కవిమిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.
ఈ సమస్యను సూచించిన శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదాలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.
ఈ సమస్యను సూచించిన శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదాలు.
గురువుగారూ,
రిప్లయితొలగించండిక్రమాలంకార పూరణ.
పిల్లను దెచ్చి మోదమున పెండిలి చేసినయట్టి మామకున్,
మెల్లగ చెంతజేరి తగు నెమ్మిక జూపెడి నిష్టభార్యకున్,
చల్లగ జూచి శ్రేష్టమగు సఖ్యతనేర్పిన మాతమాతకున్,
అల్లుడనయ్యెదన్, మగడనయ్యెద, నేమనుమండనయ్యెదన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ అభినందనలు.
రిప్లయితొలగించండినల్లని రంగునే బులుమి నాతులు మువ్వురు కేశసౌరుకున్
రిప్లయితొలగించండిచెల్లక కాలమే, వగచి, చీరలకొట్లకుబోవ మర్త్యుతో
నల్లడ,నెల్లవారలకునాతడుచెప్పదొడంగె,తిప్పలై:
అల్లుడనయ్యెదన్,మగడనయ్యెద,నేమనుమండనయ్యెదన్.
పిల్లడ! చేర రార! మరి పెండ్లిని యాడితి నత్త కూతునే
రిప్లయితొలగించండినల్లన జూడగా వరుస లన్నియు జెప్పెద నాలకింపుమా
మెల్లగ! నత్తగారికిని మీదట భార్యకు నామె తాతకున్
అల్లుడనయ్యెదన్, మగడనయ్యెద, నేమనుమండనయ్యెదన్!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అసలే భ్రాహ్మణ వేషంలో నున్నాడేమో
ఆ పై రాజాధి రాజులకూ వీరాధి వీరులకూ అసాధ్యమయిన
మత్స్యయంత్రాన్ని భేదించాడేమో
ఆనంద పారవశ్యంలో ద్రుపదునికి
తాను యే యే విధంగా బంధు వౌతాడో ఏకరువు పెడుతున్నాడర్జునుడు :
01)
________________________________________________
కల్లయు గాదు సత్యమిది - గాంచితి వీవు సభాంతరాళమున్
అల్లదె మత్స్య యంత్రమును - నాశగ గొట్టితి , రాజనందనుల్
గొల్లన ! నేటినుండి తమ - కొమ్మకు , కూతుకు , మాతృదేవికిన్
అల్లుఁడ నయ్యెదన్ , మగఁడ - నయ్యెద , నే మనుమండ నయ్యెదన్ !________________________________________________
కొమ్మ = స్త్రీ(భార్య)
హనుమచ్ఛాస్త్రి గారు,
రిప్లయితొలగించండిబాగా చెప్పారు.
కానీ పెండ్లిని యాడితి స్థానంలో పెండిలినాడితి అనాలేమో!
పిల్లను చూసివచ్చెనిక పిల్లడి తొందర పెండ్లినాటికై,
నొల్లడు తిండినిద్దురల, నూహల నెప్పుడు తేలియాడె,నే
నల్లుడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే,మనుమండ నయ్యెదన్
నల్లని తాత,యవ్వలకు; నాకిక నెల్లరు సొంతవారలే.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅల్లరివాడ వేమవుదు వాలురి నుందరరాజుగారికిన్
పిల్లను నివ్వ, పిల్లకును, పేర్మిగ పెంచిన దాని తాతకున్
అల్లన బంధమేమిటన యంతట జెప్పెను భానుమూర్తి తా
నల్లుడనయ్యెదన్, మగడనయ్యెద, నేమనుమండనయ్యెదన్
అలురు సుందరరాజగారు, వారి అల్లుడు భానుమూర్తిగారు నన్ను మన్నించవలసినదిగా కోరుచున్నాను. భానుమూర్తిగారిని, కూతురునిచ్చిన అలూరు సుందరరాజుగారికి, ఆపిల్లకు, ఆపిల్లయొక్క తాతకు అతను వరుసకు ఏమౌతాడని అడిగినపుడు అతను చెప్పు సమాధానంగా ఊహించి వ్రాసినాను.
పెద్దలు, సంబంధితులు నన్ను మన్నించ ప్రార్థన.
కవిమిత్రులకు నమస్కారము . నేను గత సంవత్స రము చదివిన దానిని మీతో ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుందని అనుకొంటున్నాను. సాహితీ ప్రియులకు తెలిసియే యుండును. అనుచితమని భావిస్తే క్షమించగలరు .
రిప్లయితొలగించండిశ్రీ T .V .K.సోమయాజులు గారి "ఏఱిన ముత్యాలు " పుస్తకం లో ప్రస్తావించిన దానిని వారికి కృతజ్ఞలతో మీతో పంచుకొంటున్నాను .
కామము ఒక వయస్సులో పరవళ్ళు త్రొక్కు చుండును కళ్ళు మూసుకొని యున్న యువకుడు అత్యాశతో వేశ్యా
గృహము చేరినాడు .ఏబది యేండ్ల లోపు వయస్సున్న ఆమె ,తన కూతురును -మనుమరాలును -తనను పరిచయము చేసి - కూతురితో నుండి అల్లుడవయ్యెదవా? నన్ను గూడి మగడవౌదువా? మనుమరాలితో నుండి మనుమడవయ్యె దవా ?అని ప్రశ్నించిన తీరు ఈ పద్యములో చూడ వచ్చును
" మొల్ల సుగంధి కూతురది ముంగిట నున్నది దాని చూడు ,ము
త్పుల్ల సరోజ నేత్ర వర పుత్రిక పుత్రిక దీని చూడు ,మే
నెల్ల విధంబులన్ రతుల నేలిన దానను నన్ను చూడు ,నీ
వల్లుడ వయ్యెదో ? మగడ వయ్యెదొ? ముద్దుల మన్మడయ్యెదో ?"
ఈ పద్యమునకు ఆ యువకవి సమాధానము అదే ప్రాసలో అదే వృత్తములో "చూడు " అనుటకు బదులుగా "మాన" గా మూడు చోట్ల సవరించి చెప్పి నాడట.
" మొల్ల సుగంధి కూతురది ముంగిట నున్నది దాని మాన,ను
త్పుల్ల సరోజ నేత్ర వర పుత్రిక పుత్రిక దీని మాన ,మే
నెల్ల విధంబులన్ రతుల నేలిన దానను నన్నుమాన ,నే
నల్లుడవయ్యెదన్!మగడ వయ్యెద! ముద్దులమన్మడయ్యెదన్!!!
శ్రీ మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములండీ.
హబ్బ ! ఏ న్నాళ్ళకి తమ్ముడూ ! ఈ రోజూ బ్లాగులో కను పించి నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలాగే రోజూ సమస్యలను ఇస్తూ , ఇంకా కొత్త పాఠాలు నేర్పుతూ అనందం గా ఉండాలని దీవిస్తూ ,! అక్క
రిప్లయితొలగించండిఆయన గురువుగారు కాదక్కయ్యా ! మిస్సన్నగారు !
రిప్లయితొలగించండినిన్న సాయంకాలం ఢిల్లీకి విచ్చేసిన పుంభావసరస్వతి, శ్రీశ్రీశ్రీ కుర్తాళం పీఠాధ్యక్షులు పూజ్యశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వాముల వారి సమక్షంలో ఎ.పి.భవన్లో కేంద్ర రక్షణ శాఖామాత్యులు శ్రీ పళ్ళంరాజు గారు, రాష్ట్రమంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి గారల చేతులమీదుగా పురస్కారాన్ని అందుకొన్నందుకు దయతో ఆశీర్వదించి, ప్రోత్సహించి నన్ను విద్యానిరపనోద ఋణగ్రస్తుని కావించిన మాన్యశ్రీ గురుచరణులకు, సౌజన్యసిద్ధులు శ్రీ శంకరయ్య గారికి పౌనఃపున్యధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపెద్దలకు ప్రణామములు:
రిప్లయితొలగించండిసమస్యలో క్రమసంగతి కనుపిస్తున్నది కాబట్టి – పూరణలో క్రమాన్వయాన్ని పరిహరించాలని ప్రయత్నం చేశాను:
ఒక అందాల నటి ప్రక్కన నాయక పాత్ర కాకపోతే - కనీసం ఆమె చెంత నిలిచి ఉండే ఏ చిన్న వేషమైనా వేయనిమ్మని ప్రాధేయపడుతున్న ఒక అభ్యర్థి మాటలు.
పల్లవపాణి! యో మృదులపల్లవపాద! మనోహరాకృతీ!
సల్లపనామృతాతిసరసం బగు నాంధ్రుల చిత్రసీమలో
సల్లలితాంబరాంతరలసన్మణిమంజులతారకామణీ!
చల్లని తీయవెన్నెలల జా లెసలారఁగ నివ్వటిల్లు సం
ఫుల్లశశాంకమండలము పోడిమి మీఱఁగ నెయ్యురాలవై
పల్లవితత్వదుజ్జ్వలకృపాపరిపాటినిఁ బల్కరించి మే
నెల్ల ముదంబునం బులకరింపఁగఁ జేతు వంచు నేఁ
బెల్లగు నాసఁ జేరితిని - పేరిమి నీ సరసన్ నటింపఁగా;
నుల్లమునందుఁ జేర్చి నను నొక్క నిమేషము నిల్వనిమ్ము! న
న్నుల్లస మొప్ప నె ప్పగిది నొప్పరికింపకు; నిన్ను వేడు న
న్నల్లన నొల్లఁ జెల్లు నొకొ! నాయక వేషము గానిచో, సరే!
యెల్ల వితంబులైన వేషముల నే ధరియింపఁగ సిద్ధ మయ్యెదన్,
ప్రల్లద మాడఁబో; నొకరి పాత్రము మేలని చూడఁబోను; నేఁ
గల్లరి నయ్యెద; మనికి కాపరి నయ్యెద; తాత నయ్యెదన్;
మల్లరి నయ్యెదన్; మఱఁది నయ్యెదఁ; దండ్రిని, మామ నయ్యెద;
న్నల్లుఁడ నయ్యెదన్; మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
పై సమస్యను చూచి నేను చాలా క్లిష్టమైనదని భావించాను.
రిప్లయితొలగించండిమిత్రులు, పెద్దలు అలవోకగా చక్కని పూరణ లివ్వడం చూసి చాల ముచ్చట వేసింది. అందరికీ అభినందనలు.
నా ప్రయత్నం.
పిల్లకు పెండ్లి పై నెలను, పెద్దలు తప్పక మీరు రండు మా
చెల్లెలి తోడ, దీవెనలు చింతలు బాపి శుభమ్ము గూర్చెడిన్,
కల్లయె నే సగోత్రికుడ, గాంచిన మీ ఘన వంశ మందున-
న్నల్లుఁడ నయ్యెదన్; మగఁడ నయ్యెద, నే మనుమండ నయ్యెదన్.
బంధువుల పెళ్ళిలో ఒక యువకుడు
రిప్లయితొలగించండితండ్రి తాతలతో కలసి యున్న ఒక పడుచుమీద మనసు పారేసుకొని
తన కోరిక నెఱవేరితే, వారితో వరుసలు యెలా కలుస్తాయో
తనలో తానే యిలా ఊహించు కొంటున్నాడు :
02)
________________________________________________
ఉల్లము రంజిలన్ మిగుల - యోగ్యత గల్గిన గుమ్మ నీ యెడన్
ఝల్లన గంటి నా యెడద, - చక్కని రూపసి , మంజుభాషిణిన్ !
కల్లయె గాదు నా బులుపు; - కామితము న్నెఱవేర్చు కొన్నచో
అల్లుఁడ నయ్యెదన్,మగఁడ - నయ్యెద,నే మనుమండ నయ్యెదన్ !________________________________________________
బులుపు = కోరిక
ఇత్రులారా!
రిప్లయితొలగించండిఈనాటి సమస్య కాస్త విలక్షణముగా కనిప్పించినా పూరణలన్నీ వైవిధ్యముతో ఉన్నాయి-- ముఖే ముఖే సరస్వతి అని అర్యోక్తి.
1. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు శ్రీకారము చుట్టేరు. క్రమాలంకారముతో మంచి పూరణ గావించేరు.
2. అజ్ఞాత గారి పూరణ ప్రయత్నము బాగున్నది. కేశసౌరు అనే సమాసము బాగులేదు. మర్త్యుతో అని వాడేరు. మర్త్యుడు అంటే మానవుడు అని అర్థము. వారు ఏ భావముతో వాడేరో?
3. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు పిల్లడితో ఒక పెద్దాయన కొన్ని కొన్ని వావి వరుసలను ముచ్చటించుటను చెప్పేరు. బాగున్నది.
4. శ్రీ వసంత కిశోర్ గారు ఉత్సాహవంతుడైన అర్జునుని పలుకులను చక్కగా వివరించేరు.
5. శ్రీమతి లక్ష్మీదేవి గారు పెండ్లి కాబోయే యువకుని కలలని వర్ణించేరు - బాగున్నది.
6. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు ఒక భనుమూర్తి గరి వివరణతో కూడిన సమాధనమును ప్రస్తావించేరు - బాగున్నది.
7. శ్రీ మంద పీతాంబర్ గారు వేశ్య ఇంటి వావి వరసలను సరసుడితో చెప్పించేరు. బాగున్నది.
8. శ్రీ ఏల్చూరి వారు ఒక చక్కని ఉత్పల మాలికను చెప్పేరు - వారు చిన్న పద్యము వ్రాయుట అరుదు. భావము బాగున్నది. ఉత్సాహవంతుడైన యువకుని అభ్యర్థనను విన్నవించేరు. చాలా బాగున్నది. అన్నట్లు వారికి జరిగిన సన్మానమును పురస్కరించుకొని మళ్ళీ మా హృదయపూర్వక శుభాభినందనలు.
