20, మార్చి 2012, మంగళవారం

నందనానందం

కవిమిత్రులకు స్వాగతాంజలి.

నందన నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కవితా ఖండికలను పంపవలసిందిగా ఆహ్వానం.
మీ కవితలను నాకు మెయిల్ చేస్తే ఉగాది నాడు అన్నీ ఒక పోస్ట్‌గా ప్రకటిస్తాను.


నా మెయిల్ చిరునామా
shankarkandi@gmail.com

13 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    మీ అందరి ఆకాంక్షలు, ఆశీస్సుల వల్ల జ్వరం పూర్తిగా తగ్గింది. నా ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెంది సలహాలు ఇచ్చి, సానుభూతిని తెలిపిన సహృదయులందరికీ ధన్యవాదాలు.
    కాకుంటే చాలా నీరసంగా ఉన్నాను. ఒంటినొప్పులు కూడా ఉన్నాయి.
    ఇంట్లో నెట్ సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. పొరుగింటి వాళ్ళ దయతో రోజుకొకసారి నెట్ వినియోగించుకుంటున్నాను. అందువల్ల వెంట వెంటనే నా స్పందనలను తెలియజేయలేక పోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గార్కి స్వాస్థ్యమ్ము చేకూరె
    శంకరాభరణము చాల మెరిసె
    సభ్యులెల్లరకును స్వాంతమ్ము లలరారె
    నందనమ్ము వచ్చి విందు గూర్చు

    రిప్లయితొలగించండి
  3. చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ ! . మీరు త్వరలో మిగిలిన " గడి - నుడి , వ్యాకరణ పాఠములు , అన్నీ మొదలు పెట్టాలని కోరుతూ !
    శంకరాభరణం ఆనంద నందనంగా వెన్నెలలు వెల్లి విరియాలని " నందన " శుభా కాంక్షలు .

    రిప్లయితొలగించండి
  4. గురువు గారూ , ఆరోగ్యము బాగయిందని శుభ వార్త చెప్పారు. మిగిలిన సమస్య లవే సర్దుకొంటాయి. నందన వత్సరము అందఱికీ శుభప్రద మవుతుందని ఆశిద్దాము !

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! మీకు స్వస్థత చేకూరి నందుల కానందముగా నున్నది !
    నందనానికందరికీ శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వసంత కిశోర్ గారూ,
    ........................... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. నందన నామ వత్సర మమంద మనోజ్ఞ మహానుభూతులన్
    అందరు బంధుమిత్రులకు నందగ జేయుత యంచు గోరుచున్
    అందము లొల్కు జీవన మరందము గ్రోలుడి యంచు దెల్పెదన్
    డెందము పుల్కరింపగ స్వదేశ విదేశ బుధాళి కంతకున్.

    -------------
    నవయుగాదికి నాంది గా నందనాఖ్య
    వత్సరమ్మిదే అరుదెంచె పల్లవ సుమ
    శోభిత దుకూలమును దాల్చి ,శుభము లీయ
    నెల్లవారికి స్వాగత మ్మీయ రండు.
    -------------

    రిప్లయితొలగించండి
  8. అయ్యా డా. కమనీయం గారూ! నమస్తే:

    మీ ఉత్పలమాల పద్యములో 1, 3 పాదములలో యతి మైత్రి కుదురట లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా,నేమానిగారు,ప్రాసయతి సరి ఐనదేనని కావాలనే వేసాను.దేశి చందస్సు లోతప్ప ,వృత్తాలలో పనికిరాదా,దయచేసి వివరించగోరెదను.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! డా. కమనీయం గారు! నమస్తె!

    తేటగీతి, ఆటవెలది, సీసము మొదలైన తెలుగు ఛందస్సునకు సంబంధించిన జాతి పద్యములలోనే ప్రాస యతిని వేయవచ్చును. వృత్తములలో ప్రాసయతి పనికిరాదు. ప్రాస నియమములేని పద్యములలో మాత్రమే ప్రాసయతిని వాడుకొనవచ్చును. స్వస్తి.
    నేమాని రామజోగి సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  11. స్వామీ! దేవకీనందనా!

    మాన్యులు శ్రీ శంకరయ్య గారికి తోడు నిలిచి ధైర్యం చెప్పవయ్యా!

    కమ్రపద్యమాకంది - మా కంది శంక
    రయ్య గారికి నారోగ్య మలవరించి
    స్వస్థచిత్తునిఁ గావింపు మాస్థ, నంద
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  12. ఒక రోజు ఆలస్యంగా...

    కం.నందనమను వత్సరమిక
    అందముగా ఏతెంచెను అంబర వీధిన్
    డెందమున ముదమునొందగ
    వందనమొనరించ వలెను వందే యనుచున్.

    కం. ఖర వెళ్లి నందనొచ్చెను
    వరుసగనే వచ్చుచుండు వత్సరములు యా
    వరుసను పట్టించుకొనక
    వర దాతృని దూష చేసి వగచుట ఏలా ?

    (పాత సంవత్సరం బాగా లేదు, ఈ సంవత్సరం చాలా బాగుంటుంది - అని జ్యోతిష్యుల చేత చెప్పించుకొని, అలా జరగక పోవటంతో చెప్పిన జ్యోతిష్యుని, ఆ తరువాత, తనకు వరాలివ్వలేదని, దేవుని దూషించుట తప్పని చెప్పటం నా ఉద్దేశ్యం.)

    రిప్లయితొలగించండి