10, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 643 (రాముడిచ్చెను సీతను)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -


రాముడిచ్చెను సీతను రావణునకు.


ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. కవి మిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగు పడలేదు.
    నెట్ సమస్య కూడా పరిష్కారం కాలేదు.
    కొత్తగా ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు కరెంటు కోత.
    అందు వల్ల ఈ రోజు సమస్య ఇవ్వడం ఆలస్య మయింది.
    దయచేసి మరికొన్ని రోజులు పూరణల పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  2. రాముడా యెను గా హరి రమయె సీత
    రావణాసురు జంపగా రచన జేసి
    తప్పు జేయించి చంపుట యొప్పు గాన
    రాముడిచ్చెను సీతను రావణునకు.

    రిప్లయితొలగించండి
  3. రాముడిచ్చెను సీతను రావణునకు
    దక్కకుండగ, అగ్నిలో దాగియుండి
    చేయుమా నీదు నీడతో మాయ చేత
    మరొక సీత ననుచు నాజ్ఞ క్ష్మాతనయకు

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    హరియె రామునిగా యిల - నవతరించె
    దనుజ మూకల గూల్చగా - ధరణి మీద
    నెపము జూపగ రావణు - నిహతు జేయ
    రాముడిచ్చెను సీతను - రావణునకు !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  5. 02)
    _____________________________________________

    అమిత కారుణ్య మూర్తియై - హరియె భువిని
    అవతరించెను రాముడై - యసుర వధకు !
    ద్వార పాలకు లిద్దరిన్ - దరికి జేర్చ
    మాయ లేడిని దనుజుల - మాయ నెఱిగి
    రాముడిచ్చెను సీతను - రావణునకు !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ!
    "దనుజ మూకల" అనేది దుష్ట సమాసము అగుతుంది. సరిజేయండి. దనుజ సేనల లేక దనుజ చయముల వంటి మార్పులు ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  7. 03)
    _____________________________________________

    రామ రావణ యుద్ధపు - రచన జేయ
    రక్కసుల మాయ నెరిగిన - రామ విభుడు
    రమ్య రురువును బట్టగా - రమణి విడచి
    రాక నెరిగియు క్రూరుడౌ - రాక్షసునకు
    రాముడిచ్చెను సీతను - రావణునకు !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  8. నేమాని వారికి ధన్యవాదములతో :
    01అ )
    _____________________________________________

    హరియె రామునిగా యిల - నవతరించె
    దనుజ సేనల గూల్చగా - ధరణి మీద
    నెపము జూపగ రావణు - నిహతు జేయ
    రాముడిచ్చెను సీతను - రావణునకు !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  9. రాము డిచ్చెను సీతను రావణు నకు
    ననగ నేటికి ? రావణు డ పహ రించె
    మాయ వేషంబు దాల్చియు మాయ జేసి
    మాయ లెం త యొ కాలంబు మనగ లేవు .

    రిప్లయితొలగించండి
  10. భీమునగ్రజు కుంగరం బెవ్వరిచ్చె
    నెవరి వెదకెను లంకలో పవన సుతుడు
    యెదిరి యెవ్వారి కింజేసె హెచ్చరికను
    రాముడిచ్చెను - సీతను - రావణునకు.

    రిప్లయితొలగించండి
  11. రాజ్య భోగమ్ము వదిలిన రాజ సుతుడు
    పసిడి జింకకై పరుగిడ పాడి యౌనె
    రాక్షసాదుల నిర్జించు రచన యేమొ
    రాముడిచ్చెను సీతను రావణునకు!!!

    ఇంచుమించు ఇదే సమస్యను ( రాము డొ సెగెను జానకిన్ రావణునికి ) లోగడ 14 -12 -2010 నాడు 169 వ సమస్యా పూరణగా ఇదే బ్లాగు లో ఇవ్వడం జరిగింది .ఆనాటి కవి మిత్రుల పూరణలను గూడ గమనించ వచ్చును.

    రిప్లయితొలగించండి
  12. గోలీ వారు,

    నమో నమః! అద్భుతం మీ పూరణం. మూడు పాదాలు, మూడు ముక్కలు వెరసి నాలుగు పాదాల కవితా గీర్వాణీ!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  13. రామ చంద్రన్ తమిళులకు రాముఁడయ్యె
    జానకిగ మారె నిజసతి జానకి మరి
    నుతమగు కరుణానిధి రావణుండు కాగ
    మరి జయలలితయె ప్రజకు మాయ సీత
    తన తదుపరి పోటిగ నిల్వ తమిళనాట
    రాముడిచ్చెను సీతను రావణునకు!!

    రిప్లయితొలగించండి
  14. విశ్వ మాయను కల్పించు విష్ణు వతడు
    కపట లేడిని దెచ్చెడి నెపము తోడ
    దైత్య సంహార మొనరించ ధర్మ నిరతి
    రాముడిచ్చెను సీతను రావణునకు !

    రిప్లయితొలగించండి
  15. దండకారణ్యమున పలుతాపసులకు
    భయము దీరిచి కరుణనభయము నచట
    రాముడిచ్చెను; సీతను రావణునకు
    మృత్యుగీతగాగ విధి పంపినది గనుడు

    రిప్లయితొలగించండి
  16. మిత్రులారా!
    ఈనాడు పూరణల పంపిన వారందరికి అభినందనలు.
    1. శ్రీ శంకరయ్య గారు త్వరలో కోలుకొనాలని మన ఆకాంక్ష.
    2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారునూ మరియునూ ఎందరో రాముని అవతార ప్రయోజనమును గూర్చియే పూరించేరు.
    3. శ్రీ సుబ్బారావు గారు ప్రశ్నతో మొదలిడి, రావణుని మాయను గూర్చి కూడా పేర్కొన్నారు.
    4. శ్రీ జిగురు సత్యనారాయణ గారు రాజకీయాలని ఎన్నుకొన్నారు.
    5. శ్రీమతి రాజేశ్వరి గారు కపట లేడి అని వాడేరు. కపట మృగము అంటే బాగుంటుంది. లేకపోతే దుష్ట సమాసము అవుతుంది.
    6. శ్రీమతి మందాకిని గారు మంచి విరుపుతో మంచి పూరణ చేసేరు.
    7. శ్రీ వసంట కిశోర్ గారికి, శ్రీ మంద పీతాంబర్ గారికి కూడ అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. గురువులు శ్రీ పండిత నేమాని వారికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! మీకు ఇంకను ఆరోగ్యము కుదుట పడి నట్లు లేదు. కొన్ని రోజు లు విశ్రాంతి తీసుకోగలరు. త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షిస్తున్నాము.

    శ్రీ నేమాని వారికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  19. పాదు కలిచ్చినదెవరు భరతునకును
    ఎవరినెత్తుకు వచ్చేను రావణుండు
    ఎవరికాత్మలింగంబు తా నిచ్చె శివుడు
    రాముడిచ్చెను సీతను రావణునకు

    రిప్లయితొలగించండి
  20. గౌతమి గారు,
    మీ పూరణలో మొదటి పాదములో గణభంగమయినది. రెండవ పాదములో ప్రాసయతి సరిపోలేదు. పాదము మొదటి అక్షరము లఘువు అయితే ప్రాసయతి ముందరి అక్షరము కూడా లఘువు కావలె. మీ పూరణకు నా సవరణ.

    పాదుకలొసగినదెవరు భరతునకును
    రావణుండెవరిని తెచ్చె రాక్షసముగ

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా ! మీ ఆరోగ్యం ఎలా ఉంది !
    మీరు త్వరగా కోలుకోవాలని కోరుతున్నా !

    రిప్లయితొలగించండి