18, మార్చి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 650 (పుండు సతిని గాంచి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

పుండు సతిని గాంచి మోదమొందె.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

 1. చంద్రశేఖరుండు, శంభుడు, మదనరి
  పుండు సతిని గాంచి మోదమొందె.
  సకల జగములకును శక్తిశివులు తల్లి
  దండ్రులండ్రు, కొలుతు తనివితీర.

  రిప్లయితొలగించండి
 2. పైన పొరపాటుగా సగం ప్రచురించబడిన నావ్యాఖ్యను మీరు తొలగించారా గురువుగారు,
  అదేమిటో నాకు తొలగించే ఆప్షన్ కనిపించదు.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. రమణి యెవరో తెలియదని రాజు పలుక
  "నీ సతి శకుంతల వాడె నిజ సుతుడ"ను
  నీల గగనము పలుకు వినిన నృపాధి
  పుండు సతిని గాంచి మోదమొందె!!

  రిప్లయితొలగించండి
 4. రమణి యెవరో తెలియదని రాజు పలుక
  "నీ సతి శకుంతలిది వాడె నిజ సుతుడ"ను
  నీల గగనము పలుకు వినిన నృపాధి
  పుండు సతిని గాంచి మోదమొందె!!

  రిప్లయితొలగించండి
 5. క్షమించాలి. పొరబాటున ఆటవెలది బదులు తేట గీతిలో పూరించాను.

  రిప్లయితొలగించండి
 6. రమణి తెలియదనుచు రాజు పలికినంత
  "కాదు నీదు సతియె కణ్వ సూతి"
  యనిన సంబ్రమముగ నంబరము నృపాధి
  పుండు సతిని గాంచి మోదమొందె!!

  రిప్లయితొలగించండి
 7. బలము చాలక రిపు బలమున నోడిన
  తనదు సుతుల గావ తనయు కోరు
  నట్టి పరమ సాధ్వి యదితి గాంచిన కశ్య
  పుండు సతిని గాంచి మోదమందె.

  రిప్లయితొలగించండి
 8. శశి ధరుండు భవుడు శంకరు మదన రి
  పుండు సతిని గాంచి మోద మొందె
  దక్ష య జ్ఞ లయము దాక్షా య ణి కతన
  వంద నీయు డెపుడు భర్గు మనకు

  రిప్లయితొలగించండి
 9. గ్రామాంతరము వెళ్ళిన కారణంబున నాలుగు రోజులుగా కవోతోద్యాన వ్యాహ్యాళికి రాలేక పోయినాను.
  (హనుమత్కవచమును పార్వతి యడుగగా పరమేశ్వరుడు లోకానికి ప్రసాదించాడు)

  కలిని జనులు మిగుల యలమ టింతురు గాన
  హనుమ కవచ మిచ్చి యాదు కొనుమ
  యనిన పుత్ర ప్రేమ గనుచు నా లోకాధి
  పుండు సతిని గాంచి మోదమొందె.

  రిప్లయితొలగించండి
 10. ఈ నాటి అందమైన సమస్యకు నా పూరణప్రయత్నం ఇది. పెద్దలకు నివేదిస్తున్నాను.

  శ్రీరామ పట్టాభిషేకానికి ముందు సీతను చూచి రామయ్య మనసు కృతజ్ఞతతో నిండిపోయింది:

  శ్రీ గజగామిని యోగాగ్నిదగ్ధయై నాఁగేటి చాలున నవతరించె
  శివధనుర్భంగ ముంకువ గాఁగఁ బాణిగృహీతియై నన్ను నిబ్బరించె
  రాజాజ్ఞఁ గైకొని రాజ్యంబు విడనాడ దుర్గమాటవులందుఁ దోడు నడచె
  దివిజారి చెఱలోన నవమానభర మూని యగ్నిపునీతయై యామతిల్లె

  నిట్టి సాధ్వి ఋణము నే రీతిఁ దీర్తును
  గుండెలందు నిల్పికొంటఁ గాక!
  యనుచు, గౌఁగిలించికొనుచు, శ్రీరామభూ
  పుండు సతినిఁ గాంచి మోదమందె.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 11. సత్యవంతుడతను సావిత్రిపెనిమిటి
  చనగ యమునివెంట తనువువిడిచె
  వనిత పోరి పొంద పతిప్రాణములను నృ
  పుండు సతిని గాంచి మోద మందె!!!

  రిప్లయితొలగించండి
 12. ఈ నాటి అందమైన సమస్యకు నా పూరణప్రయత్నం ఇది. పెద్దలకు నివేదిస్తున్నాను.

  శ్రీరామ పట్టాభిషేకానికి ముందు సీతను చూచి రామయ్య మనసు కృతజ్ఞతతో నిండిపోయింది:

  శ్రీ గజగామిని యోగాగ్నిదగ్ధయై నాఁగేటి చాలున నవతరించె
  శివధనుర్భంగ ముంకువ గాఁగఁ బాణిగృహీతియై నన్ను నిబ్బరించె
  రాజాజ్ఞఁ గైకొని రాజ్యంబు విడనాడ దుర్గమాటవులందుఁ దోడు నడచె
  దివిజారి చెఱలోన నవమానభర మూని యగ్నిపునీతయై యామతిల్లె

  నిట్టి సాధ్వి ఋణము నే రీతిఁ దీర్తును
  గుండెలందు నిల్పికొంటఁ గాక!
  యనుచు, గౌఁగిలించికొనుచు, శ్రీరామభూ
  పుండు సతినిఁ గాంచి మోదమొందె.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 13. ఒక పిల్ల కాకికి బాడె పుండు
  మరొక పిల్ల కాకికి జంటిక పుండు
  కోవిపుండు గల పెండ్లాము కాకి
  పుండు సతిని గాంచి మోదమొందె. !


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 14. అయ్యా! శ్రీ మురళీధర్ గారూ! శుభాశీస్సులు.
  మీ సీస పద్యము 2వ పాదములో గణములను సరిచూచి సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా సుబ్బారావు గారూ!
  మీ పద్యము 4వ పాదమును దోష నివారణ కొరకు ఈ విధముగా మార్చుదాము:
  "వందనీయు డెపుడు భవుడు మనకు".

  రిప్లయితొలగించండి
 16. సకల శుభకరుండు సర్వ లోక గురుండు
  నీలకంథరుండు నిర్మలుండు
  సాధు సన్నుతుండు శాంతుండు విశ్వాధి
  పుండు సతిని గాంచి మోదమొందె

  రిప్లయితొలగించండి
 17. పూజ్యశ్రీ గురుదేవులకు
  ప్రణతోఽస్మి.

  విలేఖనంలో రెండక్షరాలు జాఱిపోయాయి. ఆ భాగాన్ని భవత్పరిశీలనార్థం పునర్లిఖించి పంపుతున్నాను. మీ ఆశీర్మయనిర్దేశానికి ధన్యవాదాలు.

  శ్రీరామ పట్టాభిషేకానికి ముందు సీతను చూచి రామయ్య మనసు కృతజ్ఞతతో నిండిపోయింది:

  శ్రీ గజగామిని యోగాగ్నిదగ్ధయై నాఁగేటి చాలున నవతరించె
  శివధనుర్భంగ ముంకువ గాఁగఁ బ్రేమఁ బాణిగృహీతియై నన్ను నిబ్బరించె
  రాజాజ్ఞఁ గైకొని రాజ్యంబు విడనాడ దుర్గమాటవులందుఁ దోడు నడచె
  దివిజారి చెఱలోన నవమానభర మూని యగ్నిపునీతయై యామతిల్లె

  నిట్టి సాధ్వి ఋణము నే రీతిఁ దీర్తును
  గుండెలందు నిల్పికొంటఁ గాక!
  యనుచుఁ, గౌఁగిలించికొనుచు, శ్రీరామభూ
  పుండు సతినిఁ గాంచి మోదమొందె.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 18. ఈనాటి సమస్యను అనేక రీతులుగా పూరింపవచ్చును. కాని కొద్ది మంది మాత్రమే ఇప్పటివరకు స్పందించేరు.
  శ్రీమతి మందాకిని గారు ప్రథమ తాంబూలము నందుకొన్నారు. 2 విధములుగా పూరించేరు. బాగున్నవి (1) జగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల గురించి (2) అదితి కశ్యపుల గురించియు.

  శ్రీ జిగురు సత్యనారాయన గారు శకుంతలా దుష్యంతుల సమాగమమును వర్ణించేరు.

  శ్రీ సుబ్బా రావు గారు శివ స్తుతి చేసేరు. వారి పద్యము మొదటి పాదములో శంకరు కి బదులుగా శాంబుడు అనియు, అలాగే 4వ పాదములో భర్గు కి బదులుగా భవుడు అని మార్చితే బాగుంటుండి.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు శివ కవచాన్ని ప్రస్తావించేరు.

  శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు సీస పద్యములో శ్రీరామునికి సీత యెడల గల అద్భుతమైన భావాన్ని మనోహరముగా ఆవిష్కరించేరు.

  శ్రీ మంద పీతాంబర్ గారు సావిత్రీ సత్యవంతుల పవిత్రమైన కథను గుర్తు చేసేరు.

  అందరి పూరణలు బాగుగ నున్నవి. అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. అయ్యా సుబ్బారావు గారూ: మీకు చేసిన సూచనలో సాంబుడు అని చదువుకొనండి. (శాంబుడు కాదు).

