3, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 636 (తల్లి మాట వినుట)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

తల్లి మాట వినుట తప్పు గాదె.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. తల్లి మాట వినక తండ్రి మాట వినక
    చీదరించు కొనుచు ' ఛీ' లు కొట్టి
    ప్రక్క నున్నచిన్న బాబాయి మరి పిన
    తల్లి మాట వినుట తప్పు గాదె

    రిప్లయితొలగించండి
  2. తల్లి దండ్రు లనగ దైవ సమానులే
    వెల్లు వంటి ప్రేమ తల్లి మనసు
    మమత పంచి పెంచు మాతృదేవత గాన
    తల్లి మాట వినుట తప్పు గాదె !

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిశనివారం, మార్చి 03, 2012 7:33:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    జనని కల్పవల్లి జయములు జేకూర్చు
    క్షేమములను కలుగజేయునెపుడు
    మంచి గోరు మనకు మనసార దీవివించు
    తల్లి మాట వినుట తప్పు గాదె!

    (తల్లిమాటను వినుట తప్పు కాదు కదా)

    రిప్లయితొలగించండి
  4. ఆది గురువె యమ్మ [ అమ్మ ] నారాధ్య [ ఆరాధ్య ] దైవమ్ము
    కన్న ప్రేమ కంటె మిన్న యేది ?
    అమ్మ జూపు బాటె యందాల [ అందాల ] హరి విల్లు
    తల్లి మాట వినుట తప్పు కాదె !
    ------------------------------------------------క్షమించాలి " మధ్యలో " అ " రాకూడదు కదా ! అం .....దు.....కని
    అమ్మ అని వ్రాస్తేనే కమ్మ దనం కదా ? అదన్న మాట అసలు సంగతి

    రిప్లయితొలగించండి
  5. తల్లి యొక్క తరువు తల్లి మేటి గురువు
    తల్లి మించు వారు ధరణి లేరు
    తల్లి మాట వినుట తప్పు గాదె న్నడు
    మాట నేర్పి నదియె మాత మనకు.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా,
    శుభోదయం....
    ఇంకా నా ఆరోగ్యం, నెట్ సమస్య కొలిక్కి రాలేదు. అందువల్ల కొందరు మిత్రుల సందేహాలకు, అభ్యంతరాలకు వెంటనే సమాధానాలు ఇవ్వలేకపోతున్నాను. మన్నించాలి.
    ఈ రోజు భద్రాచలం వెళ్తున్నాను. ఒక మిత్రునికి కొత్తగూడెంలో పని ఉండి కారులో వెళ్తూ రమ్మన్నాడు. ఆరోగ్యం బాగాలేకున్నా వెళ్ళేది కారులోనే కదా! ఆ సీతారాముల దర్శనం చేసుకోవచ్చునని అని ధైర్యం చేస్తున్నాను. పునర్దర్శనం రేపు ఉదయం.
    దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  7. చిన్న సవరణ తో..

    తల్లి కల్ప తరువు తల్లి మేటి గురువు
    తల్లి మించు వారు ధరణి లేరు
    తల్లి మాట వినుట తప్పు గాదె న్నడు
    మాట నేర్పి నదియె మాత మనకు.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారూ ఆ సీతమ్మ తల్లి శ్రీరాముల వారికి మా అందఱి నమస్కారములు అందించి వారి ఆశీస్సులను మన అందఱి బ్లాగు మిత్రులకు కొనితెండి. మీకు సుఖ ప్రయాణము సకల శుభములు కోరుతున్నాము.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ! సుదర్శన ధారి సు దర్శన భాగ్యం వలన శ్రీ సీతా రామానుగ్రహ ప్రాప్తి తో మీ సమస్యలు తీరి ప్రశాంతత కలగాలని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  10. అక్కయ్య గారి పద్యము :

    ఆది గురువె యమ్మ యారాధ్య దైవమ్ము
    కన్న ప్రేమ కంటె మిన్న గలదె?
    అమ్మ సూపు బాట యందాల హరి విల్లు
    తల్లి మాట వినుట తప్పు కాదె !

    రిప్లయితొలగించండి
  11. ఈర్ష్య పిక్కటిల్లనింతి కద్రువ - నాగ
    మాత - యాజ్ఞ చేయ మత్సరమున
    వినుట సర్పజాతి, వినత దుఃఖితయయ్యె;
    తల్లి మాట వినుట తప్పు కాదె?

    రిప్లయితొలగించండి
  12. తాళి గట్టి పిదప దల్లి దండ్రు లనుట
    బేల తనము గాదె ! పెళ్ళి నాడె
    కళ్లె మొకటి దగిలె గంఠంబులో నింక
    తల్లి మాట వినుట తప్పు గాదె !!

    రిప్లయితొలగించండి
  13. తల్లి ప్రేమ పంచు తల్లియె దండించు
    తనయు బాగు కోరి తపన జెందు
    తల్లి మాట వినుట తప్పు కాదెవరికి
    నైన తుదకు హరికి నైన నిజము

    రిప్లయితొలగించండి
  14. శ్రీ రాముని సోదరుడైన భరతుని మాటలు......

    ధర్మమార్గము విడి, తనయుని రాజుగ
    చేయమనుచు కొత్త చిక్కు తెచ్చు
    తల్లి కొఱకు నేను దారి తప్పగ లేను,
    తల్లి మాట వినుట తప్పు గాదె?

    రిప్లయితొలగించండి
  15. తల్లి మాట వినుట తప్పు గాదే? అంటే గాని 'తల్లి మాట వినుట తప్పుగాదు' అని అర్థము రాదేమో.. విజ్ఞులు తెలపాలి..

    రిప్లయితొలగించండి
  16. తెలుగు బిడ్డ యొకడు తెలుగు గడ్డను గల
    ఆంగ్ల పాఠశాల యందు జేరె
    నచటి వారలందు రక్కటా! మన తెల్గు
    తల్లి మాట వినుట తప్పు గాదె

    రిప్లయితొలగించండి
  17. మిత్రులారా!
    తల్లి మాట వినుట తప్పు గాదె అను సమస్యను పూరించేటప్పుడు అన్వయము సామాన్యముగాను మరియు వ్యతిరేకముగాను కూడా చేసుకొనే అవకాశమున్నది. అది పూరించే వారి ఊహను బట్టి చేసుకొనవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. కట్నములును, పెక్కు కానుకలును, చాల
    లాంఛనములు నిచ్చి లక్షణముగ
    పెండ్లి జరుపవలెను వియ్యాల వారను
    తల్లి మాట వినుట తప్పు కాదె

    రిప్లయితొలగించండి
  19. మిత్రులారా!
    ఈనాటి సమస్యకు విశేషమైన ఆదరణతో వివిధములైన పూరణలు వచ్చుట ముదావహము. అగ్ర తాంబూలమును పుచ్చుకున్న శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, సోదరి శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి, శ్రీ శ్రీపతి శాస్త్రి గారికి, ఒక అజ్ఞాత కవి గారికి, మనుమడు అష్టావధాని చి. రాంభట్లకి, తమ్ముడు చి. డా. గన్నవరపు నరసింహ మూర్తికి, శ్రీ మిస్సన్న గారికి, శ్రీమతి మందాకిని గారికి అభినందనలు. పూరణలన్నీ ప్రశంసార్హములే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. తల్లి మొదటి గురువు తల్లి దైవంబును
    తల్లి మాట వినుట తప్పు గాదె
    తల్లి దండ్రి మీద దయ తోడ మసలుచు
    తల్లి సేవ చేసి తరియు మన్న !

    రిప్లయితొలగించండి
  21. తల్లి ప్రథమ గురువు తల్లియే దైవంబు
    తల్లడిల్లి నపుడు తల్లి వలయు
    తల్లి పద్దతులను తనివి తీరగనేర్పు
    తల్లి మాట వినుట తప్పు గాదె!

    రిప్లయితొలగించండి
  22. తండ్రి మాట నిలుప తాన్ వనికేగగఁ
    దలచె రఘు వరుండు ధర్మ మూర్తి
    వలదు వలదనుచును వగచి వగచి పల్కు
    తల్లి మాట వినుట తప్పు గాదె!!

    రిప్లయితొలగించండి
  23. తమ్ముడూ ! ఆ శ్రీరామ చంద్రుని దర్శన భాగ్యం కలగడం ధన్యులు . ఆ భగ వంతుని కృపా కటాక్ష వీక్షణలు మనందరి పైన ప్రసరించడం అదే మనకి మంచి ఆరోగ్యం. !
    [ సోదరులందరికీ ] , శ్రీ అజ్ఞాత గారికీ శ్రీ పండిత నేమాని వారికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  24. కర్ణ! నిజము వినుము కౌంతేయుడవు నీవు
    ధర్మజాదులగును తమ్ములు, కురు
    పతిని వీడి చేరు పాండవులననెడి
    తల్లి మాట వినుట తప్పు గాదె!!

    రిప్లయితొలగించండి
  25. శంకరయ్యగారూ,
    ........భద్రాద్రి రాముని భజనకు జనుచుండ
    ............బంధుమిత్రుల యాజ్ఞ బడయ నేల
    అయినా మా అందరతో పంచుకున్నారు. చాల సంతోషం. హాయిగా వెళ్ళిరండి.

    కందగీతి:
    సీతారాముల దర్శనము చేసిన కలుగును సత్ఫలము
    భూతలపతి సందర్శనము మోక్షప్రదమని యెరుగుదుము
    మాతరపున రఘునాధులకు మాతకు దెల్పుడు మా నుతులు
    వాతాత్మజ సౌమిత్రులకు పలుకుడు మా నుతివచనములు

    కందగీతి లక్షణముః
    ఈ కందగీతి అనే ఒక కొత్త ఛందమును ఇక్కడ కల్పించితిని. యతి,ప్రాస నియమములు గలవు. ప్రాసయతిని అంగీకరించును. ప్రతిపాదము మధ్యకు విరుగును - పాదద్వితీయార్థము యతిస్థానముతో ప్రారంభము. ప్రతిపాదార్థమును కందపద్యము యెక్క హ్రస్వపాదములపైని యేక లఘువుగా నుండును.
    కందగీతి చక్కగా గానయోగ్యమై యుండును. పాదార్థమున పద విరామము చాల శోభనిచ్చును - గాన యోగ్యతను ఇనుమడింప జేయును,

    నేను వ్రాయుచున్న శ్రీమధ్భాగవత మహాత్మ్యములో కొన్ని కందగీతులుండవచ్చును.

    రిప్లయితొలగించండి
  26. అయ్యా! మీరు కందగీతిని రచించుచున్నారు. సంతోషము. నాకు గుర్తున్నంత పరిధిలో ప్రాస నియమము పాటించే పద్యములలో ప్రాస యతులు ఉండవు. పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  27. తల్లి మాట వినుట తప్పు గాదె
    మాట నిలపిన ఒప్పు గాదె
    వినుట పెద్దల మాట పాడి
    గాదె తల్లి చాటు బంగరు జిలేబీ

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  28. నేమానివారు,
    మీరన్నది నిజమే. పాదానికి ౨౬ మాత్రల చొప్పున ఇది కొంచెం దీర్ఘపాద నిర్మితి కలిగిని పద్యం. ఈ పద్యలక్షణాలపైన మరి కొంచెం ఆలోచించవలసి యుంది. పాదసౌష్టవరీత్యా ప్రాసయతి ప్రాసలలో మొదటిదే అవసరమేమో ఆలోచించాలి.

    రిప్లయితొలగించండి
  29. అన్నయ్య గారికి ధన్యవాదములు. కద్రువ, కైక ,కట్న కానుకలు వాంఛించు తల్లుల మాటలు పరులకు దుఃఖము కలిగిస్తాయి కాబట్టి అవి విన రాదు.

    తల్లి కంటె మిన్న దైవమ్ము ధర లేదు
    తరుగు లేని ప్రేమ తల్లి పంచు
    పెరిగి యదియె పరుల పీడన హేతువౌ
    తల్లి మాట వినుట తప్పు గాదె !

    రిప్లయితొలగించండి
  30. సుగంధి
    నందనమ్ము వచ్చెగాన నవ్య శోభ లీనుచున్
    గండు కోయిలమ్మ లన్ని గానమాల పించగన్
    పండు వెన్నెలంత నింగి పైట వేసి యాడ గన్
    బ్లాగు మిత్రులంత పొంగి పొందె స్వాగత మ్మిలన్
    ---------------------------------------------------
    క్షమిం చాలి .ఊరికే ఒక ప్రయత్నం . ఎన్ని తప్పులు ఉంటే అన్ని సార్లు క్షమించాలి [ గురువులు పె......ద్ద......మనసు.....తో ]

    రిప్లయితొలగించండి
  31. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కుంతీమాత కర్ణునితో :

    01)
    _____________________________________________

    ధర్మ రక్షణమున - తమ్ముల గలియుట
    తప్పు గాదు తండ్రి - యొప్పె యగును !
    తల్లి నేనె నీకు - తగదురా క్రోధమ్ము !
    తల్లి మాట వినుట - తప్పు గాదె !
    _____________________________________________
    ******

    రిప్లయితొలగించండి
  32. సోదరి రాజేశ్వరి గారి పద్యము కొన్ని మార్పులతో:
    సుగంధి:
    నందనమ్ము వచ్చె పృథ్వి నవ్య శోభలీనుచున్
    సందడించి కోకిలమ్ము స్వాగతమ్ము పల్కగా
    నైందవ ప్రకాశమందు నంబరంబు వెల్గగా
    విందులొంద రండు బ్లాగు వీక్షకుల్ ముదమ్మునన్

    రిప్లయితొలగించండి
  33. నమస్కారములు
    గురువులు శ్రీ పండితుల వారికి ధన్య వాదములు. పద్య లక్షణాలు నాకు పూర్తిగా అవగాహన లేదు. ప్రాస నియమం ఉందని తెలియదు. ఒక్క " గలం [ గురు, లఘువు లూ ౭ , చివరిగా గురువు ] ఉంటే చాలనుకు న్నాను . మరొక సారి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  34. మిత్రులారా,
    రాముల వారికి నా మీద దయ కలుగనట్టుంది. వారి దర్శనభాగ్యానికి నోచుకోలేదు. కొత్తగూడెంలో నిన్న మా మిత్రుని పని ఆలస్యమయింది. దానితో భద్రాచలం ప్రయాణం రద్దు చేసికొని వెనుదిరిగి రావలసి వచ్చింది.
    *
    ఈనాటి సమస్యను పండిత నేమాని గారు అన్నట్టు "తప్పే కదా/ తప్పు కాదు కదా" అని రెండువిధాలుగా పూరించడానికి అవకాశం ఉంది. మిత్రులు రెండు విధాల పూరణలనూ అందించారు.
    *
    గోలి హనుంచ్ఛాస్త్రి గారూ,
    మీ "పినతల్లి మాట" పూరణ బాగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణలో సమస్యను మూడవ పాదంలో ఇమిడ్చిన విధానం ప్రశంసనీయం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ, నందనానికి సుగంధాన్ని అద్దిన పద్యమూ బాగున్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
    మొదటి పూరణలో "వెల్లువంటి" అన్నచోట వెల్లువ + వంటి కదా! దానిని `వెల్లువ వలె" అందాం.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో "దీవించు" అన్నచోట ఒక "వి" అదనంగా టైపయ్యింది.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.
    *
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    కాని తల్లిమాటను నాగజాతి మొత్తం వినలేదుకదా! తల్లి ఆజ్ఞను విని వారేమన్నారు? "అనయ మిదియుఁ దల్లి పనిచె నని యధర్మువు సేయంగ నగునె" అంటూ నిరాకరించి శాపానికి గురి అయ్యారు కదా! కర్కోటకు డొక్కడే తల్లి మాటను విన్నాడు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గౌతమి గారూ,
    స్వాగతం. సంతోషం!
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    *
    శ్యామలీయం గారూ,
    ధన్యవాదాలు.
    *
    జిలేబి గారూ,
    అభినందనలు.
    ఈరోజు మీ భావాన్ని ఎవరూ ఛందోబద్ధం చేసినట్టు లేదు.
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి