27, జులై 2016, బుధవారం

సమస్య - 2099 (అన్నను భర్తగాఁ గొనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ"
లేదా...
"అన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్"

99 కామెంట్‌లు:

  1. మన్నన పొందువాడు తన మంచితనమ్ముననూరు మెచ్చగన్
    మిన్నగ ప్రేమ జూపు ప్రియమిత్రులపై బహు భాగ్యశాలియై
    చెన్నుగ నన్ను చెల్లి యని స్నేహము జూపెడి ధర్మశీలి మా
    యన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      'మా యన్నను..' అంటూ సమస్యను చక్కగా పూరించారు. అభినందనలు.

      తొలగించండి
  2. మిన్నగ మనసుకు నచ్చిన
    సన్నని చిరునగవు చాటు సరసము నందున్
    వెన్నెల జల్లులు విరియు గో
    పన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టము నన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      `గోపన్నను...' అంటూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. `వెన్నెల జల్లు వి(కు)రియు గో...' అనండి.

      తొలగించండి


  3. చిన్నడు లక్ష్మణు సాక్షిగ
    అన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్
    యెన్నడు అలుపెరుగక తా
    మిన్నగ కాపాడుచుండె మిన్నాగు వలెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      `లక్ష్మణుడు సాక్షిగ..' అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది.
      `...యదృష్టమున। న్నెన్నడు నలు పెరుగక...' అనండి.

      తొలగించండి
  4. వెన్నెల రాత్రులందు తన వేణువు నూదుచు మైకమం దునన్
    కన్నెల గుండియల్ చెదరి కాంతుని సన్నిధి జేరగో పికల్
    వెన్నుని ప్రీతిపా త్రమగు ప్రేయసి నెంచగ సంతసించు మా
    యన్నను భర్తగాఁ గొనిన యన్యులమిన్నయదృష్ట రాశియౌ

    రిప్లయితొలగించండి
  5. సుభద్ర కృష్ణుని గూర్చి

    మిన్నును తాకునట్టి ఘన మేరువు కంటెను గొప్పవాడుఁదా
    చన్నును గ్రోలియంగనను శాశ్వత మున్దనయందుజేర్చెనా
    కన్నడు వేణుగానమున కాంతల చిత్తము దోచుచుండు మా
    యన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  6. కన్నుల విందుగ గాంచితి
    రన్నుల మిన్నుల స్వయంవరము, భెల్లున రా
    మన్న ధనుస్సు విఱుచెనే,
    అన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్

    రిప్లయితొలగించండి
  7. అన్నవరంబులో జనులు హర్షముతో తమ కండదండగా
    నున్న పరోపకారగుణు నొక్కని నున్నతు గాంచి యాత్మలో
    నెన్నుచు నుండి రిట్టులని యీతని సాధుచరిత్రు ధీరు రా
    జన్నను భర్తగా గొనిన యన్నులమిన్న అదృష్టరాశియౌ.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  8. కళ్యాణ్ గారి పూరణ....

    కన్నుల పండువౌ కొలువు గాఢసమాధిని కూర్చు తత్త్వమున్
    వెన్నెల నవ్వులున్ ఘనులు వేదవిదుల్ నుతిజేయు దీప్తియున్
    సన్నిధి మోక్షమై చెలగు సప్తనగాలయ చక్రవర్తి వెం
    కన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందఱకు నమస్సులు!

    [సీతాస్వయంవర సభలో సీత చెలికత్తెలు తమలోఁ దామనుకొనుచున్న సందర్భము]

    మిన్నగ సత్యవాక్కుఁ దన మేలిమియౌ సుగుణమ్ముఁ జేసి, తా
    సన్నుతు లొప్పఁ దాటకనుఁ జంపి, మునీంద్రుని జన్న మోమియున్;
    గన్నులవిందుగా నతివగా నొక ఱాతిని మార్చినట్టి రా

    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ!

