కవిమిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిరతము రామచంద్ర పద నీరజయుగ్మమునే భజించుచున్
రిప్లయితొలగించండివరమతి ధర్మమార్గమున వర్తిలుచున్ పరమార్థచిత్తులై
పరగెడువారికెల్ల కనుపండువు గావున యట్టి భక్తి తత్
పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్
ధరణినిసూర్య పుంజములు తాకక మున్నుగ లేచి స్నాతలై
రిప్లయితొలగించండిపరిపరికీర్తనమ్ములను భధ్రగిరీశునిభక్తిఁగొల్చుచున్
మరుజనమంబుసున్ననచు మైమరపున్గొను వేనవేల చూ
పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్!
కరమున శంఖచక్రముల గల్గిన శోభనమూర్తియై సదా
రిప్లయితొలగించండిస్థిరముగ భద్రపర్వతపు శృంగము నందున నిల్చినట్టి శ్రీ
కరుడగు రామభద్రుడిని కంజదళాయత నేత్రిఁ గొల్చు తత్
పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.
లక్ష్మీ దేవి గారూ,
రిప్లయితొలగించండిరెండవ పాదంలో రామచంద్రుడిని బదులు రామచంద్రుని అని ఉండాలి . కాబట్టి రామచంద్రవిభు అని దిద్దుకో వచ్చునేమో పరిశీలించండి . లేదా మీరు వేరే ఏదైనా దిద్దుబాటు చేయండి .
లక్ష్మీ దేవి గారూ,
రిప్లయితొలగించండిరెండవ పాదంలో రామచంద్రుడిని బదులు రామచంద్రుని అని ఉండాలి . కాబట్టి రామచంద్రవిభు అని దిద్దుకో వచ్చునేమో పరిశీలించండి . లేదా మీరు వేరే ఏదైనా దిద్దుబాటు చేయండి .మరో విషయం . భక్తి తత్పరులు ( చూ. నేమాని వారి పూరణ ) అనాలి కానీ భక్తి గొల్చు తత్పరులు అనవచ్చా ? ఇది చింత్యము .
ఊక దంపుడు స్వామీ ,
రిప్లయితొలగించండిపుంజము అనగా సమూహము . సూర్య పుంజములు ప్రయోగమునకు సూర్య కిరణములు
అను అర్ధము రాదు . సవరింప ప్రార్దితులు
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండివేనవేల ధన్యవాదములు.
లక్ష్మీ దేవి గారికి సూచించినట్లు- నాకూ దిద్దుబాటు చెప్పారు కాదు.
సవరించాను. తప్పొప్పులు చెప్పండి.
ధరణిని సూర్యదీధితులు తాకక మున్నుగ లేచి స్నాతలై
పరిపరికీర్తనమ్ములను భధ్రగిరీశునిభక్తిఁగొల్చుచున్
మరుజనమంబుసున్ననచు మైమరపున్గొను వేనవేల చూ
పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్!
భవదీయుడు
ఊక దంపుడు
శ్రీ గురుచరణులకు విహితానేక ప్రణామములు.
రిప్లయితొలగించండిఇంతమంది నోట పవిత్రమైన శ్రీరామ నామమంత్రాన్ని ఇన్నిమార్లు జపింపజేసిన నేటి సమస్యాప్రదాతకు, భక్తిరసవిధాతకు వందనం.
నాకు ఈ పూరణ మూలకంగా పునఃపద్యరచనావకాశాన్ని కల్పించిన శ్రీ కంది శంకరయ్యగారికి అభివందనం.
పద్యం HTMLలో ఒక్క వరుసలో వెళ్ళకపోవటం వల్ల రెండు భాగాలుగా పంపవలసి వచ్చింది. ఒక్క భాగంగా ఉంటే బాగుండేది. మన్నింపగలరు.
