కవిమిత్రులకు నమస్కృతులు. మీ అందరి ఆకాంక్షలు, ఆశీస్సుల వల్ల జ్వరం పూర్తిగా తగ్గింది. నా ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెంది సలహాలు ఇచ్చి, సానుభూతిని తెలిపిన సహృదయులందరికీ ధన్యవాదాలు. కాకుంటే చాలా నీరసంగా ఉన్నాను. ఒంటినొప్పులు కూడా ఉన్నాయి. ఇంట్లో నెట్ సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. పొరుగింటి వాళ్ళ దయతో రోజుకొకసారి నెట్ వినియోగించుకుంటున్నాను. అందువల్ల వెంట వెంటనే నా స్పందనలను తెలియజేయలేక పోతున్నాను. మన్నించండి.
పదవ తరగతి దప్పిన - పడుచు వాడు పట్టుదల తోడ సాధించి - పస్టురాంకు కడకు జిల్లాకు యధికారి - కాగలిగిన ! పండువెన్నెల లివె యమా - వాస్యఁ గురిసె! _____________________________________________
శ్రీ మిస్సన్న గారు వసంతాగమమును పేర్కొనుచూ రమణి యెదను పండు వెన్నెల కురిసె అన్నారు. ప్రకృతి రమణిగా అన్వయించుకొందాము.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు దీపావళి కాంతులే పండు వెన్నెలను దలపింప జేసెను అన్నారు.
శ్రీ వసంత కిశోర్ గారు 3 విధాలుగా పూరించేరు. (1) రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుని గురించి (2) పట్టుదలతో చదివి పెద్ద ఉద్యోగము సంపాదించిన వాని గురించి (3) ఎన్నో సంబంధాలు చూచిన్ కుదరకపోయినా చివరకు దొరికిన సహృదయమైన పెండ్లి సంబంధమును గూర్చి
శ్రీమతి మందాకినీ గారు శ్రీ శంకరార్యునికి స్వాస్థ్యము చేకూరిన సంబరము గురించి
శ్రీ సుబ్బా రావు గారు పెద్ద వారింట్లో జరిగే పెళ్ళికి వెలిగే దీపపు కాంతుల గురించి.
అన్ని పూరణలు బాగుగ నున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.
అభిమానుల గుండెలలో దీపావళిని వెలిగించిన శ్రీ నేమాని గురువరేణ్యుల శ్రీచరణములకు ప్రణామములు.
ఈనాఁడు మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్య సొగసులు వెలారుస్తున్నది. వారికి భగవదనుగ్రహం వల్ల స్వస్థత చేకూరుతుండటం ఎంతో సంతోషంగా ఉన్నది. వారు "వందన" మనరాదని వినయవిజ్ఞాపనం చేస్తున్నాను. వారి ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.
ఎం .......త.....మంచి రోజూ ? తమ్ముని ఆరోగ్యం బాగై బ్లాగులో కనబడి నందులకు చాలా ఆనందం గా ఉంది . మరి కొంచం విశ్రాంతి తీసుకుంటే " మధుర మైనట్టి పలుకుల సుధలు కురియు పండు వెన్నెల శంకరా భరణ మందు "
మిత్రులారా! ఈనాటి నా భారతీ స్తుతి సీసములోని ఒక ప్రత్యేకతను గమనించారా? అందులో ఇంద్రగణములన్నీ "సల"లే కదా. అలా వ్రాస్తే నడకలో ఒక విశిష్ఠిత కనిపిస్తుంది. మీరూ ప్రయత్నించండి. స్వస్తి.
భవదీయ నిస్సీమ దయాపూర్ణపద్యాశీర్వాదముచే ధన్యధన్యుడ నైనాను. మీ దీవెనలోని శుభాశంసితం వల్ల సుగంధిలమైనదే కాని, నా వాక్కు స్వప్రకాశితం కాదు. ఈ సమస్యాపూరణ వ్యాజాన, మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారి అప్రమేయసౌజన్యమూలాన నాకు మీ తోడి సన్నిధిసేవ సమకూడింది. మీరు అవ్యాజానుగ్రహంతో శిష్యత్వాన్ని అనుగ్రహించారు.
