24, జులై 2016, ఆదివారం

సమస్య - 2096 (పురుషునిఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

“పురుషునిఁ బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్”
లేదా...
“పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా”

45 కామెంట్‌లు:

  1. పురుషుడొకండు విద్యలను పొందగ దాల్చెను బ్రహ్మచర్యమున్
    పురుషుడొకండు జ్ఞానమున పూనె విరాగముచే త్రిదండమున్
    పురుషుడొకండు తాపసిగ మోక్షము కోరి మదిన్ తలంచె సత్
    పురుషునిఁ, బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్!!

    రిప్లయితొలగించండి
  2. సురలకు మధువును పంచగ
    హరియట మోహినిగ మారి హాసము నిడగన్
    హరుడును మోజుగ బ్రమపడి
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా !

    రిప్లయితొలగించండి
  3. సరసమొ విరసమొ దెలియదు
    పరుషంబగు నట్టిదైన పదుగురిలోనన్
    పరికించి జూడ నేడిట
    పురుషుని బెండ్లాడె నొక్క పురుషుండౌరా!

    రిప్లయితొలగించండి


  4. మురిపెముగ గోపికలు నొక
    పురుషునిఁ బెండ్లాడె, నొక్క పురుషుం డౌరా
    సరిసమముగ నెల్లర మన
    సు రమించెను రాసకేళి సుమనోహరుడై !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పురుషత్వము లేక కుమిలి
    యరుదయిన చికిత్సతోడ నాశ్యర్యముగన్
    తరుణీమణిగా మారిన
    పురుషుని బెండ్లాడె నొక్క పురుషుండౌరా!!!

    రిప్లయితొలగించండి
  6. వరగుణయైన యొక్కరిత వైభవమొప్పగ నింటివారలౌ
    గురుజను లాదరంబునను గూర్చిన వానిని సుందరాంగుడౌ
    పురుషుని బెండ్లియాడె, నొక పూరుషు డందరు మెచ్చి యౌననన్
    వరుసకు మేనమామ యట వర్ధిలు మంచు నొసంగె దీవెనల్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  7. జరిగెడు నాటకమందున
    పరిణయఘట్టమ్మునందు ప్రహ్లాదముగన్
    తరుణిగ వేషము గట్టిన
    పురుషుని బెండ్లాడె నొక్క పురుషుండౌరా!!!

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులు!

    తరుణము వచ్చినంత నొక తన్వియె ముద్దులు గుల్కుచుండి స
    త్వరమె వరించ నేఁగె ననువైన విధానఁ జరించునట్టి స

    త్పురుషునిఁ; బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్
    దరుణిని; నామె వెల్గెఁ బ్రమదమ్మునఁ దత్పతిఁ జూచి సిగ్గునన్!!

    రిప్లయితొలగించండి
  9. మరదలిఁ దుంటరి వీడక
    సరసమ్మాడగఁ బిలచిన శక్తియుతుండౌ
    వరుసైన వాడణచి యా
    పురుషుని, బెండ్లాడె! నొక్క పురుషుండౌరా!

    రిప్లయితొలగించండి
  10. పురుషత్వము లేదనగా
    పురిలో మేలయి నవెజ్జు పూర్తిగ మార్చెన్
    గరితగ మారిన ముదమున
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

    (గరిత = స్త్రీ, యాడుది)

    రిప్లయితొలగించండి
  11. పురుషుండొకరుడె శ్రీహరి
    ధరలో గలమనుజులెల్ల తప్పక స్త్రీలే
    పరమాత్ము భక్తి జేరగ
    పురుషుని బెండ్లాడె నొక్కపురుషుండౌరా.