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
పరుల కునీతివర్తనల బమ్మెరవోయి; యధర్మచింతనా
రిప్లయితొలగించండిపరుల కుసుంభరాగముల బాధల పాల్పడి; దుష్టయోజనా
పరుల కువాడపుం దెఱువుబాముల గాసిలి; నీచయోచనా
పరుల కుచేష్టితానుచితపాతకచేష్టితకిల్బిషక్రియా
పరుల కుతర్కసంగతుల పాపము లీఁగిన పుణ్యభావనా
పరులకు నార్తచిత్తులకు భక్తిపథంబును నేర్పు పాడికా
పరులకుఁ గామశాంతికయి పావనరాముని నామకీర్తనా
పరులకుఁ గ్రోధశాంతికయి పావనరాముని నామకీర్తనా
పరులకు మోహశాంతికయి పావనరాముని నామకీర్తనా
పరులకు లోభశాంతికయి పావనరాముని నామకీర్తనా
పరులకు దుర్మదక్షతికిఁ బావనరాముని నామకీర్తనా
పరులకు మత్సరక్షతికిఁ బావనరాముని నామకీర్తనా
పరులకు నాత్మవంతుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు నాదిదేవుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు జన్మకీలుఁ డగుపావనరాముని నామకీర్తనా
పరులకు జ్ఞానగమ్యుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ దీర్థపాదుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు ధర్మయూపుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు నైకమాయుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు నైకశృంగుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ బుష్కరాక్షుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు బ్రహ్మనాభుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు రత్నగర్భుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు లోకనాథుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు వర్ధమానుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు విశ్వకర్ముఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు విశ్వరూపుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు విశ్వరేతుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు విశ్రుతాత్ముఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు వీరబాహుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు శార్ఙ్గధన్వుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు శేషతల్పుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు శోకనాశుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు సన్నివాసుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు సప్తజిహ్వుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు శ్రీనివాసుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు సోమగర్భుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు సత్యసంధుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు నాత్మయోని యగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ గైటభారి యగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ జక్రపాణి యగు పావనరాముని నామకీర్తనా
పరులకు దానవారి యగు పావనరాముని నామకీర్తనా
పరులకు ధర్మకర్త యగు పావనరాముని నామకీర్తనా
పరులకు ధర్మవేత్త యగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ బుణ్యకీర్తి యగు పావనరాముని నామకీర్తనా
పరులకు యోగవేత్త యగు పావనరాముని నామకీర్తనా
పరులకు విశ్వమూర్తి యగు పావనరాముని నామకీర్తనా
పరులకు శంఖపాణి యగు పావనరాముని నామకీర్తనా
పరులకు నక్షరుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నగ్రజుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నచ్యుతుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నద్భుతుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నర్చితుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నవ్యయుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నాశ్రితుం డయిన పావనరాముని నామకీర్తనా
రిప్లయితొలగించండిపరులకు నూర్జితుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నీశ్వరుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు నుత్తరుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకుఁ గామదుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు గోహితుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకుఁ బ్రాణదుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు భూషణుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు మాధవుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు మానదుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు రక్షణుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు వత్సలుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు వారిశుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు శర్మదుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు శాశ్వతుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు శ్రీకరుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు శ్రీధరుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సంగ్రహుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సంభవుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సత్కృతుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సర్వగుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సమ్మితుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సాత్త్వికుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు స్వస్తిదుం డయిన పావనరాముని నామకీర్తనా
పరులకు సూర్యవంశ్యుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు నాజిసూనుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ గౌసలేయుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు గాధిసూను వటు పావనరాముని నామకీర్తనా
పరులకు శైవచాపహర పావనరాముని నామకీర్తనా
పరులకు జానకీరమణ పావనరాముని నామకీర్తనా
పరులకు నాంజనేయప్రియ పావనరాముని నామకీర్తనా
పరులకు సప్తతాళహర పావనరాముని నామకీర్తనా
పరులకు వాలిసంహరణ పావనరాముని నామకీర్తనా
పరులకు సేతుబంధఘన పావనరాముని నామకీర్తనా
పరులకు రాక్షసాంతకుని పావనరాముని నామకీర్తనా
పరులకు జానకీప్రియుని పావనరాముని నామకీర్తనా
పరులకు లక్ష్మణాగ్రజుని పావనరాముని నామకీర్తనా
పరులకు ధర్మరక్షకుని పావనరాముని నామకీర్తనా
పరులకు సత్యదీక్షితుని పావనరాముని నామకీర్తనా
పరులకు మౌనిపూజితుని పావనరాముని నామకీర్తనా
పరులకు దేవవందితుని పావనరాముని నామకీర్తనా
పరులకు లోకరక్షకుని పావనరాముని నామకీర్తనా
పరులకు రామచంద్రుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు రామభద్రుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకుఁ గోసలేంద్రుఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు మానితాత్ముఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు చక్రవర్తిసుత పావనరాముని నామకీర్తనా
పరులకు సార్వభౌముఁ డగు పావనరాముని నామకీర్తనా
పరులకు వేడ్కగా నవమి పండుగఁ బల్లెల వాడవాడఁ దీ
ర్పరులకు నింపుగూరఁ బెనుపందిళులన్ ఘటియింపఁజేయు గూ
ర్పరులకు వేదమంత్రము లభంగురమంగళవాద్యఘోషఁ ద
త్పరులకు నేత్రపర్వముగ దంపతులున్ బరివారమెల్లఁ జూ
పరులకుఁ బ్రీతిభోజనముఁ బంక్తికిఁ దీర్చిన రామభక్తిత
త్పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదం బగున్.

