4, మార్చి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 637 (కోఁతి కూఁత కూసె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

కోఁతి కూఁత కూసెఁ గోడి వలెనె.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. కోతి కూత కూసె గోడివలెనె బళీ!
    వినిరె? యనగ నొక్క వెర్రి వాడు
    బాగు బాగు చేసే బాతు నృత్యంబని
    వెక్కిరించె నొక్క పిచ్చి వాడు

    రిప్లయితొలగించండి
  2. పల్లెటూరి బామ్మ ప్రతిదిన ముదయమ్ము
    కోడి కూత వినగ కునుకు లేచు
    మనుమ డర్ద రాత్రి మాయ జేయ ' చిలిపి '
    ' కోఁతి ' కూఁత కూసెఁ గోడి వలెనె.

    రిప్లయితొలగించండి
  3. ఎన్నికలకు తిరుగు నెందరో నేతలు
    పలుకు చుండునట్టి వాటము గన
    తొండ పలకరించె తుండంబు పైకెత్తి
    కోతి కూత కూసె గోడి వలెనె

    రిప్లయితొలగించండి
  4. సంతలోన నిన్న జంతుస్వరంబులన్
    దెల్పు మీటనొకటి దెచ్చినాను,
    తంతులెల్ల తాను తప్పుగా జతచేయ
    కోతి కూతకూసె కోడి వలెనె.

    రిప్లయితొలగించండి
  5. రామభద్రు డనిని రావణుఁ దునుమంగ
    లంక జేర బూనె బింక మొప్ప
    సేన నిదుర లేప సేతువు గట్ట నో
    కోతి కూత కూసె కోడి వలెను

    రిప్లయితొలగించండి
  6. కోడి కూత కూసె గోడి వలెనె నట
    కాల మహిమ లయ్య! కాద యిదియ ?
    ఒకరి మాట లొకర యోలి పలుకు చుంటి
    రికద! వింత లేదు నికను మనకు .

    రిప్లయితొలగించండి
  7. గెంతె నొక్క కోతి గొంతెత్తి మఱియొక
    కోతి కూత కూసె కోడి వలెను
    చెట్టు చేమ విఱగె కట్టెలుగా మారె
    మధువనమ్ము కళలు మాసి పోయె.

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ, మన తెలుగు వారూ, అష్టావధాని రాంభట్ల వారూ, శ్రీ పతి శాస్త్రి గారూ, సంపత్కుమార్ శాస్త్రి గారూ మిగిలిన మిత్రులందరికీ సూచన:

    క్రింది మెయిలు చిరునామాకు మీ మెయిలు చిరునామాలు పంపి జాలకవి సమ్మేళనంలో పాల్గొనండి:

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారు,
    ధన్యవాదాలు. వివరాలేమీ ఇవ్వలేదు మీరు.

    హనుమ నేడు మనకు నగుపించు నేరీతి?
    నాలకింపుమనుచు నాశ తోడ
    కోకిలేమి చేసె? కోడి పిల్లలరిచె,
    కోఁతి; కూఁత కూసెఁ; గోడి వలెనె.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారు చెప్పిన లింకు యిచ్చు చున్నాను.నేను పద్యములు మొదలు పెట్టినాను. కవి మిత్రు లందరు పాల్గొన గలరు.

    navanandanavasantam@googlegroups.com
    To: navanandanavasantam@googlegroups.com

    రిప్లయితొలగించండి
  11. మీ మెయిల్ ఐ.డి పంప వలసిన చిరునామా...

    bh.aditya369@gmail.com

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్చ్హాస్త్రి గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. స్వాగతమ్మని శంకరార్యులు స్వాగతించిరి నన్నిటన్
    నాగతమ్ముల సూకృతమ్ములు నన్ను నేడిట జేర్చెనే
    ఈగణమ్మునచేరినంతనె యిట్టె బుట్టునె పద్యముల్
    ఓగణాధిప నిన్ని వేడెద ఒజ్జయై పలికించవే

    రిప్లయితొలగించండి
  14. వి.గౌతమి
    నమస్కారములు శంకరయ్య తాతగారు ,
    మమ్ము నా ముద్దు పేరు
    నా బ్లాగ్ పేరు కూడా మమ్మునే

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిఆదివారం, మార్చి 04, 2012 3:42:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కొంటెవారి జూచి కోతిమూకలనుచు
    వెక్కిరించుచుండ ప్రక్కవారు
    వెకిలి చేష్టలంత వికటించగా నొక్క
    కోతి కూతకూసె కోడి వలెనె

    రిప్లయితొలగించండి
  16. హనుమచ్చాస్త్రి గారు,

    మీరు పద్యములను పెట్టినారన్నరు కదా. ఆ లింకును చెప్పగలరా!!

    రిప్లయితొలగించండి
  17. కవి మిత్రు లారా ! bh.aditya369@gmail.com కు మీ మెయిల్ ఐ డి పంపిస్తే మీకు navanandanavasantam@googlegroups.కం లింకు పంపు తారు. దానిద్వార మీరు పూరణలు చేయ వచ్చు మరియు చూడ వచ్చు.

