వేడుకోలు
శ్రీవిశ్వేశ్వర! రాజతాచల మహాశృంగాధివాసా! మహా
దేవా! హైమవతీశ్వరా! పశుపతీ! దీవ్యత్ కృపాశేవధీ!
భావాతీత విశిష్ట తత్త్వవిభవా! బాలేందుచూడామణీ!
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!
శ్రీవిద్యానిధులైన నీదు పద రాజీవమ్ములన్ గొల్చెదన్
దేవా! సర్వజగన్మయా! సుజన హృత్సీమాలయా! చిన్మయా!
నా విజ్ఞాపన మాలకింపుము సదానందస్వరూపా! శివా!

ఓ వేదాంత వనీ విహారనిరతా! ఓ సర్వలోకేశ్వరా!
ఓ వేదస్తవనీయ తత్త్వవిభవా! ఓ సర్వయోగప్రదా!
ఓ విశ్వంభర! వామదేవ! గిరిశా! ఓ పార్వతీవల్లభా!

ఈ విశ్వంబు మహాంధకారమయ మందిచ్చోట నే చిక్కితిన్
త్రోవన్ గానక చిక్కులం బడితి చిద్రూపా! భవత్పాద రా
జీవంబే శరణంచు నమ్మి గొలుతున్ చిన్మార్గమున్ జూపుమా

కావేవీ సుఖదాయకంబు లవనిన్ గౌరీశ! శబ్దాదులం
దో విశ్వేశ్వర! భక్తి యించుకయు నందొప్పారకున్నన్ కృపా
భావా! పావన నామ! యాదరమునన్ భావింతు నీ తత్త్వమున్

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

పంచ ముఖునకు పంచ శార్దూలములతో జేసిన వేడుకోలు భక్తి సుధలను పంచినది. నమస్కారములు.
రిప్లయితొలగించండిహరునకు త్రిపురాసుర సం
రిప్లయితొలగించండిహరునకు జేసితిని నేను ప్రార్థనమును శం
కరుడాతడు మిము బ్రోచును
హర హర హర యనుడు గోలి హనుమఛ్ఛాస్త్రీ!
పండితులవారూ , రజతాచలమా లేక రాజతాచలమా అని సందేహంగా ఉంది. తీర్చగలరు.
రిప్లయితొలగించండిఅయ్యా అజ్ఞాతగారూ, రాజతాచలము సరియైన మాటయే. రాజతము అంటే వెండితో చేయబడినది. రాజతాచలము అంటే రాజతము అయిన అచలము. అంటే వెండితో చేయబడిన కొండ. వెండికొండ.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా అందర్నీ ధన్యుల్ని చేశారు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిశంకరుని కటాక్ష వీక్షణములు మా పై ప్రసరింప జేసిన శ్రీ పండితుల వారు ధన్యులు . అందుకు మా కృతజ్ఞత పాదాభి వందనములు.