19, జూన్ 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1707 (నందమూరి రామారావు నటుఁడు గాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

నందమూరి రామారావు నటుఁడు గాఁడు.

29 కామెంట్‌లు:

  1. విశ్వవిఖ్యాతుడై యిల వెలసినట్టి
    నందమూరి రామారావు నటుడు - గాడు
    పుకొడుకుగ నటియించి తా పొందె మెప్పు
    పాండవవనవాసమునందు ప్రజలచేత

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్రుల కభిమా నముగల యంద మైన
    నంద మూరి రామారావు నటుఁడు గాఁడు
    రాజ కీయపు రణమున మోజు పెరిగి
    లక్ష్మి పార్వతి మాటున రాలి పోయె

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఆంధ్రుల - అందాల, ఆరాధ్య
    ఆటకాడు - అన్నగారు
    విశ్వవిఖ్యాత నటసార్వబౌముడు
    నందమూరి తారక రామారావు :

    01)
    _______________________________

    "నందమూరి రామారావు నటుఁడు గాఁడు"
    నందమూరి రామారావు - నడుమ, నుంచి
    పదము" తారక " ; తొలగించ - వలయు "గాడు"
    పిదప చదివిన దొరకును - బిరుదుమగడు

    విశ్వ విఖ్యాతు డైనట్టి - వినయశీలి
    తెలుగు తేజము దశదిశల్ - వెలుగు నటుల
    దీప్తిమంతము జేసిన - ధీరవరుడు
    నాంధ్ర యందాల యారాధ్య - యాటకాడు
    నాంధ్ర హృదయాల చిరజీవి - యన్నగారు !
    _______________________________
    ఆటకాడు = నటుడు

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ‘కాఁడు’ గసడదవాదేశం వల్ల ‘గాఁడు’ అయింది. మీరు అరసున్నాను గమనించలేదనుకుంటాను. ‘గాడుపు’లో అరసున్నా ఉండదు. మరో ప్రయత్నం చేయండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    రాజకీయరంగంలో నటించలేకపోయాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    మీ పూరణ బాగున్న్దది. అభినందనలు.
    కొసరు పద్యంలో ‘ఆరాధ్య ఆటగాడు’ అనడం దుష్టసమాసమే. ‘ఆరాధ్యు డాటగాడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. నంద మూరి రామారావు నటుఁడు గాఁడు
    బహుముఖ ప్రజ్ఞలఁ వెలుగు భాస్కరుండు
    మానధనికుండు మాటల మాంత్రికుండు
    నవ్య భావనా స్ఫోరక నాయకుండు

    రిప్లయితొలగించండి
  6. అనగ ' దేవుని ' యాంగ్లమ్మునందు " గాడు "
    తెలుగు వారికి నావెండి తెరల ఱేడు
    పిచ్చి యభిమానమే పెంచ, పిలుతు రిట్లు
    నందమూరి రామారావు " నటుడు - గాడు "

    రిప్లయితొలగించండి
  7. ఆత్మ సౌందర్యమందున- నసమ దివ్య
    సహృదయావిష్కరణమున - సకల జన శు
    భేప్సితంబున- సత్య వాక్ ప్రీణనమున-
    నందమూరి రామారావు నటుడు గాఁడు

    రిప్లయితొలగించండి
  8. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ‘వెరైటీ’గా ఉంది. అభినందనలు.
    కాని గాడ్ (God)లో అరసున్నా లేదే!
    *****
    విజయకుమార్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అన్నిపాత్రలన్ జీవించి యద్భుతముగ
    విశ్వవిఖ్యాతి గాంచిన విదురుడతడు
    నందమూరి రామారావు నటుడుగాదు
    దేవుడంచును పూజింత్రు తెలుగు వారు

    రిప్లయితొలగించండి
  10. ధన్యవాదములండీ...మాస్టరు గారూ..ఇంగ్లీషు గదండీ కొన్ని సైలెంట్ గా ఉంటాయి....( సరదాకి )

    రిప్లయితొలగించండి
  11. నందమూరి రామారావు నటుఁడు గాఁడ
    తండు కేవలము, తెలుగు తల్లి ముద్దు
    బిడ్డ డాతడు మన బాస విరులతావి
    మాననీయుడు మా ముఖ్య మంత్రి యతడు.

    రిప్లయితొలగించండి
  12. నంద నందను వేషాన సుందరుండు
    నందమూరి రామారావు! నటుఁడు కాఁడు
    భువి జగన్నాటకంబాడ పుట్టెననెడు
    ద్వారకాపురి నేలెడు శౌరి వాడె!

