20, జూన్ 2015, శనివారం

సమస్యా పూరణము - 1708 (ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని.

35 కామెంట్‌లు:

  1. పాండవాగ్రజుండనుచు నెవరిననెదరు?
    కుంతి యతనికేమగు? నూరుగురు సుతులకు
    తల్లి ఎవరు?దుర్మార్గులౌ ధార్తరాష్త్రు
    లకు సుబలుడేమగును ? సుబల సుతుడెవరు?
    ధర్మజుని - తల్లి గాంధారి - తాత - శకుని

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అవి నాటకమున గాదు
    నిజజీవితములోని - పేళ్ళు మరియు చుట్టరికమూను :

    01)
    _______________________________

    "న్యాయ పోరాట" మను నొక - నాటకమున
    నటన జేసిరి ముగ్గురు - నయముగాను
    వరుస జూచిన వారంత - బంధువు లగు
    ధర్మజుని తల్లి గాంధారి - తాత శకుని !!!
    _______________________________

    రిప్లయితొలగించండి
  3. గంత లనుగట్టె పినతల్లి కన్ను లుండి
    మాయ జూదము నోడించె మామ శకుని
    సుబలు డనురాజు సంతతి సోయ గమున
    ధర్మజుని, తల్లి గాంధారి తాత శకుని
    కనిక రించక బంపిరి కాన లందు

    రిప్లయితొలగించండి
  4. గాంధారి - హస్తినాపురపు రాణి యే
    గాక పెదతల్లి కూడా గదా - ధర్మజునకు :

    02)
    _______________________________
    తల్లి , యత్తయు , రాణియు - నన్నభార్య
    మరియు గురుపత్నియును పంచ - మాతలౌట
    ధర్మజుని తల్లి గాంధారి ! - తాత శకుని
    యగును పాండవ సుతులగు - నర్భకులకు !
    _______________________________
    అర్భకుఁడు = బాలుఁడు
    పంచ మాతలు : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
    కన్న తల్లి, భార్యను కన్న తల్లి (అత్త), రాజు భార్య, గురువు భార్య, అన్న భార్య

    రిప్లయితొలగించండి
  5. క్రమము పేర్చి జవాబుల - గలపి చదువ :

    03)
    _______________________________

    కర్ణు త్యజియించె నెవ్వాని - గన్నతల్లి ?
    కనుల గంతలు తా కోరి - కట్టె నెవరు ?
    గాంగు డేమగు పాండవ - కౌరవులకు ?
    కపట దేవన నెవడు తా - కార్యకాడు ?
    ధర్మజుని తల్లి - గాంధారి - తాత - శకుని !
    _______________________________
    గాంగుడు = భీష్ముడు
    దేవన = ద్యూతము

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నాటకమ్మున పోషింఛె నాడు జూడ
    మాదు పినతల్లి, యత్తమ్మ, మామ, యన్న
    పాత్రలివి మెచ్చ జనమంత బాగుగాను
    ధర్మజునితల్లి, గాంధారి, తాత, శకుని
    ( తాత = భీష్ముడు )


    రిప్లయితొలగించండి
  8. ధర్మజుని తల్లి యెవ్వరు?తాత యెవ్వ
    రంచు ప్రశ్నించ శిష్యుని నయ్యవారు
    చెప్పె బదులిట్లుమదిని యోచించకుండ
    ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని.

    రిప్లయితొలగించండి
  9. వసంత కిషోర్ గారూ,
    'కార్యకాడు'అనేది మిశ్రమ సమాసంలా కన్పిస్తోంది. కార్యశాలి, కార్యరతుడు లాంటి సమాసాలు సరియేమో. నా అభిప్రాయం తప్పయితే సరిదిద్ద గలరు.అయితే అందమైన మిశ్రమ సమాసాలు ప్రయోగింప వచ్చనేది నా ప్యక్తిగత అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  10. నేను కూడా విజయ కుమార్ గారితో ఏకీభవిస్తాను.
    ' వాక్యం రసాత్మకం కావ్యం' కాబట్టి ఆభరణం ,అందంగానూ, అమలిన బంగారం తోనూ కూడినదైతే, చిన్నపాటి మచ్చ కూడా అందంగా ఉంటుందేమో! కానీ అది చాలా చాలా తక్కువగా వాడాలి. లేకుంటే కవన విశృంఖలత కు దారి తీసి వికారమౌతుందని నా పరిమిత బుద్ధికి తోచిన ఆలోచన.
    అధిక ప్రసంగానికి, క్షంతవ్యుణ్ణి

    రిప్లయితొలగించండి
  11. కుంతి భోజుని పుత్రిక కుంతి యెవరు?
    కౌరవుల తల్లి పేరేమి భారతమున?
    మాద్రి మనుమల కేమగు మామ శకుని?
    సుబలుని తనయు డెవ్వరు సుంత చెపుమ?
    ధర్మజుని తల్లి , గాంధారి , తాత , శకుని !!!

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా ! ధన్యవాదములు !

    విజయకుమార్ గారికి ధన్యవాదములు !

    మూర్తి వై ఎస్ ఎ ఎన్ గారికి ధన్యవాదములు !

    మిత్రులకు విన్నపం !

    "కార్యకాడు " అన్న సమాసం నేను సృష్టించినది కాదు !
    ఆంధ్రభారతి నుండి గ్రహించినదని గ్రహించగలరు !

    కార్యశీలుడు
    కార్యకర్త : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

    ఉత్కలుడు, కర్మఠుడు, కారయిత, కార్యకాడు, కార్యదక్షుడు, కార్యదర్శి, కార్యశీలుడు,
    కార్యసాధకుడు, తాళీకుడు, దాళీకుడు, ధురీణుడు, నిర్వర్తకుడు, నిర్వాహకుడు,
    నైర్వాహికుడు, పొలమరి, ప్రయోజకుడు, ముదిసెలి, వితమరి, సంప్రసారుడు.

    రిప్లయితొలగించండి
  13. కాదు కాదయ్య వినుమార్య ! కాదుకాదు
    ధర్మజుని తల్లి గాంధారి , తాత శకుని
    కాదు ముమ్మాటికి నసలే కాదు నమ్ము
    ధర్మజుని తల్లి కుంతియ తాత కుంతి (భోజుడు )

    రిప్లయితొలగించండి

  14. కుంతి దేవి యెవని తల్లి? గ్రుడ్డిరాజు
    సతియెవరు? పిలుతురేమని శాంతనవుని?
    మాయ పాచిక లాడిన మామ యెవరు ?
    ధర్మజుని తల్లి, గాంధారి, తాత, శకుని.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    దువ్వూరి రామమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    కేవలం బి.యన్.రెడ్డి గారు తప్ప మిగతా నిఘంటుకారు లెవ్వరూ ‘కార్యకాడు’ శబ్దాన్ని ప్రస్తావించలేదు. దాని సాధుత్వం సందేహమే... ‘కపట దేవన’ అన్నదీ అర్థం కాలేదు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    తాత కుంతి(భోజుడు)... అని ప్రయోగించడం సబబేనా అని అనుమానం.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కౌరవుల యింట కుములుతు గడిపె నెవరు
    కనుల గంతలు కట్టిన కాంత యెవరు
    మహిళ గాంధారి మనుమ లేమంద్రు శకుని
    ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని.

    చూడుడు :-.మూడవ పాదమును క్రింది విధముగ మార్చ వచ్చు
    మనుమ లేమని పిలుతురా ''మామ శకుని''
    ఉత్తరభారత దేశంలో కుయుక్తులు పన్నినవానిని
    ''శకుని మామ''అంటారు

    రిప్లయితొలగించండి
  17. పార్థు సుతుని గూల్చగఁగౌరవాదులనిన
    తాను సుతులనోదార్చుచుఁ దల్లడిల్లె
    ధర్మజుని తల్లి, గాంధారి, తాత శకుని
    మనవడిని గూర్చి తెలుపగ మధనపడియె.

    రిప్లయితొలగించండి
  18. శ్రీకే.యస్ గురుమూర్తి గారిపూరణ
    భీష్ముతో చెప్పి రిట్టుల పెక్కుమార్లు
    ధర్మజుని తల్లి, గాంధారి-తాత"శకుని
    మట్టుబెట్ట జూచు యిరువంశములుగూడ
    మందలించుము-నీవుదుర్మతినినేడె"

    రిప్లయితొలగించండి
  19. కుంతి యెవరంచు నిజముగ గొప్ప జెప్ప
    ధర్మజుని తల్లి, గాంధారి తాత, శకుని
    కైన తాతయే యౌనని యనగ వచ్చు
    సరిగ జెప్పంగ గురువర్య శంకరయ్య

    రిప్లయితొలగించండి
  20. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    నేనునుం గ్రమాలంకారమునే యాశ్రయించితిని!

    నా పూరణము:

    కంకుఁ డని పిల్తు రెవని? నిన్ గన్న దెవరు?
    తానె గంతలం గొనె నేరు? తండ్రి తండ్రి
    నేమి యనవలెఁ? గౌరవహితుఁ డెవండు?
    ధర్మజుని-తల్లి-గాంధారి-తాత-శకుని!

    రిప్లయితొలగించండి
  21. నా మఱియొక పూరణము:

    (కన్నీరుఁ గార్చుచు గాంధారి ధర్మజునితోఁ దన కుమారులఁ గూర్చి పలికిన సందర్భము)

    కంట నీరొల్కఁ బల్కె నక్కడనుఁ జూచి
    ధర్మజుని, తల్లి గాంధారి, "తాత! శకుని,
    నాదు కొమరుల మనముల నాది నుండి
    మార్చివైచెను గాన దుర్మార్గులైరి!"

    (తాత! = నాయనా!)

    రిప్లయితొలగించండి
  22. తే.గీ: గంగలో సుతుఁ విడిచిన కన్న దెవరు?
    కౌరవులు నూరుమందిని కన్నదెవరు?
    మాయజూదమాడించిన మామ యెవరు?
    ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని.

