21, జూన్ 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1709 (సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్.

37 కామెంట్‌లు:

 1. నిన్నేమనవలె? మావా
  ళ్ళన్నను నీకెప్పుడునుచులకనయె మగడా!
  యన్నము తినకనె యాకును
  సున్నమిడవెయన్న మేల చుట్టంబునకున్?

  రిప్లయితొలగించండి
 2. పన్నగమట బంధువ నిన
  తిన్నింటి వాసముల లెఖ తీరును కనగన్
  మిన్నగ ప్రేమను జూపక
  సున్న మిడవె యన్న మేల చుట్టం బునకున్

  రిప్లయితొలగించండి
 3. తిన్నదియె యరుగలేదట
  అన్నము రాత్రికి వలదట యతిధి వరునకున్
  మిన్నగ నాకులు వక్కలు
  సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్||

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  వేశ్యమాత వాసవదత్తతో :

  01)
  _________________________________

  కన్నెల మేటివి నీవని
  వన్నెలదొర మెచ్చె నిన్ను - వాసవదత్తా
  పన్నుగ వక్కాకు మరియు
  సున్న మిడవె యన్నమేల - చుట్టంబునకున్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 5. అన్నము దిని వచ్చితిరట
  సున్నుండలు దెచ్చియివ్వు సుదతీ మరియున్
  మిన్నగు తమలములు చికిని
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్!!!

  చికిని= వక్కపొడి

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. ‘సున్న మిడవె- అన్న(అనిన)- మేలె(మేలా?)’ మంచి విరుపు... అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘తిన్న గృహము వాసములను దివిరి గణింపన్’ అనండి.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. అన్నముదిని వచ్చితినని
  చిన్నగ దానక్క తోడ చెప్పుచు నుండన్
  హన్నా ! యని బావిటులనె
  " సున్న మిడవె యన్న మేల చుట్టం బునకున్"

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులందఱకు నమస్సులు!
  మన పూజ్యగురువులు కీ.శ్రీ.నేమానివారు ఇడక, తినక, చేయక మొదలగు నిషేధాంతములకుఁ జివర నకారము...అనఁగా...ఇడకన్...అను రూపము రాఁగూడదని చెవినిల్లుకట్టుకొని పోరెడివారు. కాని, యిప్పుడు వారు లేరు గాని కొందఱు మిత్రు లిప్పటికిని వాటిని నకారాంతములుగనే వ్రాయుచుండిరి. ఇఁకనుండియైన నట్లు వ్రాయుట మానఁగలరు. మఱొకవిధముగ భావింపవలదని మనవి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. అన్నా ! యేమివి చిత్రము ?
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకు
  న్నెన్నడు పలికితె యిటులుగ
  మిన్నగ మఱి చూడవలెను మేదిని వారిన్

  రిప్లయితొలగించండి
 10. అన్నియు విపరీతములే
  మున్నెరుగము విందులోన ముందుగ నన్నం
  బెన్నక వక్కయు నాకులు
  సున్నమిడవె యన్న మేలె చుట్టంబునకున్?

  రిప్లయితొలగించండి

 11. నున్నని గుండున క్షతమయె
  సున్నమిడవె. యన్నమేల చుట్టంబునకున్
  యున్నవి కద పులగము చి
  త్రాన్నము పొంగళులు యింట నాహారింపన్

  రిప్లయితొలగించండి
 12. తిన్నియ దిగబోయిన మా
  చిన్నానకు కాలు బెణకె, చెదరని పట్టున్
  తిన్నగ వేయగ, బెల్లము
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్!

  రిప్లయితొలగించండి
 13. అన్నంబెప్పుడు తినునదె
  జున్ను,వడలు,బూరి,గారె,సున్నుండల నో
  అన్ను!తమలము వక్కలు
  సున్నమిడవె యన్నమేల?చుట్టంబునకున్

  రిప్లయితొలగించండి


 14. కన్నము వేసెడి దొంగల
  కన్ననుఁ బది రెట్లు చోర కాంక్షిత మతులౌ
  నన్నల కిపు డో రమణీ
  సున్న మిడవె! యన్నమేల చుట్టంబునకున్?

  రిప్లయితొలగించండి
 15. గుండు మధుసూధన్ గారి పూరణ చమత్కారభరితంగా చాల బాగుంది.

  రిప్లయితొలగించండి
 16. చెన్నయి దగ్గరి వాడే
  ఎన్నగ తీపొంటబెట్టి యేమరువకనే
  తిన్నగ పాను న కొంచము
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్

  రిప్లయితొలగించండి
 17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  వెన్నుండిదె వచ్చెననుచు
  క్రన్నన ధర్మజుడు తనదు కాంతను బిలిచెన్
  మన్నన సేతువు పద,మన
  సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్.

  నమించు = నమస్కరించు
  మనసున్న మిడుము = మనసున నమస్కరింపుము

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రులు బొడ్డు శంకరయ్యగారికి ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి
 19. నా రెండవ పూరణము:

  (శిశుపాలుఁడు దుడుకుతనముతోఁ దన బావ శ్రీకృష్ణునకు వెన్నకు బదులుగ సున్నమిమ్మని తన తల్లితోఁ జెప్పు సందర్భము)

  "కన్నఁ డిటు వచ్చి 'యత్తా!
  వెన్ననుఁ దె’ మ్మంచుఁ బల్క, వేగమె యమ్మా!
  వెన్ను నిట బన్నపఱుపఁగ
  సున్న మిడవె! యన్న మేల చుట్టంబునకున్?"

  రిప్లయితొలగించండి
 20. భర్త భార్యతో వచ్చిన చుట్టమునకు రొట్టెలు చేసి పెట్టమను సందర్భమున.

  వెన్నను బూసిన రొట్టెలు
  సన్నగ జేసినను గుడుచు సంతోషముగా
  తిన్నపిదప విడియమునను
  సున్నమిడవె, యన్నమేల చుట్టంబునకున్​!

  రిప్లయితొలగించండి
 21. అన్నమిడిన పిదపను వే
  సున్నము తోడను తములము సొంపుగ వేయన్,
  అన్నమరుగునండ్రు గనుక
  సున్నమిడవె,యన్నమేల చుట్టంబునకున్

  అన్నము కేవలమిడినను
  చెన్నును కాదది ఖనిజము చిందెడి కూరల్
  పన్నుగ నెముకల బలమిడు
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్

  సున్నము మిన్నగ కలిగిన
  చెన్నగు పండ్లను,విరివిగ చిక్కని పాలన్
  అన్నముగా పిల్లలకిడి
  సున్నమమిడవె యన్నమేల చుట్టంబులకున్

  పిన్నగు చుట్టములొచ్చిరి
  చెన్నగు పోషక ఖనిజము చేరిన పాలన్
  మిన్నగ నిచ్చుచు,నందలి
  సున్నమిడవె యన్నమేల చుట్టంబులకున్

  రిప్లయితొలగించండి
 22. కం:తిన్నగ ననుజూడుమిటన్
  పన్నగవేణీ యథితులు వచ్చిరటంచున్
  ఖిన్నత నొందకు యాకులు
  సున్నమిడవే యన్నమేల చుట్టంబునకున్.

  రిప్లయితొలగించండి
 23. తిన్నాడట యన్నమతడు
  మున్నే హితునింటిలోన ముచ్చటతోడన్
  తిన్నగ నాకులు, వక్కయు,
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్

  రిప్లయితొలగించండి
 24. మిస్సన్న గారూ,
  అమ్మమ్మ! బ్రేక్ పడనిస్తానా? .... దేర్ హై... అంధేర్ నహీఁ!

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులకు నమస్కృతులు...
  నిన్న రాత్రికే తిరిగివద్దామనుకొని బయలుదేరాను. అందుకే ఈనాటి సమస్యను, పద్యరచనను షెడ్యూల్ చేయలేదు. కాని రాత్రికి తిరిగి రాలేకపోయాను. ఇప్పుడే చేరుకున్నాను. నిన్నని పూరణలను, పద్యాలను తీరికగా పరిశీలిస్తాను. అసలే ప్రయాణపుటలసట... మన్నించండి.

  రిప్లయితొలగించండి
 26. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  గుండు మధుసూదన్ గారి వ్యాఖ్యను గమనించారా? ‘తినకనె’ అనడం దోషం. ‘తినకయె’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ సూచన తప్పక అనుసరణీయం. ధన్యవాదాలు.
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చిత్రము’ ఏకవచనం. అందుకని ‘ఏమిది చిత్రము’ అనండి.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  దువ్వూరి రామమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘అన్ను!(?) తమలములు వక్కలు...’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తీపొంటబెట్టి’...?
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ వివరణ ప్రకారమైనా ‘నమిడు’ అంటే నమస్కరించు అనే అర్థం రాదు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. గురువుగారూ మీకు మీరే సాటి అని మరొక్కసారి ఋజువైంది.

  రిప్లయితొలగించండి
 28. సవరణ
  ******
  అన్నంబెప్పుడు తినునదె
  జున్ను,వడలు,బూరి,గారె,సున్నుండలనో
  అన్ను!తమలములు,వక్కలు
  సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్ .
  శ్రీ శంకరయ్యగారు!నమస్సులు
  అన్ను=భార్య

  రిప్లయితొలగించండి
 29. మొన్ననె గెంటెను వీడే
  చెన్నున నిన్నింటి నుండి చీరుచు చీరన్
  చిన్నా! ద్రౌపది! వినుమా!
  సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్!

  రిప్లయితొలగించండి

 30. రాహులుడు నాడు తల్లితో :)

  కన్నూమిన్నూ కానక
  నన్నూ నిన్నూ తెలుగు జనాళియు నమ్మో
  బన్నము లాడిరి విడువక
  సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. మన్నును తినగా కన్నడు
  పన్నుగ గోకులమునందు పలువురు మెచ్చన్
  తన్నుకు చచ్చెడి కరవున
  సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్

  రిప్లయితొలగించండి