13, మార్చి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 645 (దివియె భువిపైన గిరగిర)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

దివియె భువిపైన గిరగిర తిరుగుచుండు.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. కవి మిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. అయినా పెళ్ళిళ్ళకూ, చావులకూ తిరగక తప్పడం లేదు.
    కొద్ది రోజులు బ్లాగుకు సెలవు ప్రకటించి విశ్రాతి తీసుకొమ్మన్ని కొందరి మిత్రుల సూచన. ఇందులో నేను శ్రమపడుతున్న దేమీ లేదు. కేవలం సమస్య నివ్వడమే. అది కూడా మిత్రులు పంపినవే. ఎప్పటికప్పుడు పూరణలను చదివి విశ్లేషించడంలో కొద్దిగా మానసిక శ్రమ ఉంటుంది. ఇంట్లో నెట్ కనెక్షన్ లేక పోవడంతో ఆ శ్రమ కూడా లేదు.
    క్రమం తప్పకుండా పూరణలు చేస్తున్న మిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు.
    నా అనుపస్థితిలో పూరణలను విశ్లేషిస్తూ మిత్రులకు అవసరమైన సూచన లిస్తున్న పండిత నేమాని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !

    01)
    _____________________________________________

    దివియె భువి పైన గిర గిర - తిరుగుచుండు
    నటుల కాన్పించునే గాని , - కటిక నిజము
    భువియె గిరగిర తిరుగును - మొదటినుండి !
    దివియె గిర గిర తిరగదు - తిరము గుండు !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  3. దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు
    ఆహ ! యేమి యీ బలుకుల నాల కించ
    చెవుల బూ వులు వరుసంగ చిదుముకొనగ
    నవస రంబగు నియ్యె డ యయ్య ! మనకు

    రిప్లయితొలగించండి
  4. దివియు భువియు పాతాళమున్ దిరుగుచుండు
    నిరతమును, దివియె పైనుండు, ధరణి మధ్య
    నుండు, కావున చోద్యమేముండు నిందు
    దివియె భువిపైన గిర గిర దిరుగుచుండు

    రిప్లయితొలగించండి
  5. తావి గుభాళింపు కై గాలి తిరుగుచుండు
    తారల తోడు కై నెలరేడు తిరుగు చుండు
    మనసుకై పరంధాముడు తిరుగుచుండు
    దివియే భువిపైన గిరగిర తిరుగుచుండు!


    (డోంట్ బీ లేజీ జిలేబీ ఐ తిరుగుచుండు కవీశ్వరా, శంకరార్యా, ఆరోగ్యమునకు మూల కారణం mind, Health is the state of Mind, thats the only advise I can provide yu sir, Come back with good and cheerful health)

    zilebi.

    రిప్లయితొలగించండి
  6. చెట్లు చేమలు పరువెత్తు నట్లు తోచు
    బండి నుపవిష్టుడై సాగు వాని ముందు
    అవనిపై నుండి చూచు వా రందరకును
    దివియే భువిపైన గిరగిర తిరుగుచుండు!

    రిప్లయితొలగించండి
  7. మేలు గోరంత కీడేమొ మేరువంత
    జనుల ధనమంత పాలక జనుల చెంత
    మంత్రి మాన్యుల మాయల తంత్ర మందు
    దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి వందనములు, శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు తెలుపుతూ
    -----
    పుణ్య మూర్తులకును పాద పూజ జేయ,
    పుడమి పురిటినొప్పులకును తడవునివ్వ,
    దివియె భువిపైన గిరగిర తిరుగుచుండు
    నారధ ముని వలెను నేడు నలుదిశలకు
    ( పుడమి = సహనముగల స్త్రీ)

    రిప్లయితొలగించండి
  9. భూమి పైనున్న మనుజుల పుణ్య మేమొ
    నరుల కొన గూర్చు చుండుగా వరము లెన్నొ
    స్వర్గ తుల్యము గాదొకో ' శాటి లైటు '
    దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు.

    రిప్లయితొలగించండి
  10. జనులనెల్లరకును ప్రియస్థానమగును
    దివియె భువిపైన; గిరగిర తిరుగుచుండు
    భువి విరామము లేక విభుడగు రవియె
    కేంద్రమగుచును నెప్పుడు క్రింద పడక.

    రిప్లయితొలగించండి
  11. నింగి నగములు తిరగవు నిక్క ముగను
    తిరుగు చుండును తానుగా ధరణి యనగ
    దివియె భువిపైన గిరగిర తిరుగు చుండు [ నటుల ]
    కనులు దిరిగిన రుజయందు గలుగు బ్రాంతి !