ఆ వచోనిచయమ్ము! ఆ తపోవిభవమ్ము! ఆ కృపావర్షమ్ము! ఆ మహత్త్వ! మా శుభోదర్కమ్ము! ఆ సభావిజయమ్ము! ఆ విభాసత్వమ్ము! ఆ కవిత్వ! మా శాంతతేజమ్ము! ఆశాంతసుయశమ్ము! ఆసాంతసత్త్వమ్ము! ఆ పటుత్వ! మా మహాభావమ్ము! ఆ మహౌదార్యమ్ము! ఆ మహీదేవత్వ! మా గుణిత్వ!
మేను మన్నన న న్నోము మాననమున నాను మునినాము నామమ్ము నూనినాను నా మనమ్మున మౌనమ్ము నాన మాని నేన నేమాని గురుదేవు నేమ మూని!
(మునినాము = పండిత శ్రీ నేమాని రామ సన్యాసి జోగారావు నామధేయులు)
కవిమిత్రుల పూరణలు వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు. పండిత నేమాని వారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి పత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే పక్కింటివాళ్ళ అబ్బాయి "ఈ తాతయ్య సిస్టం ఎప్పుడు వదిలి పెడతాడా" అని నా వైపు గుర్రుగా చూస్తున్నాను. మరో రెండు మూడు రోజుల్లో నా నెట్ కనెక్షన్ రావచ్చు. ఇక అప్పుడు సమస్యే ఉండదు. సెలవు.
గండు కోయిల పాడెను గళము నెత్తి
రిప్లయితొలగించండిబొండు మల్లియ విరిసెను ముద్దుగాను
రండు నందన మదెయని రమణి యెదను
పండువెన్నెల లివె యమావాస్యఁ గురిసె.
ప్రమిద లెన్నియో వెలిగించ ప్రమదలచట
రిప్లయితొలగించండిచిచ్చు బుడ్లు మతాబులు హెచ్చు గాను
పిల్ల లందరు గాల్చగా వెల్లి విరిసి
పండువెన్నెల లివె యమావాస్యఁ గురిసె.
ప్రణబానందుని ప్రసవ వేదన ముగిసే
రిప్లయితొలగించండిదేశానికి మరో బడ్జెట్టు కుమారుండు పుట్టే
కార్పోరేట్లకి ఖుషీ, రైతుకి కన్నీళ్లు
పండువెన్నెల లివె యమావాస్యఁ గురిసె!
జిలేబి.
(కష్టే ఫలే వారి బడ్జెటు కామెంటరీ చదివాక!)
అంధుడగు ధృతరాష్ట్రుని కచ్యుతుండు
రిప్లయితొలగించండిపల్కుచు హితంబు విశ్వరూపమును జూపె
తత్ఫలమ్ముగ కురుపతి ధన్యుడయ్యె
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________________
చిన్ని యెన్నిక గెలవంగ - చేవ లేని
శక్తిహీనునకదె రాజ్య - సభను సీటు
పిదప మంత్రిగా స్థిరుడయి - పేరుగొనిన !
పేదవాడదె పెన్నిధి - నీది నట్లు
పండువెన్నెల లివె యమా - వాస్యఁ గురిసె!
_____________________________________________
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమీ అందరి ఆకాంక్షలు, ఆశీస్సుల వల్ల జ్వరం పూర్తిగా తగ్గింది. నా ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెంది సలహాలు ఇచ్చి, సానుభూతిని తెలిపిన సహృదయులందరికీ ధన్యవాదాలు.
కాకుంటే చాలా నీరసంగా ఉన్నాను. ఒంటినొప్పులు కూడా ఉన్నాయి.