    రిప్లయితొలగించండి
  12. తరుణియె సర్వప్రథమునిఁ
    బురుషునిఁ బెండ్లాడె! నొక్క పురుషుం డౌరా
    వరుసనుఁ బ్రథముం డయ్యునుఁ,
    బరిణయ కారకుఁడు నౌట, వరమగుఁ గాదే? 2

    శరసంధాన మొనర్చెడి
    పురుషునిఁ బెండ్లాడె! నొక్క పురుషుం డౌరా
    వరుసగ శరములు వేయుచు,
    నరిసేనలఁ గూల్పఁ, బెండ్లి యాడరె సుదతుల్? 3

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. గురుతర కార్యభారము నకుంఠిత దీక్ష వహించు ధీరుడే
      పరువము నందు భాసిలెడు భామ సుదంతి సుదీర్ఘ కేశియుం
      గరమరు దైన రూపవతి కన్పడ, భక్తి నుతించి వేగ నా
      పురుషునిఁ, బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్

      [ పురుషుని = పరమాత్మను]


      చిరకాలము జీవింపగఁ
      బరమప్రీతిం దలుపక భవ దోషమునున్
      వరగుణవతిఁ గూతురు కా
      పురుషునిఁ, బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

      తొలగించండి

  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సిరి పయి మోజుతో పొగిలె , " శ్రీలత "

    తాను వివాహ మాడి కా

    పురుషుని || పె౦డ్లి యాడె నొక పూరుషు

    డ౦దరు మెచ్చి యౌ ననన్ ,

    వరగుణ యైన యట్టి " సుగుణన్ " వరకట్నము

    పైస లేకయే !

    అరయగ మిన్నయే సిరి , సమ౦చిత మైన

    గుణమ్ము కన్నయున్ ? ?

    ( పొగిలె = పరితపి౦చెను ; ఔననన్ =
    శభాష్ అనగా )

    రిప్లయితొలగించండి
  15. మా అన్నయ్య పోచిరాజు సుబ్బా రావు గారి పూరణ:

    పురుషుని లక్షణ యుతమగు
    నెరజాణను జూచి పిదప నెమ్మన మందు
    న్గరమున్బ్రేమ నొనర యా
    పురుషునిఁ, బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

    రిప్లయితొలగించండి
  16. హరుడు గిరిన్నటించ గని యాహరి జవ్వని గాగ వచ్చి తా
    మరులను గొల్పగా శివుడు మన్మధ బాణము నన్వివస్యుడై
    పరుగున వచ్చి గూడ , నొక పట్టి జనించెను '' స్వామి '' రూపునన్
    పురుషునిఁ బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్

    హరియే సృషించె కధను
    పురుషుని పెండ్లాడ నొక్క పురుష వధువు ను
    త్తరునకు నసురునొకని నట
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావుగారు,
      మీరు చెబుతున్నది శశిరేఖా పరిణయము గురించా?
      అప్పుడు లక్ష్మణ కుమారుడు కదా! ఉత్తరుడు కాదు కదా!! (సినిమాలో రెండు పాత్రలు రేలంగి గారే చేశారనుకొండి)

      తొలగించండి
  17. అరయంగా ' ఈవు ' ప్రథమ
    పురుషుని బెండ్లాడె! నొక్క పురుషుండౌరా
    తరుణిని గూడి ఫలము దిన,
    ధరణియె నా నేరము తల దాల్చగ వచ్చెన్!
    (ప్రథమ స్త్రీ పురుషులుగా చెప్ప బడే 'ఆదం, ఈవ్ ' ల అంశం ఆధారంగా)
    (ఫలము = భగవానునిచే నిషేధింపబడిన ఫలము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆలోచించగా (అరయంగా), వాళ్ళిద్దరికి పెండ్లి జరిగినట్లే యని భావించ వచ్చేమో ననిపించింది.
      ధన్యవాదములు.

      తొలగించండి
  18. ఆరయన్ స్వలింగములలో
    పరిణయములు చెల్లుననుచు ప్రాంశువు తీర్పున్
    వరముగ కోర్టులు నీయగ
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులు మన్నించాలి...
    ఉదయం నుండి మా నాన్నగారి 8వ మాసికం కార్యక్రమాల్లో వ్యస్తుణ్ణై ఉన్నాను. ఇప్పుడు శ్రీ కోవెల సుప్రసన్న గారి ‘ఆశీతి పూర్తి అభినందన సభ’కు వెళ్తున్నాను. మళ్ళీ ఏ రాత్రి అవుతుందో తిరిగి రావడానికి. దయచేసి ఈరోజు పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

    రిప్లయితొలగించండి
  20. పొరపాటున 'సుద్యుమ్నుడు'
    'శరవని'లో నడుగిడంగ చానగ 'నిలయై'
    గిరిజ వరమ్మున 'బుధు'డను
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు పురాణేతివృత్తముతో చక్కటి పూరణ చేశారు. అభినందనలు.
      శ్రాద్ధదేవునికి (వైవస్వత మనువు) శ్రద్ధాదేవికి “ఇల” యను కూతురు కలుగుతుంది. ఈమె ఇక్ష్వాక్వాదులు పదిమంది కి యక్క గారు. వైవస్వతుని కోరిక మేర వశిష్ట మహర్షి విష్ణు మూర్తిని ప్రార్థించి యీమెను మగవానిగా సుద్యుమ్నుడు గా మారుస్తాడు. ఇతనొకనాడు పరివారముతో కుమార వనానికి వెళ్ళగా సపరివారము గుర్రములతో సహా ఆడువారి గా మారిపోతారు. ఆవనములోనికి వచ్చిన వారందరు నాడువారగు నట్లు పరమ శివుని వరము. ఆ వనితా రూపముతో బుధుని వలన పురూరవుని కంటుంది. తిరిగి వశిష్టుని వేడగ నాయన యీశ్వరుని ప్రార్థించి మగవానిగా మారుస్తాడు. కానీ యొక నెల మగవాడు మరియొక నెల స్త్రీగా మారుతూ ఉంటాడు. అలా చాలా కాలము రాజ్యము నేలుతాడు.
      ఉత్కలుడు, గయుడు, విమలుడను ముగ్గురు సుద్యుమ్నుని (మగవానిగా) పుత్రులు.
      ఆధారము: శ్రీమదాంధ్ర మహాభాగవతము.

      తొలగించండి
    2. అయ్యా, ’’వశిష్టుడు‘‘ కాదు ‘‘వసిష్ఠుడు’’ అని వుండవలెను. ఇక్ష్వాక్వాదులు కాదు ఇక్ష్యాకాదులు అని కావచ్చునేమో!
      .....శ్రీనివాసుడు

      తొలగించండి
    3. శ్రీనివాసుడు గారు వసిష్ఠుడు పద ముద్రణ లోని దోషమును తెలియపరచినందులకు ధన్యవాదములు. ఇక్ష్వాక్వాదులు సాధువే. అక్కడ యణాదేశ సంధి వచ్చినది.

      తొలగించండి
  21. సరసము తోడను సుందరి
    పురుషుని బెండ్లాడె:నొక్క పురుషుండౌరా
    మురిపెముగా నాతి యవగ
    పరిణయమాడ దలచెను భవుడా నాడే.

    రిప్లయితొలగించండి
  22. సరసము తోడను సుందరి
    పురుషుని బెండ్లాడె:నొక్క పురుషుండౌరా
    మురిపెముగా నాతి యవగ
    పరిణయమాడ దలచెను భవుడా నాడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారు,
      చివరి పాదములో ఒక లఘువు తక్కువయినది.
      "పరిణయమాడగ దలచెను" అంటే సరిపోతుంది