నిరతము కర్మమార్గులయి నిత్యసుఖంబులు గాంచు వారికిన్,
రిప్లయితొలగించండిహరిహరనామసంస్మరణ మద్భుతరీతిని సల్పువారికిన్,
స్థిరతను మోక్షసిద్ధికిక చిత్తము బ్రహ్మనుజేర్చు ధ్యానత
త్పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్.
నిరతము కర్మమార్గులయి నిత్యసుఖంబులు గాంచువారికిన్,
రిప్లయితొలగించండిహరిహరనామసంస్మరణ మద్భుతరీతిని సల్పువారికిన్,
స్థిరతను మోక్షసిద్ధికిక చిత్తము బ్రహ్మను జేర్చు ధ్యానత
త్పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్.
నిరతము కర్మమార్గులయి నిత్యసుఖంబులు గాంచు వారికిన్,
రిప్లయితొలగించండిహరిహరనామ సంస్మరణ మద్భుతరీతిని సల్పువారికిన్,
స్థిరతను మోక్షసిద్ధికిక చిత్తము బ్రహ్మను జేర్చు ధ్యానత
త్పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్.
నిరతము కర్మమార్గులయి నిత్యసుఖంబులు గాంచువారికిన్,
రిప్లయితొలగించండిహరిహరనామసంస్మరణ మద్భుతరీతిని సల్పువారికిన్,
స్థిరతను మోక్షసిద్ధికిక చిత్తము బ్రహ్మను జేర్చు ధ్యానత
త్పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్.
కవిమిత్రులకు మనవి...
రిప్లయితొలగించండిఈరోజు ఎవరో "అజ్ఞాత" అసభ్యమైన పదజాలంతో వ్యాఖ్య పెట్టి, అశ్లీల చిత్రాలను, వీడియోలను చూపే కొన్ని వెబ్‌సైట్ల చిరునామాలను వ్యాఖ్యగా పంపాడు. సరిగ్గా అదే సమయంలో నేను నా ఇన్‌బాక్స్ తెరిచి ఉన్నాను. మిత్రులెవరూ చూడక పోయి ఉండవచ్చు. వెంటనే ఆ వ్యాఖ్యను తొలగించాను. ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ పంపుతాడేమో అని అనుమానం వేసి "వ్యాఖ్యల మోడరేషన్" అక్టివేట్ చేసాను. అందువల్ల మీ మీ వ్యాఖ్యలు వెంటనే బ్లాగులో కనిపించక పోవచ్చు. ఆ వ్యక్తి రెండు మూడు సార్లు పంపి విసిగి మానేస్తాడని అనుకుంటున్నాను. అందువల్ల కొన్ని రోజులు నేను వెంట వెంటనే వ్యాఖ్యలను పరిశీలించి ప్రకటిస్తూ ఉంటాను. అసౌకర్యానికి మన్నించండి.
హరినిమనంబునదుననహర్నిశలున్ దలపోయుచున్,సదా
రిప్లయితొలగించండిపరమము ముక్తిదాయకము భవ్యవినాశనకారకంబుగాన్
జరుగును,భద్రపర్వతపుసానులయందున,చూచు భక్తిత
త్పరులకు, రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్.
భద్రపర్వతము = భద్రాచలము అనే అర్థములో
అహర్నిశలు, సదా అని వాడినాను. అహర్నిశలు అనేది హరినామస్మరణకు, సదా అనునది భద్రాచలములో జరిగే రాములవారి నిత్యకల్యాణము అనే అర్థములో వాడినాను. పునరుక్తి దోషము లేదనుకుంటాను గురువుగారూ.
పరమ పదంబు జేరగను పావన మూర్తిని రామచంద్రునిన్
రిప్లయితొలగించండిపురజను లంత పుణ్యప్రద భూమిజ పెండ్లిని గాంచబోవగా
కురియగ దేవదుం దుబులు కూరిమితోడ జగంబు నిండచూ
పరులకు రామ చంద్రుని వివాహము పుణ్య ఫల ప్రదంబగున్`
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
________________________________________________
నిరతము సత్య ధర్మముల - నీమముగా జరియించు వారికిన్
పరమును గోరు వారలకు, - వారిజ గర్భుని ధ్యాన మందునన్
స్థిరమగు శాంతి గోరుచును - చిత్తము నిల్పిన నిత్య మోక్ష త
త్పరులకు రామచంద్రుని వి - వాహము పుణ్య ఫలప్రదంబగున్ !________________________________________________
ఈనాటి సమస్యకు నా పూరణం:
రిప్లయితొలగించండిచం. ధరణిన ధర్మ నిగ్రహము దానవుపాలి ట ఆగ్రహమ్ములన్
పరిణత జూపు రామునికి పావని సీతకు ఉత్సవమ్ముగా
సరియగు రీతి భద్రగిరి సాలున కొక్కటి జేయు కార్య త
త్పరులకు రామాచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్!
