7, జూన్ 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1696 (కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
(ఒకానొక అవధానంలో రాళ్ళబండి కవితాప్రసాద్ గారు పూరించిన సమస్య)

రాళ్ళబండి వారి పూరణ:

భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

45 కామెంట్‌లు:

  1. రాతను నమ్ముకొంటి నని రంజిలు నారిత లంచెనం టవో
    నేతను బెండ్లియా డినచొ నిక్కము చాలిన సంపదుండుగా
    యాతని రూపురే ఖలవి యందమ దేటికి కూరవం డునా
    కోతిని పెండ్లియాడె నొకకోమలి స్నేహితు రాండ్రు మెచ్చగా

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    అందం కూడుపెడుతుందా అంటూ ధనికుడైన కురూపిని పెళ్ళాడిన కోమలి గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కొన్ని దోషాలు ఉన్నాయి. అన్నిటినీ చూపించాలంటే వ్యాఖ్య పెద్ద దవుతుంది. అందుకని మీ పద్యానికి సవరణలను చేస్తున్నాను. మీ పద్యంతో పోల్చుకొని దోషాలను గుర్తించండి....
    వ్రాతను నమ్ముకొంటి నని రంజిలు నారి తలంచెనంట యా
    నేతను బెండ్లియాడినను నిక్కము చాలిన యాస్తి యుండుగా
    యాతని రూపురేఖలవి యందమ దేటికి కూడు బెట్టునా
    కోతిని పెండ్లియాడె నొకకోమలి స్నేహితు రాండ్రు మెచ్చగా.

    రిప్లయితొలగించండి
  3. " కోతులు, చాకొ బారులని " కొంటెగ బిల్తురు పాఠశాలలో
    ప్రీతియె బిల్వగా తరలి పెండ్లికి వచ్చుచు మిత్రబృందమే
    ప్రీతిగ తెచ్చినారు తమ' ఫ్రెండ్షిపు ' గుర్తుగ వారితోడ " చా
    కో " తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా.

    రిప్లయితొలగించండి
  4. లంకా గిరిధర్ గారి పూరణ.....
    అద్భుతమైన విఱుపును మీరు ప్రశ్నతోబాటుగా ఇచ్చేస్తే ఇక మా గతి ఇంతే, కోతులతోనే పెండ్లి చేయించవలె.
    ఉ.
    స్ఫీతయశః ప్రభాకరుడు విక్రము డొక్కడు మౌని శాప మన్
    ఘాతముచేత వానరముగా పరివర్తన చెంద, ప్రేమతో
    నాతి యొకర్తె శాపమును నాశముజేయుగ సాధ్యురా లనన్
    గోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘చాకో’ తినిపించిన మీ పూరణ మధురంగా ఉంది. అభినందనలు.
    *****
    లంకా గిరిధర్ గారూ,
    కోతితోనే పెండ్లి చేయించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రాళ్ళబండి వారి పూరణ అనుపమానము.

    కోతులు కామరూపులట గొప్పగ రూపము మార్చుకొంచు సం
    ప్రీతిగ నచ్చు నాకృతిని పెండ్లిని మించుదు రంట నాడదే
    రీతిని తార వాలికడ శ్రీకర రూపము దాల్చె పెండ్లిలో
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా.

    రిప్లయితొలగించండి
  7. పాతకమేమి చేసితినొ భాగ్యమదెట్టుల నుండబోవునో?
    జాతకరీత్య తప్పదని శాంతముఁ గూర్చెడు దారిఁ జూప రే
    పాతని బొందు మున్మునుపె బాపడు దోష నివారణమ్మనన్
    గోతిని బెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  8. జాతక దోషముండ పతి చచ్చునటంచును నమ్మకమ్ముతో
    కూతురి పెండ్లి చేయనొక కోతిని తెచ్చిరి తల్లితండ్రులే
    యాతరువాత చేసెదము హాయిగ మారు వివాహమన్న యా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    నాతి యొకర్తె రేబవలు నచ్చెను నాకని చాకలేట్లు కే
    కుల్ తినె పాలకోవ రసగుల్ల జిలేబ్లు గులాబిజామ్ల తో;
    రోతగ పెంచి కాయమును ,రూపసి యయ్యె నదేమి మందుమా
    కోతిని ,పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    రిప్లయితొలగించండి
  11. నాతిని భాగ్యవంతుడని నాయకుడైన కురూపివానికిన్
    ప్రీతిగనివ్వదల్చి కడువేడుక పెండిలి నిశ్చయించగన్
    ఆతడు బుద్ధిమంతుడని యాపురవాసులుసంతసించగా
    కోతిని పెండ్లి యాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