    రిప్లయితొలగించండి
  18. కొతి తినెను రుచిగ కోడి మాంసము నంత
    తిన్న పిదప తెలిసె యెన్న గాను
    వెఱ్ఱి పుట్టె గాన బిఱ్ఱ బిగిసి పోయి
    కోఁతి కూఁత కూఁసె గోడి వలెను

    రిప్లయితొలగించండి
  19. చిందులేయు బొమ్మ సింహాసనంబెక్కె
    పండితుండు కొలిచె పామరులను
    పోతులూరి మాట పొల్లుపోనీయక
    కోతి కూత గూసె కోడి వలెనె

    రిప్లయితొలగించండి
  20. వసుధ నేలు వారు వరచోరులై యుండి
    వనము దోచు చుండ వనచరమ్ము
    నిదుర లేప బూనె నిద్రాణమౌ వని
    కోతి కూత కూసె కోడి వలెనె

    రిప్లయితొలగించండి
  21. స్వాగతమ్మని శంకరార్యులు స్వాగతించిరి నన్నిటన్
    నాగతమ్ముల సూకృతమ్ములు నన్ను నేడిట జేర్చెనే
    ఈగణమ్మునచేరినంతనె యిట్టె బుట్టునె పద్యముల్
    ఓగణాధిప నిన్ని వేడెద ఒజ్జయై పలికించవే

    రిప్లయితొలగించండి
  22. డి. నిరంజన్ కుమార్సోమవారం, మార్చి 05, 2012 12:08:00 AM

    కోతి చేష్ట లవియె కూతయైనను బెట్టు
    గోడ దూకు లేక కొమ్మలూగు
    హద్దు పద్దు లేక అల్లర్లు జేయునే
    కోతి కూత కూసె కోడివలెనె

    రిప్లయితొలగించండి
  23. కొండ కోతి కూసె కోడి వలనె
    వసంత కిశోరం నిదుర లేచె
    సదస్సున సమస్యాపూరణం వెల్లివిరిసె
    జిలేబీ కవిత కామెంట కరెంటు పోయే!!


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వాడు పేరుకే "కొండపగతుడు" గాని బుద్ధికి మాత్రం
    కోతి ,కొండంగి , కొండద్రిమ్మరి , కొండముచ్చు !
    ఏ రూపమైనా ధరిస్తాడు ! ఏ కూతలైనా కూస్తాడు :

    01)
    _____________________________________________

    కొమ్మ కొమ్మ నెగురు - కోతి బుద్ధులవాడు
    కోమలింట జేరె - గోల గూడ
    కొక్కొ రొక్కొ యనుచు - గుమ్మ మగని పంప
    కోఁతి కూఁత కూసెఁ - గోడి వలెనె !
    _____________________________________________
    గోల = గుమ్మ = స్త్రీ

    రిప్లయితొలగించండి
  25. నిద్రిస్తున్న కోతుల్ని యుద్ధానికి సన్నద్ధం జెయ్యడానికి ఒకకోతి కంఠం మార్చి :

    02)
    _____________________________________________

    కోటి పైన జేరె - కోతు లంద రచట
    కోట జేరి లంక - కూల గొట్ట !
    కోతు లంత నిదుర - కూలగా , మేల్కొల్ప
    కోఁతి కూఁత కూసెఁ - గోడి వలెనె !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  26. మూర్తిగారి స్ఫూర్తితో :

    03)
    _____________________________________________

    క్షోణి నేలువారు - కుసుమాలులుగ మార
    గోత్ర మంత దోచ - కోతి కుంది
    కోలుకొనుడు మీరు - మేలుకొను డనుచు
    కోఁతి కూఁత కూసెఁ - గోడి వలెనె !
    _____________________________________________
    క్షోణి = భూమి
    కుసుమాలుడు = దొంగ
    గోత్రము = అడవి

    రిప్లయితొలగించండి
  27. మిమిక్రీ పోటీల్లో పాల్గొన్న ఒకానొక కోతి :
    (మొదటి బహుమతి దానిదే ననుకోండి)

    04)
    _____________________________________________

    కోతి యొకటి నేర్చె - కూతల నెన్నెన్నొ
    కూత పంత మందు - కోరి గెలువ !
    కోడె, కొంగ , కుక్క - కోకిల వలె గాక
    కోఁతి కూఁత కూసెఁ - గోడి వలెనె !
    _____________________________________________
    పంతము = పోటీ

    రిప్లయితొలగించండి
  28. మిస్సన్నగారి స్ఫూర్తితో :

    దధిముఖుని వనం చేరిన కోతులలో నొక కోతి ఆనందముతో:

    05)
    _____________________________________________

    కోతి లంక మరలి - సీత జాడ దెల్ప
    గోల గోల జేసె - కోతులన్ని !
    కోపు త్రాగి , కైపు - కోపగా లేనట్టి
    కోఁతి కూఁత కూసెఁ - గోడి వలెనె !
    _____________________________________________
    కోపు = మద్యము

    రిప్లయితొలగించండి
  29. కిశోర్ జీ మీ పూరణలు ముచ్చటగా నున్నాయి, కాని మీరు అందిస్తున్న క్రొత్త పదజాలము బుఱ్ఱలో నిమిడి యుండడము లేదు. అయినా మీకు కృతజ్ఞతలు . కుసుమాలుడు అంటే యెదో గౌరవనీయుడనుకొన్నాను !

    రిప్లయితొలగించండి
  30. మూర్తీజీ ! ధన్యవాదములు ! ఆలోచన మీదే ! అక్షరాలే నావి !

    రిప్లయితొలగించండి
  31. వైవిధ్యంగా పూరణలు పంపిన
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    మందాకిని గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
    నిరంజన్ కుమార్ గారికి,
    జిలేబీ గారికి,
    వసంత కిశోర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గౌతమి (మమ్ము) గారూ,
    చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి