********************************************************************** అజ్ఞాత గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘పెట్టకనమ్మయగునె’ అన్నదాన్ని ‘పెట్టక యమ్మయగునె’ అంటే సరి! ********************************************************************** జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. ********************************************************************** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ********************************************************************** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ********************************************************************** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ.ఆభినందనలు. ‘పెట్టక తల్లనిపించదు’ అన్నది ‘పెట్టక తల్లి యనదగదు’ అనీ, ‘మొట్టక గురువుయునుకాడు’ మొట్టక గురువనగరాదు’ అంటే బాగుంటుంది. ********************************************************************** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. **********************************************************************
********************************************************************** వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ********************************************************************** (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ, స్వీయముద్రాంకితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు. ********************************************************************** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, లోకన్యాయాన్ని చక్కగా మీ పూరణలో వివరించారు. మంచి పూరణ. ‘ఇట్టిది లోకము నయ్యో’ అన్నదానిని ‘ఇట్టిదె లోకన్యాయము’ అంటే బాగుంటుందని నా సలహా. ********************************************************************** రాజేశ్వరక్కయ్యా, నిర్దోషంగా చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. **********************************************************************
********************************************************************** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ రెండవ పూరణ ప్రస్తుత రాజకీయాన్ని అద్దం పడుతున్నది. చక్కని పూరణ. అభినందనలు. ********************************************************************** (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ, ‘ఓవర్ లుక్’ అంటారే ... అలా జరిగిపోతుంటాయి. మొదటి పూరణలోని టైపాటు ఏమిటో చూద్దామంటే మీరు తొలగించారు. సరే లెండి. బాగుంది. **********************************************************************
1. తల్లి యనదగదు’ సాధువే. ...అవును. నేను కొంచెం నడక గురించే అభిప్రాయం చెప్పాను. 2. యడాగమం తప్పు, పెట్టకన్ అన్నదే సరి కదా అని నేనన్నది ఆధికప్రసంగం! విద్వత్కవి మా మామయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారిని సంప్రతించాను. నాదేతప్పని మనవి జేసుకుంటున్నాను.
‘శ్యామలీయం’ గారూ, ‘ప్రమాదో ధీమతామపి!’ అని ఊరికే అన్నరా? నేనూ ఎన్నో పొరపాట్లు చేస్తుంటాను. ఎవరమూ సర్వజ్ఞులం కాదు. నా పొరపాటును ఒప్పుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాను. అయినా దూషణ భూషణ తిరస్కారాలను సమానంగా స్వీకరించడానికి అలవాటు పడ్డాను. నా మీది ప్రేమాభిమానాలతో నా బ్లాగు శిష్యులు చేసిన వ్యాఖ్యల వలన మీ మనస్సు నొచ్చుకుంటే క్షంతవ్యుణ్ణి!
పెట్టకనమ్మయగునె?నస
రిప్లయితొలగించండిపెట్టకగాదాలియున్ను,పిన్నలు వింటే!
చెట్టనరుపండ్లు లేకను,
కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే.
తిట్టక పోవునె నేతలు?
రిప్లయితొలగించండికొట్టక పోవునె జనులను గూండాలింకన్?
గుట్టుగ బ్రతకరె పౌరులు?
కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే!!
పెట్టనిచో కాదు జనని
రిప్లయితొలగించండికొట్టనిచో కాదు తండ్రి కొడుకును చదువన్
తిట్టనిచో కాదు గురువు
కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే !
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....
రిప్లయితొలగించండిఎట్టిదియని యొకపిట్టను
చెట్టునగని పరమగురుడు శిష్యునియడుగన్
ఇట్టుల చెప్పెను, పట్టిన
కుట్టనిచో తేలు, కాదు కుమ్మరిపురుగే
పెట్టక తల్లనిపించదు,
రిప్లయితొలగించండిమొట్టక గురువుయునుకాడు, ముద్దులు ప్రేమన్
పెట్టక ప్రియురాలగునే?
కుట్టనిచో తేలుకాదు, కుమ్మరి పురుగే.
సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ ....
రిప్లయితొలగించండిపెట్టక తల్లనిపించదు,
మొట్టక గురువుయునుకాడు, ముద్దులు ప్రేమన్
పెట్టక ప్రియురాలగునే?
కుట్టనిచో తేలుకాదు, కుమ్మరి పురుగే.
ముట్టినను వేలునెక్కడ
రిప్లయితొలగించండికుట్టనిచోతేలుకాదు కుమ్మరిపురుగే,
ముట్టకుమద్దానిని,చూ
పెట్టుము పెద్దలకు,దెలియు పురుగో,తేలో!
పండిత నేమాని వారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిమిత్రులందరి పూరణలు చాలా బాగుగా వస్తున్నాయి. అందరికి శుభాభినందనలు.
**********************************************************************
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పెట్టకనమ్మయగునె’ అన్నదాన్ని ‘పెట్టక యమ్మయగునె’ అంటే సరి!
**********************************************************************
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
**********************************************************************
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
**********************************************************************
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ.ఆభినందనలు.
‘పెట్టక తల్లనిపించదు’ అన్నది ‘పెట్టక తల్లి యనదగదు’ అనీ, ‘మొట్టక గురువుయునుకాడు’ మొట్టక గురువనగరాదు’ అంటే బాగుంటుంది.
**********************************************************************
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఒక భార్య భర్తతో :
01)
_____________________________________
బట్టల పెట్టెను గల యొక
పుట్టములో దాగి యుండె ! - ముట్టుకొనినచో
కుట్టును వేలిని గట్టిగ !
కుట్టనిచో తేలు కాదు - కుమ్మరి పురుగే !