9. శ్రీ మిస్సన్న గారు పెండ్లి పత్రికను పట్టుకొని వచ్చి వరుసలను కలిపేరు. బాగున్నది.
ఈనాడు పూరణలు పంపిన వారందరికీ పేరు పేరునా శుభాభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిమిత్రులందరూ చక్కని పూరణలు చేశారు.
రిప్లయితొలగించండిలక్ష్మీ దేవి గారూ ! ధన్యవాదములు.
ఏల్చూరి వారికి అభినందనలు.
శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
శ్రీ యుతులు మురళీ ధర్ గార్కి అభినందనలు.
రిప్లయితొలగించండిఏ సందర్భమో ఏ పురస్కారం లభించిందో తెలియలేదు.
పైన పెట్టెలో టైపుచేసిన తర్వాత TABను నొక్కండి. ఈ పెట్టెలో సందేశం మీకోసం సెలక్ట్ చేసుకోబడుతుంది.
రిప్లయితొలగించండిTELUGU EMPLOYEES WELFARE ASSOCIATION DELHI
IN ASSOCIATION WITH SRI MAHAANDHRA CULTUAL EDUCATIO0NAL & CHARITABLE TRUST, DELHI
AND WITH GRACIOUS BLESSINGS OF HIS HOLINESS SRI SRI SRI SIDDHESWARANANDA BHARATI SWAMIJI OF KURTALAM
HONOURED DR. ELCHURI MURALIDHARA RAO AS AN EMINENT PERSONALITY IN THE FIELD OF EDUCATION ON 25 MARCH 2013
THESE GOOD NEWS ARE HEREBY MADE KNOWN TO ALL THE MEMBERS SOF OUR SANKARABHARANAM BLOG
SWASTI
శ్రీ పండిత నేమానిగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి అభినందనలు.
కల్లలు కావు నేనపుడు గాంచిన కన్యను పెండ్లి యాడగన్
రిప్లయితొలగించండిచల్లని వెన్నెలల్ గురియు చూపుల తూపులు గ్రుచ్చి చంపెనన్ !
ఝుల్లున పొంగి పోయి మది చిందులు వేసెను మోద మందగా
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ !
దర్శకేంద్రుడు రాఘవేంద్రుని సరి కొత్త చిత్రం చూతము రారే,
రిప్లయితొలగించండిఅల్లుడే మగడు, మగడే మనుమండు సూపర్ బంపర్ !
నయనతార హీరోయిన్ అనంగ,బాలకిట్టి తొడకొట్టి చెప్పెన్
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ !
నమస్కారములు
రిప్లయితొలగించండిగౌరవ నీయులు శ్రీ ఏ ల్పూరి మురళీ ధర రావు గారికి అభినందన మందారములు .అవునూ ! నేను " మాలిక . ఒ .ఆర్జీ " లొ మీ ఆర్టికల్స్ చూసాను . చాలా సంతోషం. అభినందనలు .
కిషోర్ గారూ ! మీ పిలుపు ఎంతో బాగుంది . " అమ్మలూ , అక్కలు " , అందర్నీ దీవించగల అదృష్ట వంతులు . ఔనా ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజిలేబి గారి ఊహకు పద్యం.
రిప్లయితొలగించండిచెళ్ళున అంకమున్ చరిచి చెప్పెను యిత్తరి బాలకృష్ణుడే
చిల్లర చిత్రరాజమున చెన్నుగ రాఘవు దర్శకత్వమున్
"కొల్లరి మామ!నీకు, మరి కూతురు రాధకు, నాదు తాతకున్
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ ! "
శ్రీయుతులు ఏల్చూరి మురళీధర రావు గారికి మరొక్కసారి అభినందనలు.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా ధన్యవాదములు.
సహృదయంతో నిండైన దీవెనలు కురిపించిన శ్రీ గురువులకు, పెద్దలందరికి మఱొక్కసారి - చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతలను నివేదించుకొంటున్నాను.
రిప్లయితొలగించండిమురళీధరరావుగారికి అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ ఏల్చూరి మూళీధర రావు గారికి అభినందనలు
రిప్లయితొలగించండిచల్లగ భారతమ్మునకు జంకును లేక ప్రధానమంత్రియౌ
రిప్లయితొలగించండిటొల్లక పోవగా షరతు టోపిని మార్చుచు త్యాగమూర్తి వోల్
కల్లలు చెప్పుటందునను కమ్మగ సోనియ నీకు నేను నే
డల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్
https://m.youtube.com/watch?v=2GyT9dqHxLk