5, మార్చి 2012, సోమవారం

సమస్యాపూరణం - 638 (కమలబాంధవుఁ డేతేర)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

కమలబాంధవుఁ డేతేరఁ గలువ విచ్చె

21 కామెంట్‌లు:

  1. కవి మిత్రులకు,
    శుభోదయం, నమస్కృతులు.
    ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. నెట్ సమస్య తీరలేదు. మనస్తాపాన్ని కలిగించే కొన్ని సంఘటనల వలన కలత చెంది ఉన్నాను. అందువల్ల నా స్పందనలను వెంట వెంట తెలుపలేకున్నాను. మన్నించాలి.
    దయచేసి మరికొన్ని రోజులు మిత్రుల పూరణల గుణదోషాలను పరస్పరం సద్విమర్శ చేసికొనండి.

    రిప్లయితొలగించండి
  2. స్నాన మైనది వేకువ జాము లోనె
    పూజ జేసెద శివునికి పూలు వలయు
    పొమ్ము చెరువుకు పెరుగును ప్రొద్దు వచ్చు
    కమలబాంధవుఁ డే తేరఁ గలువ విచ్చె

    రిప్లయితొలగించండి
  3. పగలు విశ్వము నంతయు పర్యటించి
    ప్రకృతికెంతయు చేతనత్వమును గూర్చి
    స్యందనము డిగ్గి నిజ నివాసమ్ము దరికి
    కమలబాంధవు డేతేర కలువ విచ్చె

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    కారు చీకటి తొలగెను - కాంతు లొదవె
    కమల బాంధవు డేతేర ! కలువ విచ్చె
    కలువ రాయని వెన్నెల - గాంచినంత
    కలికి కన్నుల వెన్నెల - ల్గాంచు డవిగొ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా !

    ఎన్ని సమస్యలు ముసిరిన
    నెన్నకనే రోజు బ్లాగు నే మరు వరుగా
    సన్నుతి జేసెద సాయిని
    అన్ని సమస్యల నణచగ నా చార్యునకున్.

    రిప్లయితొలగించండి
  6. స్నాన మైనది వేకువ జాము లోనె
    పూజ జేసెద శివునికి పూలు వలయు
    పొమ్ము చెరువుకు - పెరుగును ప్రొద్దు, వచ్చు
    కమలబాంధవుఁడే - తేరఁ గలువ విచ్చె

    రిప్లయితొలగించండి
  7. నేమాని వారి స్ఫూర్తితో :

    02)
    _____________________________________________

    కనక స్యందన మందున - కాలు నిలిపి
    కాల చక్రముతో పాటు - కదలి కదలి
    కడకు సంచారమును వీడి - కాంత కడకు
    కమల బాంధవు డేతేర - కలువ విచ్చె !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  8. అనిని సైంధవుఁ గూల్చగ నర్జునుండు
    నిశిని గూర్చగఁ జక్రమున్ శశిని గనెనొ
    కృష్ణు మాయకు వశమయ్యి కృతక రాత్రి
    కమల బాంధవుఁ డేతేరఁ గలువ విచ్చె !

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! వసంత కిశోర్ గారూ!
    మీ పద్యము బాగున్నది. మొదటి పాదములో చిన్న మార్పు అవసరము చూడండి. కనక స్యందనములో స్య కు ముందునున్న క గురువు అగును కదా. గణభంగము కాకుండా సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. ధరణికటు తమసమన౦గ తరణి వచ్చె
    నిటు వెలు౦గులు నింపుచు నీదరికిని
    కమలబాంధవుఁ డేతేరఁ, గలువ విచ్చె
    నాదరి భరత భూమిన హాయిగొలుప!

    రిప్లయితొలగించండి
  11. నేమాని వారికి ధన్యవాదములతో :

    02అ)
    _____________________________________________

    కనక కంచర మందున - కాలు నిలిపి
    కాల చక్రముతో పాటు - కదలి కదలి
    కడకు సంచారమును వీడి - కాంత కడకు
    కమల బాంధవు డేతేర - కలువ విచ్చె !
    _____________________________________________
    కంచరము = రథము

    రిప్లయితొలగించండి
  12. పుచ్చ వెన్నెల మఱి పించె పుడమి మీద
    కమల బాంధవు డే తేర , గలువ విచ్చె
    చంద మామను గనుగొని సంత సమున
    ప్రీతి పాత్రుల కలయిక ప్రీతి గాదె !