_____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....
రిప్లయితొలగించండిమిత్రుల పూరణలు అలరిస్తున్నాయి. శ్రీ గురుభ్యో నమః
ఇట్టిది లోకము నయ్యో !
కట్టియ లేకున్న గొఱ్ఱె కఱచును కుక్కై !!
తిట్టరె ? కొట్టరె ? సాదుని
కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే ! !!
రాజేశ్వరి నేదునూరి గారి పూరణ ....
రిప్లయితొలగించండికుట్టును చీమలె యైనను
పెట్టినచో తనదు వేలు పుట్టలయందున్ !
ముట్టిన ముట్టక యున్నను
కుట్టనిచో తేలుకాదు కుమ్మరి పురుగే !
**********************************************************************
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
**********************************************************************
(మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
స్వీయముద్రాంకితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
**********************************************************************
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
లోకన్యాయాన్ని చక్కగా మీ పూరణలో వివరించారు. మంచి పూరణ.
‘ఇట్టిది లోకము నయ్యో’ అన్నదానిని ‘ఇట్టిదె లోకన్యాయము’ అంటే బాగుంటుందని నా సలహా.
**********************************************************************
రాజేశ్వరక్కయ్యా,
నిర్దోషంగా చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
**********************************************************************
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....
రిప్లయితొలగించండిగురువు గారూ ధన్య వాదములు .మీ సవరణ బాగుంది
మరో పూరణ.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు - ఢిల్లీలో ఎఱ్ఱ తేలుల కధ !
తిట్టక కేసీ యారును
కొట్టక హరీశు గారు , కోటులు మ్రింగన్
బట్టు వడ ప్రాజ్ఞు డందుర ?
కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే !
మాస్టారూ, ధన్యవాదాలు. తేలికగా మార్కులిచ్చేస్తున్నారు. మొదటి పాదంలో ఇప్పుడే టైపాటు గమనించి సరిదిద్ది మరలా పోస్టు చేస్తున్నాను.
రిప్లయితొలగించండిపుట్టనిది పూవు, ముట్టిన
కుట్టనిచో తేలు;; కాదు కుమ్మరిపురుగే
మట్టిని పట్టిన, కృత్రిమ
చట్టమున సహజ గుణములు సాగవు చంద్రా!
**********************************************************************
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండవ పూరణ ప్రస్తుత రాజకీయాన్ని అద్దం పడుతున్నది. చక్కని పూరణ. అభినందనలు.
**********************************************************************
(మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
‘ఓవర్ లుక్’ అంటారే ... అలా జరిగిపోతుంటాయి. మొదటి పూరణలోని టైపాటు ఏమిటో చూద్దామంటే మీరు తొలగించారు. సరే లెండి. బాగుంది.
**********************************************************************
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ -
రిప్లయితొలగించండి‘పెట్టకనమ్మయగునె’ అన్నదాన్ని ‘పెట్టక యమ్మయగునె’ అంటే సరి! -> యడాగమం తప్పు. మీకు తెలియంది కాదు. ( పెట్టకన్ అన్నదే సరి కదా. )
పెట్టక తల్లనిపించదు’ అన్నది ‘పెట్టక తల్లి యనదగదు’ -> మొదటిదే మంచి కందపు నడక.
‘శ్యామలీయం’ గారూ,
రిప్లయితొలగించండిఅక ప్రత్యయం ద్రుతప్రకృతికం కాదని నా నమ్మకం. మీ వ్యాఖ్యతో ఆలోచనలో పడ్డాను. ఒకసారి వ్యాకరణం తిరగేయాలి.
‘శ్యామలీయం’ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ అభ్యంతరం ...
‘తల్లి + అనిపించదు’ అన్నప్పుడు సంధి లేదు. కాబట్టి అక్కడ తప్పక యడాగమం వస్తుంది. ‘తల్లి యనదగదు’ సాధువే.
1. తల్లి యనదగదు’ సాధువే. ...అవును. నేను కొంచెం నడక గురించే అభిప్రాయం చెప్పాను.
రిప్లయితొలగించండి2. యడాగమం తప్పు, పెట్టకన్ అన్నదే సరి కదా అని నేనన్నది ఆధికప్రసంగం! విద్వత్కవి మా మామయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారిని సంప్రతించాను. నాదేతప్పని మనవి జేసుకుంటున్నాను.
‘శ్యామలీయం’ గారూ,
రిప్లయితొలగించండి‘ప్రమాదో ధీమతామపి!’ అని ఊరికే అన్నరా? నేనూ ఎన్నో పొరపాట్లు చేస్తుంటాను. ఎవరమూ సర్వజ్ఞులం కాదు. నా పొరపాటును ఒప్పుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాను.
అయినా దూషణ భూషణ తిరస్కారాలను సమానంగా స్వీకరించడానికి అలవాటు పడ్డాను.
నా మీది ప్రేమాభిమానాలతో నా బ్లాగు శిష్యులు చేసిన వ్యాఖ్యల వలన మీ మనస్సు నొచ్చుకుంటే క్షంతవ్యుణ్ణి!
వట్టిగ, కట్నమునడుగక
రిప్లయితొలగించండిగుట్టుగ పెండ్లాడినట్టి గుణవంతుడినిన్
తిట్టెదరత్తలు మామలు:
కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే
చుట్టము లందరు పరుగిడ
రిప్లయితొలగించండిపట్టను మామయ్య ధనము పాడెకు నెదురన్
తిట్టుచు మొట్టుచు కోడలు
కుట్టనిచో తేలు కాదు కుమ్మరిపురుగే