28, ఆగస్టు 2016, ఆదివారం

సమస్య - 2128 (పెద్దలఁ జూడగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పెద్దలఁ జూడగా నెపుడు పిల్లలవోలె‌ వచించుచుందురే!"
లేదా...
"పెద్దలు వచియింతు రెపుడు పిల్లలవోలెన్"
ఈ సమస్యను పంపిన శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదాలు.

75 కామెంట్‌లు:

  1. కం. మొద్దులు పలుకన్నేరరు
    ఎద్దుల వలె దిరుగు వార లెరుగరు దేనిన్
    అద్దిర ! విలువగు సుద్దులు
    పెద్దలు వచింతు రెపుడు పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేరరు+ఎద్దుల... దీనిన్+అద్దిర' అని విసంధిగా వ్రాశారు. 'మొద్దులు నేరరు పలుకగ। నెద్దులవలె...దేని। న్నద్దిర...' అనండి.

      తొలగించండి



  2. నిదుర మేలుగ బోవ చిట్కా :)

    ఒద్దుర చింతనొకింతయు
    పెద్దలు వచియింతు రెపుడు, పిల్లలవోలెన్
    నిద్దుర బోవలెను మనము
    నద్దరి జీవితము గడుప నాకము మనదే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ఆదిలోనే పప్పులో కాలు వేశారు. వద్దురను ఒద్దుర అన్నారు. 'చింత+ఒకింతయు=చింత యొకింతయు' అవుతుంది.

      తొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు :

    నిద్ధముగ చెలఁగి యున్నను
    మద్దతు గూర్చక ముదిమది మనుషుల కెంతన్
    యొద్దిక గూర్చని వేళల
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్.

    విద్దియ నేర్వని వారిని
    దిద్దుచు నిచ్చలు విధముగ తెలివిని నేర్పన్
    సుద్దులు ముద్దుగ జెప్పుచు
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మనుషులు' అన్నపదం సాధువు కాదు. 'ఎంతన్+ఒద్దిక' అన్నపుడు యడాగమం రాదు. 'మనుజుల కెంత। న్నొద్దిక..' అనండి.

      తొలగించండి
  4. ముందుగా పూజ్యులు శ్రీ కంది శంకరయ్య గురువుగారికి....నేను పంపిన సమస్యను యీనాటి పూరణమునకై యిచ్చినందులకు ప్రణామములు.... కృతజ్ఞతలు. సుకవిమిత్రులకు నమస్సులు.

    నా మొదటి పూరణము:

    ముద్దుగ మాటలాడి దగ
    మోదము తోడుత నాడు పిల్లల
    న్నొద్దిక చెంత జేర్చికొన
    నూ కొడుతున్ కథలందు తూగుచు
    న్నిద్దుర బోవు వేళలను
    నెయ్యపు మాటల చిచ్చి గొట్టునా
    పెద్దల జూడగా నెపుడు
    పిల్లల వోలె వచించు చుందురే!

    నా రెండవ పూరణము:

    ముద్దుల నొలికెడి బిడ్డల
    నొద్దిక నొడిలోన జేర్చి యొయ్యారమునం
    దిద్దుచు మోమున తిలకము
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కొడుతున్' అనడం సాధువు కాదు. కొట్టుచున్ అనాలి, కాని అలా అంటే గణదోషం.

      తొలగించండి
    2. గురువుగారూ...ఊ యనుచున్....అంటాను

      తొలగించండి
  5. ముద్దులు మూటగట్టుకొను మోహన రూపము యీడు మీరగన్
    సుద్దులు జెప్ప నేర్చుకొను సోయగ వర్ధనతల్ తదూహలే
    రద్దగు పళ్ళు నూడగ కరాళ ఋజల్ తన వెంట నుండ నా
    పెద్దల జూడగానెపుడు పిల్లలవోలె వచించు చుందురే

    రిప్లయితొలగించండి
  6. వద్దది నీదగు నీకే
    యిద్దర మొక్కటియె నాది యిద్దియు నీకే
    గ్రుద్దులు కలహాల్ మరచియు
    పెద్దలు వచియింతురెపుడు పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'రూపము నీడు' అనండి. అక్కడ యడాగమం రాదు. 'సోయగ వర్ధనతల్...? ఋజల్(రుజల్?)...

      తొలగించండి
  7. ముద్దుల మూటలు గట్టుచు
    నెద్దియొ పల్కుచు వలవల నేడ్చు బుడతలన్
    నిద్దుర బుచ్చగ నయముగ
    పెద్దలు వచియింతురెపుడు పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
  8. యెద్దుల వలెవయసొచ్చిన
    పెద్దలు కొందరు వివేకవిరతుల వోలెన్
    సుద్దులిడువారు, పేరుకు
    పెద్దలు, వచియింతురెపుడు పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YSAN(?) మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఒచ్చిన' అనడం గ్రామ్యం.

      తొలగించండి
  9. ముద్దగు జీవితము ముగిసి
    హద్దులను విధించబిడ్డ లనవరతమ్మున్
    తద్దయు కోపముతోడుత
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. సుద్దులు జెప్పెడి వేళల
    దిద్దుచు తప్పులను సరిగ ధీరత నిడుచున్
    ముద్దుగ గారము జేయుచు
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్!!!

    రిప్లయితొలగించండి
  11. సుద్దులఁజెప్పుచున్ సతము చోద్యము గాచరియించు చుంద్రుగా
    హద్దుల నిర్ణయించి తమ కాంక్షల పెట్టిన పిన్నవారిపై
    వృద్ధపుఁబ్రాయమందునను వీడరహమ్మును, మొండిపట్టుతో
    పెద్దలఁజూడగానెపుడు పిల్లలవోలెవచించు చుందిరే

    రిప్లయితొలగించండి
  12. హద్దులు మీరిబల్కిరట యంధనరేశ సుతుల్ విశేషతన్
    పెద్దలు గారు జూడగను పిల్లలుగారు,విరోధభాషలన్,
    వద్దని సంధినొల్లమని, బల్కిరి ధర్మజ,చిత్రమేమొ యా
    పెద్దల జూడగా నెపుడుపిల్లల వోలె వచించుచుందురే

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమః

    ముద్దుల పాపల మోముల
    యద్దమునన్ తమదు రూప మగుపించంగన్
    సుద్దుల బలుకుచు ముదమున
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లలవోలెన్

    రిప్లయితొలగించండి
  14. ముద్దుగ యొద్దిక నుండగ
    పెద్దలువచియింతురెపుడు,పిల్లలవోలెన్
    పద్దతి తప్పుచు నడచిన
    పెద్జరికము నిలువదు మరి పేరిమి తగ్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముద్దుగ నొద్దిక...' అనండి.

      తొలగించండి
  15. ముద్దులు గారెడు మోమున
    దిద్దుచు తిలకమ్ము ముఖము ద్రిప్పక నుండన్
    ముద్దుల పాపకు మాటలు
    పెద్దలు వచియింతురెపుడు పిల్లలవోలెన్.

    రిప్లయితొలగించండి
  16. పద్దెము శిష్ట్లా రచనగ
    పెద్దలు వచియింతురెపుడు, పిల్లల వోలెన్
    పద్దతి తప్పుచు వ్రాసిన
    పద్దెము గద్యమగునుమరి పద్యంబౌనే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ నమస్సులు అంత లేదండి. నేను నిత్య విద్యార్థిని. పద్యం వ్రాయటం నేర్చుకొంటున్నాను గురువుల సూచనలతో....

      తొలగించండి
    2. శ్రీరామ్ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. ముద్దగ మాటలు పలుకుట,
    మొద్దుగ వాదనల జేసి ముచ్చట లాడన్.
    కద్దన్నది లేదనుచును.
    పెద్దలు వచియింతురెపుడు, పిల్లల వోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. అద్దము వోలె శుద్ధము మహాత్ముల చేష్టలు చిత్త వృత్తియు
    న్నిద్దము చంద్రబింబసమ మిద్ధర కల్మష హీన చేతనన్
    నిద్దము లెంచ మాక్షికపు నిర్మల బిందువు లిద్ధ వాచ్యముల్
    పెద్దలఁ జూడగా నెపుడు పిల్లలవోలె‌ వచించు చుందురే!



    ఈతరపు యువకుల యాలోచనలు:

    నిద్దుర పొమ్మను సుఖముగ
    తద్దయు వింత తలపులు గద! నుడువ సుద్దుల్
    వద్దనుముర మన కిక నా
    పెద్దలు, వచియింతు రెపుడు పిల్లలవోలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.

      తొలగించండి
  19. ముద్ద దినంగబోవనిట ముంగిట నిల్పక చందమామనే !
    "వద్ద"ని మేలమాడు రఘువంశజు ముద్దిడి తల్లి వెంటనే
    అద్దము దెచ్చి చూపుచు శశాంకుడిదే యని చెప్పె నట్టిచో..
    పెద్దల జూడగా నెపుడు పిల్లల వోలె వచించుచుందురే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముద్దుగ మాటలు నేర్పుచు ,
      దిద్దించుచు వర్ణమాల , తిలకంబిడుచున్ ,
      ముద్దలు దినిపించుచు మన
      పెద్దలు వచియింతురెపుడు పిల్లల వోలెన్ !!

      తొలగించండి
    2. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. ముద్దుగ మాటలాడుటయు, మొండిగ పంతము లూనబూనుట ,
    న్నిద్దురబోక రాత్రి నిశి నేనియు గాంచగ విశ్రమించకన్ ,
    వద్దని జెప్పినన్వినక , వశ్యము గాని పనుల్ ఘటించు నీ
    పెద్దలఁ జూడగా నెపుడు పిల్లలవోలె‌ వచించుచుందురే!

    రిప్లయితొలగించండి
  21. ముద్దులొలుకు బాల నటులు
    దిద్దగ భారతఁపు 'బుల్లితెర' చిత్రమ్మున్
    సుద్దులఁ జెప్పెడు పాత్రల
    పెద్దలు వచియింతురెపుడు పిల్లల వోలెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. ముద్దుగ దెల్పు”మాటలను మూటలకూర్పును విప్పిజెప్పెడిన్
    పెద్దలె పిల్లలౌదురట”|వేడుకలందున సాంప్రదాయకం
    దిద్దుచు నాటిపద్దతులు తీరికచేతనునెర్పబూనుచున్
    పెద్దల జూడగా నెపుడు పిల్లలవోలె వచించు చుందురే|
    2.సిద్దులవలె ననుభవమును
    పద్దతులుగ నేర్పనెంచి పసివారలతో
    ముద్దుగ,ముచ్చట లందున
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్.|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సాంప్రదాయకం' అని ముప్రత్యయం స్థానంలో అనుస్వారముంచారు.

      తొలగించండి
  23. వృద్దులు బాలలేయనుచు ప్రేమనుజూపుచుబుజ్జగించినన్
    ముద్దుగ మాటలాడుదురు మొండితనంబునపట్టుబట్టుచున్
    శ్రద్దగ పొందురన్నిటిని సైయనివారు,వయస్సువాకిటన్
    పెద్దలజూడగానెపుడు పిల్లల వోలె వచించుచుందురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      'పొందు రన్నిటిని'...? పొందుదు రన్నిటిని అని కదా ఉండాల్సింది. 'పొందువారు గద...' అందామా?

      తొలగించండి
  24. ముద్దకు ముద్దంచుబలికి
    హద్దులు లేనట్టి రీతి ఆప్యాయతతోన్
    ఇద్దరమొకటని హత్తుకు
    పెద్దలువచియింతురెపుడు పిల్లలవోలెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2వపాదము సవరణ..
      హద్దులు లేనట్టిరీతి నాప్యాయతతోన్.

      తొలగించండి
    2. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆప్యాయతతో। నిద్దర మొకటని...' అనండి.

      తొలగించండి
  25. సుద్దులుమంచిగనేర్వగ
    పెద్దలువచియింతురెపుడుపిల్లలవోలెన్
    సద్దులుసేయుచువింతగ
    మద్దూరీవింటివయ్యమాయీపలుకుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. ఒద్దికమీరజ్ఞానధనమున్ పరి పూర్ణమనోవికాసతన్
    తద్దయు సంతరించినను దాపునుజేరెడు వార్థకంబునన్
    సద్దును సేయకే తనకు స్వాగతమిచ్చెడి బుద్ధిమాంద్యమున్
    పెద్దలజూడగానెపుడు పిల్లల వోలె వచించుచుందురే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన్యులు శంకరయ్యగారికి..1వ.పాదం.సవరణ...

      ఒద్దిక మీర జ్ఞానధన మోర్మిని.....అనిన యతి దోషము రాదని భావింతును.

      తొలగించండి
    2. పొన్నెకంటి వారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. ముద్దులు మూటగట్టెడు
    సుద్దుల నాడుచు జగతిన శోభాయముగా
    నిద్దుర పుచ్చుచు బాలల
    పెద్దలు వచియింతురెపుడు పిల్లల వోలెన్.

    ఇద్ధరలో కొందరెపుడు
    సుద్దులు చెప్పుచు నటువలె చొక్కపు తీరున్
    ముద్దుల మాటల నాడుచు
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్.

    అద్దము వంటి మనసుగల
    ముద్దుల పాపల పలుకులు ముచ్చట గొలుపన్
    యిద్ధర వయసుడిగినయా
    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. 'ముద్దులను మూట గట్టెడు...' అనండి. 'శోభాయముగా'?
      మూడవ పూరణలో '...గొలుప। న్నిద్ధర...' అనండి.

      తొలగించండి
  28. సుద్దులుసెప్పునత్తరినిసోముడురామునిజేరదీసియున్
    ముద్దుగబల్కుచున్నతనిమోమునమోమునుబెట్టియప్పుడున్
    సద్దునుజేయుచుండియునుసత్కధలెన్నియొపూసగ్రుచ్చిగా
    పెద్దలజూడగానెపుడుపిల్లలతోవచించుచుందురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 4వపాదము
      పెద్దలజూడగానెపుడుపిల్లలవోలెవచించుచుందురే

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. పెద్దఱికము తలబోయక
    ముద్దుగ పసి వారలందు మోదము నింపన్
    సుద్దులు తగవని నెఱిగిన
    పెద్దలు వచియింతురెపుడు పిల్లల వోలెన్!

    రిప్లయితొలగించండి
  30. నిద్దుర వచ్చుట లేదని

    యొద్దికగా చెంతజేరి యొక కథ యడుగన్

    ముద్దుగ సుద్దుల తోడను

    పెద్దలు వచియింతు రెపుడు పిల్లల వోలెన్.

    రిప్లయితొలగించండి
  31. పెద్దరికం బనన్ మనిషి పెద్ద వయస్సు న పిల్లచే ష్టలన్
    సుద్దత గానుమాటలతొ సున్నిత భావన తోడ జీ వితం
    పద్దతి తోడనే మసలు ప్రా కృతి సాహససం బిదిన్ మరే
    పెద్దలఁ జూడగా నెపుడు పిల్లలవోలె వచించుచుందురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ, (మీ యింటిపేరు వద్దూరి, వడ్డూరి?)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'మాటలను' అనవచ్చు. 'సాహససంబు'...?

      తొలగించండి
  32. గురుమూర్తి ఆచారి గారి పూరణ.....
    పెద్దల జూడగా నెపుడు పిల్లల వోలె వచి౦చుచు౦దు రే
    ప్రొద్దున నైన, వారి మదిలో కనిపి౦చదు కల్మష౦బె నీ
    పెద్దలు మేలు గోరెదరు పెద్దల మాటలు చద్ది మూటలౌ!
    పెద్దల ధిక్కరి౦చెడు "ప్రబుధ్ధలు" కు౦దుదు రి౦క భావిలో

    రిప్లయితొలగించండి
  33. మాన్యులు శంకరయ్యగారికి..1వ.పాదం.సవరణ...

    ఒద్దిక మీర జ్ఞానధన మోర్మిని.....అనిన యతి దోషము రాదని భావింతును.

    రిప్లయితొలగించండి
  34. అద్దరి నిద్దరిన్ననక హాయిగ తూగుచు నన్నిచోటులన్
    సుద్దులు చెప్పుచున్ చిలిపి సుంకరి మాటల కోతలందునన్
    ముద్దుగ ముద్దుగా పలికి ముచ్చట మీరెడి పండ్లులేని మా
    పెద్దలఁ జూడగా నెపుడు పిల్లలవోలె‌ వచించుచుందురే!

    రిప్లయితొలగించండి