19, మార్చి 2012, సోమవారం

సమస్యాపూరణం - 651 (కలను దలచి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

కలను దలచి హృదయకమల మలరె.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. అలను దలచి అమల సంద్ర మలరె
    తావిని దలచి విమల వాయవు అలరె
    పరంధాముడే హృదయ అమలా విమలమైన
    కలను దలచి హృదయ కమల మలరె .


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. శేషశయనుడయిన శ్రీవత్స ధరుడిని,
    పాదసేవ చేయు పడతి శ్రీని
    గాంచినాను నేను కలత నిద్దురయందు;
    కలను దలచి హృదయకమల మలరె.

    రిప్లయితొలగించండి
  3. బలమెసగుచు నున్నది కద
    కలదాదృతి ప్రజల కనుచు కమలాప్త తతుల్
    చెలగంగా నెన్నికలను
    దలచి హృదయ కమలమలరె తద్దయు వేడ్కన్

    రిప్లయితొలగించండి
  4. అన్న నిన్ను వీడ ననుచున్న భరతుని
    అనునయించి ప్రీతి నతని కోర్కె
    ననుస రించి యిడగ నారామ నిజ పాదు
    కలను దలచి హృదయకమల మలరె.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా! ఈనాటి సమస్యను నింపునపుడు ఈ సూచనలను గమనించండి:

    (1) సర్వ లఘు పద్యములను వ్రాయవచ్చును.
    (2) ఉత్సాహ మొదలగు వీలు కల్పించే పద్యాలను కూడా వ్రాయ వచ్చును.

    తగు ప్రయత్నము చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పద్యములో : 3వ పాదమును ఇలాగ మార్చితే బాగుంటుందేమో:

    "అనుసరించి యిడగ నా రామ విభు పాదు"

    రిప్లయితొలగించండి
  7. తాండవమ్ముమరియు తరళ లాస్యము గంటి
    పరవశమ్ముబొంది భవ్యరీతి,
    దిద్ధిమితయన శివ దేవుని సతితోడ
    కలను దలచి హృదయకమల మలరె.

    రిప్లయితొలగించండి
  8. చక్కని సవరణ సూచించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.

    అన్న నిన్ను వీడ ననుచున్న భరతుని
    అనునయించి ప్రీతి నతని కోర్కె
    ననుస రించి యిడగ నారామ విభు పాదు
    కలను దలచి హృదయకమల మలరె.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ___________________________________

    కైక కోర్కి మీద - కాన కేగిన యన్న
    కమల నయను, రాము - కలసి మురిసి;
    కనక పీఠి నుంచి - గారవమున; పాదు
    కలను దలచి హృదయ - కమల మలరె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పాదుకా పట్టాభిషేక సమయంలో భరతుని హృదయ కమలం :

    01)
    ___________________________________

    కైక కోర్కి మీద - కాన కేగిన యన్న
    కమల నయను, రాము - కలసి మురిసి;
    కనక పీఠి నుంచి - గారవమున; పాదు
    కలను దలచి హృదయ - కమల మలరె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  11. చిత్ర సీమ కేగి చిత్రంబు నొకదాని
    చూడ ముచ్చ టుం డె చూచు కొలది
    రేయి నిదుర వోవ తీ యని కల గాంచి
    కలను దలచి హృదయ కమల మల రె .

    రిప్లయితొలగించండి
  12. చక్కని సవరణలు సూచించిన శ్రీపండిత నేమాని వారికి ధన్యవాదములు.
    తప్పక ప్రయత్నము జేసెదము గురువుగారు
    ------
    కళ్ళు లేని వాడు కళ్యాణ రాముని
    వేడ, కదలి వచ్చె విప్రునివలె,
    వరమునా గలియుగ వరధుని గాంచిన
    కలను దలచి హృదయ కమలమలరె

    రిప్లయితొలగించండి
  13. mandakini gari padyam modati paadam ila savrinchukovali

    sesha sayanudaina srivatsa dharu jeri

    రిప్లయితొలగించండి
  14. అమ్మా మందాకిని గారూ!
    మీ పద్యము మొదటి పాదములో శ్రీవత్స లాంఛను అని గాని శ్రీవత్స ధారిని అని గాని ఉంటే బాగుంటుంది. అలాగే 2వ పాదములో శ్రీని అనే కన్నా సిరిని అనవచ్చునేమో.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గురుభ్యో నమః.

    ఈ రోజు మీ ఛందఃపరివర్తన రూపకమైన పూరణ అమోఘంగా ఉన్నది.

    నావి - ఒకటి భారతంలోని వీరరసం; మఱొకటి ఇంటింటి భారతంలోని హాస్యం:

    ఆజానజంబుగా నవమానితులఁ జేసి ధర్మపథంబును దప్పి నడచి
    దాయాదు లనిపించి, మాయాదురోదరంబున రాజ్యలక్ష్మిని మ్రుచ్చిలించి
    పాంచాలిని సభ కీడ్పించి, వలువల నూడ్పించి, వంశంబును గ్రించుపఱచి
    గడువు దీఱిననాఁటఁ గయ్యంబునకు నిల్చు దుర్యోధనుని సేన దుఃస్థితిఁ గని

    యుత్తరుండు దీర్చు నుత్తమరథ మెక్కి
    గాండివంబుఁ దాల్చు దండధరుని
    యట్టి యర్జునునకు నెట్టన నా పొలి
    కలను దలఁచి హృదయకమల మలరె.

    రెండవది:

    కాన్పుటింటి ముందుఁ గాంత శీలంబందు
    శంకఁ గొన్న పతికి వంక లేక
    తనయు మోమునందుఁ దన తండ్రి నునుపోలి
    కలను దలఁచి హృదయకమల మలరె.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత గారికి, పండితుల వారికి ధన్యవాదాలు.
    ధారు జేరి అంటే గణదోషం వస్తుంది.

    శేషశయనుడయిన శ్రీవత్స ధారిని,
    పాదసేవ చేయు పడతి సిరిని,
    గాంచినాను నేను కలత నిద్దురయందు;
    కలను దలచి హృదయకమల మలరె.

    రిప్లయితొలగించండి
  17. పండితుల వారు పైన సర్వలఘుపద్యము, ఉత్సాహ ప్రయత్నించమని ఇచ్చిన సూచన ఇప్పుడే గమనించాను.
    పరిశీలించగలరు.

    శిలను మలిచె నొకడు జిగిజిగి మెఱుగుల
    మగువ వదనము తన మనము నిలిపి,
    తఱచి తఱచి గనియె, తనువుఁ గలుగు పుల
    కలను దలచి హృదయకమల మలరె.

    వలచిరాగదోయి ఫుల్లపద్మనయన, నిన్ను నే
    పిలిచినందుకింత లోకువేమి? నీరజాక్ష నీ
    యలుకమానుకొనుము, పలుకుమయ్య! చిలుకపలుకులన్
    కలయికలను దలచి హృదయకమలమలరె రావొకో!

    యతికొరకు సమస్యకు ముందు ఒక సూర్యగణము చేర్చాను.

    రిప్లయితొలగించండి
  18. ఈనాటి పూరణలను చదివేను. మంచి సమస్యకు మంచి పూరణలు వచ్చేయి.

    శ్రీమతి మందాకిని గారి రచనా వైవిధ్యానికి జోహారులు. దేవతా మూర్తులను కలలో చూచిన ధన్యాత్ములు మీరు. అంతకంటే వేరే భాగ్యము ఏముంది? మీ పూరణలన్నీ బాగుగ నున్నవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు రామ సేవానిరతుడైన భరతుని ఆనందమును వర్ణించేరు. మంచి భావము అందమైన పద్యము.

    శ్రీ వసంత కిశోర్ గారికి కూడా శ్రీరాముని పాదుకలే ప్రోత్సాహమును కూర్చినవి. ధన్యవాదములు.

    శ్రీ సుబ్బా రావు గారు చూచిన చిత్రమే చిత్రము. చూడ ముచ్చటుండె అనే ప్రయోగము మాండలికము అనుకుంటా. "చూడ ముచ్చటగుట" అని కూడా అనవచ్చునేమో. పద్యము బాగున్నది.

    శ్రీ వరప్రసాద్ గారు కళ్యాణ రాముని లీల వర్ణించేరు. శుభం భూయాత్.

    శ్రీ ఏల్చూరి వారి ప్రత్యేకతే వేరు. భారతములోని ఒక మంచి సన్నివేశాన్ని సీసపు మూసలో పోసేరు. అలాగే ఇంటింటి రామాయణమును కూడా విడువలేదు. అయితే అది సుఖాంతమే అయినది. పద్యాలు బాగుగ నున్నవి.