    రిప్లయితొలగించండి
  13. గురువు గారికి వందనములు
    కర్నాటక రాజకీయ పరిస్థితులపై
    ----------
    కమల నాథులు కలహించి, కాలుదువ్వ
    రాజకీయసంక్షోభము రక్తిగట్ట
    కమల బాంధవు డేతేర, గలువ విచ్చె
    మండు వేసవి నందున మంత్రులందు|

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! వసంత కిశోర్ గారూ! అభినందనలు. మీ ప్రయత్నము బాగున్నది. మీరు సవరించేరు కాని మరియొక సూచన. కంచరము అన్నది సంస్కృత పదము కాదు, వైకృత పదము. అందుచేత కనకకంచరము అనేది దుష్టసమాసము అగును. అందుచేత ఈ విధముగా సవరించండి:
    "కాంచన స్యందనమ్ము పై కాలు నిలిపి"

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా!

    మన శ్రీ శంకరయ్య గారు త్వరలో స్వస్థతతో మన మధ్యకి వస్తారని ఆశించుదాము.

    ఈరోజు పూరణలు కూడా బాగుగనే యున్నవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు శివ పూజకై కలువలని తెప్పించేరు.

    శ్రీ వసంత కిశోర్ గారు మొదటి పూరణ మంచి విరుపుతో రాణింప చేసేరు; 2వ పూరణలో కమల బాంధవుడు సంజె వేళ ఇంటికి చేరుకొనీ కాంతను కలుసు కొనే యత్నమును వర్ణించేరు.

    తమ్ముడు డా. నరసింహమూర్తి కృతక రాత్రి వేళ కలువ విచ్చిన విధమును ప్రస్తావించెను.

    శ్రీ చంద్రశేఖర్ గారు అమెరికాలో పగలు భరత దేశములో చంద్రోదయమును గుర్తు చేసేరు.

    శ్రీ సుబ్బా రావు గారు మంచి విరుపుతో పూరించేరు.

    శ్రీ వరప్రసాద్ గారు కర్ణాటక రాజకీయములతో రక్తి కట్టించేరు.

    అన్ని పూరణలు బాగున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. వేడి కిరణాల వాడికి మాడి పోయి
    విరహ తాపమ్ము భరియింప వెతను బడగ
    చలువ వెదజల్లి ప్రీతిగ చెలుల కనుచు
    కమల బాంధవుఁడే తేరఁగలువ విచ్చె !

    రిప్లయితొలగించండి
  17. నేమాని వారికి ధన్యవాదములతో :

    02ఆ)
    _____________________________________________

    కాంచన స్యందనమ్ము పై - కాలు నిలిపి
    కాల చక్రముతో పాటు - కదలి కదలి
    కడకు సంచారమును వీడి - కాంత కడకు
    కమల బాంధవు డేతేర - కలువ విచ్చె !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యులకు స్వస్థత చేకూరి రెట్టించిన ఉత్సాహముతో
    మన మధ్యకు రావాలని మనసారా కాంక్షిస్తున్నా !

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ

    కమల బాంధవుడేతేర క్రమ్ముకొన్న
    మేఘ పంక్తులు తెరదీసి మింటజూపు
    నాప్త బాంధవు కరముల నాదుకొనగ
    కష్టముల వేగు జనుల పటిష్ట బరుప.

    ధైర్యంగా ఉండండి.

    రిప్లయితొలగించండి
  20. పద్య రచన కోసం ప్రయత్నలోపం లేదు. కానీ దైవకృప కొంత కావలసియున్నది గాబోలు.... ప్రయత్నిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  21. వామనకుమార్ గారూ! సాధనమున పనులు సమకూరు ధరలోన .....

    రిప్లయితొలగించండి