శంకరార్యా ! మీ ఆరోగ్యం కుదుటబడినదా ?
రిప్లయితొలగించండిశంకరార్యా ! మీ ఆరోగ్యం కుదుటబడినదా ?
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ, కుండెడుపాలలో ఒక విషపు చుక్క చాలునన్నట్లుగా ఒకరో ఇద్దరో దుర్మతుల కారణంగా మీ రిటువంటి నిర్ణయం ఇబ్బంది పడుతూనే తీసుకున్నారని అర్థం చేసుకో గలము. అందువలన విచారం లేదు.
రిప్లయితొలగించండి(నేనూ నా క్ర్తొత్త 'జ్యోతిశ్శాస్త్రం' బ్లాగులో మోడరేషన్ పాటిస్తున్నాను. లేకపోతే జ్యోతిషాన్ని యెద్దేవా చేస్తూనో, అనవసర శాఖా చంక్రమణం చేస్తూనో, నిందలూ నిష్టూరాలతో విసిగిస్తూనో కొందరు నానా రభసా చేస్తారు. తప్పవు మరి కొన్ని కఠిన నిర్ణయాలు.)
ఏల్చూరి మురళీధరరావు గారి సుదీర్ఘ చంపకమాల బాగుంది. ఇదొక రకమైన నామపారాయణంలాగా అనిపించింది.
రిప్లయితొలగించండిమురియుచు దోయిలందు తెలి ముత్యము లన్నియు పట్ట రాముడున్
రిప్లయితొలగించండిమెరవగ నీలి వర్ణమున మీదట జానకి చేత నెర్రనై
వరుసగ రంగు మారు తల బ్రాలను భక్తిని దల్చుచుండు చూ
పరులకు రామ చంద్రుని వివాహము పుణ్య ఫల ప్రదంబగున్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపరుష పదంబు పల్కడట, పావనచిత్తుడు, కోసలేంద్రుకున్
మురిపము గూర్చువాడతడు, మోహనరూపుడు, దివ్యతేజుకున్
వరములనిచ్చు వేల్పునకు వైభవమొప్పగ పెండ్లి జేయ చూ
పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.
పండిత నేమాని వారి వ్యాఖ్య ......
రిప్లయితొలగించండిశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు సుదీర్ఘమైన 108 పాదముల చంపకమాలికను శ్రీరామచంద్రునికి పుష్పహారముగా సమర్పించుకొనిరి. అది నిత్య పారాయణమునకు తగినట్లుగా నున్నది. మొన్న ఆ మాలికను మన బ్లాగులో అందరము చూచేము. వారిని అభినందిస్తూ ఈ పద్యమును మన బ్లాగులో ప్రకటింపగలరు.
పరమోత్సాహము మానసాంబుజమునన్ భాసిల్లగా శ్రీమదే
ల్చురి వంశాభరణుండు రాఘవునిపై స్తోత్రంబు గావించె సుం
దరమౌ చంపకమాలికాకృతి మహానందంబుతో భక్తులం
దరు పారాయణ చేయు నామములతో ధన్యుండతండెంతయున్.
సంపెగ పూల దెచ్చి బహు చక్కగ మాలను గూర్చినట్లుగా
రిప్లయితొలగించండినింపగు మొల్లమల్లియల నీశ్వరుకై తగ గ్రుచ్చినట్లుగా
సొంపు గులాబి జాజులను చూపుల కింపుగ దీర్చినట్లుగా
చంపక మాల భాను కుల చంద్రున కర్పణ జేసినారు శ్రీ
లింపొన రంగ భక్తిc మురళీధర! మీకు నమస్సుమాంజలుల్.
జై బజ్రంగ్ బలీ:
రిప్లయితొలగించండిఅరచుచు రామ భక్తులట హైరన జేయుచు బబ్రి పుత్రులన్
కరచుచు కాంగ్రెసీశ్వరుల కంఠము లొత్తుచు రామభూమినిన్
చరచుచు జబ్బలచ్చటను జంబము మీరగ హైందవంపు కా
పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్