29, జూన్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1716 (కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

34 కామెంట్‌లు:

 1. కాకా! వచ్చెనుగా వ
  ర్షాకాలమిక! వినపడును రాత్రులలో మం
  డూక,శునక, కీటకరొద
  కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!

  రిప్లయితొలగించండి
 2. సభలలో మన రజకీయ నేతల మాటలు

  లోకులు మెచ్చిన నేతల
  పోకడలన్ రాజ్యసభను ముంచిన తెఱగుల్
  చీకాకు తెచ్చు మాటలు
  కీకీ హిహిహీ బెకబెక కిచ కిచ భౌ భౌ.

  రిప్లయితొలగించండి
 3. కీకా రణ్యము నందున
  కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
  కుకురము కప్పలు కోతులు
  నేకతముగ జేరె నంట నిండుగ సభకున్

  రిప్లయితొలగించండి
 4. అక్కయ్యా! మూడవ పాదాద్యక్షరము గురువు రావాలి కదా...

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కీటకరొద’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘కీటకరుతి’ అనండి.
  అక్కయ్య గారి పద్యంలో లోపాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదాన్ని ‘ఆకడ పక్షులును మృగము| లేకతముగ...’ అందామా?

  రిప్లయితొలగించండి
 6. అవునుకదా! మర్చిపోయాను గుర్తు చేసి నందుకు ధన్య వాదములు తమ్ముడు

  కీకా రణ్యము నందున
  కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
  కాకులు కప్పలు కోతులు
  నేకతముగ జేరె నంట నిండుగ సభకున్

  రిప్లయితొలగించండి
 7. చేకొని జంతుల బొమ్మలు
  రాకేశ్ ! యివియేమి ? చెప్ప రారా ! యనగా
  ఓకె ! యని జెప్పె బాలుడు
  కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!


  రిప్లయితొలగించండి
 8. చేకొని ధ్వన్యనుకరణుని(శబ్దానుకరణు)
  సోకుగ పెండ్లాడినట్టి సుందరి యతనిన్
  తాకిన యాతండిట్లనె
  కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!

  రిప్లయితొలగించండి
 9. రాజేశ్వరి అక్కయ్యా,
  ముందుగా నేనుకూడ ‘కాకుల’తో సవరణ సూచించాలనుకున్నాను. కాని సమస్యలో ‘కాకా’ అని కాని ‘కావ్‍కావ్’ అని కాని లేకపోవడంతో సందేహించాను. మీ సవరణ బాగుంది. సంతోషం!
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రాకేశ్+ఇవి’ అన్నప్పుడు యడాగమం రాదుకదా... ‘రాకే శివి యేమి...’ అనవచ్చు కదా!
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. చీకాకు బెట్టు చుండును
  వాకిటిలో నుడుత కప్ప భసకము లెల్లన్
  వేకువనే కూతలిడుచు
  కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ!!!

  రిప్లయితొలగించండి
 11. వ్యాకరణం బునకనువుగ
  నీకందమునందునధ్వనియనుకరణముల్
  యేకరువుబెట్ట నిట్లగు
  కీకీ హిహిహి బెకబెక కిచకిచ భౌభౌ

  రిప్లయితొలగించండి
 12. పకపక నవ్వుట కొఱకై
  కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
  రకరకముల పై కూతలు
  సుకరముగా చదువు చుంటి సుజనులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 13. కాకులు దూరని యడవిని
  భీకర భైరవుని నగరు వెరపు గొలుపుచున్
  చీకటి పడ వినవచ్చును
  కీకీ,హిహిహీ,బెకబెక,కిచకిచ,భౌభౌ.
  2.చీకాకులు,కలిగించిన
  లోకమ్మున దాయ,సుతుల,లోలత్వముతో
  వాకొను చుండును మనుజుడు
  కీకీ,హిహిహీ,బెకబెక,కిచకిచ,భౌభౌ.
  3. కాకాపట్టును బ్రతుకగ
  మోకాలిని వంగి ద౦డములు పెట్టునిక
  న్నీకున్ నీవే సరియను
  కీకీ,హిహిహీ,బెకబెక,కిచకిచ,భౌభౌ.


  రిప్లయితొలగించండి
 14. కీకారణ్యమునందున
  నాకుల మాటున కువకువలాడుచు జీవుల్
  వేకువఁయరచుచు నుండెన్
  కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ.

  రిప్లయితొలగించండి
 15. నేకంటి నొక్క యూర - పు
  రాకృత పాపంపు వికృత రత మతిహీనుం
  డాకొన్న సన్నలెన్నగ
  కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!

  రిప్లయితొలగించండి
 16. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘అందున ధ్వని’ అన్నప్పుడు ‘న’ గురువుకాదు. ఆ పాదాన్ని ‘ఈకందమునందునను ధ్వని యనుకరముల్’ అనండి. ‘అనుకరణముల్+ఏకరువు’ అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి. సవరణ సూచించడానికి విఫలప్రయత్నం చేశాను. ‘అనుకరణముల్| సాకల్యముగా జెప్పిన...’ అంటే ఎలా ఉంటుంది?
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వేకువ’ తరువాత అర్ధానుస్వారం ఎందుకు? ‘వేకువ నరచుచు...’ అనండి.
  *****
  ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కాచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దొరఁ గాచెడి యా| పోకిరి...’ అందామా?

