3, జూన్ 2015, బుధవారం

సమస్యా పూరణము - 1692 (సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.
(మూడు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సమస్యలను షెడ్యూల్ చేశాను. 
ఈమూడురోజులు  నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చునని గమనించ మనవి)

33 కామెంట్‌లు:

  1. హోమాగ్నిని సతి చచ్చుట
    నేమాత్రము సైపనట్టి యీశుండు సుహృ
    ద్ధాముఁడు చూడాలంకృత
    సోముఁడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    గురువుగారూ ! మీ పద్యం అద్భుతంగా ఉంది
    సరిగ్గా నేనుకుడా శివును గురించే అనుకున్నాను గానీ ప్చ్ ! నాకంత తొందరగా రాదుగా
    అందుకే మీ....రు గువులు

    రిప్లయితొలగించండి
  3. కాముని బాణము తగులగ
    యేమా త్రముజాగు లేక నిటలాక్షముతో
    ధూమము గ్రక్కుచు మారుని
    సోముఁడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే

    రిప్లయితొలగించండి
  4. కామజ్వర పీడితుడై
    రామన యోనిజఁ చెరగొన, రాక్షస పతిపై
    భీముడగుచు ననిఁ రవికుల
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే

    రిప్లయితొలగించండి
  5. రాజెశ్వరి అక్కయ్యా,
    కామదహనం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదాన్ని ‘ధూమము లెగయ మరునిపై’ అనండి. సోముడంటే శివుడనే అర్థంకూడా ఉంది.
    మీరు మాత్రం నన్ను ‘గురువుగారు’ అనవద్దు. ‘తమ్ముడు’ అంటేనే సంతోషం!
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ‘రవికులసోముడు’ విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. కామాగ్నిజ్వలితహృదయ
    భామిని విరహమ్ముతోడ విలవిలలాడెన్
    వేమాఱు శీతకరుఁడగు
    సోముఁడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    రిప్లయితొలగించండి
  7. సేమముగా లంకకు జన
    నీమని ప్రార్థింప జలధి నెమ్మది నుండన్
    రాముడు రఘుకుల వార్నిధి
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే.

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    రఘుకులాబ్ధిసోముడైన రాముని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నమస్కారములు
    ఎంత తమ్ముడైనా , కొడుకే ఐనా వాళ్ళ ఉన్నత స్తానానికీ,పదవికీ, మనసులో నాటుకు పోయిన గుర్తింపు తప్పకుండా అలాగే ఉంటుంది .ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  10. మామక జనగణములపై
    యేమది మీపెత్తనంబులికమేమొప్పన్
    బోమని తేల్చి సుభాసిత
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే
    ( సుభాష్ చంద్రుడు : సుభాసిత సోముడు అన్నాను
    గురువుగారి approval అపేక్షిస్తూ)

    రిప్లయితొలగించండి
  11. భూమిజను చూఱలాడిన
    కాముకుడా రావణుడిని కడతేర్చంగా
    రాముడు రఘుకులజాతుడు
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే !!!

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులతో...

    (సభలో శిశువాలుఁడు శ్రీకృష్ణు నధిక్షేపించు సందర్భము)

    "వేమఱుఁ బొగడఁగనేలా?
    ధీమతుఁడా యాదవుండు దివిజేశుండా?
    సేమము కా" దన యదుకుల
    సోముఁడు నిప్పులను గుఱిసె సూర్యునివలెనే!

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు శంకరయ్యగారి పూరణము ప్రశస్తముగనున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కాముని దహియించెను గద
    సోముడు, నిప్పులను గురిసె సూర్యుని వలెనే
    సోముడ నంగుని గాంచగ
    కామము మఱి గౌరి పైన గలుగుట వలనన్

    రిప్లయితొలగించండి
  15. భీముండై రణమందున
    భీమంబౌ శస్త్రములను రావణు పైనన్
    ఏమఱక వేయ రఘుకుల
    సోముఁడు , నిప్పులను గురిసె సూర్యునివలెనే.

    రిప్లయితొలగించండి

  16. సమస్య :సోముదు నిప్పులను గురిసె సూర్యునివలెనే
    పూరణ:రాముడు యినకులమునకే
    సోముదు నిప్పులను గురిసె సూర్యునివలెనే
    భీమపరాక్రమముతో సం
    గ్రామమునన్ దుష్టుడైన రావణు గాంచన్

    జూన్ 03, 2015 9:15 [AM]

    రిప్లయితొలగించండి
  17. శ్రీమతిచరవిడిపించగ
    సోమముతోనసురపతిని స్రుక్కగజేయన్
    భీమబలంబున రవికుల
    సోముడు నిప్పులనుగురిసె సూర్యునివలెనే

    రిప్లయితొలగించండి
  18. కామిత మొసగెడి శివుడికి
    కామము బంచంగ నెంచ? గలిగెడి ముప్పే
    కాముని నాశన బరచగ
    సొముడు నిప్పులను గురిసె సుర్యుని వలెనే

