1, జులై 2015, బుధవారం

పద్య రచన - 947

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

 1. కనువిందు నూడ్పు లందున
  వనితల సౌరులను గాంచ వరిమడు లందున్
  వినసొంపు పాట లందుకు
  వినువీ ధులతేలు చుంద్రు విహంగ ములై

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘విహంగములై’ అన్నచోట గణభంగం. ‘విహగముల వలెన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 3. ముందు "విహగముల వలెన్ " అనివ్రాసి మళ్ళీ ఎందుకో చెరిపేసాను .ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 4. పోడిగా వర్షములు పడ పొలములందు
  మొదలు పెట్టిరి వరినాట్లు ముదముతోడ
  చేతినిండుగ పని గల్గె నాతులకును
  పల్లె లన్నియు పచ్చగా పరిఢవిల్ల

  రిప్లయితొలగించండి
 5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో అశ్లీలార్థం స్ఫురించే ప్రమాదం ఉంది. ‘చేతినిండుగ పని గల్గె చేడియలకు’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. వనిత లచ్చట పొలములో వరుస గాను
  పాదు చుండిరి వరినాట్లు పొదుపు గాను
  బాడు కొనుచును జక్కగా పాట లెన్నొ
  కాయ కష్టము వారిదే , కంటి రి గద !

  రిప్లయితొలగించండి
 7. వరిమళ్ల నాటుచు వడ్లను బండించు
  ------బ్రహ్మ సృష్టికి మూల పడతులిచట|
  జనపద సాహిత్య మననము బంచగ
  ----కూలీలె వాణియు కూర్పు లిచట|
  జీవరాసుల తిండి- భావన లందించు
  -----శక్తి నాసక్తుల యుక్తు లిచట|
  కష్టించి పనిజేయు నిష్టత నందించు
  -----పుష్టికి మూలమౌ యుహలిచట|
  లక్ష్మి లక్ష్యాలు జేకూర్చు లాభమిచట|
  పండజేయగ కూలీలనిండు మనసె
  పంట రూపాన యింటికి ,వంటకొచ్చు|
  కూలిలేకున్న? పంటలే తాలుయగును|

  రిప్లయితొలగించండి
 8. కూలిజనములేక కుదురదు యేపని
  జాలిమనసు నందె జగతి పనులు
  నారుమళ్ళువిడువ కారులు బండునా?
  కారు పంట కెవరుకర్త?”కూలి”

  రిప్లయితొలగించండి
 9. రంగుల చీరెలఁ దీరిచి
  కొంగునడుముఁ జుట్టి మడినిఁ గూడగ శ్రమణల్
  వంగడమేదైనన్ వరి
  బంగారమె పండు వారి పనితనమునకున్!

  రిప్లయితొలగించండి
 10. ఆ.వె:పంట చేల యందు పడతులెల్లరు జేరి
  పనులు చేయు చుండ పండు భువిని
  కలుపు తీత పాట కమనీయమౌనుగా
  ఆట పాట గాంచి అవని మురిసె.

  రిప్లయితొలగించండి
 11. అచ్చపు తెలుగు దనముతో
  ముచ్చటించుచు బొలమున ముదితలనేకుల్
  పచ్చని వరి నాటుట కడు
  ముచ్చట గొలుపు గనగను ముదముప్పొంగున్

  రిప్లయితొలగించండి
 12. పోచిరాజు సుబ్బారావు గారు,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కే. ఈశ్వరప్ప గారు,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గందూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మేడమిద్దెలనెప్డు మెఱుగనక
  కోడి కూసెడు వేళకు పడి లేచి
  పాడి పంటల శ్రద్ధఁ బండించుచున్
  పాడుకొనుచునుంద్రు పనులయందు.

  రిప్లయితొలగించండి