  రిప్లయితొలగించండి
 20. సదన మందు నిలిచి శక్తుల నొసగుచు
  వక్ర తుండ మనగ ప్రాభ వమ్ము
  విఘ్న ములను బాపు వల్లభ గణనాధి
  పుండు సతిని గాంచి మోద మొందె !

  రిప్లయితొలగించండి
 21. పతి యసువుల గొంచు పరలోకమునకేగు
  యముని వెంట నరుగు నక్కజముగ
  నిర్భయాత్మ నరసి నిరయలోకైకాధి
  పుండు సతిని గాంచి మోదమొందె.
  -----------------

  రిప్లయితొలగించండి
 22. రామపాద రజపు రశ్మికి ధూళియే
  నాతి రూపు నొందె వ్రాత మారి
  పుణ్య శీల యాయె భువి మునిలోకాధి-
  పుండు సతిని గాంచి మోద మొందె !

  రిప్లయితొలగించండి
 23. పుండుకు పుల్ల మొగుడంటారు కదా. సరదాకి.

  రుబ్బు రోటి రాయి దబ్బున పడియెను
  కాలు పచ్చ డాయె కర్మ మేమొ
  ముద్దు లాడ సాగె మొగుడు పుల్లత్తరి
  పుండు సతిని గాంచి మోద మొందె !

  రిప్లయితొలగించండి
 24. శ్రీమతి రాజేశ్వరి గారి పద్యమును కొంచెము మార్చాలి. ఇలా మారిస్తే బాగుంటుంది అనుకొనుచున్నాను:

  సదనమందు నిలిచి శక్తుల నొసగుచు
  వక్రతుండ యనగ ప్రాభవమున
  చింతలెల్ల బాపు శ్రీ వల్లభ గణాధి
  పుండు సతిని గాంచి మోదమొందె

  రిప్లయితొలగించండి
 25. నమస్కారములు
  గురువులు శ్రీ పండితుల వారికి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 26. శ్రీ కమనీయం గారు సావిత్రీ సత్యవంతుల గాధను ప్రస్తావించేరు. పద్యముబాగున్నది.

  శ్రీ మిస్సన్న గారు 2 విధాలుగా పూరించేరు. 1 అహల్యా సాధ్విని గూర్చి మరియు (2)హాస్యోక్తి గాను. పద్యాలు బాగున్నవి.

  అందరికీ శుభాభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 27. ఆర్యులకు,

  చమత్కారమే సమస్య ప్రపూర్తికి జీవాతువు. శ్రీ మిస్సన్న గారి హాస్యఘట్టితం చాలా రంజకంగా ఉన్నది. ఈ రోజు జిగురు సత్యనారాయణ గారు అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని ఇమిడ్చి చూపారు. శ్రీమతి మందాకిని గారు, శ్రీ మంద పీతాంబర్ గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు, శ్రీ కమనీయం గారు, శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారు చేసిన పూరణలు, శ్రీ గురువుల పద్యశిక్షణ పద్యం హృద్యంగా ఉన్నాయి.

  ఈ పరిసమాపక నివేదనను నేనెందుకు వ్రాయవలిసి వచ్చినదంటే – శ్రీ నేమాని వారు అనర్ఘమైన నేటి శ్రీ సరస్వతీ స్తోత్ర ఖచితమైన చిత్రపటంలోని కలహంసి రూపంలో వివిదిషువులకు గోచరిస్తున్నారు.

  వారు అచిరకాలంలో శ్రీమత్పావనమైన అష్టోత్తర శతాన్ని పరిపూర్ణించాలి.
  ఏతన్నిర్విఘ్నపరిసమాప్తికై ఆ చల్లని చదువుల తల్లి దోహదించాలని మనమందఱము ఆకాంక్షిద్దాము.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 28. మఱొకరు చిత్రోక్తి - ఛీర్సోక్తిచతురులు భలే జిలేబి గారికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ నేమాని వారికీ, ఏల్చూరి వారికీ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 30. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  రుక్మిణీ పాణిగ్రహణ సమయంలో శ్రీకృష్ణుడు :

  01)
  ___________________________________


  రమ్ము నన్ను గొనుము - నమ్ముము నీదాన
  నన్న లలన తనను - యనుసరింప
  రుక్మరథము జేర - రుక్మిణీ హృదయాధి
  పుండు సతిని గాంచి - మోద మొందె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 31. అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ!
  మీ పద్యము 3వ పాదములో "యవసరమున" అని యడాగమము చేసేరు. అక్కడ నుగాగమము ఉండాలి కదా. సవరించండి. స్వస్తి

  రిప్లయితొలగించండి