    అందరికి పేరు పేరునా అభినందనలు, స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. రామ నవమి పర్వ రాజమ్ము సర్వార్థ
    దాయకమ్మటంచు తన్మయులయి
    భక్త తతులు చేయు భద్రాద్రిలో వేడు
    కలను దలచి హృదయ కమల మలరె.

    వరుని జూచి వధువు, వధువుజూచి వరుడు
    మోదమంద రకట, ముచ్చటలిడు
    కానుకలు లభింపగా పెండ్లిలో కాను
    కలను దలచి హృదయ కమల మలరె

    రిప్లయితొలగించండి
  20. శ్రీ నేమాని సద్గురువరేణ్యుల శ్రీ చరణములకు ప్రణామములు.

    “శంకరాభరణము”లో ప్రతిదినం సమస్యలను పూరిస్తున్న “మందాకిని” గారెవరో నాకు తెలియదు. ఈ రోజు వారి సుకుమారమైన పద్యాన్ని చదువగానే గుండె “ఝల్లు” మని, ఈ కల్పన స్ఫురించింది.
    వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    ఇది నా వినమ్ర నివేదనం ... మీ దీవెనలను కోరుకొంటూ ...

    పాన్పుగా నమరిన ఫణిరాజు “బుస్సు బు” స్సను నూర్పుగాడ్పుల సవదరింపఁ
    గస్తూరి తిలకంబు కరఁగి “జలజల”న జాఱు చాఱలఁ జెంప జలదరింప
    నడిరేయిఁ గనుమూఁత వడనీక “బుడబుడఁ” గలశాబ్ధి తరఁగలు గలకలింప
    నడుగుఁదమ్ములఁ బిసికెడి లచ్చిమి పడఁతి గాజుల “గలగల” కళవళింప

    హోరు జోఱు మీఱ - నొకరాత్రి మేల్కాంచి,
    కనులు నులుముకొంచుఁ గలఁతఁ జెందు
    కమలనయను గూర్చి కలఁగంటి, మేల్కొంటి;
    కలను దలఁచి - హృదయకమల మలరె!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  21. దూరదేశమేగి వారాంతవేళలో
    త్వరిత గతిని ఇంటి కరుగు చుండి,
    జాగు చేసి తంచు సతిజూపు చిరుయలు
    కలను దలచి హృదయ కమల మలరె.

    రిప్లయితొలగించండి
  22. ఇంద్రుని రధ మెక్కి ఇందు మౌళిని గన
    గగన మార్గ మందు సొగసు గాంచి
    జలదములను దాటి జలజాసు ముంగిట
    కలను దలచి హృదయ కమల మలరె !

    రిప్లయితొలగించండి
  23. అయ్యా శ్రీ మూర్తి గారు!
    మీ పద్యమును చూచేను. 3వ పాదాంతములో చిరు + అలుక = చిరుయలుక అని యడాగమము చేసేరు మీరు. కానీ 2విధాలుగా సంధి చేసికొనవచ్చు.
    (1) చిరు + అలుక = చిట్టలుక (ద్విరుక్త టకార ఆదేశ సంధి) లేదా
    (2) చిరు + అలుక = చిరునలుక (నుగాగమ సంధి)

    అంతేకానీ యడాగమము చేయకూడదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా శ్రీ మురళీధర రావు గారూ!
    శ్రీమతి మందాకిని గారు మంచి మంచి భావాలతో చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. మంచి విదుషీమణి. నాకునూ ఈ బ్లాగులోనే వారి పద్యాలతోనే పరిచయము. సరస్వతి కటాక్షము వారియందు నిండుగా నున్నది - అట్టి ధన్యురాలికి మా శుభాశీస్సులు. మీరు కూడా ఆమె లోని ప్రతిభను గుర్తించునందుకు చాల సంతోషము.

    రిప్లయితొలగించండి
  25. కవి దిగ్దంతుల ప్రశంసల నందుకొన్న
    మందాకిని గారికి అభినందన మందారాలు.

    లేక లేక నొక్క లేమకు నెల దప్పె
    కడుపు పండ నున్న ఘటన దలచి
    సిగ్గులాయె! లోన శిశువుయొక్క కదలి-
    కలను దలచి హృదయ కమల మలరె !