    రిప్లయితొలగించండి
  19. సాహితీ మిత్రులూ
    మీ వీలునుబట్టి ఈ క్రింది లింకును చూడగలరు

    http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=78

    రిప్లయితొలగించండి
  20. కాముని చేష్టల సెగలో
    ప్రేమే పెంపొందగానె? ప్రేయసి లేకన్
    క్షెమంబొసగెడి” మదిలో
    సోముడు” నిప్పులనుగురిసె?సూర్యుని వలెనే

    రిప్లయితొలగించండి
  21. దామోదరుఁ జూపు మనచుఁ
    దా మోదగ కంభము నట! దానవుడంత
    న్నేమర! ప్రహ్లాద హృదయ
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    రిప్లయితొలగించండి
  22. భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    కౌముది నిండుగ నింపెడి
    సోముని పున్నమిని గ్రహము క్షోబను గూర్చె
    న్నామరు క్షణమున విడువగ
    సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే.

    రిప్లయితొలగించండి
  23. సోముని జేరగ పార్వతి
    కాముడు విడిచెను శరముల,కటువుగ మదనున్
    భీమపు ముక్కన్నుదెరచి
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    కామము తోడను ప్రియులల
    సోముని రాత్రిని తమకపు సోయగమందన్
    సోముని వెన్నెల సెగయై
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    సోముడు,సూర్యుడు కాంతిని
    తామటు విడినను,చలువయు,తాపము కలుగున్
    కాముకులకు వేడి నిడుచు
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    భీమపు వేసవి నిపుడును
    సోముని పున్నమి సమయము సోలగ జేసెన్
    సేమము విడగా-కనగను
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    వివరణ;సోముడు=చంద్రుడు,శివుడు

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. భీముండై రణమందున
    భీమంబౌ శస్త్రములను వేయగ రావణు
    పై మండిపడుచు రఘుకుల
    సోముఁడు , నిప్పులను గురిసె సూర్యునివలెనే.

    రిప్లయితొలగించండి
  26. ​భూమిజ నెత్తుకు పోయిన
    కాముకుడగు టక్కరి దశకంఠుని గూల్చన్
    మీమాంస వదలి రఘుకుల
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    రిప్లయితొలగించండి
  27. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా సవరణలతో మీ పద్యం.....
    భూమిజను చూఱనాడిన
    కాముకుడగు రావణు ననిఁ గడతేర్చంగన్
    రాముడు రఘుకులవార్నిధి
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే !!!
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరి రెండు పాదాలను ఇలా సవరిస్తే బాగుంటుందేమో!
    ‘రాముని కడ కేగెఁ బరశు
    రాముఁడు విషయమ్ము నరసి రక్తాక్షుండై’
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవపూరణలో రెండవపాదం చివరి అక్షరం తప్పక గురువై ఉండాలి కదా! ‘వేయ నసురుఁ డా|పై మండిపడుచు...’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రాముడు+ఇనకుల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రాముం డినకులమునకే’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘భీమపరాక్రమమున సం...’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణలో ‘కాముని నశింపజేయగ’ అనండి.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ దత్తోదాహరణము ప్రింటు పుస్తకమే ఉంది నా దగ్గర. దీనిని సమీక్షించాలని ఎన్నిసార్లు అనుకున్నా ఏదో ఒక అవాంతరం వస్తున్నది. మీరు అనుమతిస్తే దీనిని ‘శంకరాభరణం’ బ్లాగులో ప్రకటిస్తాను రోజుకొక విభక్తిచొప్పున.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కంబము (లేదా) స్తంభము’ అనండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కార్ముక’మనండి.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
    దామోదరుఁ జూపు మనుచుఁ
    దా మోదగ కంబము నట! దానవుడంత
    న్నేమర! ప్రహ్లాద హృదయ
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!

    రిప్లయితొలగించండి
  29. శ్రీ శంకరార్యా
    నా ఉదాహరణం శంకరాభరణంలో ఉంచడానికి నాకే అభ్యంతరమూ లేదు.

    రిప్లయితొలగించండి
  30. కామంబును రగిలింపగ
    కాముడు సంధించినాడు కార్ముక మనగన్,
    నీమము వీడుచు శివుడగు
    సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  31. ఆ మాల్యా విజయుండే
    ధీమాతో లండనందు దీటుగ దాగన్
    భీముడు కోశాగారపు
    సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే

    భీముడు = భయంకరుడు
    సోముడు = కుబేరుడు

    రిప్లయితొలగించండి


  32. రాముని యనుంగు మిత్రుడు
    సోముఁడు, నిప్పులను గురిసె సూర్యునివలెనే
    భీముని పైనాతండట
    రాముని కొట్టగ, జిలేబి రాధనమొందన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. కోమల కమలము వీడుచు
    ప్రేమను సైకిలును త్రొక్కి పెడసరి తనమున్
    ఢామని నేలను కూలగ
    సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే

    సోముడు = చంద్రుడు

    రిప్లయితొలగించండి