ఇంట్లో నెట్ సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. పొరుగింటి వాళ్ళ దయతో రోజుకొకసారి నెట్ వినియోగించుకుంటున్నాను. అందువల్ల వెంట వెంటనే నా స్పందనలను తెలియజేయలేక పోతున్నాను. మన్నించండి.
02)
రిప్లయితొలగించండి_____________________________________________
పదవ తరగతి దప్పిన - పడుచు వాడు
పట్టుదల తోడ సాధించి - పస్టురాంకు
కడకు జిల్లాకు యధికారి - కాగలిగిన !
పండువెన్నెల లివె యమా - వాస్యఁ గురిసె!
_____________________________________________
చిన్ని గుండెకు పడె చిల్లి, చిట్టి తండ్రి
రిప్లయితొలగించండివేదనార్పగ నల్లాడె పేద తల్లి
దాత లెందరో కలసి చేయూత నీయ
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె
అయ్యా గురువు గారూ మంచి వార్తను చెప్పారు. మీ ఆరోగ్యమే మా మహా భాగ్యం. త్వరలోనే నీరసం కూడా తగ్గిపోయి మళ్ళా మా మధ్యలోకి వద్దురుగాని. శుభం.
రిప్లయితొలగించండిఅమావాస్య రాబోతున్నది.
రిప్లయితొలగించండిఆరోగ్యం చక్కబడుతున్న శుభవార్తను గురువు గారు తెలియజేయటం
ఖరపు కడగొట్టు నాళుల కలత పెట్టె,
కొంత దుష్కరసమయము గురువు గార్కి.
మంచి వార్తను వినిపించ మాకు నేడు
పండువెన్నెలలివె యమావాస్య కురిసె.
పెద్ద వారిండ్ల జరిగెడు పెండ్లి కొఱకు
రిప్లయితొలగించండివీధివీధుల దీ పాలు వెలుగు లీన
కళ్ళు మిరిమిట్లు గొలుపంగ కాంతులొదవ
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె .
శంకరయ్య గార్కి స్వాస్థ్యమ్ము చేకూరె
రిప్లయితొలగించండిశంకరాభరణము చాల మెరిసె
సభ్యులెల్లరకును స్వాంతమ్ము లలరారె
నందనమ్ము వచ్చి విందు గూర్చు
శంకరార్యా కోలు కున్నారు గదా ! ఇక తేరు కోవడమెంత సేపు !
రిప్లయితొలగించండిమునుపటి కన్నా రెట్టించిన ఉత్సాహంతో చేరు కుందురు గాని
నూతన నందన నామ వత్సరంలో !
03)
రిప్లయితొలగించండి_____________________________________________
పెండ్లి చూపులు జరిగినన్ - పెక్కు మార్లు
పెళ్ళి కొక్కరు ముందుకు - వెళ్ళ కున్న
పరమ దుర్గమ సమయము - పడతి గాంచి
పెండ్లి యాడిన మనసున్న - పెళ్ళికొడుకు
పట్టు వస్త్రాలు కట్నాలు - వలద టంచు !
బాటసారికి దొరికిన - బంగరట్లు
పండువెన్నెల లివె యమా - వాస్యఁ గురిసె!
_____________________________________________
చండశాసనులనుకొన్న గురువులు
రిప్లయితొలగించండిచండామార్కుల గడ దప్పి ప్రహ్లా
దుండు విష్ణ్వనుగ్రహంబొందె
పండువెన్నెలలివె యమావాస్య గురిసె
పద్య స్వరూప స్వభావాలైనా తెలీని మూఢుణ్ణి, చాపల్యాన్ని మన్నించగలరు.
ఈనాడు ఇప్పటి వరకు వచ్చిన పూరణలను చూద్దాము:
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారు వసంతాగమమును పేర్కొనుచూ రమణి యెదను పండు వెన్నెల కురిసె అన్నారు. ప్రకృతి రమణిగా అన్వయించుకొందాము.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు దీపావళి కాంతులే పండు వెన్నెలను దలపింప జేసెను అన్నారు.
శ్రీ వసంత కిశోర్ గారు 3 విధాలుగా పూరించేరు.
(1) రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుని గురించి
(2) పట్టుదలతో చదివి పెద్ద ఉద్యోగము సంపాదించిన వాని గురించి
(3) ఎన్నో సంబంధాలు చూచిన్ కుదరకపోయినా చివరకు దొరికిన సహృదయమైన పెండ్లి సంబంధమును గూర్చి
శ్రీమతి మందాకినీ గారు శ్రీ శంకరార్యునికి స్వాస్థ్యము చేకూరిన సంబరము గురించి
శ్రీ సుబ్బా రావు గారు పెద్ద వారింట్లో జరిగే పెళ్ళికి వెలిగే దీపపు కాంతుల గురించి.
అన్ని పూరణలు బాగుగ నున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.
అభిమానుల గుండెలలో దీపావళిని వెలిగించిన శ్రీ నేమాని గురువరేణ్యుల శ్రీచరణములకు ప్రణామములు.
రిప్లయితొలగించండిఈనాఁడు మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్య సొగసులు వెలారుస్తున్నది. వారికి భగవదనుగ్రహం వల్ల స్వస్థత చేకూరుతుండటం ఎంతో సంతోషంగా ఉన్నది. వారు "వందన" మనరాదని వినయవిజ్ఞాపనం చేస్తున్నాను. వారి ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.
దేవేంద్రుని పంపున మన్మథుడు పరమశివుని తపోవనంలోకి అడుగుపెట్టినప్పుడు అకాల వసంతోదయమైంది. పండు వెన్నెలలు ఉమావాస్యమును (పార్వతి ఇంటిని) వెతుక్కొంటూ వచ్చాయి:
శ్రీపుండరీకాక్షలేఖర్షభాదిత్యదేవతానీకంబు దిటవుఁ గొనఁగఁ
దారకదైత్యసంహారకారణుఁ డైన శరజన్ము జన్మంబు సాళగింప
సూనాస్త్రనికరంబు శుకపికప్రకరంబుఁ ౙలవట్టి ౙగజెట్టి బలము గాఁగఁ
బ్రాంతకాంతారాంతరనితాంతహేమంత మంత వసంతమై పంతు మీఱ
భావజుఁడు మహేశ్వరుని తపోవనంబు
నందు నడుగుమోపిన యంత నతిశయించి
పండు వెన్నెల లవె! యుమావాస్య మరసె!
పండు వెన్నెల లివె! యమావాస్యఁ గురిసె.
మఱొకటి:
కట్న మీయంగ లేదని కాంతను విడ
నాడి, తప్పు గ్రహించి, తానై వరించి,
పాదముల వ్రాలె విభుఁడు; నా వధువు నెడఁదఁ
బండు వెన్నెల లివె! యమావాస్యఁ గురిసె.
విధేయుఁడు
ఏల్చూరి మురళీధరరావు
గురువు గారి వద్దనుండి మంచివార్త వచ్చినది. చాలా సంతోషము
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని గారికి, శ్రీ ఏల్చూరి గారికి ధన్యవాదములు తెలుపుతూ
తమ విధేయుడు
వరప్రసాదు
తలపు తలపును లలితమై చెలువునిండి
రిప్లయితొలగించండిపదము పదమును మంగళాస్పదమునౌచు
రసమయమ్ముగ పద్యధారలు కురియుచు
నలరు మురళీధరు కవిత్వ మద్భుతముగ
ఇతర దేశము లందున్న పతిని దలచి
రిప్లయితొలగించండికలత బడుతున్న ప్రియసతి కలలు విరియ
గగన మందుండి మెరుపులా దిగెను సఖుడు
పండు వెన్నెల లివె యమావాస్యఁ నాడు !