    రిప్లయితొలగించండి
  26. పండితులవారికి నమస్కారములు,
    పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు. సరిచేసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  27. పూజ్య గురువుల మన్ననలను పొందిన ధన్యులు " సోదరి మందాకిని గారికి " శుభాభి నందనలు . "

    రిప్లయితొలగించండి
  28. విరహ బాధ తోడి వేగిన మనసుకు
    ఆమె వచ్చు నన్న ఆశ కలిగి
    కలత నిదుర లోన కదిలింప జేసిన
    కలను దలచి హృదయ కమలమలరె.

    రిప్లయితొలగించండి
  29. పగలంతా పనులతో తీరిక లేక , రాత్రి పూట ఈ బ్లాగును చూస్తున్నాను అప్పుడు నేను చేసే ప్రయత్నం మరుసటి రోజుకు చద్ది అన్నం అయిపోతున్నది. అంత మాత్రాన నేను వదిలే వాడిని కాను.

    రిప్లయితొలగించండి
  30. మందాకిని గారి పద్యంలో లక్ష్మీనారాయణుల ఆదర్శదాంపత్యం కలలో వచ్చిన సన్నివేశాన్ని చూచి - పాలకడలిపై పవళించే దేవునికి మెలకువ వచ్చిన దృశ్యకల్పన స్ఫురించి, "పొలి కలను", "పోలికలను" తర్వాత, ఆ మూడవ నిజమైన కలకలం తోడి కలను గూర్చిన పద్యాన్ని వ్రాయగలగటం నాకొక అపూర్వావకాశం.

    శ్రీ మిస్సన్న గారి పద్యం ఆ అంతర్వత్ని లాగుననే భావ"గర్భం"గా, చమత్కారమైన "కదలిక"లను గలిగి అతి"రమణీ"యంగా ఉన్నది.

    ఈ రోజు శ్రీ గురువులు అందమైన కంద-ఛందశ్చిత్రంలో ఎన్నికలను, గీతికలలో భద్రాద్రి వేడుకలను, పెండ్లిలో కానుకలను; శ్రీ హనుమచ్ఛాస్త్రి గారు, శ్రీ వసంత కిశోర్ గారు శ్రీరామ పాదుకలను; శ్రీ సుబ్బారావు గారు తీయని కలను; శ్రీ వరప్రసాదు గారు వరదుని కలను; మందాకిని గారు మళ్ళీ అలఘు లఘువుల కలయికలను, అంతే ఉత్సాహంగా పులకలను; శ్రీ మూర్తి గారు ప్రవత్స్యత్పతిక అలుకలను; శ్రీమతి రాజేశ్వరి గారు ముంగిట కలను పరిచయం చేసిన ఈ నాటి పూరణ కార్యక్రమం మహానందదాయకంగా అలరారింది.

    శ్రీ గురువుల నేతృతా గరిమకు, పెద్దలు మీ అందఱికీ సాధువాదం!

    రిప్లయితొలగించండి
  31. అద్భుత మైన పూరణలు చేసిన మిత్రులకు అభివాదములు.


    ఫణము పైన చరణ పద్మములను నిల్పి
    ప్రణుతి జేయు చుండ వల్లవుండ్రు
    వంశనాళ మూదు వర నర్తకుని గాంచు
    కలను దలచి హృదయ కమల మలరె

    వల్లవుడు = గొల్ల వాడు ; వంశ నాళము = వేణువు

    రిప్లయితొలగించండి
  32. గురువులు క్షమించాలి ,ఊరికే ఒక ప్రయత్నం

    హరి హరులను మదిని యమితముగ కొలిచి
    తనువు పులక లిడగ దళము లిడితి
    ఇరువు రొకటె యనుచు మురిసి గనిన
    కలను దలచి హృదయ కమల మలరె !

    రిప్లయితొలగించండి
  33. హృద్యమైన రచనలు చేయగల మీవంటి పెద్దలందరి ఆశీర్వాదాలు పొందగలిగేట్టు సరస్వతి కడగంటి చూపు నామీద ప్రసరించినందుకు ధన్యురాలను.
    దేవి పాదరేణువునై ఉండగలిగితే అంతకన్నా భాగ్యం లేదు.
    పండితుల వారికి, మురళీధరరావు గారికి, మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి ప్రణామాలు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. పూరణలు పంపిన మిత్రులకు అభినందనలు.
    వ్యాఖ్యలు చేసిన సహృదయులకు ధన్యవాదాలు.
    పూరణలను విశ్లేషిస్తున్న పండిత నేమాని వారికి, ఏల్చూరి మురళీధరరావు గారికి పాదాభివందనాలు.

    రిప్లయితొలగించండి