      తొలగించండి
  23. శంకరయ్య గారూ!
    చాలాకాలం క్రితం నేనొక ఉపనిష్కథ చదివియుంటిని. అందు, ఒక మహర్షి తనకు ప్రకృతిలోని చరాచరములన్నియూ గురువులే యని ఒక ప్రశ్నకు సమాధానముగా చెప్పియున్నాడు. అంటే, ప్రతి ప్రాణి, స్థావరములనుండి నేను అనేక విషయములను గ్రహించితినని, నాకు అందరూ గురువులేనని చెప్పినట్లుగా చదివియున్నాను. మీకు జ్ఙప్తికి యున్న యెడల ఆ వృత్తాంతమును తెలుపవలసినదిగా నా మనవి.
    భవదీయుడు,
    శ్రీనివాసుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. శ్యామలీయం వారిని అడగాల్సిన ప్రశ్న కంది వారి ని అడిగితే ఎట్లా ? :)



      జిలేబి

      తొలగించండి
    2. భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు మరియు కందిరీగ. ఈ ఇరవై నాలుగు దత్తాత్రేయ మహర్షి గురువులు అని చెప్పి యున్నారు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు ఫణి కుమార్ తాతా గారూ! ఈ వృత్తాంతము ఏ ఉపనిషత్తులో వున్నదో దయచేసి తెలియజేయగలరా?
      *********************************************************
      ’జిలేబీ‘ అనబడు ‘సుధా కుణ్డలికా’ గారూ! తమరు సూచించిన విధంగానే ఈ బ్లాగులో సమాధానం రాకపోతే అక్కడకి పయనమయెదను.

      ...శ్రీనివాసుడు

      తొలగించండి
    4. నాకు తెలిసినంత వరకు ఇది శాండిల్యోపనిషత్ నందు గానీ దత్తాత్రేయోపనిషత్ నందు గానీ చెప్పబడినది.

      తొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. విరివిగ నాటకాల్నడుపువిజ్ఞునియందము నాడవేషమున్
    మరువని రీతిగానటన మంగళవాద్యములందు-సీతకున్
    వరముగ తాళిగట్టె|రఘు వంశుజు డందరు జూడవేషమే
    పురుషుని బెండ్లి యాడె నొకపూరుషుడందరుమెచ్చియౌననన్|
    2.సరళకుమారి పవన్ యను
    పురుషుని పెండ్లాడె|”నొక్క పురుషుండౌరా
    అరుణను కట్నంబడుగక
    అరుదెంచిన పెల్లియందె నాలిగ మార్చెన్”.|

    రిప్లయితొలగించండి
  26. తరుణి యొకర్తి యాస్తి గల ధైర్య గుణోన్నతు ప్రేమ లోబడెన్
    విరహిని తల్లి దండ్రుల విభేదము లెక్కొన రించ కుండ నా
    పురుషునిఁ బెండ్లియాడె, నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్
    కరము ప్రయాస కోర్చియును కష్టముతోడను గూర్చె నిద్దరిన్

    రిప్లయితొలగించండి
  27. తరుణిగ వర్తించు పురుషు

    డరుదైన చికిత్స తోడ నతివగ మారన్

    పరికించి ప్రేమతో న

    ప్పురుషుని బెండ్లాడె నొక్క పురుషుండౌరా!

    రిప్లయితొలగించండి
  28. పురమున నొక్క జవ్వని సమున్నతి నొందగ జేరె నొంటిగా
    తరుణులపైన దుండగుల దాడుల గాంచియు భీతినొందియున్
    పురుషని వేషమేయ గని బోడిని భార్యగ పొందగోరి యా
    పురుషునిఁ బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్

    రిప్లయితొలగించండి
  29. హరు డొసగె న్వరమ్మనుచు నాతని నెత్తిన చేతు నుంచగా
    పరుగిడి పట్టగా తరము భస్ముని కందక నందె మోహినీ
    కరమునకా శివుం డటుల కాంతను పొందక శౌరి కాంతుడై
    పురుషునిఁ బెండ్లి యాడె నొక పురుషుఁ డందరు మెచ్చి యౌననన్!

    రిప్లయితొలగించండి
  30. మరుగొని మగవాడొక్కడు
    తరుణుల కాదని సఖుడిని తగునని వలచెన్
    హరి హరి కలికాలమహిమ
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

    రిప్లయితొలగించండి