    రిప్లయితొలగించండి
  12. ఈతరమందు విద్య సహజీవన మట్లుగ సాగుచుండగా?”
    కోతియు చేష్టకున్ నొకని”కోతిగబిల్చుచు విద్యసాగగా”|
    జాతక రీతిగా తగును”జానకటంచును పెద్ద లెంచగా?
    కోతిని పెండ్లి యాడె నొక కోమలి స్నేహితు రాండ్రు మెచ్చగా|

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    షట్పాది:
    జాతికి "నొక్క యప్సర"యె, శాపవశమ్మున "నంజనాఖ్య"యై,
    కూఁతురుగా జనించె కపి "కుంజర" నామక సౌమనస్వికిన్!
    భాతిగఁ బ్రత్యహమ్ము గుణవర్ధని యౌచును నుండ, నొక్కెడన్
    గౌతుకమొప్పఁగా సఖులు కూర్మినిె వెన్కొనఁ గాన కేఁగి, తా
    భీతిలె హస్తిఁ జూచి! కని వేగమె, "కేసరి" దానిఁ జంప, నా
    కోఁతినిఁ బెండ్లియాడె "నొక కోమలి" స్నేహితురాండ్రు మెచ్చఁగా!!

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గారూ , నమస్సులు.
    ఈనాటి సమస్య ' కోతిని పెండ్లియాడె ....' నా ? లేక ' కోతినిఁ బెండ్లియాడె...' నా ?
    ఈనాటి సమస్యలో , తత్సంబంధమైన రాళ్లబండి వారి పూరణలో ఒక చిన్న వైరుధ్యముంది. ఇది కవిబృందానికి ఉత్తరోత్తర సమస్యా పూరణల్లో ఉపయోగపడుతుంది. కవికి సూక్ష్మ దృష్టి అవసరం.
    సమస్యా పృచ్ఛకుడు ' కోతిని పెండ్లియాడె ' అన్నాడా , ' కోతినిఁ బెండ్లియాడె ' అన్నాడా గమనించడం అవధానికి చాలా అవసరం. ఇక్కడే సమస్య నూరు శాతం పూరించబడినట్టే అవుతుంది .

    నిజానికి ద్వితీయా విభక్తి పరంగా ఒక కోతిని ఒక కోమలి పెండ్లాడింది అనే అర్థం వచ్చేలా సమస్య ఇస్తే , ' కోతినిఁ బెండ్లియాడె ' అనే రూపంలోనే ఇవ్వవలసి ఉంటుంది."కోతిని పెండ్లియాడె" అనడం వ్యాకరణ సమ్మతం కాదు. అప్పుడు రాళ్లబండి వారు మందు మాకో తిని "పెండ్లియాడె" అనవలసి ఉంటుంది కానీ సమస్యలో సూచించినట్లుగా మందు మాకో తినిఁ బెండ్లియాడె అనలేరు , అనకూడదు. ఎందుకంటే - కోతినిన్ అనే పదం - ద్వితీయా విభక్తి నకారపు పొల్లు లోపించి ' కోతినిఁ బెండ్లియాడె ' అవుతుంది. ' తిని ' అనే పదం కేవలం కళ. అసమాపక క్రియ. తిని తరువాత అరసున్న రాదు.

    ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈనాటి సమస్య పాదం అర్థవంతంగా ఉండాలంటే ' కోతినిఁ బెండ్లియాడె..... ' అని ఇవ్వవలసి ఉంటుంది కానీ ' కోతిని పెండ్లియాడె...' అని కాదు. ఫలానా మందు మాకో తిని ....పెండ్లియాడె అని పూరించతగదు కూడా. తెలుగులో అరసున్నల ప్రాధాన్యం విస్మరించలేనిది.

    రిప్లయితొలగించండి
  15. నీతిగ నిల్వబోక-అవినీతను చెట్టును యెక్కి దూకుచున్
    జాతికి చెప్పి చేయక-?ప్రజాహిత మంచును పార్టి మారుచున్
    తాతల ఆస్తి పాస్తులను అల్లరి మూకల బెంచ బూను-ఆ
    కోతిని పెండ్లియాడె నొక కోమలి-స్నేహితు రాండ్రు మెచ్చగా|---

    రిప్లయితొలగించండి
  16. సుకవి పండిత మిత్రులు డా.విష్ణునందన్‍గారికి నమస్సులు!

    మీరన్నది నిజమే! నేను నా పూరణమున ద్వితీయాంతముగనే ప్రకటించితిని. మఱొక విషయ మేమనగా, "కోతి" శబ్దముయొక్క సరియైన రూపము "కోఁతి" కదా! ఇదియును గమనార్హమనుకొందును! అట్లు కాక శ్రీ శంకరయ్యగారిచ్చిన సమస్యను ఆలాగుననే తీసికొన్నచో...దాని నిట్లుకూడా పూరింపవచ్చును.

    నా మఱొక పూరణము:

    (పరిశీలనా జ్ఞానము చక్కఁగా లేని యొక కోమలి చేష్ట)

    "తాతనుఁ బెండ్లి చేసుకొనె" దంచునుఁ బోవుచు దారిఁ దోఁటలోఁ
    గాఁతయుఁ గాఁచి, గొప్ప వడగాలికి రాలిన మావికాయలన్,
    జూత సుగంధపున్ సొగసు స్రుక్కగఁ గాంచియొ, దానిఁ గానలే
    కో, తిని, పెండ్లియాడె నొక కోమలి, స్నేహితురాండ్రు మెచ్చఁగా!

    రిప్లయితొలగించండి
  17. కవిశ్రీ సత్తిబాబు గారి పూరణ....
    కోతులు పూర్వులైనవిధి కోతుల చేష్టలు మానరెవ్విదిన్
    పాతక బుద్దులెల్ల తగుపాళ్ళను మించుచు కూడియుండగన్
    నీతులు జెప్పినన్ వినక నేరము మానని కోతిమూకలో
    కోతిని పెండ్లియాడె నొకకోమలి స్నేహితు రాండ్రు మెచ్చగా.

    రిప్లయితొలగించండి
  18. డా. విష్ణునందన్ గారూ,
    సమస్యను విశ్లేషించి సర్వోపయోగమైన విషయాన్ని వివరించిన మీ సునిశిత పరిశీలనా సామర్థ్యానికి నమోవాకాలు. ఇకనుండి సమస్యను ఇచ్చేముందు ఒకటికి రెండుమార్లు పరిశీలించి ఇస్తాను. ధన్యవాదాలు.
    అందరిచేత ‘గురువుగారూ’ అని పిలిపించుకుంటున్న నాకే ఈ విషయం తట్టలేదంటే మిగతా ఔత్సాహికకవులు ఎంత? ఈరోజుకు ఇలా కానివ్వండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో ప్రాసదోషం. ‘చాకలేట్లొ కే|కో తినె పాలకోవ రసగుల్ల జిలేబి గులాబుజాములన్’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణ మొదటిపాదంలో యతి తప్పింది. ‘జానకి+అటంచును’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    రెండవపూరణలో ‘అవినీతి+అను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
    *****
    కవిశ్రీ సత్తిబాబు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులకు సూచన...
    మీరు వ్యాఖ్యను టైపు చేసిన తర్వాత క్రింద ‘నేను రోబోటును కాను’ అన్న దానిని పట్టించుకోకండి. క్రింద ఉన్న వ్యాఖ్యను ప్రచురించండి అన్నదానిని క్లిక్ చేస్తే చాలు.

    రిప్లయితొలగించండి
  20. ఘాతము చేతకుంటిదయి,కన్యక యోర్తుక,పెండ్లియాడగా
    వే,తను జూచి యందరును వీడగ,వేసరి,యొక్కచోట తా
    కోతిని బోలు నందమును కూడియు,బుద్ధిని నందగాడు నౌ
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    వే తను భర్తగా రుమయు,వెల్గెడి సూర్యుని తేజమందు నా
    కోతిని సూర్యసూను గని,గొప్పగు నాతని లక్షణంబులన్
    భాతిగ నెంచి,వానరుని భర్తగ పొందెను కీర్తిమంతుడా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    కోతినిబోలు రూపయిన కోమల మైనను మానసంబదే
    భాతిగ నెంచకుండగను,వానిని నందవిహీనుడంచు వే
    తా,తలపోతు రెంతయును,తన్వులు మంచినిగాంచి రూపునన్
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    వే తలపోసి భామినులు,పెద్దగ నేడిల సంపదుంటయే
    భూతలమందు మేలునని,పొల్పుగ నెంచియు పెండ్లియాడరే
    కోతిగ రూపమైన,వరు గొప్పగ నాశలు దీరునంచు తా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ గుండు మధుసూదన్ గారూ , మీరు అర్ధానుస్వార ప్రయోగోచితానుచితాల మర్మమునెరిగిన వారు! తదనుగుణమైన మీ మొదటి పూరణ రసజ్ఞ పఠితృజన రంజకమైనదే !

    శ్రీ శంకరయ్య గారూ ,మీ విషయంలో ఇది నిస్సందేహంగా ' ప్రమాదో ధీమతామపి ' అని నేనెరుగుదును ...కనుక ఆ విషయం అక్కడికి వదిలేస్తే, ఇక్కడ శంకరాభరణ వేదిక మీద కవితాగానం చేసే ఔత్సాహిక కవిబృందానికి ఇవ్వదగిన సూచన ప్రకారం ఇది ద్రుతాలకు , కళలకు సంబంధించిన విషయం. ద్రుతమెక్కడ వస్తుందో తెలిస్తే అంతే సులువుగా కళాస్వరూపం పట్టుబడుతుంది.అలాగే ద్రుతాంతమైన పదాలు తెలుసుకున్న వారు అనవసరమైన తావులలో యడాగమ ప్రయోగం కూడా పరిహరించగలరు . కనుక మీ అనుభవ రీత్యా ద్రుతం, కళల గురించి పాఠాల వరుస మొదలు పెడితే , ఇప్పటికే పద్యమల్లడం నేర్చుకున్న కవిబృందానికి నిర్దోషమైన పద్యనిర్మాణంలో మరొక్క మెట్టు అధిరోహించడానికి ఉపయోగపడుతుంది కదా !

    రిప్లయితొలగించండి

  22. భ్రాతలు వాలి, భానుజుడు, భ్రాజిత రీతిని అక్క అంజనన్
    పూతచరిత్రు కేసరికి పోడిమి భార్యగ నిశ్చయించగా
    ప్రీతి మహర్షులున్, దివిని వేల్పులు దీవెనలందజేయ, నా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

    రిప్లయితొలగించండి
  23. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    కొన్నిలోపాలున్నా మూడవపూరణలో ‘తా తలపోతు రెంతయును’ అన్నదే ముఖ్యమైన దోషం. ‘తాన్’ అని అది ద్రుతాంతం. ‘తాఁ దలపోయు’ అనాలి. తలపోతురు అని బహువచనాన్ని ప్రయోగించారు కనుక ముందు తాము ఉండాలి.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు. మీ సూచనకు వీలైనంత తొందరగా కార్యరూపం ఇస్తాను. (ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉన్నాను. నా వ్యాకరణ పుస్తకాలేవీ అందుబాటులో లేవు).
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. చేతలు కోతివంటివని చిన్నతనమ్మున గేలి చేయుచున్
    బ్రాతలు తాతలున్ బిలుచు బావను కోతిగ దాను పిల్చుచున్
    ప్రీతిగ నెచ్చెలుల్ బొగడ ప్రేమను బంచగ బ్రాయమందు నా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    రిప్లయితొలగించండి
  25. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోతి+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘కోతిగ బిల్చుచున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  26. బొడ్డు శంకరయ్య గారూ,
    ఇప్పుడు బాగుంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  27. సాహితీ మిత్రులు డా.విష్ణునందన్‍గారూ! మీ మెచ్చుకోలునకుఁ గృతజ్ఞతలు. అర్ధానుస్వారము విషయమున నేనును బ్రారంభకుఁడనే యయినను నిఘంటువుల, కావ్యప్రయోగముల సాహాయ్యమున నెంతయో కొంత జ్ఞానమును సంపాదింపఁ గల్గితిని. మీవంటి జ్ఞానవృద్ధు లప్పుడప్పు డిట్లు తెలుపుచుండుట మా బోంట్లకు సహాయకారి కాఁగలదు. ధన్యవాదములు! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. గురుదేవులకు ధన్యవాదములు.
    రెండవపాదం కొద్దిపాటి సవరణతో :
    పాపాతకమేమి చేసితినొ భాగ్యమదెట్టుల నుండబోవునో?
    జాతకరీతి తప్పదన శాంతిని గూర్చెడు దారిఁ జూప రే
    పాతని బొందు మున్మునుపె బాపడు దోష నివారణమ్మనన్
    గోతిని బెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  29. మిత్రులు నాగరాజుగారూ!

    ద్రుతమనఁగా నకారము. (1) నకారము చివరనున్న పదముల తదుపరి క,చ,ట,త,ప-లతో మొదలగు పదములు వచ్చినచో, ఆ కచటతప-లు గ,జ,డ,ద,బ-లుగ మారును. (2) అట్లు మారిన గజడదబ-లకు ముందున్న ద్రుతము బిందువు(సున్న/అరసున్న)గా మారును.

    ఉదా. కోతినిన్ + పెండ్లియాడె
    > (1) కోతినిన్ + బెండ్లియాడె
    > (2) కో్తినిఁ బెండ్లియాడె/కోతినిం బెండ్లియాడె
    ....ఈ విధముగ రూపములు వచ్చును.
    ఇవి కాక సంశ్లేష రూపము కూడ నొక్కొక్కమాఱు...అనఁగా...
    ....కోతినిన్బెండ్లియాడె...అను రూపమును రాఁగలదు.
    అనుభవము సిద్ధించినకొలఁది ప్రయోగము తేలికయగును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  30. ఆతడనేక మానినులయాశల సౌధము, పైడిబాతువున్
    ఆతని జేరగా దలచి యక్కట! రూకలఁబొందఁ గోరి, యా
    బూతుల రేని, నాకృతికి బుష్పశరుండు గుణమ్ములెంచినన్
    కోతిని, పెడ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

    రిప్లయితొలగించండి
  31. నమస్కారములు
    ఇన్ని తప్పులను ఓపికతో సవరణ జేసినందులకు గురువులకు ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి
  32. నాగరాజు రవీందర్ గారూ,
    ద్వితీయావిభక్తిలో ‘కోతిన్, కోతిని, కోతినిన్’ అని మూడు రూపాలున్నాయి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ....

    ఆతని నామమే హనుమ యాతని వన్నియు కోతి చేష్టలే
    ఆతని మేము కోతి యని యందుము కాని వరించె నెట్టులో
    యాతని కోతి చేష్టలకె యబ్బురమొందియు కట్నమీయకన్
    కోతిని పెంద్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

    (కోతిని పెండ్లి యాడటం వరకు బాగానే ఉన్నది. కానీ స్నేహితురాళ్లెందుకు మెచ్చారు ? కట్నం లేకుండా చేసుకున్నది కాబట్టి)

    రిప్లయితొలగించండి
  34. ధనికొండ రవిప్రసాద్ గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. ప్రీతిగ సంపదన్ వలచి రీతిగ రూపసి జాలమల్లి తా
    కోతిని పెండ్లియాడె;..నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా
    జాతక మిద్దియే ననుచు జాప్యము జేయక దీనిలో మహా
    పాతక మేమిలేదని ప్రభాకర శాస్త్రిని పెండ్లియాడెగా!!!

    రిప్లయితొలగించండి
  36. కోతుల వేడుకందునను గోవులు లేళ్ళును దున్నపోతులున్
    చేతులు చేతులన్ కలిపి చెన్నుగ కాకులు కోయిలమ్మలున్
    నేతలు సింహముల్ పులులు నిక్కుచు రాగను డింపులుండెడిన్
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    రిప్లయితొలగించండి