    రిప్లయితొలగించండి
  13. నటన యందున శ్రే ష్టు డు నటికు లందు
    నంద మూరి రామారావు ,నటుడు గాడు
    గాన మాధుర్య ముగల యా ఘంట సాల
    కాన నొక్కరి కొక మేటి కళ యుండు

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నటుఁడు గాఁడు -> నటుఁడు గాదు...టైపాటా?
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తెలుగులో మనకున్న ఏకైక ‘సైలెంట్’ అక్షరం అరసున్నా. కనిపిస్తుంది కాని వినిపించదు. మీరేమో దాన్ని కనిపిండకుండానే చేశారు (నేనూ సరదాకే!)
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారి, మరియు గోలి వారలవైన
      యర్ధ సున్నలకడనాడిన చిరు
      సరస గడుసు తీపి సరదాల కజ్జాలు
      వినుటకింపు కనగ వేడ్క నుండె
      కజ్జము : తీపి భక్ష్యము

      తొలగించండి
    2. గురువు గారి, మరియు గోలి వారలవైన
      యర్ధ సున్నలకడనాడిన చిరు
      సరస గడుసు తీపి సరదాల కజ్జాలు
      వినుటకింపు కనగ వేడ్క నుండె
      కజ్జము : తీపి భక్ష్యము

      తొలగించండి
  15. నందమూరి రామారావు నటుడు గాడు
    అనగల వినగలుగుటన?అరుదునేడు
    రామ,కృష్ణ,దుర్యోధన ,రాజుపాత్ర
    సాటి రారెవ్వ రాంధ్రలో పోటీయందు|
    2.నందమూరి రామారావునటుడుగాడు
    నేటికాలాన జూడగ ?”చాటుగున్న
    సార్వ భౌముడు నటనలో సాటిరారు”
    నవరసాలను బంచిన నటుడు నాడు

    రిప్లయితొలగించండి
  16. ధీర నేత "నందమూరి రామారావు
    నటుడు గాడు"పాలనంబు నందు
    వెండి తెరను వేయి వెల్గులు జిమ్మిన
    తెల్గు నాయకుండు ధృత యశుండు.

    రిప్లయితొలగించండి
  17. ప్రజలు బూజించు కృష్ణుడు రాముడతడు
    తెలుగు వారికి యన్నగా వెలిగె నతడు
    నందమూరి రామారావు నటుడు గాడు
    గొప్ప నాయకునిగ మెప్పు గొనెనతండు!!!

    రిప్లయితొలగించండి
  18. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘నటుఁడు గాఁడు+అనుటను’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. ‘నటుఁడు గాఁ డ|నంగ వినగలుగు టనగ...’ అందామా?
    *****
    దువ్వూరి రామమూర్తి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. తేటగీతి సమస్యను ఆటవెలదిలోనికి ప్రవర్తింప జేసిన నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వారికి నన్నగా...’ అనండి.

    రిప్లయితొలగించండి

  19. నందమూరి రామారావు నటుడు కాడు!!
    రామ,కృష్ణ,దుర్యోధన,రావణ ,శివ,
    వేంకటేశు పాత్రలను జీవించినాడు
    అర్చనలనందె నతడు దేవాలయముల

    రిప్లయితొలగించండి
  20. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    రామ రావణ కృష్ణుల రాజసమును
    దుష్ట దుర్యోధనుడు కర్ణ దుడుకుజూపి
    కదలు చుండిరి వారలే కనుడటన్న
    నందమూరి రామారావు నటుఁడు గాఁడు.

    తెలుగు దేశ పతాకమ్ము దేశమందు
    వెలుగ ,భాషకు కీర్తిని విలువ నొసగి
    యావదాంధ్రుల ప్రగతికి త్రొవజూపు
    నందమూరి రామారావు నటుఁడు గాఁడు.

    రిప్లయితొలగించండి
  21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జీవించినాడు+అర్చనల’ అని విసంధిగా వ్రాసినారు. ‘జీవించి జనుల| అర్చనల...’ అనండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘కర్ణ దుడుకు’ అనకుండా ‘కర్ణు దుడుకు’ అనండి.

    రిప్లయితొలగించండి
  22. శంకరయ్య గారికి నమస్కారములు. మేరు సూచించినట్లుగా పద్యమును సవరించితిని

    నందమూరి రామారావు నటుడు కాడు!!
    రామ,కృష్ణ,దుర్యోధన,రావణ ,శివ,
    వేంకటేశు పాత్రలను జీవించి జనుల
    అర్చనలనందె నతడు దేవాలయముల

    రిప్లయితొలగించండి
  23. ముఖ్యమంత్రిగా నతడు ప్రాముఖ్యతనిడి
    తెలుగు భాష నాచరణకు తెచ్చినాడు
    రాజకీయము నందు విరాజితుడు
    నందమూరి రామారావు నటుఁడు గాఁడు

    రిప్లయితొలగించండి
  24. నందమూరి తారక రామ నటనగాంచ?
    రావు-వేరెవరికి రావు భావపటిమ
    నందమూరి రామారావునటుడు గాడు
    వారి వంశజు డైనట్టి వేరువటుడు

    రిప్లయితొలగించండి
  25. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. శంకరార్యా ! ధన్యవాదములు !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  27. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి