27, మార్చి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 659 (కాలుని పెండ్లియాడె నఁట)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

కాలుని పెండ్లియాడె నఁట కామిని సీత మహోత్సవమ్ముగన్.

(లేదా)

కాలుని పెండ్లాడె సీత కడు మోదమునన్.


ఈ సమస్యను పంపిన శ్రీ గుండా సహదేవుడు గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. లీలగ సీతయై యవతరించిన లక్ష్మికి విష్ణుదేవు ని
    ల్లాలిగ నుండుటొక్కటె సమంచిత కామము తత్ఫలమ్ముగా
    నా లలితాంగి రాముని దయాళుని ధర్మరతున్ త్రిలోకజిత్
    కాలుని పెండ్లియాడెనట కామిని సీత మహోత్సవమ్ముగన్

    రిప్లయితొలగించండి
  2. పై వ్యాఖ్యలను తీసి వేయగలిగితే బాగుండును. గురువుగారు,

    పాలను గారు బుగ్గలను బంగరు సిగ్గుల పెళ్ళికూతురై
    మాలను చేతియందునను మక్కువ తోడను బూనియున్నదై
    బేల, మహా మహుండసుర పీచమడంచిన వాని, భీకరున్,
    కాలుని, పెండ్లియాడె నఁట కామిని సీత మహోత్సవమ్ముగన్.



    చేలను పచ్చందనముల
    పాలను బోలిన మనమున, పంతము తోడన్
    కాలుని విల్లును విరిచిన (కాలుడు=శివుడు)
    కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్.

    రిప్లయితొలగించండి
  3. కాలును మోపెను భువిపై
    కాలునిగా రాక్షసులను కాటికి బంపన్
    కాలుని విలు ద్రుంచిన సమ
    కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్.

    రిప్లయితొలగించండి
  4. కాలుని విల్లును ద్రుంచి స
    కాలములో రాముడెదుట కనుపించగనే
    మేలుగ దలచుచు మనసున
    కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్.

    రిప్లయితొలగించండి
  5. నాడు రాముని పెండ్లాడే సీత
    నేడు కలియుగపు సీత భరత పర్వంలో
    చదువల వెంటపడి 'రేట్' రేసులో రొ
    క్కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతిశాస్త్రిమంగళవారం, మార్చి 27, 2012 10:13:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    రాలిరి రాక్షసు లెందరొ
    బాలా యీ బాలకుండు బలశౌర్యుండే
    కూలగ తాటకి పాలిట
    కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్.

    (తాటకి కూలిపోయేవిధముగా తాటకిపాలిట కాలుడైనట్టి రాముని)

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతిశాస్త్రిమంగళవారం, మార్చి 27, 2012 10:14:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    రాలిరి రాక్షసాథములు రాముని బాణపరంపరావళిన్
    తాళగ లేక తక్షణమె తాపసులెల్లరు సంతసిల్లగా
    లాలన జూపి బాలుడగు రాముని, రాక్షసజాతి పాలిటన్
    కాలుని, పెండ్లియాడె నఁట కామిని సీత మహోత్సవమ్ముగన్.

    లాలనము = అధికేచ్ఛ , ఔత్సుక్యము

    రిప్లయితొలగించండి
  8. సరదాగా...

    మేలాయెను సెల్ ఫోన్ తో
    కాలేజీ రోజుల నొక కాల్జేసెను, రాంగ్
    కాలే ప్రేమా యెను, 'రాంగ్
    కాలుని' పెండ్లాడె సీత కడు మోదమునన్

    రిప్లయితొలగించండి
  9. సహదేవుడు గారూ లక్ష్మీ దేవి గారి వ్యాఖ్యను బహుశ మీరు అపార్థం చేసుకొని ఉంటారు. ఆమె భావం మీ సమస్య పాదాన్ని తొలగించమని అయ్యుండదు. ఆమెగార్కి క్లిష్టమైన సమస్యలుండవు.
    నేననుకోవడం ఆమె ఏదో అసంతృప్తికరమైన పూరణ కానీ, వ్యాఖ్య కానీ పెట్టి ఉంటారు ముందు. దాన్ని తొలగించమని గురువుగారిని కోరి ఉంటారు.

    రిప్లయితొలగించండి
  10. పెద్దలకు ప్రణామాలు.

    శ్రీలుని, భువిఁ దన మహిమలు
    నూలుకొన సనాతనికధనుర్భంగకలా
    కేలీలాలితకంఠే
    కాలునిఁ బెండ్లియాడె సీత గడుమోదమునన్.

    సంప్రదాయ పద్ధతి పూరణలన్నీ అయిపోయినందువల్ల – ఇది.

    “సీతారామకళ్యాణం” నాటకంలో పార్వతి వెంట పడిన రావణ వేషధారిని ప్రేమించి, సీత వేషం ధరించిన నటి ఆయనను పెళ్ళిచేసుకున్నది.

    శ్రీలకుఁ దానకం బగుచుఁ జెన్ను వహించిన నాట్యగాథలో
    శైలనగాధిరాజసుతఁ జాదిన రావణు వేషబాషలన్
    లోలతఁ జూచి, ప్రేమఁ గొని, లోకులు మెచ్చ - నటీమణి కోరి, యా శుభాం
    గాలునిఁ బెండ్లియాడె నఁటఁ గామిని సీత మహోత్సవంబునన్.

    ఆలుడు – శ్రేష్ఠుడు.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. సహదేవుడు గారు,
    మీరు అపార్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యలు రెండుమూడు సార్లు ప్రచురించాను. ఈ బ్లాగులో నేనే తొలగించే అవకాశం లేదు. అందుకే గురువుగార్ని నా వ్యాఖ్యల్ని తొలగించమన్నాను.
    వేరే వారి వ్యాఖ్యలను తొలగించమని నేనెందుకంటాను?
    నేను నావ్యాఖ్యలను తొలగించమనటానికీ, మీరు చెప్పిన విషయానికీ సంబంధమేమిటి తెలియలేదు.
    మిస్సన్న గారు,
    ధన్యవాదాలండి. సరిగ్గా అర్థం చేసుకున్నారు.

    రిప్లయితొలగించండి
  12. గాలము వేసెను ప్రియుడని
    మేలము లాడంగ చెలులు మీరిన వేడ్కన్ !
    లోలార్క బిడియ మందుచు
    కాలుని పెండ్లాడె సీత కడు మోదము నన్ !

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    లక్ష్మీదేవి గారు మొత్తం మూడు వ్యాఖ్యలు పంపారు. మొదటి రెండింట కొన్ని దోషాలు, అసంపూర్ణత ఉండడం వల్ల వాటిని తొలగించమని కోరారు. అందువల్ల వాటిని తొలగించాను. అంతే!
    *
    లక్ష్మీదేవి (మందాకిని) గారూ,
    వ్యాఖ్యను తొలగించమనే వ్యాఖ్యను విడిగా పంపితే బాగుండేది. దాని వల్ల అపార్థాలకు అవకాశం కలిగింది. విడిగా పంపితే ముందున్న రెండింటితో పాటు తొలగించమన్న వ్యాఖ్యనూ తీసివేసేవాణ్ణి.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ________________________________________________


    బాలుడు గాడు జూడ, ఘన - పాశము బట్టిన కాలకాలుడై
    కోలల నేసి ఘోరముగ- కూల్చిన రాక్షస మూక, భీకరా
    కాలుని,పెండ్లియాడె నఁట - కామిని సీత మహోత్సవమ్ముగన్
    వాలుగ జూచుచున్ కొసల - వాలిన కండ్లను , మోహ విహ్వలై !________________________________________________

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ ఏల్చూరి వారూ!
    మీ పద్యములో (శ్రీలకు తో మొదలైన పద్యము) 3వ పాదములో 3 అక్షరములు ఎక్కువగానున్నవి. తగ్గించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ గురువులకు ప్రణామములు.

    నిజమే, మూడవ పాదమున గణాధిక్యమును చూచికొనలేదు.

    శ్రీలకుఁ దానకం బగుచుఁ జెన్ను వహించిన నాట్యగాథలో
    శైలనగాధిరాజసుతఁ జాదిన రావణు వేషభాషలన్
    లోలతఁ జూచి, ప్రేమఁ గొని, లోఁగి, నటీమణి కాంక్ష నా శుభాం
    గాలునిఁ బెండ్లియాడె నఁటఁ గామిని సీత మహోత్సవంబునన్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  17. వాలిన భక్తి మీరగను వారిజ లోచన సంతసిం చుచున్
    వాలుగ గాంచినందులకు వాసవు వాడికి సిగ్గుమొగ్గ యై
    రాలెను ముత్యముల్ నగవు రాజిల సోయగ మద్భుతం బుగా
    కాలుని పెండ్లి యాడెనట కామిని సీత మహోత్సవమ్ము గన్ !

    రిప్లయితొలగించండి
  18. కాలుని వేష ధారి మరి కామిని పాత్రను వేయు సీతయే
    సోలిరి ప్రేమలోన గన సోయగ మొప్పగ ప్రేక్షకాళియే
    పూలను జల్లి సంబరము పొల్పుగ జేసిరి మంటపమ్ములో
    కాలునిఁ బెండ్లియాడె నఁటఁ గామిని సీత మహోత్సవంబునన్.

    రిప్లయితొలగించండి
  19. శైలము చిత్రకూటమది, జానకితోననె రామచంద్రుడా
    శైల సుతత్తరిన్ తనకు సర్వము శంభునిగా దలంచుచున్
    మాలిమితో తపించెనట మానక పట్టిన పట్టు నా మహా
    కాలుని పెండ్లి యాడెనట కామిని, సీత! మహోత్సవమ్ముగన్.

    శైలసుతా నిరర్థకము శంభుని గోరుట బిచ్చగానికిన్
    జాలదు నిన్ను గూడుటలు చాలు తపంబనె దొంగసామియై
    నీలగళుండు కాని తననే వరియించె నటంబ వింటివా
    కాలుని పెండ్లి యాడెనట కామిని, సీత! మహోత్సవమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  20. శ్రీపతిశాస్త్రిమంగళవారం, మార్చి 27, 2012 11:03:00 PM

    మిస్సన్నగారూ అభినందనలు. మీ పద్యాలు నాకు బాగా నచ్చినవి

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతిశాస్త్రి గారూ ధన్యవాదాలు.
    మీ పూరణలు కూడా అలరిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  22. వాలుజడల తోడ మురియు
    బాలికను పిలువగ బ్రహ్మ
    పరుగులిడుచు తా
    వ్రాలగ జటాధరుని పై
    కాలుని పెండ్లాడె సీత కడు మోదమునన్

    కాలుడు = శివుడు
    సీత = గంగ

    రిప్లయితొలగించండి
  23. శూలికి నొక్కతే వధువు సుందరి పార్వతి వేరులేరటన్
    బేలలు చేయు వాదముల పెంచుట మానుము శంకరార్యుడా!
    చాలిక నేను చూచితిని శాస్త్రము లన్నియు తేఱిపాఱగా:👇
    "కాలుని పెండ్లియాడె నఁట కామిని సీత మహోత్సవమ్ముగన్" :)

    కాలుడు = శివుడు
    సీత = గంగ

    రిప్లయితొలగించండి