మిగుల మహితోన్నతు సా
    మాన్య సుజనునకు దుర్గుణ
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి వారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      అన్యుల వలె... అనండి.

      తొలగించండి
  21. కన్యాకుమారి పెంచిన
    గున్యాయను కుక్కయొకటి కూనల బెట్టన్
    ధన్యత గూర్చుననుచు నో
    సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
  22. మాన్యులు విస్సన్న గారికి నమస్సులు. సత్+న్యాసి=సన్యాసి.సూ..కచటతప,లకు న,మ,లు పరమగునపుపుడు వాని అనునాశికాక్షరములే వచ్చును.అనునాశిక సంధి. న్యాసము అనగా విడచుట.అది సాధువు. ఇక "న్న్యాస" పదము నాకు తెలిసి లేదు. కనుక "సన్యాసి"పదమే సాధువు.

    రిప్లయితొలగించండి
  23. ధన్యత జెందగ నాయన
    యన్యాయపు విత్త మన్న నంటక ధరలో
    మాన్యుండగు సత్యాహిం
    సన్యాసి కి బిల్ల నిచ్చి సంబర పడియెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమాసంలో హింసాన్యాసికి... అవుతుంది కదా! హింసాప్రవృత్తి, హింసాకాండ, హింసాకార్యం... ఇవి మనకు తెలిసినవే.

      తొలగించండి
    2. గురువుగారూ, మీరు చెప్పిన మూడు ఉదాహరణలు హింస అనే పదాన్ని విశేషణంగా వాడటం చేత "స"కి ఆ దీర్ఘం వచ్చిందని నా అభిప్రాయం. మరి మిస్సన్నగారు అలా వాడలేదు కదా. ఇక్కడ మీరన్నది వర్తిస్తుందా అని నా అనుమానం.

      తొలగించండి
    3. గురువుగారూ సత్యాహింసలను న్యాసము చేసిన వాడు అనే భావంతో సత్యాహింసన్యాసి అని అన్నాను. రఘురామ్ గారు చెప్పి నట్లు మీరన్న సూత్రం మరి యిక్కడ వర్తిస్తుందా అన్న నా సందేహాన్ని మళ్ళా మీరే తీర్చాలి.

      తొలగించండి
    4. తంగిరాల రఘురామ్ గారూ ధన్యవాదాలు.

      తొలగించండి
    5. రఘురామ్ గారు విశేషణము వలన "స"కి ఆ దీర్ఘం రాలేదు. అవి సాంస్కృతిక (సిద్ద) సమాసములు. "హింస" ఆ కారంత స్త్రీ లింగ పదము. దీనితో మరియొక సంస్కృత పదముతో సమాసము చేసిన "హింసా" యని దీర్ఘము తోనే చేయాలి. "హింస" తెలుగు పదము గా తీసుకున్న (తత్సమము) "హింస న్యాసి" ని మిశ్రమ సమాసము గా తలుప వచ్చును. కానీ సత్యాహింస అన్న సిద్ద సమాసముతో దీనిని సమసిస్తున్నప్పుడు మిశ్రమ సమాసమవదు. తప్పని సరిగా సిద్ద సమాసమే చేయాలి. అప్పుడు "సత్యాహింసాన్యాసి" అన్నదే సాధువు.ఇది నా భావము. గురువు గారు విశ్లేషించ గలరు.

      తొలగించండి
    6. కామేశ్వరరావు గారూ ధన్యవాదాలండీ

      తొలగించండి
  24. సన్యాసి యను పేరు గలవానికి.....

    అన్యులకు సాయపడుచున్
    ధన్యతను గడించుకొనెడి ధర్మాత్ముండౌ
    మన్యంలో నివసించెడు
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరబడియెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మన్యములో' అనండి.

      తొలగించండి
  25. మన్యమున మలయు యతియని
    కన్యను పంపె హలదరుడు కరసేవ నిడన్
    ధన్యుడవని పొగడ హరి
    సన్యాసికిఁబిల్ల నిచ్చి సంబర పడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'పొగడగ' అనండి. హలధరుడు... హలదరుడు అయింది.

      తొలగించండి
  26. గురువుగారికి ధన్యవాదములు గణభంగమైనది గమనించలేదు మన్నించడి మీసూచనతొ మార్చుచున్నాను

    రిప్లయితొలగించండి
  27. గౌరవనీయులు కామేశ్వరరావు గారికి నమస్సులు. మీ వివరణతో ఏకీభవిస్తున్నాను. పొరబాటుకు క్షంతవ్యుడను. సూత్రాధారముగా కూడ అనునాశిక వచ్చినది.పొరబడ్డాను.

    రిప్లయితొలగించండి
  28. పొరబాటును సూచించినందులకు ధన్యవాదములు. గురువుగారు శంకరయ్యగారికి కూడ క్షమాపణలు.

    రిప్లయితొలగించండి
  29. 'సన్యాసి ' యనెడు హితు నొక
    కన్యారత్నము వరించగా నట పితరుం
    డన్యాయ మనక సిరిగల
    సన్యాసికి బిల్ల నిచ్చి సంబర పడియెన్!
    (సన్యాసి యనెడు = సన్యాసి యను పేరు గల)

    రిప్లయితొలగించండి
  30. కన్యలతో క్రీడించు సు
    కన్య దొసగు చే మహర్షి కనులను పొడువ
    న్నన్యాయము బాపగ పిత
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబర పడియెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సుకవులు మాన్యులు తిమ్మాజీ రావు గారూ...నమస్సులు!
      నేనును సుకన్య యంశమునే స్వీకరించి పూరించితిని. కాకతాళీయముగ మన యిద్దఱ పూరణములును ఒక్క యంశమునే యాధారముగఁ జేసికొనినవి. నా పూరణము కన్నను మీ పూరణమే బాగుగనున్నదనిపించుచున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. గురుదేవులు శంకరయ్యగారికి,సుకవి మిత్రులు మధుసూదన్ గారికి నమోవాకములు
      నాపూరణ మీమెప్పును పొండినందుకు కృతజ్ఞతలు

      తొలగించండి
  31. శ్రీకందిశంకరయ్యగురువర్యులకువందనాలతోనాసవరణ
    21.7.16.సన్యాసి జ్ఞాన వంతుడు
    సన్యాసికి పదవిగలదు|సంఘము నందే
    సన్యాసి మంచివరుడని
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్| {సన్యాసియనెడి పేరుగల వరుడికి}
    2.మాన్యములెన్నో గలిగిన
    మాన్యుడు సన్యాసి|తండ్రి మంత్రియు గాగా
    అన్యాయస్తునికంటెను
    సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్. {సన్యాసియనుపేరుగల వ్యక్తికి}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  32. విన్యాసములను జేయుచు
    కన్యను చేబట్ట క్రీడి ఘనయతి కాగా ,
    నన్యాయపు రీతి హరియె
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్

    మన్యువుతో శివుడుండఁగ
    కన్యగ పార్వతియె మగని కామించగన్
    ధన్యుడ ననుచు గిరీశుడు
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కామించంగన్' అనండి.

      తొలగించండి
  33. సన్యాసి యనుచు కొలిచిన
    కన్యా రత్నపు మనసును కవ్వడి గెలవన్
    కన్యా దానము జెయుచు
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
  34. పార్వతి తపస్సు ---
    వన్యముల నడుమ భూధర
    కన్య శివునికై తపస్సు కఠినము చేసెన్,
    అన్యోన్యతకై హిమవత్
    సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్!

    రిప్లయితొలగించండి
  35. సన్యాసి నామ మైనను

    మాన్యుడు, గుణవంతుడనుచు మనసునకే ప్రా

    ధాన్యము నిడి తండ్రి యొకరు

    సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్.

    రిప్లయితొలగించండి
  36. సన్యాసి నామ మైనను

    మాన్యుడు, గుణవంతుడనుచు మనసునకే ప్రా

    ధాన్యము నిడి తండ్రి యొకరు

    సన్యాసికి బిల్లనిచ్చి సంబర పడియెన్.

    రిప్లయితొలగించండి
  37. మిత్రులందఱకు నమస్సులు!

    మాన్యుఁడు శర్యాతి, సుత సు
    కన్యయె వనమందు మౌనిఘనుఁడగు చ్యవనున్
    దా న్యూన పఱుప, నపు డా

    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్!

    రిప్లయితొలగించండి
  38. నా రెండవ పూరణము:

    [రోమపాదుఁడు తన దేశమందు వర్షపు రాకకై ఋష్యశృంగుని రప్పింపఁగా నాతని తండ్రి కోపించి శపించునేమో యని శంకించి, తన కొమరిత శాంత నాతని కిచ్చి వివాహము జరిపించిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది]

    మున్యాశ్రమమందుండెడు
    ధన్యుని నా ఋష్యశృంగుఁ దరలింప వెసన్
    మాన్య ముని చలముఁ బాపఁగ

    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్!

    రిప్లయితొలగించండి
  39. సన్యాసి,సన్న్యాసి పదప్రయోగం మీద నా సందేహానికి వివరణాత్మక సమాధానాన్ని చెప్పివ గురువు గారికి, శ్రీయుతులు పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారికి, పోచిరాజు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  40. తెలుసుకోవాలనే ఆసక్తితో ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున్నాను. దయచేసి మిత్రు లెవరూ అపార్థం చేసుకోవద్దని మనవి. ఋషి ని సన్యాసి కి పర్యాయ పదంగా వాడవచ్చునా?

    రిప్లయితొలగించండి
  41. మిస్సన్న గారూ మంచి సందేహం.... తెలిసిన వారెవరైనా వివరించగలరు....అలానే "ముని" కూడా...

    రిప్లయితొలగించండి
  42. ఋషి అన్న పదానికి పర్యాయపదంగా ముని అని వాడవచ్చును.
    సన్యాసి అన్నది ఋషికి పర్యాయపదం కాదు.

    సన్యాసం అనేది ఒక ఆశ్రమథర్మం. అవివాహితులైతే తలిదండ్రుల అనుమతితో‌ సన్యసించవచ్చును. వివాహితులైతే భార్య అనుమతి తప్పని సరి. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వ్యక్తికి ఆ జన్మ ముగిసినట్లే భావించి ఉచిత కర్మకలాపం నిర్వహించి దీక్ష ఇస్తారు. సన్యాసి మరొక జన్మ ఎత్తినట్లే లెక్క. దీక్షాగురువులు కొత్తపేరును కూడా ఇస్తారు. పాతజన్మ ముగిసింది కాబట్టి దానికి సంబంధిచిన అనుబంధాలు అన్నీ‌ విడిపోయినట్లే. సన్యాసి ఒక పూర్వాశ్రమంలోని తల్లికి నమస్కరించాలి తప్ప మిగతా బంధుమిత్రాదులు ఇతరులూ పాత సంబంధాలతో నిమిత్తంలేకుండా సన్యసించిన వారికి నమస్కరించ వలసి ఉంటుంది.

    ఋషి లేదా మునికి తపోవృత్తి ముఖ్యవిధి. మునులు ఏ ఆశ్రమస్థితిలో ఐనా ఉండవచ్చును. గృహస్థులు కూడ కావచ్చును - వశిష్టాది సప్తర్షులు భార్యలతో ఉండే వారే కదా. ఒక ఋషి చివరకు ఉపనయనాది సంస్కారం కూడా కాని వాడు కావచ్చును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారూ అద్భుతమైన మీ వివరణకు ధన్యవాదాలండీ.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు తాడిగడప వారికి....మిస్సన్న గారికి నమస్సులు!
      తాడిగడపవారూ...చక్కని వివరణ నిచ్చారు. అభినందనలు...ధన్యవాదాలు!

      తొలగించండి
  43. శ్యామలీయం గారికి నమస్సులు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  44. మాన్యుండగు శ్రీమంతుం
    డన్యాయముజేసి దోచ నన్యుల ధనముల్
    ధన్యుండౌచును కాంగ్రెసు
    సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్

    రిప్లయితొలగించండి