  రిప్లయితొలగించండి
 18. శ్రీ భాగవతుల కృష్ణరావు గారి పూరణ

  మా కవితలు వినుడనుచునె
  కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
  కేకలను విడిచి మద్యము
  మాకోద్దను మాట చాటి మసలగ మేలౌ

  రూకల కోరి ప్రభుత్వమె
  వాకొని "మద్యమ్ము త్రాగ మానుడటంచు"
  న్నే కోనల నమ్మగ, నిక!
  "కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!"

  రిప్లయితొలగించండి
 19. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. కీకారణ్యము నందున
  వే కవ్వడి,కవలును,తను భీముని తోడన్
  తా కనె సవ్వడులరయగ
  కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!

  వేకువ వర్షపు వేళల
  నా కీటకములును,కప్ప,లరచెడి పక్షుల్
  వే కుక్కలరుపు గనమే
  కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!

  తా కొండొక మాంత్రికుడటు
  వే కీడును కలుగజేయ,భీకర శభ్దాల్
  తాకింపజేసె చెవులను
  కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!

  నే కంటిని మానసికపు
  భీకర రోగిని నతడును పెద్దగనరచెన్
  తా,కట్టబడియు,నిటులన్
  కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!

  రిప్లయితొలగించండి
 21. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
  'తాన్+కట్టబడియు - తాఁ గట్టబడియు' అవుతుంది కదా!

  రిప్లయితొలగించండి
 22. గురుదేవులకు ప్రణామములు.

  నిన్నటి దత్తపది :

  క్షీరరాశి వధువుఁ జేకూర్చి పెట్టగ
  నహరహముల సృష్టి కన్నమిడుచు
  భవహర! శుభకర! శ్రీశ! పంకజనాభ! యీ
  ధరణి జనులు గనరు ద్రప్సమైన!

  నేటి సమస్యాపూరణం :

  కేకలఁ బెట్టక పిలువగఁ
  జేకూర్చగ 'పిలుచు గంట' చిత్రపు రీతిన్
  తాకగ మీటన్నిటులనె
  "కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!"

  (Calling bell=పిలుచు గంట)

  రిప్లయితొలగించండి
 23. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  (ఒక వైద్యశాలలో నొక రోగికి మందిడగా నతఁడు చేయు వింత చేష్టలను గని పరిచారిక భిషక్కుతోఁ బలికిన సందర్భము)

  "చేకొని మందిడ నీతఁడు
  కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
  కేకల నిడసాఁగె! వితథ
  మో, కాక నిజమొ? కనుఁగొను మో దోషజ్ఞా!"

  రిప్లయితొలగించండి
 24. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ‘ఏకరువు+ఎట్టి’... ఇందులో ‘ఎట్టి’ అనేది ‘పెట్టి’ అనే అర్థంలో వాడారా? అలా అయితే దోషమే. లేక ‘ఎట్టి = ఎటువంట్’ అనుకుంటే అన్వయం కుదరడం లేదు. వివరించండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణలు (నిన్నటి దత్తపది, ఈనాటి సమస్య) రెండూ బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  వితథము అర్థంకోసం ఆంధ్రభారతిలో వెదకవలసి వచ్చింది!

  రిప్లయితొలగించండి
 25. ధన్యవాదములు శంకరయ్యగారూ!

  ముందుగ "ననృతమో" యనుకొంటిని. మనస్సు మార్చుకొని, "వితథమో" యని వ్రాసితిని! ఏమయిన నేమి? మీకొక యర్థముపై నవగాహన కలిగినది! సంతోషము!

  రిప్లయితొలగించండి
 26. వ్యాకరణం బునకనువుగ
  నేకరువున్ బెట్టుచునుధ్వనియనుకరణముల్
  సౌకర్యంబుగ నిట్లగు
  కీకీ హిహిహి బెకబెక కిచకిచ భౌభౌ

  గురువుగారు ఇలా సవరించాను

  రిప్లయితొలగించండి
 27. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ఇప్పుడు మీ పద్యం అన్నివిధాల బాగున్నది. సంతోషం!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారు
   కృతజ్ఞతలు, చివరికి కంపార్టుమెంటల్ పద్ధతిలో
   పాసయ్యాను

   తొలగించండి
 28. లోకుల పోకడవలెనే
  దూకుచుకోతులు,పురుగులు,దొరగాచెడియా
  పోకిరి కుక్కలయరుపులు
  కీకీ,హిహిహీ, బెకబెక కిచకిచ బౌబౌ

  రిప్లయితొలగించండి
 29. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. కేకలఁబెట్టుచు సభలన్
  కీకీ హిహిహి బెకబెక కిచకిచ బౌబౌ
  యీకాలపునేత లకట!
  చీకాకులఁబెట్టుచుంద్రు చీడ పురుగులై

  రిప్లయితొలగించండి
 31. మాస్టరు గారూ ! ధన్యవాదములు.. మీ సూచనతో......

  చేకొని జంతుల బొమ్మలు
  రాకేశివియేమి ? చెప్ప రారా ! యనగా
  ఓకె ! యని జెప్పె బాలుడు
  కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!

  రిప్లయితొలగించండి
 32. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి