31, ఆగస్టు 2011, బుధవారం

సమస్యా పూరణం -444 (రంజానుకు చేయవలయు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రంజానుకు చేయవలయు రాముని భజనల్.

34 కామెంట్‌లు:

 1. అంజనకుమార అహ్మద్
  రంజని మరి షేక్ సలీము 'లవ్లీ సన్నే' !
  'ఎంజాయ్' చేయుచు నమాజు
  రంజానుకు, చేయవలయు రాముని భజనల్ !

  రిప్లయితొలగించు
 2. హనుమచ్ఛ్ఛాస్రి గారి మీద తోసేస్తా నా పూరణను. ఇందులో దగా లేదు :

  సంజాయిషి యిచ్చెదగా !
  అంజన పుత్రుండు చనగ నతి వేగముతో
  కంజజుడు చెరిపి వ్రాసెను
  'రంజానుకి జేయవలయు రాముని భజనల్ ' !!!

  రిప్లయితొలగించు
 3. హనుమచ్ఛ్ఛాస్రి గారి మీద తోసేస్తా నా పూరణను. ఇందులో దగా లేదు :

  సంజాయిషి యిచ్చెదగా !
  అంజన పుత్రుండు చనగ నతి వేగముతో
  కంజజుడు చెరిపి వ్రాసెను
  'రంజానుకు చేయవలయు రాముని భజనల్ ' !!!

  రిప్లయితొలగించు
 4. రంజిత ఖురాను పఠనము
  రంజానుకు చేయవలయు. రాముని భజనల్
  కంజ దళేక్షణ సీతయు
  నంజన తనయుండును తనియగ చేయవలెన్.

  రిప్లయితొలగించు
 5. మూర్తి గారూ ! మీపూరణ లో దగా లేదన్నారు ..ఉన్నదండీ ..(మొదటి పాదం లోనే ) యిచ్చె 'దగా'....(సరదాగా) ...

  రంజాన్ అయినా ఏ పండుగ అయినా వారి వారి ఇష్ట దైవాలను పూజించాలని నా భావం ..

  రంజానుకు ' ప్రేయర్' జాన్
  రంజానుకు మరి నమాజు లాలహ్మద్ లే !
  అంజన కుమార చౌదరి
  రంజానుకు చేయవలయు రాముని భజనల్ !

  రిప్లయితొలగించు
 6. గుంజీల్ తీయించుచు తల
  గుంజును తినుచుండె కొల్వు ఘోరము! మనమున్
  రంజింప, సెలవు దొరకెను
  రంజానుకు! చేయవలయు రాముని భజనల్ !

  రిప్లయితొలగించు
 7. మిస్సన్న గారూ ! 'గుంజీల్ తీయించుచు' భలే 'సెలవిచ్చారండీ' ...!
  చింతా వారూ ! రంజింప జేశారండీ 1

  రిప్లయితొలగించు
 8. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
  మీరేం తక్కువ తినలేదు. మత సామరస్యాన్ని చక్కగా చెప్పేరు.
  శ్రీ చింతా వారు పెద్దలు! వేరే చెప్పేదేముంది?
  మూర్తి మిత్రులు దగా చేసి సంజాయిషీ ఇచ్చుకొన్నారు .

  రిప్లయితొలగించు
 9. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 31, 2011 10:43:00 AM

  భంజింపక నిరశనమును
  రంజానుకు చేయవలయు, రాముని భజనల్
  మంజుల సుమధుర భావిత
  శింజితములు, పుణ్యమూర్తి జీవిత పథముల్.

  రిప్లయితొలగించు
 10. 'రంజయతి' రామ నామము
  భంజింపుడు హిందువైన ప్రతివాడు మనో
  రంజితుడై - క్రిస్మసు కును ,
  రంజానుకు - చేయవలయు రాముని భజనల్

  రిప్లయితొలగించు
 11. రాం,జయ జయరాం,సీతా
  రాం,జయరాం శ్రీరఘుపతి రాఘవరాజా
  రాం,జనరహీముని గొలువ
  రంజానుకుచేయవలయురాముని భజనల్!!!

  రిప్లయితొలగించు
 12. చింతా వారి స్పూర్తితో

  అంజలి ఘటిత నమాజును
  రంజానుకుచేయవలయు, రామునిభజనల్
  రంజితముగ జేయందగు,
  అంజనపుత్రుండుమెచ్చ నవనిజమెచ్చన్ !!!

  రిప్లయితొలగించు
 13. అంజన తనయుడు హనుమకు
  అంజలి ఘటియించి నటుల నతి వినయముతో !
  రంజింప శిరము వంచుతు
  రంజానుకు చేయవలయు రాముని భజనల్ !

  రిప్లయితొలగించు
 14. శ్రీపతి శాస్త్రిబుధవారం, ఆగస్టు 31, 2011 8:41:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  అంజలినిడుచున్ జెప్పెద
  రంజానుకు చేయవలెను రాముని భజనల్
  సంజాయిషినన్నడుగకు
  రంజిల్లును సకల జగము రాముని తలువన్.

  రిప్లయితొలగించు
 15. శ్రీపతి శాస్త్రిబుధవారం, ఆగస్టు 31, 2011 8:52:00 PM

  శ్రీమహాగణాధిపతయేనమ:
  గురువుగారికి, కవిమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించు
 16. సోదర సోదరీ మణులకు వినాయక చవితి శుభా కాంక్షలు

  రిప్లయితొలగించు
 17. భాద్ర పద శుధ్ధ చవితికి
  చిద్రూప గణేశు గొల్చి శ్రీలు ,సకల సం
  పద్రూప శుభము బడయుడు
  భద్రమ్మగు మిత్రు లార ! భవదీయులకున్

  రిప్లయితొలగించు
 18. మిత్రుల అందఱి పూరణలు చాలా బాగున్నయి. అక్కయ్య గారి పూరణ చాలా బాగుంది. శ్రీ మంద పీతాంబర్ గారు చక్కగా రాం భజన చేసి అందఱినీ రంజింప జేసారు.

  గురువు గారికి మిత్రులకు గణేష్ చతుర్ధి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించు
 19. రంజుగ హలీము తప్పక
  రంజానుకు చేయవలయురా! "ముని" భజనల్
  పుంజుకొనగ లారెన్సుకు
  సంజీవి దొరికిన రీతి సంతసమయ్యెన్!!

  రిప్లయితొలగించు
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  01)
  _________________________________

  సంజ సమయమున తీరిక
  సంజర్పమొనర్చు వేళ - సత్పురుషులతో
  సంజీవకరణి సమమగు
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________

  రిప్లయితొలగించు
 21. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  02)
  _________________________________

  గుంజాటము విడిచి చనుడు !
  గుంజాటన లేల మీకు - గురువగు నతడే !
  గుంజాయిషీ గలుగు నెద
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________
  గుంజాటము = లంపటము,
  గుంజాటన = వెనుకముందులాడుట
  గురువు = కాపాడువాఁడు
  గుంజాయిషీ = లాభము(పుణ్యము)

  రిప్లయితొలగించు
 22. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  03)
  _________________________________

  భంజించెను దానవులను
  భంజించును పాపములను - వాని భజింపన్
  భంజకమగు శోకములే !
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________

  రిప్లయితొలగించు
 23. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  04)
  _________________________________

  కంజదళాక్షియె మెచ్చిన
  అంజని కొమరుండు పాడు - ఆలాపనలే
  మంజులముగ మనసారా
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________

  రిప్లయితొలగించు
 24. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  05)
  _________________________________

  మంజుల మోహన రూపుని
  మంజరియౌ మగువ సీత - మాతను దలచన్
  మంజిడి ధరించి రండోయ్
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________
  మంజరి = పెద్దముత్తెము
  మంజిడి = చిత్ర వర్ణ వస్త్రము / నీలవస్త్రము

  రిప్లయితొలగించు
 25. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  06)
  _________________________________

  కుంజరుడౌ నరులందున
  కంజదళాక్షుడు రఘుపతి - కాళ్ళను గొలవన్
  కొంజుకొనక ,రారె మరల
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________
  కొంజుకొను = సందేహించు

  రిప్లయితొలగించు
 26. కవిమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
  నిన్న హైదరాబాదు, రవీంద్రభారతిలో ‘వానమామలై వరదాచార్యుల శతజయంత్యుత్సవాలు’ ప్రారంభసభకు వెళ్ళాను. బ్లాగ్ మిత్రులు శ్రీ డా. ఆచార్య ఫణీంద్ర గారు ‘అభినవ పోతన పురస్కారం’ అందుకున్నారు. సభాప్రారంభంలో వానమామలై వారి గురించిన లఘు వార్తా చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
  ఇల్లు చేరేసరికి రాత్రి 2 గం. అయింది. అందువల్ల మిత్రుల పూరణలకు నిన్న స్పదించలేకపోయాను.
  పూరణలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, గన్నవరపు నరసింహ మూర్తి, చింతా రామకృష్ణారావు, మిస్సన్న, సంపత్ కుమార్ శాస్త్రి, లక్కాకుల వెంకట రాజారావు, మంద పీతాంబర్, నేదునూరి రాజేశ్వరి, శ్రీపతి శాస్త్రి, జిగురు సత్యనారాయణ, వసంత కిశోర్ గారలకు అభినందనలు, ధన్యవాదాలు.
  ఈ రోజు సాయంత్రం వరకు వీలు చూసుకొని మిత్రుల పూరణలను పరిశీలించి వ్యాఖ్యానిస్తాను.

  రిప్లయితొలగించు
 27. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  07)
  _________________________________

  జంజన్యమానమౌ మది
  జంజడలను వదలి రండి - జగదీశ్వరుడే
  జంజాటము తొలగించును
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________
  జంజన్యమానము = మాటిమాటికి కలుగునది
  జంజడ = చీల(బంధనం)
  జంజాటము = తగులము

  రిప్లయితొలగించు
 28. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  08)
  _________________________________

  నంజ సముడె పాపాలను
  నంజుల, దొలగించు వాడె - నారాయణుడే
  నంజుకొనగ రారయ్యో
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________
  నంజ = మాగాణి
  నంజు = విషము
  నంజుకొను = ఆస్వాదించు

  రిప్లయితొలగించు
 29. క్రిస్మసైనా , రంజానైనా వాళ్ళు రోజూ సాయంత్రం చేసే పనదే !
  రంజాను రోజున కూడా మానెయ్యకుండా రండని ఒక మిత్రుడు
  అందరికీ చెబుతున్న సందర్భం :

  09)
  _________________________________

  పంజరములు విడనాడుడు
  పంజతనము పోవునులే - వాని కరుణతో
  పంజనమౌ మీదు బ్రదుకు
  రంజానుకు చేయవలయు - రాముని భజనల్ !
  _________________________________
  పంజరము = బంధనము
  పంజతనము = పిఱికితనము
  పంజన = శ్రేష్ఠమైనది

  రిప్లయితొలగించు
 30. పుంజుకొని శక్తి యుక్తులు
  కంజీవరములు బురఖలు కలిసిన యుగము
  న్నంజలి నమాజు జరుపుచు
  రంజానుకు చేయవలయు రాముని భజనల్

  రిప్లయితొలగించు
 31. అమిత్ షా ఉవాచ:

  అంజనసుతు భక్తులు భల్
  జంజాటము చేయ నెంచి జమ్మమసీదున్
  గుంజుచు గ్రుద్దుచు మీరలు
  రంజానుకు చేయవలయు రాముని భజనల్

  రిప్లయితొలగించు