    రిప్లయితొలగించండి
  12. నభము నందున సురలంత విభవ ముగను
    మన్ను మిన్నులు నేకమై మలగు నటుల
    దివియె భువిపైన గిరగిర తిరుగు చుండు
    మభ్య పెట్టును మనలను మాయ చేత !

    రిప్లయితొలగించండి
  13. మిత్రులారా!
    శ్రీ శంకరార్యులు వ్యాఖ్యచేసినట్లుగా నేను చేయలేను. కానీ కొంతవరకు ముచ్చటించుకొందాము. ఈనాటి సమస్య కొంచెము మనసునకు పదును పెట్టేదే. వచ్చిన పూరణలన్నీ బాగున్నవి.

    శ్రీ వసంత కిశోర్ గారు : దివి తిరుగదు అని పేర్కొనినారు. 4వ పాదములో తిరముగుండు అనే ప్రయోగమును మార్చితే బాగుంటుంది అని నా భావన. ఆ పాదాన్ని ఇలాగ మార్చుదాము: "దివి తిరుగదు, తిరమ్ముగ పరగుచుండు"

    శ్రీ సుబ్బారావు గారు: చెవులపై పూవుల శోభను ఉదహరించేరు.

    శ్రీ శ్యామల రావు గారు: సాపేక్ష సిద్ధాంతమును ఉదహరించేరు.

    శ్రీ మంద పీతాంబర్ గారు: మంత్రుల మాయా తంత్రాలతో పోలిచి జెప్పేరు.

    శ్రీ వరప్రసాద్ గారు: 2వ పాదములో తడవు నివ్వ అన్నారు - తడవు నీయ అంటే బాగుంటుందేమో. భూమి మీది పుణ్యమూర్తులకు దివి పాద పూజ చేయుటకు ఉత్సాహ పడును అని సెలవిచ్చేరు.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శాటిలైటును చక్కగా ప్రస్తావించేరు.

    శ్రీమతి మందాకిని గారు: మంచి విరుపుతో పూరించేరు.

    శ్రీమతి రాజేశ్వరి గారు: 2పూరణలు చేసేరు. 1. కనులకు వచ్చే రోగముతో చూచుట; 2) దేవతలు మాయతో మబ్య పెట్టుట అని.

    శ్రీమతి జిలేబి గారు: గాలి, చంద్రుడు, దైవము తిరిగే విధానమును తనదైన బాణిలో వినిపించేరు.

    అందరి పూరణలు ఆనందమును కలిగించేవే. అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారు పరిశీలించే అవకాశం లేనప్పుడు మీరు శ్రమ తీసుకుని పరిశీలించి వ్యాఖ్యానించటం మాకెంతో తృప్తి కలిగిస్తుంది.
    తప్పొప్పులు (పదప్రయోగాల్లో, గణగణనలో, యతిప్రాసల) విషయాల్లో మీ వ్యాఖ్యలు మాకెంతో అమూల్యమైనవి.
    మీకు మరీమరీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమాని వారికి ధన్య వాదములు తెలుపుతూ శిరసాభి వందనములు .

    రిప్లయితొలగించండి
  16. వలదు ప్లాస్టీకు సంచులు వలదు వలదు
    కుప్పల కొలది పెరిగిన తిప్పలగును
    కమల వైరిని కన్నుల కనఁగ కుదర
    దివియె భువిపైన గిరగిర తిరుగుచుండు

    కుదరదు + ఇవియె = కుదరదివియె

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి స్వస్థత మనోనిబ్బరము భగవంతుడు కల్పించాలని ప్రార్ధిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  18. సొంత యింటిని గూర్చిన వింత కలలఁ
    సగటు మానవు డెప్పుడు స్వర్గముఁ గను
    భూమి ధరవరల్ చుక్కలఁ బొడము కతన
    దివియె భువిపైన గిరగిర తిరుగుచుండు

    రిప్లయితొలగించండి
  19. మిత్రుల పూరణలు అలరారు తున్నాయి. అందఱికీ అభివందనములు.

    పుణ్యమూర్తులు పుడమిపై పుట్టి ప్రజల
    నడుమ వర్తిల్లి ధర్మమున్ నడచు నపుడు
    అనిమిషత్వము వర్ధిల్లు నవని యందు
    దివియె భువిపైన గిరగిర తిరుగుచుండు

    రిప్లయితొలగించండి