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా ! ధన్యవాదములు !

    నిఘంటువుల్లో కూడా తప్పులుంటే - దిద్దగల
    పరిఙ్ఞానం గాని పరిణితి గాని నాకు లేవు !

    దేవన = ద్యూతము
    అని పద్యం క్రిందనే అర్థం వ్రాసినా మీ కర్థం కాలేదంటే
    నేనేమి చెయ్య గలను ???

    ఇదికూడా ఆంధ్రభారతి నుండి గ్రహించినదే

    జూదము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

    అంధిక, అక్షగ్లహము???, అక్షతత్వము, అక్షద్యూతము, అక్షము, అక్షవతి,
    అక్షవిద్య, ఆదేవనము, కైతనము, జూజము, కుదోదరము, దేవన, దేవనము,
    ద్యూతము, ద్యూతి, నెత్తము, పణాయ, పాచికలాట, పాళి, వ్యవహారము.

    రిప్లయితొలగించండి
  24. వసంత కిశోర్ గారూ,
    సర్వాపరాధిని... మౌజ్ చక్రం తిప్పుతూ ఆ పద్యం వరకే ఆపి, క్రింది మీ వివరణ చూడకుండానే వ్యాఖ్యానించాను. క్షమించండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో ‘చూచు+ఇల= చూచు నిల’ అవుతుంది.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్త్గి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో ‘సుతుల’ను ‘తుసుల’ అన్నారు. అక్కడ సుతుల అన్నా, తుసుల అన్నా యతి తప్పుతున్నది.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు వైవిధ్యంగా, మనోరంజకంగా ఉన్నాయి. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తాత’ను వదలి వేసినట్టున్నారు... మొదటిపాదాన్ని ‘గంగలో సుతు విడిచిన కాంత యెవరు’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  25. పాండ వాగ్రజు డందురె వనిని? సుత శ
    తమును గన్నది? తండ్రికి తండ్రెవండు?
    కౌరవుల మేనమామకే పేరు కలదు?
    ధర్మజుని-తల్లి గాంధారి-తాత-శకుని.

    రిప్లయితొలగించండి
  26. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. 1సుతుల కాపాడనెంచిన సుదతియెవరు?
    ధార్తరాష్ట్రనిభార్య?2.ఉదారభీష్ము
    డెవరు?3.మంచిచెడ్డను-బంచెనెవరువారు?4
    1]ధర్మజునితల్లి2]గాంధారి3]తాత4]శకుని.

    రిప్లయితొలగించండి
  28. తే.గీ: గంగలో సుతుఁ విడిచిన కాంత యెవరు?
    కౌరవులు నూరుమందిని కన్నదెవరు?
    మాయజూదమాడించిన మామ యెవరు?
    ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని !

    రిప్లయితొలగించండి
  29. ధర్మజుని తల్లి,గాంధారి,తాత,శకుని
    కలసి జీవించి రొకనాడు కలసి మెలసి
    శకుని మంచిశత్రువుగాగ?శాంతి లేక
    జూదమందున వేరైరి|మోదమున్న.

    రిప్లయితొలగించండి
  30. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. పాండు విభునికి పత్నియౌ పడతికుంతి
    ధర్మజునితల్లి,గాంధారి తాత శకుని
    యౌను తాత పేరును గనుటిది రివాజు
    నగునుగాన,శకుని యౌను నతని తాత

    కుంతి యెవరగు?-(1);ధృతరాష్ట్రు కూర్మిభార్య
    యెవరు?-(2)భీష్ముడు కురులకు నేమి యగును?-(3)
    కౌరవాళికి మామయౌ కనగనెవరు?-(4)
    ధర్మజునితల్లి-(1);గాంధారి-(2)తాత-(3);శకుని-(4)

    తాగియుండియు మత్తున ధాటి బలికె
    నొకడు,నందరు వినుచుండ నొప్పుగాను
    తనకు తెలియు పురాణగాధలవి యనుచు
    ధార్మజునితల్లి గాంధారి తాత శకుని

    మృచ్ఛకటిక శకారుడు మృగమువోలె
    చారుదత్తుని శిక్షింప సరిగ సాక్షి
    తాను ననుచును,పిచ్చిగా తానుపలికె
    ధర్మజునితల్లి గాంధారి తాత శకుని

    రిప్లయితొలగించండి
  32. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    చివరిపూరణలో ‘తానె యనుచు / తా నటంచును’ అనండి.

    రిప్లయితొలగించండి
  33. అయ్యయ్యో ! ఎంతమాట !
    శంకరార్యా ! మీరే నన్ను మన్నించాలి !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  34. యింతి కుంతి భోజుని కూతు రెవరితల్లి?
    తనయులన్ నూర్గురను గన్న తల్లి యెవరు?
    గాంగుడేమగును కుటిల కౌరవులకు?
    కౌరవ కులమ్ముఁగూల్చిన కపటి యెవరు?
    ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని

    రిప్లయితొలగించండి