వరవీణా మృదుపాణి, పద్మభవు జిహ్వన్ బొల్చు గీర్వాణి, బం
భర వేణీ, శుకపాణి, సమ్ముదిత విద్వఛ్ఛ్రేణి, కళ్యాణి, భా
సుర విజ్ఞాన పవిత్ర వాణి, బహుధా శుద్ధాంతరంగమ్మునన్
వరివస్యన్ బొనరింతు నీ విభవమున్ భావించుచున్ భారతీ!
రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
adbhuthamaina padyam
రిప్లయితొలగించండినిర్మలాంతఃకరణం, పవిత్రమైన భావన, పరిశుద్ధమైన వాక్కు, నిరాఘాటమైన ధార, శబ్దాలంకారశోభితమైన శైలి, మత్తేభగమనం, నిండైన భక్తి ఉట్టిపడుతున్న స్మరణీయమైన శ్రీ శారదా స్తోత్రం.
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని గురుదేవుల చిత్తసంస్కారానికి జోహారులు. భగవతి రూపధేయం ముందున్న హంస వారితో సోఽహం అని సారూప్యసిద్ధిని భజిస్తున్నది.
శుభం భూయాత్!
నేమాని పండితార్యా నమోన్నమః.
రిప్లయితొలగించండివరవీణా మృదుపాణి రు
రిప్లయితొలగించండిచిర వాఙ్మయ విభవసిద్ధి చేకూర్చుత సద్
వరముగ మా హితులగు కవి
వరులకనుచు తెలుపుచుంటి పద్యాశీస్సుల్
సరస్వతీ పుత్రులు శ్రీ పండితుల వారికి ప్రణామములు
రిప్లయితొలగించండి