23, జూన్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1711 (వాన కురియ మురిసెఁ బడకటింట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వాన కురియ మురిసెఁ బడకటింట.

45 కామెంట్‌లు:


  1. శోభనంపురాత్రి చూడచక్కనిజంట
    వూలపాన్పుపైన ముచ్చటగను
    మదనకేళినుండ మధురమైన వలపు
    వాన కురియ మురిసె బడకటింట

    రిప్లయితొలగించండి
  2. మాష్టారూ..నిన్నటి నా పూరణ సమీక్షించ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  3. నింగి లోన విరిసె రంగుల హరివిల్లు
    ఆలు మగలు గాంచె కులుకు తోన
    మబ్బు కన్నె మదిని మాయవ్యూహము పన్నె
    వాన కురియ మురిసెఁ బడక టింట

    రిప్లయితొలగించండి
  4. ఈరోజు మొత్తానికి నెట్టింట్లో సరసమైన పూరణల వాన కురిసేట్టున్నది...
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    వలపువానతో మీ పూరణ మధురంగా ఉంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘హరివిల్లు+ఆలుమగలు’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ యడాగమానికి అవకాశం లేదు. కనుక ‘హరివిల్లె| యాలుమగలు...’ అనండి. అలాగే ఆలుమగలు బహువచనం, కాంచె ఏకవచనం... ‘కాంచె’కు బదులు ‘కనిరి’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    రాసలీలల జడివానతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    మొదటిపాదంలో ‘మల్లె లత్తరు’ అన్నచోట గణదోషం. సవరించండి.

    రిప్లయితొలగించండి
  5. కవిమిత్రులందఱకు నమస్సులతో...


    క్రొత్తదంపతులకుఁ గొంగ్రొత్తగా శోభ
    నమ్ముఁ జేయ నెంచినారు నాఁడు!
    జంట పడక పైకిఁ జనఁగానె పూవుల
    వాన కురియ మురిసెఁ బడకటింట!!

    రిప్లయితొలగించండి
  6. మొదటి రాత్రి వచ్చె మొండి వేసవినందు
    ఉక్కబోతనందు తిక్క బెరిగె
    వాన రాని దినము వరుణ కనికరాన
    వాన కురియ మురిసె బడకటింట

    రిప్లయితొలగించండి
  7. బుంగ మూతి బెట్టి మూలనుండగ పతి
    బుజ్జగించి సతిని ముద్దుజేయ
    నవ్వి దరిని జేర నయముగా వలపుల
    వాన కురియ మురిసె బడకటింట

    రిప్లయితొలగించండి
  8. బడికి సెలవు వచ్చె కడు తీవ్రమై జడి
    వాన కురియ, మురిసెఁ బడకటింట
    ముసుగు దన్ని నిద్రపోయేడి కుఱ్ఱఁడు
    లేచునట్టి బాధ లే దటంచు.

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూలవాన పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీరు సవరించింది బాగానే ఉంది. కాని పద్యం నడక సుగమంగా లేదు. ‘బొండుమల్లె జాజి పూలసరులు దీరి...’ అంటే ఎలా ఉంటుంది?
    *****
    కవిశ్రీ సత్తిబాబు గారూ,
    వేసవిలో శోభనం... అకాలవర్షం... మంచి ఊహ.. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ వలపువాన పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మండు టెండ లన్ని మరలిపోయి భువిని
    వాన కురియ, మురిసె పడకటింట
    జోల పాడి తల్లి బాలుని లాలిస్తు
    నిదుర బుచ్చు చుండె నెమ్మదిగను !!!

    రిప్లయితొలగించండి
  11. ఇది సరిపోయిందా గురువుగారు

    బొండుమల్లె జాజి పొన్న చేమంతులు
    గొరలు పాన్పు జేరి, క్రొత్త జంట
    రసజగత్తు లోన రాస లీలల జడి
    వాన కురియ మురిసె బడకటింట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలా చేయి పట్టి వ్రాయించే గురువు గారిని ఏమని పొగడమలం, వట్టి కృతజ్ఞతలు అని చెప్పడం తప్ప.

      తొలగించండి
    2. ఇలా చేయి పట్టి వ్రాయించే గురువు గారిని ఏమని పొగడమలం, వట్టి కృతజ్ఞతలు అని చెప్పడం తప్ప.

      తొలగించండి
  12. చెలియ తోడ పెండ్లి చెన్నుగా జరుగగ
    వరుని మదిని కలిగె కరము తృప్తి
    మొదటి రాత్రి చెలియ ముద్దులతోడుత
    వాన కురియ మురిసెఁ బడకటింట

    రిప్లయితొలగించండి
  13. శోభ నంబు రాత్రి సూర్యనా రాయణ
    వానకురియ మురిసె, బడక టిం ట
    క్రొత్త యైన పెళ్లి కూతురు తోడను
    మదన కేళి యందు మరులు గొలిపె

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    బిడ్డకు వేసవి తాపం తొలగినందుకు ఆనందించిన తల్లి విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లాలిస్తు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘బాలు లాలించుచు’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ఇప్పుడు చక్కగా ఉంది. సంతోషం.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ ముద్దుల వాన పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ముద్దుమురిపముల| వాన కురియ...’ అంటే ఇంకా బాగుంటుందేమో?!
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఓ అన్నదాత....
    అప్పు జేసి విత్త నైదున్నరెకరాలు
    కునుకు మరచి పోయె చినుకు లేక !
    కరుణ జూపు మనుచు వరుణదేవుని మ్రొక్క
    వాన కురియ మురిసెఁ బడకటింట!

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    వాన కురవగా మురిసిన కర్షకుని గురించిన మీ పూరణ బాగునన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి అక్కయ్య గారూ,"మాయ" తత్సమ పదమైతే, గణ భంగమయ్యే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  18. విజయకుమార్ గారూ,
    అది తద్భవమే. తత్సమమైతే సమాసంగా ‘మాయావ్యూహము’ అనవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  19. అలక గొన్న సత్య ననునయించగ బోయి
    పదయుగమ్ము శౌరి పట్టినంత
    భామ నేత్ర పాత భాష్పంపు కణముల
    వాన కురియ మురిసె పడకటింట

    రిప్లయితొలగించండి
  20. దీనబాంధవుడిగ దీక్షను గైకొన్న?
    క్రొత్త పెళ్లి కొడుకు చిత్త మంత
    పంటకొరకువాన-“కంటబడగ భార్య
    వాన కురియ మురిసె బడకటింట|
    2.దేనికున్న విలువ దానిదే యన్నట్లు
    వాన కురియ మురిసె| బడకటింట
    భార్య సుఖముకన్న?బాధ్యతలే మిన్న
    అనెను రైతురాజు నాలిచెంత

    రిప్లయితొలగించండి

  21. చదలునందు పూర్ణచంద్రుడు వెన్నెల
    వాన కురియ, మురిసె పడకటి౦ట
    పెడసరమ్ము విడిచి వెడగు దంపతులంత
    ఎడము మాని తనువు లేకమవగ
    2జల్లు పడగ రైతు చల్లెను విత్తులు
    వాన కురియ, మురిసె పడకటి౦ట
    సతిని జేరి పలికె సస్యసంపద గల్గ
    యాదగిరికిమొక్కు మీదు నిత్తు
    3పొంగు లోన పంట పోవ కృషికు డేడ్వ
    వాన కురియ, మురిసె పడకటి౦ట
    వర్తకుండు పలికె భళి భళీ లాభాలు
    వచ్చుమాకు ధరలు హెచ్చు జేతు
    4.వాగు వంకలందు వరదల పాల్జేయు
    వాన కురియ మురిసె పడక టి౦ట
    నేత తలచె కేంద్ర నిధులలో తన భాగ
    మునకు ఎంత దక్కుధనమటంచు






    రిప్లయితొలగించండి
  22. వర్ష ఋతువు మనకు వరమని యొక జంట
    వాన కురియ మురిసెఁ బడకటింట
    వేడి సెగల పీడ వీడె నీనాడని
    మునిగె సరసమునను మోదమలర

    రిప్లయితొలగించండి
  23. ​అత్త మామ లిద్ద రన్యదేశంబేగ
    ​క్రొత్త జంట కింకి కునుకులేక
    ​సరస మాడు చుండ సతిపైన ముద్దుల
    వాన కురియ మురిసె పడగటింట​!

    రిప్లయితొలగించండి
  24. నిన్నటి సమస్యకు పూరణ:​​
    ​​
    హృద్యంబగు మా కారుకు
    సద్యః స్టీరింగు మొండి​(జాము)​; సత్తువ కలుగన్
    చోద్యమె అయినను కొంచెము
    మద్యము సేవించి నడుపు మా వాహనమున్!

    రిప్లయితొలగించండి
  25. జలదపంక్తులెల్ల యలముకొనియెమింట
    విరిశరములు మరుడు విడిచెవింట
    వలపు హెచ్చగా నవ వధూవరులజంట
    వాన కురియ మురిసె పడకటింట.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ప్రాణ మిత్రునికి వివాహమనుచు నేగి
    చలువ యంత్ర గదులు చాల కునికి
    ప్రక్కయింట నొక్కడుక్కతో పడ పాట్లు
    వాన కురియ మురిసెఁ బడకటింట.

    రిప్లయితొలగించండి
  27. విత్తనాలు వేసి వేచి యుండెను రైతు
    పలకరించు నేమొ తొలకరనుచు
    సతిని జేరి రాత్రి చర్చించుచుండగ
    వాన కురియ మురిసె బడకటింట!

    రిప్లయితొలగించండి
  28. పంట లెవ్విధమునఁ బండుఁ బుష్కలముగ?
    భక్తుఁ డేమి చేసె వరము పొంది?
    పంతము లలుకలను పట్టించుకొన రెచట?
    వాన కురియ; మురిసె; పడకటింట.

    రిప్లయితొలగించండి

  29. ఆ.వె:కొత్తదంపతులట కోటియాశలతోడ
    యూళ్ళు తిరుగ నెంచి యుత్సుకతన
    బస్తి యందు వారు బసచేయ వలపుల
    వాన కురియ మురిసె పడకటింట.

    రిప్లయితొలగించండి

  30. ఆ.వె:కొత్తదంపతులట కోటియాశలతోడ
    యూళ్ళు తిరుగ నెంచి యుత్సుకతన
    బస్తి యందు వారు బసచేయ వలపుల
    వాన కురియ మురిసె పడకటింట.

    రిప్లయితొలగించండి
  31. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఇంతకూ మురిసింది పదం పట్టిన కృష్ణుడా? పట్టించుకున్న సత్యభామా? (సరదాకు!)
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణలు (నేటి రెండు, నిన్నటిదీ) బాగున్నవి. అభినందనలు.
    ‘సద్యఃస్టీరింగ్’ వింతసమాసం !
    *****
    దువ్వూరి రామమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పంక్తులెల్ల నలుముకొనె...’ అనండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం మొదట్లో భామ కు కామాన్ని జతచేయడం మరచాను గురువుగారు

      తొలగించండి
    2. మూడవ పాదం మొదట్లో భామ కు కామాన్ని జతచేయడం మరచాను గురువుగారు

      తొలగించండి
  32. గురువుగారు నా పద్యాన్ని చూడలేదనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  33. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    అలాగా... బాగుంది. ఇప్పుడు సందిగ్ధత తొలగిపోయింది. సంతోషం!
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోటియాశలతోడ| నూళ్ళు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  34. కప్పు కారుచుండె చెప్పిన వినడాయె
    పడకటిల్లు జూపి భద్రమె యను
    నేటితోడ బాధ నెమ్మదించని సతి
    వాన కురియ మురిసె బడకటింట.

    రిప్లయితొలగించండి
  35. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. ఎండవేడి యేచ నెంతయో వేసవిన్
    పక్కవేడిచేత పండలేక
    బాధపడుచునుండ,బాధను తీర్చుచు
    వానకురియ మురిసె పడకటింట

    పంటచేతికంద బాగైన యొకనగ
    భార్యచేతికిడగ పడతి మురిసె
    మురిపమొప్ప పలుకు మోదంపు మాటల
    వానకురియ మురిసె పడకటింట

    నెరలువడినభూమి నెటులొ తా దున్నియు
    చేనుగతికి తాను చింతనంద,
    పంటచేను తడిసె వాటమౌ రీతిగా
    వానకురియ మురిసె పడకటింట

    చినుకులవియ తాము చిటపటలాడుచు
    రాలగాను మదికి రాగమబ్బె
    సంతసానతాను సంబర పడుచును
    వానకురియ మురిసె పడకటింట

    అతివతోడతాను నాషాఢ మాసాన
    ప్రణయయాత్ర కేగె రయముగాను
    అచట పూర్ణిమందు నందంపువెన్నెల
    వానకురియ మురిసె పడకటింట

    వనితనొకతెతాను వడిగ పెండ్లాడియు
    శోభనంపు రాత్రి సుదతి గనియు,
    వనిత చెప్పునట్టి వలపుల పలుకుల
    వానకురియ మురిసె పడకటింట

    తాటియాకులింట తంటాలు పడుచును
    వానకురిసినపుడు పక్కతడియ
    కట్టె భవన మొకటి,కనకతడియు పక్క
    వానకురియ మురిసె పడకటింట

    పడతి తడియ వాన,వంపుల దేహపు
    నందమంత గనియు నాత్రపడెను
    పడకజేరినంత వానినేతలచుచు
    వానకురియ మురిసె పడకటింట

    రిప్లయితొలగించండి