23, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 655 (నందనా! నీకు వేవేల)

కవిమిత్రులారా,
అందరికీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు.

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

నందనా! నీకు వేవేల నతు లొనర్తు.
(నందన నామ సంవత్సరాన్ని సంబోధించరాదని నిషేధం)

26 కామెంట్‌లు:

  1. కవి మిత్రులకు నమస్కృతులు.
    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    మొన్న రాత్రి నుండి నాకు కిడ్నీలో రాయి కారణంగా నొప్పి వస్తున్నది. మందులు వాడుతున్నాను. నొప్పి వస్తూ పోతూ ఉన్నది.
    నిన్న రాజేశ్వరి అక్కయ్య గారు ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు.
    ఈ రోజు ఇంట్లోనుండి అడుగు బయట పెట్టలేదు. ఇంతకు ముందే శ్రీ పండిత నేమాని వారు ఫోన్ చేసారు. ప్రతి రోజు నియమం తప్పక సమస్యను పోస్ట్ చేసే నేను ఈ రోజు అందులోను పండుగ పూట పోస్ట్ పెట్టక పోయే సరికి వారు ఆందోళన చెందినట్టున్నారు.
    అందువల్ల ఓపిక తెచ్చుకొని మా మూడు ఫ్లోరులు దిగి పక్కింటి మూడు ఫ్లోరులు ఎక్కి ఈ నాటి సమస్యను పోస్ట్ చేస్తున్నాను.
    మిత్రుల ఉగాది కవితలను రేపు ప్రకటిస్తాను
    ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  2. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పిన అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్యగారూ ! పండగరోజు అనారోగ్యంతో మీరు బాధ పడడం విచారం కలిగించే అంశం. మీరు నీళ్లు ఎక్కువగానే తాగుతారు కదా , అదీ కాక ఈ మధ్య మూత్రపిండాలలో రాళ్లకు అత్యుత్తమమైన వైద్యవిధానాలు అందుబాటులోకి వచ్చాయి . మీకు ఒక యూరాలజిస్టు/ నెఫ్రాలజిస్టు సహాయం అవసరమేమో అనిపిస్తోంది.ఒకసారి పరిశీలించగలరు .పునరారోగ్య విభూతి ప్రాప్తిరస్తు ! నందన సంవత్సర శుభాకాంక్షలు !!!

    రిప్లయితొలగించండి
  4. తెలుగు పద్యాభిమానుల వెలుగు రేఖ
    శంకరయ్యకారోగ్య శశ్వద్విశేష
    సంపదలనీవె యో గిరిజా ప్రియతమ
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు !!!

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా! నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు. మీరు నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకొనండి.శ్రమకు లోను కావద్దు.
    విష్ణు నందన్ గారూ! బహుకాల దర్శనం. నూతన ఉగాది శుభాకాంక్షలు.

    విరులు పద్యము లవి విరివిగా పూయించు
    బ్లాగు వనపు మాలి బాగుగాను
    హాయిగలుగ వారి కారోగ్య మిడు నంద
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు.

    రిప్లయితొలగించండి
  6. ఒక వృద్ధుని వేదన........

    ముదిమి యేతెంచె, స్వాస్థ్యమ్ము చదికిలఁబడె,
    బాధ్యతలు దీరె, బ్రతుకేమొ భార మయ్యె,
    రమ్ము, గొనిపొమ్ము; యమధర్మరాజ! సూర్య
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు.

    రిప్లయితొలగించండి
  7. డా. విష్ణునందన్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    .................. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీశంకరయ్యగారి రోజునకొక సమస్యావిషయం ప్రకటించి తీరాలనే అసిధారావ్రతం ఆయన ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తున్నదని ఆందోళన కలుగుతున్నది. వారిని కొన్నాళ్ళు సంపూర్ణంగా విశ్రాంతి తీసుకొనవలసిందిగా లోగడనే విజ్ఞప్తి చేసాను.

    రిప్లయితొలగించండి
  9. ఈ నాటి సమస్య నా మదిలో శ్రీకృష్ణ భక్తిప్రబంధమై సాక్షాత్కరిస్తున్నది:

    అతివేగవంత మౌ నాలోకనక్రియావల్గనంబునఁ గంటిపాప లురులఁ
    జెంగుచెంగున దూఁకు భంగిమంబుల మెడల్ ముందువెన్కలు సాగి మురువు సూప
    చెవిమూలములనుండి చేదోయి వెడసాగి నిడుపులై కుఱచలై ముడిచికొనఁగ
    భుజగఫూత్కృతిమిళన్నిఃశ్వాసవేగంబున జగంబు లూగియాడఁ

    గాళియఫణీంద్రఫణమణికేళిరంగ
    నర్తనవిలోలగోపీజనకృతభక్తి
    వందనా! శ్రితచందనా నంద! నంద
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. స్వామీ! దేవకీనందనా!

    మాన్యులు శ్రీ శంకరయ్య గారికి తోడు నిలిచి ధైర్యం చెప్పవయ్యా!

    కమ్రపద్యమాకంది - మా కంది శంక
    రయ్య గారికి నారోగ్య మలవరించి
    స్వస్థచిత్తునిఁ గావింపు మాస్థ, నంద
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. నందనాఖ్యాబ్దమంతయు సుందరముగ
    సమత మమతలు హృదిలోన సాగునట్లు
    నఖిలకామద! వరములీవయ్య, నంద
    నందనా! నీకు వేవేల నతులొనర్తు.

    శంకరార్యుల కధికతేజస్సు మరియు
    స్వాస్థ్యమందించి, సాహితీ సత్త్వమొసగి
    యఖిలభారక! కాపాడవయ్య, నంద
    నందనా! నీకు వేవేల నతులొనర్తు.

    రిప్లయితొలగించండి
  12. elchuri vaariki- seesam 4va paadam okasaari choosi sari chesukona valenu.1. yathi? 2. oka ganam thakkuvaga undi

    రిప్లయితొలగించండి
  13. ఈ నాటి సమస్య నా మదిలో శ్రీకృష్ణ భక్తిప్రబంధమై సాక్షాత్కరిస్తున్నది:

    అతివేగవంత మౌ నాలోకనక్రియావల్గనంబునఁ గంటిపాప లురులఁ
    జెంగుచెంగున దూఁకు భంగిమంబుల మెడల్ ముందువెన్కలు సాగి మురువు సూప
    చెవిమూలములనుండి చేదోయి వెడసాగి నిడుపులై కుఱచలై ముడిచికొనఁగ
    భుజగఫూత్కృతిమిళన్నిజదీర్ఘనిఃశ్వాసవేగంబున జగంబు లూగియాడఁ

    గాళియఫణీంద్రఫణమణికేళిరంగ
    నర్తనవిలోలగోపీజనకృతభక్తి
    వందనా! శ్రితచందనా నంద! నంద
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. మాన్యశ్రీ అజ్ఞాత (అజ్ఞేయ?) మిత్రులకు!

    సవరణ నిమిత్తమైన మీ సకాల సూచనకు ధన్యవాదాలు.

    పద్యం చెప్పడమో, వ్రాయడమో ఒక యాగమైతే - దానిని కంప్యూటరు పరిచయం చాలక - అక్షరాలలో నిబంధించడమే ఒక ఆగమవుతున్నది!

    ఈ శంకరాభరణం సమస్యాపూరణలు నిమిత్తంగా ఛందఃసరస్వతిని వేయి నగలతో సాక్షాత్కరింపజేస్తున్న శ్రీ శంకరయ్య గారికి మఱొక్క పర్యాయం నా కృతజ్ఞతలు.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. గురువు గారు ,
    అన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఉంటారనుకుంటాను.

    దేహమందున స్వాస్థ్యత దిద్దగలవు
    హనుమ, దయచూడుమయ్య! హే యాంజనేయ!
    గురువు గారికి స్వస్థత కోరి వాయు
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు!

    రిప్లయితొలగించండి
  16. గురువు గారు ,
    అన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఉంటారనుకుంటాను.

    దేహమందున స్వాస్థ్యత దిద్దగలవు
    హనుమ, దయచూడుమయ్య! హే యాంజనేయ!
    గురువు గారికి స్వస్థత కోరి వాయు
    నందనా! నీకు వేవేల నతు లొనర్తు!
    ---------మందాకిని.

    రిప్లయితొలగించండి
  17. ప్రణవమే తుండమై పరగు శంకర నంద
    నా! నీకు వేవేల నతులొనర్తు
    ధర్మ రక్షకుడవై తనరు యాదవ నంద
    నా! నీకు వేవేల నతులొనర్తు
    విశ్వమెల్లెడలను వెలుగు నదితి నంద
    నా! నీకు వేవేల నతులొనర్తు
    శ్రీరామ దూతవై చెలగు మారుతి నంద
    నా! నీకు వేవేల నతులొనర్తు
    విఘ్నములు కల్గకుండ దీవింపుమయ్య!
    నెమ్మనమున ధర్మ నిరతి నింపుమయ్య!
    దురితమయ తమస్సంఘంబు ద్రుంచుమయ్య!
    ఎల్లెడల తగు రక్షణ నీయుమయ్య!

    రిప్లయితొలగించండి
  18. పై పద్యములో 3వ పాదములో చిన్న సవరణ: మారుతి కి బదులుగా మారుత అని సవరించాలి.

    రిప్లయితొలగించండి
  19. నంద నందన! దశరథ నందన! శివ
    నందనా! హరిహరనందనా! మరుత్తు
    నందనా! నీకు వేవేల నతులొనర్తు.
    శంకరుల బాధ మాన్పవే సత్వరముగ.

    రిప్లయితొలగించండి
  20. Friday, 23 March 2012
    samasyaapuranam
    ఈనాటి సమస్యకు నా పూరణం:

    తే.గీ. పంచ పాండవులకు నాత్మ బంధువుగను
    సర్వ వేళల బ్రోచిన చందనముగ
    కంది శంకరయ్యను దయ గాచు నంద
    నందనా! నీకు వేవేల నతు లోనర్తు.

    రిప్లయితొలగించండి
  21. అందరికీ శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

    శంకరార్యుని చుట్టిన సంకటముల
    దీర్పజాగేల వేవేగ దివినివిడిచి
    రమ్ము గురిపించుము కనికరమ్మును యదు
    నందనా నీకు వేవేల నతులొనర్తు!!!

    రిప్లయితొలగించండి
  22. నందనానికందరికీ హృదయ పూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు !
    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నందన నామ వత్సరానికి నా వినతి :

    01)
    _____________________________________________


    శంకరార్యుల కారోగ్య - సంపదలను
    శక్తి యుక్తుల గలిగించి - సంతసమును
    సకల యైశ్వర్య మందించి - సంతతంబు
    సర్వ విధముల మోదమ్ము - శాంతి గలుగ
    సజ్జనార్యుకు నానంద - చయము నిమ్ము !
    నందనా నీకు వేవేల - నతులొనర్తు!!! _____________________________________________

    రిప్లయితొలగించండి
  23. నందనానికందరికీ హృదయ పూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు !
    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నందన నామ వత్సరానికి నా వినతి :

    01)
    _____________________________________________


    శంకరార్యుల కారోగ్య - సంపదలను
    శక్తి యుక్తుల గలిగించి - సంతసమును
    సకల యైశ్వర్య మందించి - సంతతంబు
    సర్వ విధముల మోదమ్ము - శాంతి గలుగ
    సజ్జనార్యుకు నానంద - చయము నిమ్ము !
    నందనా నీకు వేవేల - నతులొనర్తు!!!


    _____________________________________________

    రిప్లయితొలగించండి
  24. శంక రార్యుని రోగము శమయ జేసి
    యాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    పూర్వ స్వాస్థ్యము చేకూర్చు శర్వ ! శంభు
    నందనా నీ కు వేవేల నతు లొ నర్తు .

    రిప్లయితొలగించండి
  25. guruvu gAriki namassulu,27-3-2012 naaTiki nA samasyanu pariSeelincha prArthana:
    samasya: kAluni peLLi yADe naTa kaamini seeta maootsavammugan.
    tama vidhaeyuDu
    G.V.S.SAHADEVUDU
    PRODDATUR

    రిప్లయితొలగించండి