కవిమిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్.
(యతిని గమనించండి)
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -
మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్.
(యతిని గమనించండి)
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
త్రుంచును సంచిత కర్మలు
రిప్లయితొలగించండిపెంచును శుభయోగములను పృథ్వీతనయో
దంచిత కళ్యాణోత్సవ
మంచు గని తరించిరెల్ల రాపర్వంబున్
కాంచీపురపీఠాధిపు
రిప్లయితొలగించండినంచితమౌభక్తితోడనవనీతలము
న్నెంచనడయాడుదైవ
మ్మంచు గని తరించి రెల్ల రాపర్వంబున్.
గురువు గారూ..,
తప్పులెన్నున్నాయో తెలియదు..
మీదే భారం.
సంచిత పాపము బాపును
రిప్లయితొలగించండిమించిన భక్తిని దలంప మేలౌ రామా
యంచన నిత్యము నిడు శుభ
మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్
త్రెంచుము భవబంధంబులు
రిప్లయితొలగించండిపెంచుము మఱి మోక్ష గతులు పెద్దమ తల్లీ !
మంచిగ సేవలు సేసెద
మంచు గని తరించి రెల్ల రా పర్వంబున్ .
త్రెంచుము భవబంధంబులు
రిప్లయితొలగించండిపెంచుము మఱి మోక్ష గతులు పెద్దమ తల్లీ !
మంచిగ సేవలు సేసెద
మంచు గని తరించి రెల్ల రా పర్వంబున్ .
మంచిని పెంపొందించెడు
రిప్లయితొలగించండినంచింతభాగవత కథలనారంభింపన్
సంచితపాపవినాశన
మంచుగనితరించిరెల్ల రాపర్వంబును.
sir,sastri garu ,namaste.
రిప్లయితొలగించండిplease verify your poem ,2nd line and last line
పెద్దలకు ప్రణామాలు
రిప్లయితొలగించండిఅందరికి శ్రీ రామనమిశుభాకాంక్షలు, శ్రీ రామనమినాడు శంకరాభరణం బ్లాగునందు విచ్చెయు కవులను ఒక్కసారి పలుకరించి పానకప్రసాదములిచ్చి ఆనందింపజేయుటకు ఈ చిన్నప్రయత్నము .
శంకరాభరణం బ్లాగునందు మాత్రమే దొరకును
శ్రీ శంకరయ్యగారి శంకరాభరణరాగం, శ్రీ పండిత నేమనివారి పళని పంచాంమృతం,శ్రీ వసంతకిశోర్ గారి వసంతరాగం , శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారి గోళీ షోడాలు ,శ్రీ ఏల్చూరి మురళీధరరావు మురళీగానం, శ్రీ లక్ష్మీదేవి (మందాకిని) గారి మడతకాజాలు,శ్రీ ఆదిభట్ల కామేశ్వరరావు గారి ఆదితాళం ,శ్రీ డా. కమనీయం గారి కమ్మని కాఫీ(తేనీరు, ఆంగ్లపదము వచ్చినది),శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి తేనెగారెలు , శ్రీ జిలేబి గారి జిలిబిలి పలుకుల జిలేబిలు,శ్రీ లక్కరాజుగారి లాలిపాటలు, శ్రీ చింతా రామకృష్ణారావుగారి చిత్రదర్శని,శ్రీ మిస్సన్నగారి మినప సున్నుండలు, శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి సపోటాలు ,శ్రీ శ్రీపతిశాస్త్రి గారి శ్రీఖండము, శ్రీ వామనకుమార్ గారి వడలు, శ్రీ సుబ్బారావు గారి సలివిడి,శ్రీ రాజెశ్వరి నెదునూరి గారి నేతివంటలు , శ్రీ మంద పీతాంబర్ గారి పీచుమిఠాయి
శ్రీ ఊకదంపుడు గారి ఉత్తంసము మఱియు శ్రీ అజ్ఞాత గారి అటుకుల బెల్లము అప్పుడప్పుడు దొరకును అందువలన,
అథిధులందరు అవి దొరకిన క్షణమున విని,తిని,చూచి, సేవించి ఆనందించ ప్రార్థన
తమ భవదీయుడు
వరప్రసాదు
కాంచుడు రామోద్వాహం
రిప్లయితొలగించండిబంచితమగు యశములొసగు నఘముల బాపున్
పంచును విభవము శుభకర
మంచు గని తరించి రెల్ల రా పర్వంబున్.
టైపాటును తెలియజేసిన శ్రీ సుబ్బారావుగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమంచిని పెంపొందించెడు
నంచితభాగవత కథలనారంభింపన్
సంచితపాపవినాశన
మంచుగనితరించిరెల్ల రాపర్వంబున్
మిత్రులారా!
రిప్లయితొలగించండిముకుందమాలలోని 41 శ్లోకములను స్వేఛ్ఛగా అనువాదమొనర్చితిని. ఆ పద్యములను 4 భాగములగా ఈ బ్లాగులో ప్రకటించుట జరిగినది. మన బ్లాగులోని మిత్రులగు మీరందరు చూచియుంటిరి. ఇట్లు ప్రకటించుటలో సహకరించిన శ్రీ కంది శంకరయ్య గారికి బహుధా కృతజ్ఞ తాభివందనములు. స్వస్తి. నేమాని రామజోగి సన్యాసి రావు
గురువు గార్కి వందనములు నా ఈ సమస్యను పరిశీలించ ప్రార్థన
రిప్లయితొలగించండిసమస్య: తే.గీ. పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు!
కాంచుడు రామోద్వాహం
రిప్లయితొలగించండిబంచితమగు యశములొసగు, నఘముల బాపున్
పంచును విభవము శుభకర
మంచు గని తరించి రెల్ల రా పర్వంబున్.
త్రుంచగ ధనువును రఘుపతి,
రిప్లయితొలగించండివంచెను వదనమ్ముసీత, వలపుల మొగ్గై
పంచెను మోదము గైకొ
మ్మంచు,గని తరించిరెల్ల రాపర్వంబున్ !!!
కొంచెము వీలే కలుగద
రిప్లయితొలగించండిటంచును భద్రాద్రి పెండ్లి కరుగని వారే
మంచిగ 'టీవీ' చూచెద
మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్.
అంచిత మైన భారతము
రిప్లయితొలగించండిపంచమ వేదమే యనుచు వ్యాసుడు తెలుపన్ !
మించిన భక్తిని కొలిచెద
మంచు గని తరించి రెల్ల రాపర్వంబున్ !
వంచన చేయుచు నేతలు
రిప్లయితొలగించండికంచికి జేరని కధలుగ కాలాగ్ని వలెన్ !
మించిన పాలన చేసెద
మంచు గని తరించి రెల్ల రాపర్వంబున్
devjeesaha గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీరు పంపిన సమస్య బాగున్నది. సేవ్ చేసి పెట్టాను. రేపు శ్రీరామ నవమి కదా! తత్సంబంధమైన సమస్య ఇస్తాను. ఎల్లుండి మీ సమస్యను ప్రకటిస్తాను. మీ సహకారం ఇలాగే కొనసాగించవలసిందిగా మనవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంచే కురిసిన వేళల
రిప్లయితొలగించండిఇంచుక మది మోహ మంద యీశుని కైనన్ !
చంచలను పిలిచె గోముగ
మంచు గని తరించి రెల్లరా పర్వంబున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
భద్రాచలంలో సీతారామ కల్యాణం వీక్షించిన భక్తబృందం :
01)
_____________________________________________
అంచితమయినది రాముని
మించిన కల్యాణ వేడ్క - మేదిని నిపుడే
గాంచితిమి జన్మ ధన్య
మ్మంచుగని తరించిరెల్ల - రా పర్వంబున్ !
_____________________________________________
మించు = అతిశయించు
మిత్రుల పూరణ లద్భుతంగా నున్నాయి. మిత్రు లందఱికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిహ వేం స న మూర్తి గారూ ---
రిప్లయితొలగించండిమీ పద్యంలో మొదటి పదం కాంచుడుకు బదులు కాంచిన. లేదా కాంచగ అని ఉన్నచో
అన్వయము చక్కగా ఉండునని తోచుచున్నది . అలోచించి సరి చేయగలరు
నేదునూరి రాజేశ్వరి గారికి
రిప్లయితొలగించండిమీ ఉత్సాహమునకు జోహారు . కానీ మొదటి కందంలో మొదటి రెండు పాదములలో గణములు తప్పినవి ..రెండవ కందంలో అర్ధము బోధ పడుట లేదు . మూడవ కందము సమస్య పాదములో యతి మీరు గమనించలేదు . (చూ శంకరయ్య గారి సూచన ) పైగా పద్యములో అన్వయములో కూడా కొద్దిపాటి చిక్కులు ఉన్నవి . గమనించగలరు
మంద పీతాo బర్ గారికి
రిప్లయితొలగించండిమీరు అనుమతిస్తే మీ పద్యానికి చిన్న సవరణ సూచిస్తున్నాను .
వంచెను ధనువును రఘుపతి ,
వంచెను వదనమ్ము సీత , వర మాలను చూ
పించుచు రఘురామా కొ
మ్మంచు గని తరించిరెల్ల రా పర్వంబున్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.
*
ఊకదంపుడు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
తప్పులు లేవు. కాని "అవనీతలము న్నెంచ" అన్నదాన్ని "అవనీతలమం దెంచ" అంటే బాగుండేదేమో?!
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మిత్రుల పూరణలను పరిశీలించి సూచనలిస్తున్నందకు ధన్యవాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"అంచిత" టైపాటువల్ల "అంచింత" అయింది.
*
వరప్రసాద్ గారూ,
అద్భుతమైన విందును మా కోసం సిద్ధం చేశారు. ధన్యవాదాలు. ఈ రాత్రికి నేను అజీర్తితో బాధపడడం గ్యారెంటీ :-)
*
హ.వేం.స.నా.మూర్తి గారూ (వేంకట సత్య నారాయణ మూర్తి అనుకుంటా.. అంతేనా?)
అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చమత్కార భరితమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
అజ్ఞాత గారి వ్యాఖ్యను గమనించారు కదా! మీ చివరి రెండు పూరణలో మీరు చెప్పదలుచుకున్న దేమిటో సందిగ్ధంగా ఉంది.
మీ మొదటి పూరణలోని మొదటి రెండు పాదాలకు నా సవరణ....
అంచిత మగు భారతమును
పంచమ వేద మ్మటంచు వ్యాసుడు తెలుపన్ ....
*
వసంత కిశోర్ గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ధన్యవాదాలు.
*
అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.
గురుతుల్యులు శ్రీ శంకరయ్యగారికి నమస్కారములు,
రిప్లయితొలగించండిమీ అభినందనలకు ధన్యవాదాలు. నా పేరుకు పూర్తి రూపం మీరు వ్రాసినదే.
- మీ ఆశీర్వచనాభిలాషి
హ.వేం.స.నా.మూర్తి.
చక్కని సవరణను సూచించి నా పూరణకు స్పష్టతను చేకూర్చిన అజ్ఞాత గారికి ధన్య వాదములు .
రిప్లయితొలగించండికొంచెము వడపప్పు వడలు
రిప్లయితొలగించండిమంచిగ పానకము లేత మామిడి ముక్కల్
కంచములో పరమాన్న
మ్మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్