21, మార్చి 2012, బుధవారం

ముకుందమాల


ముకుందమాలలోని ఒక శ్లోకమునకు స్వేఛ్ఛానువాదము


శ్రీవల్లభా యంచు దేవ దేవా యంచు
వరదాయకా యంచు హరి యటంచు
సత్కృపాపర యంచు జలజేక్షణా యంచు
భక్తప్రియా జగత్పతి యటంచు
భవమోచనా యంచు భద్రరూపా యంచు
నఖిల లోకైక నాథా యటంచు
నాగరాజ శయన నారాయణా యంచు
సకల లోక నివాస శౌరి యంచు
పలుకు పలుకున భక్తి భావమ్ము జిలుక
నీదు నామ మంత్రములనే నిర్మలమతి
పలుకవలె గాక నా జిహ్వ సలలితముగ
స్వామి గోవింద గోవింద శ్రీముకుంద!

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

5 కామెంట్‌లు:

 1. ధన్యులం.ముకుందమాలలోని అన్ని శ్లోకాలను అనువదించి మాకు ప్రసాదిస్తే ఇంకా ధన్యులమవుతాము గురువుగారూ!

  రిప్లయితొలగించండి
 2. అయ్యా విజయమోహన్ గారూ!

  శుభాశీస్సులు.
  ముకుందమాలను పూర్తిగా తెలుగు పద్యాలలో వ్రాయడానికి ప్రయత్నము చేస్తాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. ఆర్యా ! చక్కని అనువాదం. ధన్యులం. మూలమైన శ్లోకాన్ని కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 4. నమస్కారములు
  ముకుంద మాలా శ్లోకమును అనువదించి మా కందిం చినందులకు పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి ప్రణామములు

  రిప్లయితొలగించండి
 5. గురువు గారికి
  నమస్సులు. ముకుంద మాలా శ్లోకములను తెలుగు పద్యాలలో వ్రాయడానికి ప్రారంభించిన మీ ప్రయత్నం చాలా సంతోషకరమైనది. ప్రచురించబోయే ముందు ఇక్కడ తెలియజేస్తే నేను కూడా ఇతోధికంగా ఈ సత్కార్యంలో పాలు పంచుకుంటాను.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి