ప్రార్థన
భావమునందు తావక కృపారస తత్త్వ విభూతియొప్పగా
పావన వాగ్విశేష రసబంధుర సుందర పద్యరత్న శో
భా విభవాభిరామమగు ప్రార్థనమున్ బొనరింతునమ్మ! వాగ్
దేవత! జ్ఞానయోగమయ దీప్తుల నన్ను ననుగ్రహింపుమా!
రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

మూడుపాదములకు వ్యాపించిన ఒకే సమాసము. ఒక సంబోధన, రెండు వాక్యములతో ఉత్పలాల మాల శోభించుచున్నది.
రిప్లయితొలగించండిధ్యానము నందునన్ మునిగి తామర పుష్పపు నాసనమ్మునన్
రిప్లయితొలగించండికానగ మానసమ్మునను గౌరవమందితి, ధన్యనైతినే!
జ్ఞానము నిచ్చికావు మము జ్ఞాన విశారద శారదాంబికా!
మౌనము వీడి నెల్లరకు మాయలు దొల్గగ పల్కునీవికన్.
సవరణ.
రిప్లయితొలగించండిధ్యానము నందునన్ మునిగి తామర పుష్పపు నాసనమ్మునన్
కానగ భాగ్యలబ్ధమున గౌరవమందితి, ధన్యనైతినే!
జ్ఞానము నిచ్చికావు మము జ్ఞాన విశారద శారదాంబికా!
మౌనము వీడి నెల్లరకు మాయలు దొల్గగ పల్కునీవికన్.
అమ్మా! మందాకిని గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రశంసలు చూచేను - సంతోషము.
మీ పద్యమును చదివేను. 4వ పాదములో నుగాగమము కాక యడాగమము చేయాలి.(వీడి + ఎల్లరకు). 4వ పాదమును ఇలాగ మార్చండి:
"మానను నీదు సంస్మరణ మానస సారసమందు నెన్నడున్"
నమస్కారములు
రిప్లయితొలగించండిఅందమైన ఉత్పల మాలను అలంకరింన దయా మయి సరస్వతీ దేవి , ప్రార్ధించిన మా పైన కరుణ చూపించాలని కోరుతూ !
గురువులకు పాదాభి వందనములు
అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారి వాగ్దేవి స్తుతి, మందాకిని గారి చదువుల తల్లి ప్రార్ధన అద్భుతముగా నున్నాయి.
రిప్లయితొలగించండి