కవిమిత్రులారా,
హోళీ శుభాకాంక్షలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
హోళీ శుభాకాంక్షలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
మిత్రు లందరికీ నమస్కృతులు.
రిప్లయితొలగించండినా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఇంకా పొరుగువారి నెట్ కొద్దిసేపు వినియోగించుకుంటున్నాను.
మిత్రుల పూరణలను ఎప్పటికప్పుడు పరామర్శిస్తున్న పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
పూరణలు చేస్తున్న మిత్రులందరికీ అభినందనలు.
మాతృ వియోగము నొందిన శ్రీ గరికిపాటి వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేయు చున్నాను.
రిప్లయితొలగించండిఅమ్మహ నీయుం డెప్పుడు
అమ్మను తలవంగ మిగుల నార్ద్రత నొందున్
అమ్మ గలిసె దుర్గమ్మను
అమ్మా నీవిమ్మ 'అమ్మ' కాత్మకు శాంతిన్.
మాస్టరు గారూ ! మీకు త్వరగా ఆరోగ్యము కుదుట పడవలెనని మనసారా అభిలషిస్తున్నాను.
రిప్లయితొలగించండినెట్ వినియోగించుకొనుటకు మీకు అవకాశము నిచ్చుచున్న మీ పొరుగు వారికి మా ధన్యవాదములు.
అందరికి హోళీ శుభాకాంక్షలు.
మాతృ మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
అవనిని అమ్మగ నిలచుచు
నవనీతము వంటి ప్రేమ నరులకు పంచే
స్తవనీయు రాలు నగు న
వ్వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినమ్మెను దైవమే యనుచు నందరు మెచ్చగ కన్నతల్లినే
అమ్మకునంజలించి జగదంబకు వందనమాచరించుచున్
కమ్మని కంఠమున్ బలికె కావ్యసుధారసధారలెన్నియో
అమ్మవియోగ దు:ఖమును నార్పగ శక్యమె నారసింహుకున్
హనుమచ్చ్హాస్త్రి గారూ ప్రాస.................?
రిప్లయితొలగించండిఅనిశము మువురమ్మల వలె
రిప్లయితొలగించండిజనులను పోషించి, గూర్చి సౌఖ్యము, హితముం
బొనగూర్చెడు గుణవతియగు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్
గురువు గారు,
రిప్లయితొలగించండిమీ ఆరోగ్యం కుదుటపడాలని ఆ సర్వేశ్వరునికి మా విన్నపాలు.
మీ పొరుగు వారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు.
నాకు నెట్ సమస్య కారణంగా ఈ రోజే నేనూ సభాప్రవేశం చేస్తున్నాను.
హనుమచ్ఛాస్త్రి గారు,
మీ పద్యము చాలా బాగున్నది. కానీ ప్రాసనియమాన్ని మరచినట్టున్నారు.
ఘనమగు నఖిల జగమునకు
జననిగ పాలించుచున్న శక్తికి నమ్మా
నినికిని, సద్గుణ వతియగు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
పండితుల వారి ఆలోచనే నాకు వచ్చుట ఆశ్చర్యము.
రిప్లయితొలగించండిఇప్పుడు మరొక పూరణ
అనయము తన పతి తోడుగ
మనియెడి సతి గౌరికి, పరమాత్ముని ఘనమౌ
తనువున సగముగ నొదిగిన
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅనురాగంబును పంచును
జననీ రూపంబుదాల్చి జన్మనొసంగున్
మన క్షేమంబులు గోరెడు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
కనుటయు బిడ్డల యాకలి
రిప్లయితొలగించండికనుగొనుటయు కరుణసుధను కరగించుటయున్
వనితలకే చెల్లును గద
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్
మిస్సన్న గారికి , మందాకినీ గారికి ధన్యవాదములు.తొందరపాటులో పొరపాటు.
రిప్లయితొలగించండిక్షమించాలి. ప్రస్తుతానికి సమస్య పాదాన్ని సవరించు చున్నాను.
అవనిని అమ్మగ నిలచుచు
నవనీతము వంటి ప్రేమ నరులకు పంచే
స్తవనీయు రాలు నగు భ
వ్య వనితకు సలాము సేయవలె సద్భక్తిన్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువుగారూ మీరు అనారోగ్య స్థితిలో ఉండి కూదా శ్రమతీసికొనుచున్నారు. మీ అరోగ్యము మాకు ముఖ్యము. మీరు డాక్టర్ గారి సలహాలు పాటించి విశ్రాంతి తీసికొనవలసినదిగా కోరుచున్నాను. మీకు స్వస్థత చేకూరి ఆరోగ్యవతులుగా బ్లాగు నిర్వహించాలని కోరుకొనుచున్నాను.
శ్రీ గోలి హనుమాఛ్ఛాస్త్రి గారి పద్యమును ఇలా సవరించుచున్నాను.
రిప్లయితొలగించండిఅనయము నమ్మగ నిలుచు న
వనీతమె యనదగు ప్రేమ పంచు జనులకున్
వినుత గుణశీల యగు న
వ్వనితకు వందనము సేయవలె సద్భక్తిన్
అనితర సాధ్యము అమ్మయె
రిప్లయితొలగించండికన గలదుగ మంచి చెడుల గనుచును సంతున్
కనిపింప జేయు హరి గని
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
గురువు గారూ ,
రిప్లయితొలగించండిఇక్కడ ఇచ్చిన సమస్య కాకుండా ఇంకేమన్నా ఇతివృత్తం మీద పద్య రచన చేయటానికి ప్రయత్నిస్తే, అవి ఎక్కడ రాయాలి ?
చిన్న సవరణ తో..
రిప్లయితొలగించండిఅనితర సాధ్యం బమ్మయె
కన గలదుగ సృష్టి జేయు కమలభవు వలెన్
కనిపింప జేయు హరి గని
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
నా పూరణను చక్కని భావముతో సవరించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఇది నా మొదటి ప్రయత్నం.
రిప్లయితొలగించండివందనము శంకరయ్యకు
సందేహము లేక తెలుగు సలిలము కాగా
అందముగ చాటు పద్యము
లందింతును బ్లాగు లోన యనవరతముగా.
నేటి సమస్యాపూరణానికి నా ప్రయత్నం.
మనమును,గుణమును, మలచుచు
తనువును తరియింప జేయు తఱుణోపాయం
తెనిగింప జేయ గల యా
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
మిత్రు లందరికీ నమస్కృతులు
రిప్లయితొలగించండిహోళీ శుభాకాంక్షలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
కనురెప్పతీరు కదులుచు
మనమున మమతానురాగ మాధుర్యముతో
అనునిమిషము ప్రేమించెడు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
వనితే జాతికి రత్నము
రిప్లయితొలగించండివనితే కద! మూల మసలు వంశము కొరకున్
వనితే ముఖ్యము సృష్టికి
వనితకు వందనము సేయవలె సద్భ క్తిన్ .
ఘనమగు మానవ జాతికి
రిప్లయితొలగించండిఇన చంద్రుల వోలెనుండె ఇంతియు మగడున్
జన నుతులగు పురుషునకును
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్!!
వర్ధిష్ణుకవి శ్రీ వామనకుమార్ గారికి
రిప్లయితొలగించండిఅభినందనలతో,
మీ పద్యరచన సర్వతోముఖంగా వర్ధిల్లాలని నా శుభాకాంక్ష. మీ పూరణ -
వందనము శంకరయ్యకు
సందేహము లేక తెలుఁగు సందుకొనంగ
న్నందముగఁ జాటుపద్యము
లందింతును బ్లాగులోన ననవరతముగన్.
మనమును, గుణమును మలుచుచుఁ
దనువును దరియింపఁ జేయు తరుణోపాయం
బెనయింపఁ జేయఁగల యా
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.
అని ఉంటే బాగుంటుంది. (సందుకొను = వ్యాపించు)
సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
గురువు గారు మురళీధర్ గారికి నమస్సులు. మరియు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ వామనకుమార్ గారికి అభినందన పూర్వక స్వాగతము.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిజనతను సంరక్షిం పగ
రిప్లయితొలగించండిజనియించెను ధరణి పైన జగదంబ యనన్ !
ఘనముగ సంతస మందుచు
వనితకు వందనము సేయవలె సద్భ క్తిన్ !
తమ్ముడూ ! మీ ఆరోగ్యం కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ, ప్రప్రథమంగా మీరు తమ ఆరోగ్యం విషయంలో శ్రధ్ధవహించవలసినదిగా ప్రార్థన. అవసరమైతే బ్లాగుకు కొంచెం విరామం ఇవ్వండి. ఫరవాలేదు.
రిప్లయితొలగించండిశ్రీ హనుమచ్ఛాస్త్రి గారూ, మీరు గరికపాటి వారి మాతృవియోగంగురించి ప్రస్తావించటం వలననే సుదూరాలలో వున్న మాకు కూడా తెలియవచ్చింది. ఇటీవలి కాలంలో ఆయన చిన్న చిన్న మాటలతో పద్యరూపంలో ప్రకటించిన మాతృభక్తి అనన్యమూ, అపురూపము. వారిదే ఒక పద్యం:
రిప్లయితొలగించండిఅమ్మ నెదందలంతు, విపదంధ తమస్సుల వేళ ప్రేమ దీ
పమ్ము నెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రం
థమ్ముల సారమంతయు కథా కథనమ్ముల తెల్పు వ్యాస పీ
ఠమ్ము నెదందలంతు, కమఠ౦పు నివృత్తి నొసంగి బ్రోవగన్.
ఆమె ధన్యురాలు.
నాకు స్వస్థత చేకూరాలని కోరుకుంటున్న మిత్రులందరికి ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాను.
రిప్లయితొలగించండి*
గరికిపాటి వారి మాతృవియోగాన్ని మిత్రుల దృష్టికి తెచ్చిన గోలి వారికి ధన్యవాదాలు. స్పందించిన మిత్రులకూ ధన్యవాదాలు. నిజమే... మాతృదేవతపై వారు చెప్పిన పద్యాలు గొప్పగా ఉంటాయి. గరికిపాటి వారికి బ్లాగుముఖంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సెహబాస్! సమస్యపాదాన్ని మార్చడం మీ సర్వతోముఖ ప్రతిభను తెలియజేస్తున్నది. అభినందనలు.
*
మనోహరమైన పూరణలు చేసిన
పండిత నేమాని వారికి,
మందాకిని గారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
మిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
వామన కుమార్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
సుబ్బారావు గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.
*
వామన్ కుమార్ గారూ,
మీరేదైనా ఇతివృత్తాన్ని స్వీకరించి పద్య రచన చేసినప్పుడు నా మెయిల్ అడ్రసుకు పంపిస్తే దానికి ప్రత్రేక పోస్ట్‌గా ప్రకటిస్తాను. అయితే అది ఒక ఖండకృతిగా కనీసం మూడు పద్యాలైనా ఉంటే బాగుంటుంది. మీరు "వర్గాలు" లోని "అవీ-ఇవీ" శీర్షికను చూడండి ఒకసారి. ఆ విధమైన మిత్రుల రచనలు అందులో ప్రకటింపబడ్డాయి. నా మెయిల్ చిరునామా
shankarkandi@gmail.com
*
ఏల్చూరి మురళీధరరావు గారూ,
స్వాగతం. వామన్ కుమార్ గారి పద్యాలను సవరిస్తూ నా బ్లాగులోకి అడుగిడడం చాలా సంతోషాన్ని కలిగించింది. మీ సహకారాన్ని కొనసాగించవలసిందిగా మనవి.
విద్వన్మాన్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిఆంధ్రదేశంలో వందలాదిమంది విద్యార్థులను, విద్యాధికులను పద్యవిద్యాధరులనుగా తీర్చిదిద్దిన దేశికతల్లజులు మీరు. వామనకుమార్ గారు మీకు సమర్పించిన గురుపూజాప్రథమకుసుమపరిమళం సురభిళం కావాలని - యదృచ్ఛయా తిలకించిన ఆ రచనను సవరించే సాహసం చేశాను. మీ సౌజన్యానికి కృతజ్ఞుణ్ణి.
ఈశ్వరానుగ్రహం వల్ల అచిరకాలంలో మీరు స్వస్థులై సర్వశబ్దాధ్వనీనులకు మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షిస్తుంటాము.
మిత్రులు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి మాతృవియోగదుఃఖతరుణాన మీ సంధానకరణి ముఖంగా ప్రగాఢసంతాపాన్ని తెలియజేస్తున్నాను.
యుష్మన్నిరంతరాశీరభిలాషి,
ఏల్చూరి మురళీధరరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
వనిత ఘనతను జెప్పగా నెవరి తరము :
01)
___________________________________
వనితల ఘనతను బొగడగ
వనజభవుని వలన యగునె ? - పశుపతి కగునే?
పెనుబాము కైన వీలగు ?
వనితకు వందనము సేయ - వలె సద్భక్తిన్.
___________________________________
శంకరార్యా వ్యాఖ్యలపెట్టె కనబడితే చెత్త బుట్ట
రిప్లయితొలగించండిచెత్త బుట్ట కనబడితే వ్యాఖ్యలపెట్టె మరియు కుడివైపు నుండేవి
మాయమగుచున్నవి ! పరిశీలించుడు !
ఇప్పుడు రెండూ కనుపిస్తున్నవి !
మళ్ళీ చెత్తబుట్ట మాయమైనది !
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమీ వింత ?
రిప్లయితొలగించండిఇప్పుడు రెండూ కనుపిస్తున్నవి !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ పేజీ లో మాత్రమే రెండూ కనుపించు చున్నవి !
రిప్లయితొలగించండిపేజీ మారితే ఏదో ఒకటే కనబడుతున్నది !
ధన ధాన్యము బంగారము
రిప్లయితొలగించండికనివిని యెరుగని సుఖములు కావలెనన్నన్
తనువున మనమున సోనియ
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్ :)
రాహులు బాబా బెనారెసులో:
రిప్లయితొలగించండిగొణగక సణగక నసగక
చెణుకులు విసరకను మీరు చెల్లాయమ్మై
వణకించుచుండు కాంగ్రెసు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్
అనయము చాగపునెలవై
రిప్లయితొలగించండితనసంతుకు మేలుగూర్చతపననుబడుచున్
కనిపించేదైవమ్మా
వనితకువందనముసేయవలెసద్భక్తిన్