ఎం .......త.....మంచి రోజూ ? తమ్ముని ఆరోగ్యం బాగై బ్లాగులో కనబడి నందులకు చాలా ఆనందం గా ఉంది . మరి కొంచం విశ్రాంతి తీసుకుంటే
రిప్లయితొలగించండి" మధుర మైనట్టి పలుకుల సుధలు కురియు
పండు వెన్నెల శంకరా భరణ మందు "
రాజేశ్వరి గారూ మీ పూరణ "ఇతర దేశము లందున్న పతిని దలచి" చాలా బాగుంది.
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిలక్కరాజు గారికి ధన్య వాదములు
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈనాటి నా భారతీ స్తుతి సీసములోని ఒక ప్రత్యేకతను గమనించారా? అందులో ఇంద్రగణములన్నీ "సల"లే కదా. అలా వ్రాస్తే నడకలో ఒక విశిష్ఠిత కనిపిస్తుంది. మీరూ ప్రయత్నించండి. స్వస్తి.
శ్రీయుత నేమాని గురుచరణుల శ్రీ చరణములకు ప్రణామం.
రిప్లయితొలగించండిభవదీయ నిస్సీమ దయాపూర్ణపద్యాశీర్వాదముచే ధన్యధన్యుడ నైనాను. మీ దీవెనలోని శుభాశంసితం వల్ల సుగంధిలమైనదే కాని, నా వాక్కు స్వప్రకాశితం కాదు. ఈ సమస్యాపూరణ వ్యాజాన, మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారి అప్రమేయసౌజన్యమూలాన నాకు మీ తోడి సన్నిధిసేవ సమకూడింది. మీరు అవ్యాజానుగ్రహంతో శిష్యత్వాన్ని అనుగ్రహించారు.
ఆ వచోనిచయమ్ము! ఆ తపోవిభవమ్ము! ఆ కృపావర్షమ్ము! ఆ మహత్త్వ!
మా శుభోదర్కమ్ము! ఆ సభావిజయమ్ము! ఆ విభాసత్వమ్ము! ఆ కవిత్వ!
మా శాంతతేజమ్ము! ఆశాంతసుయశమ్ము! ఆసాంతసత్త్వమ్ము! ఆ పటుత్వ!
మా మహాభావమ్ము! ఆ మహౌదార్యమ్ము! ఆ మహీదేవత్వ! మా గుణిత్వ!
మేను మన్నన న న్నోము మాననమున
నాను మునినాము నామమ్ము నూనినాను
నా మనమ్మున మౌనమ్ము నాన మాని
నేన నేమాని గురుదేవు నేమ మూని!
(మునినాము = పండిత శ్రీ నేమాని రామ సన్యాసి జోగారావు నామధేయులు)
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
మురళీధరా ! నేమాని వారిని ప్రశంసిస్తూ
రిప్లయితొలగించండిప్రశంసార్హమైన పద్యం చెప్పారు ! బావుంది !
ఉమావాస్యంలో మీరు కురిపించిన పండు వెన్నెల నిండుగా నున్నది !
కవిమిత్రుల పూరణలు వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి పత్యేక ధన్యవాదాలు.
ఇప్పటికే పక్కింటివాళ్ళ అబ్బాయి "ఈ తాతయ్య సిస్టం ఎప్పుడు వదిలి పెడతాడా" అని నా వైపు గుర్రుగా చూస్తున్నాను. మరో రెండు మూడు రోజుల్లో నా నెట్ కనెక్షన్ రావచ్చు. ఇక అప్పుడు సమస్యే ఉండదు. సెలవు.
శ్రీ వసంత కిశోర్ కవివతంసా!
రిప్లయితొలగించండిమీ అదృతికి ధన్యవాదములు.
చెలియ నగుమోము దివ్వెల వెలుగు నింప
రిప్లయితొలగించండిబాలబాలిక లుత్సాహ భరితులగుచు
నవ్వు పువ్వుల బూయింప నా మనమున
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె
-------------
చెలియ నగుమోము దివ్వెల వెలుగు నింప
రిప్లయితొలగించండిబాలబాలిక లుత్సాహ భరితులగుచు
నవ్వు పువ్వుల బూయింప నా మనమున
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె
-------------