    రిప్లయితొలగించండి
  10. మున్నొక సుందరాంగి గని మోదముతో నిటులెంచె నొక్క డీ
    సన్నుతగాత్రి కేనెసరి, సచ్చరితుండను, శౌర్యయుక్తుడన్
    మన్నన లందువాడ నిక మాన్యుడనై చరియించువాడ నౌ
    యన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ
    (ఆ+నను)
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      త్రికసంధిని ఆశ్రయించి వైవిధ్యంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. సన్నని వాడు చక్కనగు చాయను పొల్చెడు వాడు బుద్ధులన్
      మిన్నగ నిల్చు వాడు తన మిత్రుల బంధుల పట్ల నెన్నడున్
      మన్నన జూపువాడు మన మాధవు డాతని జూడు డెవ్వ రే
      మన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్ట రాశియౌ.

      తొలగించండి
    3. మిస్సన్న గారూ,
      'ఏమన్నను...' అంటూ నేను పూరిద్దామనుకున్నాను. ఈలోగా మీ పూరణ వచ్చింది. అయినా కాసేపట్లో నా పూరణను పెడుతున్నాను...
      మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదాలు గురువుగారూ మీ పూరణ కూడా చాలా బాగుంది

      తొలగించండి
  11. ఈ సమస్యను 1966 లో ఆకాశవాణి విజయవాడ వారు ఇచ్చినప్పుడు నేను పంపిన పూరణము.

    జన్నము కావగా చని నిశాచరులన్ వధియించినాడు,తా

    నున్నత స్థానమున్ వదలి ఘోరడవుల్ వసియించినాడు,ఆ

    పన్నులకార్త రక్షకుడు,బాధలు తీర్చెడు వాడయోధ్య రా

    మన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      1966... అది నేను క్రొత్తగా ఛందస్సు నేర్చుకొనడం ప్రారంభించిన సంవత్సరం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘోరడవుల్' అనడంలో సంధి, సమాస దోషాలున్నాయి. 'ఘోరవనుల్ వసియించినాడు...' అనండి.

      తొలగించండి
    2. శంకరయ్య గారూ !
      నమస్సులు.మీ సూచనకు ధన్యవాదాలు.
      పిన్నక నాగేశ్వరరావు.

      తొలగించండి
  12. మిన్నగ జీతమున్ గొనుచు మేదిని మంచిగ పేరునొందు సా
    య న్నను భర్తగా గొని నయన్నుల మిన్న యదృష్ట రాశియూ
    కన్నుల పండువై దనరి గాఢము గానిల బ్రేమతో మరి
    న్న న్నువ దేలి యాడగను హాయిగ బంధము గట్టి యూ గదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి. యౌ - యూ...

      తొలగించండి
  13. మన్ననబొందుచు నందరి
    కన్నుల కాంతులను నింపు కరుణామయడౌ
    యున్నత గుణములు గల సో
    మన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్!!!

    రిప్లయితొలగించండి
  14. మరిది వదినల సంభాషణ అనవచ్చు -

    ఎన్నగ ఈ యుగమ్మునను యింతటి సజ్జనుడెక్కడుండునో
    వెన్నును తట్టి మున్నడుప విద్యను పొందితి లక్షణమ్ముగన్
    విన్నపమా విధాతకును వేరొక జన్మ మరొద్దు, చాలు! మీ
    యన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యుగంబునను నెన్నగ..' అనండి. 'వద్దు'ను 'ఒద్దు' అన్నారు. 'వేరొక జన్మ యికేల..' అనండి.

      తొలగించండి
  15. పన్నుగ నా సఖుండు శిశుపాలున కిచ్చియె పెండ్లి చేసెదన్
    ని న్నని చెప్పె రుక్మి ఘననీలతనూత్తముఁడైన కృష్ణునిన్
    మన్నన సేయఁ డైనౕఁ దన మానసచోరుని నన్న యే
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. రుక్మిణీదేవి మనోనిశ్చయుము దృఢ సంకల్పమును ప్రశస్తముగా పూరణ లోనావిష్కరించారు. నమఃపూర్వకాభినందనలు.

      తొలగించండి
    2. మిత్రులు కంది శంకరయ్య గారికి నమస్సులు! రుక్మిణీ కల్యాణ పరంగా చెప్పిన మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు!

      తొలగించండి
  16. నిన్నటి సఖియే నేటికి
    కన్నుల మెరిపించు పెళ్ళి కాంతుల నందన్
    చెన్నుగ వదినయగుచు మా
    యన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్!

    రిప్లయితొలగించండి
  17. ఈ పద్యంలో ' నేను ' అన్నది స్త్రీ లింగ పరంగా ప్రయోగింప బడింది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. చెన్నుగ జనకుని సభను శి
    వన్నవిలును విరిచె రాము డ౦దరు మెచ్చన్
    క్రన్నన జానకి మన రా
    మన్నను పతిగా గొనె జెలియ యదృష్టమనన్

    రిప్లయితొలగించండి
  19. అన్న నియుక్తి మానవుని యాశముగా గొన నేగుదెంచి తా
    చెన్నుగ పాండవుల్,జనని, చెట్టు దరిన్ శయనించు చుండ,మే
    ల్కొన్నబలాఢ్యునిన్ గని,మరుల్ గొనె రక్కసి యౌ హిడింబి,భీ
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  20. డా. పిట్టా సత్యనారాయణ గారి పూరణ....

    జన్నము లెన్ని చేసినను జాగృత శ్రేణిని మూర్ఖు లుండగా
    ఖిన్నత వీడి శీలయుతుఁ గింకర శేఖరు నెంచుకొన్నదే
    యున్నతు లుద్ధతిన్ బహుగ నూదిన కూడదు కాదటంచు యె
    న్నన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      కొంత గందరగోళంగా ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కన్నడ సేయకో వదిన ! కయ్యము

    . మాను మికైన గాని | మా

    యన్నను భర్తగా గొనిన యన్నుల మిన్న !

    . యదృష్టరాశియౌ

    నిన్నెన లేని సౌఖ్యముల ని౦పును |

    . గొ౦తెమ కోర్కె లేటి క

    న్నన్న ! హితమ్ము కాదు మగనాలికి ,

    . భర్తను ఖేదపెట్టగా

    ( కన్నడ = తిరస్కృతి ; అన్నన్న = ఆశ్చర్య
    సూచక పదము ; )

    రిప్లయితొలగించండి
  22. 1.కన్నుల విందుగ గాంచెను
    నన్నులమిన్నౌ సుభద్ర నయగారముతో
    వెన్నుని సాయాన నకులు
    నన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్.

    2.!వెన్నెలదొర సన్నిధిలో
    మిన్నేటి గలగలలోన మిసమిసనగవుల్
    చెన్నలరుచు నుండగసో
    మన్నను పతిగా గొనె జెలియ యదృష్టమనన్.

    3.మన్నన బొందుచు గురుచే
    యున్నత గుణములు గలిగిన యుర్వీశునిన్
    కన్నుల నిండుగ గని రా
    మన్నను వతిగా గొనె జెలియ యదృష్టమునన్.

    4.మిన్నేటి సూర్యుని వలెన్
    నున్నట్టి వరునిగని నాతి యుల్లము లోనన్
    యున్నతముగ నెంచుచు రా
    జన్నను పతిగా గొనె జెలియ యదృష్టమనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'కనుగొనె। నన్నులమిన్నయె సుభద్ర.. (మిన్న+ఔ=మిన్నయౌ) అనండి.
      మూడవ పూరణలో 'గురుచే। నున్నత గుణములు...' అనండి. రెండవపాదం చివర గణదోషం. '...యుర్వీధవునిన్' అనండి.
      నాల్గవ పూరణలో 'వలెన్+ఉన్నట్టి=వలె నున్నట్టి' అవుతుంది. అక్కడ `సూర్యు పోలిక। నున్నట్టి..' అనండి. అలాగే 'లోనన్+ఉన్నతముగ' అన్నపుడు యడాగమం రాదు. 'లోన। న్నున్నతముగ..' అనండి.

      తొలగించండి
  23. పిన్నలు పెద్దలన్న కడు ప్రేమను జూపుచు సద్గుణమ్ము తో
    నున్నతుడై వెలుంగెడు మహోన్నత కీర్తి విరాజితుండనే
    మన్నన లందుకొన్న మహిమాన్విత సూర్యకులాన్వయుండు రా
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    ఎన్నగ నొక్కదురలవా
    టన్నది లేనట్టి వాని యభిమానమునే
    మిన్నగ బొంది తనవదిన
    కన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరింఇ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో `విరాజితుం డనన్/ విరాజితుండుగా' అనండి.
      రెండవ పూరణలో 'దురలవాటు' దుష్టప్రయోగం. 'ఎన్నగను దురభ్యాసం। బన్నది...' అనండి.

      తొలగించండి
  24. తిన్నగ మంచిమాటొకటి ధీరతబల్కగ తెల్విలేక -దా
    క్రొన్ననలున్న చెట్టు కొనకొమ్మన నుండియు దాని ఛేదనం
    బెన్నెడి కాళిదాసనెడు భీకర మూర్ఖుని భూరి వెఱ్ఱి నా
    గన్ననుభర్తగా గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.

    అన్నెలవంకను బోలిన
    పున్నెపుబంట,సుమనోజ్ఞమూర్తినిగంటిన్
    నిన్నని తల్లికి వరుసకు
    నన్నను పతిగాగొనె జెలియ యదృష్టమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారు "భూరి వెఱ్ఱి నాగన్న" సమాసమునొకపరి పరిశీలించండి.

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారికి నమస్సులు..." భూరి "పదమునకు బదులుగా "పెద్ద" ఉంటే సరిపోతుందనుకుంటాను. సూచించినందులకు ధన్యవాదములు.

      తొలగించండి
    4. ఆ సరిపోతుందండి. "దొడ్డ" యన్న బాగానే యుంటుంది.

      తొలగించండి
    5. కృతజ్ఞతలు కామేశ్వరరావు గారు.

      తొలగించండి
  25. ఎన్నగ ప్రాణికోటికిల నిబ్బడిముబ్బడిగా ఫలంబులన్
    దున్నుచుదోకుచున్నిడెడు ధుర్యుడు,సౌమ్యుడు హాలికుండెగా!
    మన్నును సైతమున్మణిగ మార్చగ గల్గిన త్యాగశీలి,రై
    తన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.

    రిప్లయితొలగించండి
  26. మన్నన గాంచబోవు, బహుమానము లందవటంచు స్నేహితుల్
    తన్నొక యజ్ఞగా దలచి తాళుమటంచును నాతాడేల వ
    ద్దన్నను భర్తగాగొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ
    “పున్నమి” వానితో మహిని పొందెసుఖంబు లనారతంబుగన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  27. "తన్నొక యజ్ఞగా దలచి తాళుమటంచును, నాతడేల?" అని చదువ వలసినదిగా ప్రార్థన.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  28. వెన్నుడు యజ్ఞ నామునిగ విష్ణుకళత్రము దక్షిణాఖ్యయై
    క్రన్ననఁ బుట్టి యా రుచికి కన్నుల విందుగ పెండ్లి యాడగ
    న్నన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశి యౌ
    నన్న నసత్యభాషణమె యా యుగళమ్మిల నిత్యపూజ్యమే


    చిన్న కులమ్ము ధన మదియు
    సున్న చదువు లున్న నేమి సుందరి వినుమా
    మన్నన కాదని యెవరే
    మన్నను బతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ఇక్కడొక విషయం ప్రస్తావించాలి...
      మీరీ పూరణలను మొదటిసారి ప్రకటించినప్పుడు 'కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు' అని టైప్ చేస్తుండగా కరెంటు పోయి నెట్ డిస్కనెక్ట్ అయింది. మొదటి పూరణలోని కథాంశం నాకు తెలియనిది. ఈ కథను ఎక్కడినుండి స్వీకరించారా అని ఆలోచిస్తూ మా మనుమడి కోసం స్కూలుకు వెళ్ళాను. వచ్చిన తర్వాత కూడా కరెంట్ రాలేదు. లాప్‍టాప్ కనుక భాగవత పద్యాల భావాలను టైప్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను భాగవతం చతుర్థ స్కంధంలోని వేనుని చరిత్రను టైప్ చేస్తున్నాను. కాకతాళీయమో, దైవసంకల్పమో కాని వేనుని చరిత్రలోనే మీరు ప్రస్తావించిన అంశం ఉంది. మరణించిన వేనుని హస్తాలను మునులు మధించగా కుడిచేతినుండి శ్రీమన్నారాయణాంశతో పృథువు, ఎడమ చేతినుండి లక్ష్మీదేవి అంశతో ఆర్చి జనించి దంపతులయ్యారన్న కథ తెలిసింది. సంతోషం!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వేనుని బాహుమథనమున పుట్టిన వారు పృధువు (చక్రవర్తి) అర్చులైతే, రుచిప్రజాపతికి స్వాయంభువ మను తనూజ యైన యాకూతికి యజ్ఞుడు దక్షిణలు గా విష్ణుమూర్తి, లక్ష్మీదేవియు పుట్టుతారు. ఇది కూడ చతుర్థ స్కందమున(3,4) నున్నది. స్వాయంభువ మనువు పుత్రికాధర్మమున తన కూతురును రుచి ప్రజాపతి కిచ్చి పెండ్లిచేసి వారి కుమారుడైన యజ్ఞుని మనువు తన వద్ద నుంచుకుంటాడు. దక్షిణ తలిదండ్రుల వద్ద నుంటుంది.

      తొలగించండి

    3. కంది వారు

      ధన్యమయ్యె మీ జీవితం ! భాగవతం సంబంధించి మీరు చేస్తున్న కార్య/కాల వాహిని లోనే మీకు తత్సంబంధమైన ఈ సంఘటనా జరగడ మన్నది ఆ పరంధాముని ఆశీస్సులే మీకు అని అనిపిస్తున్నది నాకు


      జిలేబి

      తొలగించండి
  29. నా రెండవ పూరణము.

    ఎన్నగ నుద్యోగంబును

    మిన్నగ సుగుణములు కలిగి మేలిమి ఛాయన్

    ఉన్నత మనస్కుడౌ మా

    యన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఛాయ । న్నున్నత...' అనండి.

      తొలగించండి
  30. 1.కన్నుల విందుగ గాంచెను
    నన్నులమిన్నౌ సుభద్ర నయగారముతో
    వెన్నుని సాయాన నకులు
    నన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్.
    ధన్యవాదాలండీ.కానీ"మిన్నయౌ"అంటే రగణ మౌతుంది."అన్నుల మిన్నగు"అంటే సరిపోతుందాఅండీ.






    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిన్న+ఔ=మిన్నయౌ... అవుతుంది. అక్కడ సంధి లేదు. నేను సూచించింది `మిన్నయె'.

      తొలగించండి
  31. మొన్ననె పెళ్ళిచూపులన?మోహనరూపుడు బుద్ధిశాలి భీ
    మన్ననుభర్తగా గొనిన యన్నులమిన్న యదృష్ట రాశియౌ
    యన్న?వివేక వర్ధనుడు”నాస్తియు కంటెను మంచి కార్యముల్
    మిన్నగ జేయునన్న-వినిమెచ్చియు పెండిలి జేసె రాముడే”.
    2.సన్నని మీసపుకట్టు|ప్ర
    సన్న వదనము,తగు విధిగ సమయస్పూర్తీ,
    ఉన్నత కుటుంబమున రా
    మన్నను పతిగా గొనె జేలియ యదృష్టమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణంలో '...రాశియౌ నన్న.. నాస్తుల కంటెను...' అనండి.
      రెండవ పూరణలో `స్ఫూర్తీ' అని దీర్ఘాంతంగా వ్రాశారు. 'సమయపాలనం। బున్నత...' అందామా?

      తొలగించండి
  32. మిన్నగ సంపద గలుగగ
    సన్నుతిజేయుచుమనసునసంతస మొప్పన్
    యెన్నగ నిలతన తల్లికి
    యన్నను పతిగాగొనెచెలియ యదృష్ఠమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ చారి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'ఒప్పన్+ఎన్నన్' అన్నపుడు యడాగమం రాదు. 'ఒప్ప। న్నెన్నగ...' అనండి.
      అయినా మేనమామను పెళ్ళి చేసుకోవచ్చు కాని మరీ తల్లికి అన్న అంటే వయోభేదం? మిత్రురాలి అన్నను చేసుకుందని అందామా? 'ఎన్నగ తన సహచరి యుమ । యన్నను...' అందామా?

      తొలగించండి
  33. మిన్నగజూసెనుభరతుడు
    అన్నను,పతిగాాగొనెచెలియయదృృష్టమున
    న్నున్నవసంంజాాతకుడగు
    కన్నప్పనుమిగులవలచి,కాామింంచియునున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'భరతుం డన్నను...' అనండి.

      తొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. నిన్నిట గన్నులన్నిలిపి నెయ్యము తోడ శుభంబు లిచ్చు నా
    వెన్నెల చల్లదనమ్ము దలపించెడి మానస మందు హాయిగా
    మన్నిక తోడ జీవన సుమంబుల గంధము బంచుగాదె మా
    యన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్ట రాశియౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో చల్లదనమ్ము అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. మన్నించాలి సరిగా చూచుకోలేదు....సవరించిన పద్యం:

      నిన్నిట గన్నులన్నిలిపి నెయ్యము తోడ శుభంబు లిచ్చు నా
      వెన్నెల చల్లనౌ విమల ప్రేమను మానస మందు నిల్పుచున్
      మన్నిక తోడ జీవన సుమంబుల గంధము బంచుగాదె మా
      యన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్ట రాశియౌ!

      తొలగించండి
  36. ఎన్ని సమస్యలున్న సరె నిద్ధర సంపదలున్న వారలున్
    అన్ని విధాల సౌఖ్యమున కర్హులు నిర్ధను లెల్ల వేళలన్
    అన్నము గూడుకై వగతు రంచు మనంబున నెంచి డబ్బులు
    న్నన్నను భర్తగా గొనిన యన్నల మిన్న యదృష్ట రాశియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'సరె యిద్ధర...వారలే। యన్ని విధాల... వేళల। న్నన్నము...' అనండి.

      తొలగించండి
  37. నా రెండవ పూరణము.

    ఎన్నగ నుద్యోగంబును

    మిన్నగ సుగుణములు కలిగి మేలిమి ఛాయన్

    ఉన్నత మనస్కుడౌ మా

    యన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేలిమి చాయ। న్నెన్నగ...' అనండి. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.

      తొలగించండి
  38. గురువుగారికి ధన్యవాదములు మీసూచనబాగుంది అలాగేమార్చి రాస్తాను
    మరొక మాట నెన్నగవరుసకు తల్లికి అంటెెలావుంటుందో తెలుప ప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తల్లికి వరుసకు అన్న అన్నా వయోభేదం ఎలాగూ ఉంటుంది కదా! 'ఎన్నగ మామ కుమార్తెకు। నన్నను..' అంటే వరస, వయస్సు కుదురుతాయేమో!

      తొలగించండి
  39. రిప్లయిలు
    1. ఉద్యానవనంలో సేదదీరే 'చంద్రహాసు'ని 'విషయ' చూచిన తదనంతరం.....

      చిన్నగ కాటుకన్ 'విషయఁ' జేర్చుచ;ు చేతను లేఖ దిద్ది, యా
      చిన్నది చంద్రహాసునుని చెంతన నుంచుచుఁదల్చె నిట్టులన్
      "వన్నెల ఱేడు! వీని పలు వంకల వద్దని తల్లిదండ్రి కా
      దన్నను భర్తగా గొనిన నన్నులమిన్న యదృష్టరాశియౌ!"

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      విషమును విషయగా మార్చి పెళ్ళాడిన కథను ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      'చంద్రహానునుని' అనడమే అభ్యంతరకరం. 'చంద్రహాసునకు చెంతన...' అంటే?

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:ఉద్యానవనంలో సేదదీరే 'చంద్రహాసు'ని 'విషయ' చూచిన తదనంతరం.....

      చిన్నగ కాటుకన్ 'విషయఁ' జేర్చుచ;ు చేతను లేఖ దిద్ది, యా
      చిన్నది చంద్రహాసునకు చెంతన నుంచుచుఁదల్చె నిట్టులన్
      "వన్నెల ఱేడు! వీని పలు వంకల వద్దని తల్లిదండ్రి కా
      దన్నను భర్తగా గొనిన నన్నులమిన్న యదృష్టరాశియౌ!"

      తొలగించండి
  40. తన్నగ భర్త వక్షమును తాపసి యొక్కడు భంగపాటుచే
    వెన్నుని వీడి లక్ష్మిజన , విహ్వలుడై హరి యేగ భూమికిన్
    చెన్నుగ రాజకన్నియగ చిక్కని కానలజన్మ మొంది వెం
    కన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    వెన్నను ముచ్చిలుచునె తా
    మిన్నగ వేణువునె యూద మెచ్చిరి యువతుల్ ,
    వెన్నుని మోహించుచు గో
    పన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  41. కన్నుల పండువ యట్టుల
    వన్నెలు రాజిల్లు నట్టి పందిరి క్రిందన్
    చిన్నెలు తొలుక వదిన మా
    యన్నను పతిగా గొనె జెలియ యదృష్టమునన్!

    రిప్లయితొలగించండి
  42. గురువుగారికి శతసహస్ర ధన్యవాదములు ఈసవరణతో బ్లాపోస్ట్గ్లో చేస్తాను కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  43. జన్నమును చెరచు యసురుల
    క్రన్నన తెగటార్చి తాను కాననమందున్
    చెన్నుగ విల్లు విఱువ రా
    మన్నను పతిగా గొనె చెలియ యదృష్టమునన్

    రిప్లయితొలగించండి
  44. చిన్నతనమ్మునుండితన చెంగట నిత్యము నాటలాడి తా
    చెన్నగురూపుతోడుతను చేరె గృహిన్ వదినమ్మగాను మా
    యన్నను భర్తగాగొనిన యన్నులమిన్నయదృష్ట రాశియౌ
    కన్నుల పండివాయె గద కాంచగ వారల సోయగమ్ములన్

    రిప్లయితొలగించండి
  45. చెన్నుగ చార్మినాగరిని చేకొని నిచ్చుచు బిల్లుగేట్సుకున్
    కన్నియ రూపునందునను కమ్మగ మార్చుచు సైబ్రబాదుగా
    పన్నుగ పాలనిచ్చుచును బంగరు భూమిగ నేలినట్టి చం
    ద్రన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ!

    రిప్లయితొలగించండి