17, జూన్ 2015, బుధవారం

దత్తపది - 79 (కాకి-కోయిల-నెమలి-కోడి)

కవిమిత్రులారా,
కాకి - కోయిల - నెమలి - కోడి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. ఏకాకిగ నాట్య శాలకు
    నాకీ చకునిబి లిచితినె మలినపు బుద్ధి
    న్నాకీ గతియెటకో యిల
    కూకటి రత్నము తానై కోడిగ మాడన్

    కూకటి రత్నము = శిరోమణి , తలమానికము
    హమ్మయ్య ఎలాగో కిట్టించాను ఇక గురువాధీనం

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు. పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది.
    “ఏకాకిగ రమ్మని భీ
    మా కీచకుని బిలిచిచితినె మలినపు...” అనండి.

    రిప్లయితొలగించండి
  3. స్వర్గానికి అతిథిగా వెళ్ళిన అర్జునుడు, ఒకనాటి వెన్నెల రాత్రిలో ఇలను, ఇలలో పున్నమిని, అందులో సుమసౌందర్యాన్ని, రమణీ రమణీయాన్నే గొప్పగా తలచుచూ...

    రాకా కిరణావృత నిశి
    నేకో యిలపైని లతలనె మలిచినటులన్
    సోకులు కురిపించు ననలు,
    నా కోడిగములొలికించు నింతులె యింపౌ.


    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. అడ్డగించిన కీచకునితో...

    రాకోయి! లతాంగి దరికి
    యేకాకిగ తలచవలదు యీ సైరంధ్రి
    న్నీకోడిగమిక చెల్లదు
    వేకువనె మలిక బిలిచెను విడు నాదారిన్!!!

    మలిక = మహారాణి

    రిప్లయితొలగించండి
  6. మారు రూపున ఏకాకి మర్కటంబు
    భీముగని-అందుకో యిల వీలుగాని
    తోక జరుప మనె”మలిసంతోష బడుచు
    తీసికో డిల్ల నీకేల?ధీరుడనెను
    ------------------------------
    హనుమంతుడుమారువేషమున భీమ గర్వమణచుట

    రిప్లయితొలగించండి
  7. శ్రీ కే.యస్ గురుమూర్తి గారి పూరణం
    పాండవసతి నేకాకిగవనమున గని
    అనె-మలినమతి యగు సైంద వాదములిడు
    లేలకో-యిల నివసింప నీవు స్వర్గ
    మేలుకో-డిల్ల-లిడి కౌగిలించు నన్ను

    రిప్లయితొలగించండి
  8. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రమున యుద్ధము చేయనను అర్జునునితో:

    ఏకాకిగఁ జంప సుతుని
    పోకోయి లలాట లిఖిత మూలమ్మనుచున్,
    నీకిటనె మలినమంటదె?
    భీకర కలి దూకకోడి వెడలిన ననియెన్!

    రిప్లయితొలగించండి
  9. కీచకా కీడుదెచ్చు నీ నీచ తలపు
    తెలుసుకో యిలఁగలనీతి తెల్లముగను
    వెంటనె మలిన మదిలోని మంటఁ బాపు
    నాపతుల తేజమునకోడి నాశమవకు

    రిప్లయితొలగించండి
  10. నాకు కోడిగ మిచటనా ? నాధ ! చెపుమ
    యెందు కోయిల బ్రదుకగ నిపుడు నేను
    నేనె మలినమై తినిమఱి నెమ్మది గను
    నూర కుండుటకా కిరీ టీ ర భసము

    రిప్లయితొలగించండి
  11. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వ్యసనముల కోడి రాజ్యము,పాండు తనయు
    డర్ధ రాజ్యము కో,యిల నైదుయూర్లొ,
    గోరమనె మలి నమతుల;కౌరవ పతి
    నడుగ నేకాకి గావచ్చె నచ్యుతుండు

    రిప్లయితొలగించండి
  12. గీత బోధకు ముందు;

    హింస యేలనొ"కో? యిల"నింపు నగునె
    యిటను నే"కాకి"గా నుండి,యెల్లజంప
    బంధుల"నె మలి"నాడటు పాపమంట
    యముని"కోడి"యునుండమె యనెను నరుడు

    దుర్యోధనుడు నీట దాగినపుడు;

    ధార్త రాష్ట్ర!నీవే"కాకి"తలప నిపుడు
    ఏలొ"కో యిల"మనుటది?యింపు నగునె?
    పాండవుల"కోడి"హ్రదమున వరల నగునె?
    ఎంచ కలుగు"నె,మలి"నాడు నింపు బ్రతుకు?

    అభిమన్యుని నీతివీడి చంపే యోచన;

    పార్ధు పుత్రుని"కోడి"యు పద్మమందు
    ఎటులొ"కో యిల"వీనిని నేచు విధము?
    కలుగు"నె,మలి"రోజున పోరు కనగ మనకు
    వీడునే"కాకి"చంపగా విడుడు నీతి

    రాయబారంలో కృష్ణుని బంధించే యోచన;

    కృష్ణుడే"కాకి"యనుచును కీడుసేయ,
    నతడు మిత్రులక"నె,మలి"నాన గట్ట
    గాను,యేలొ"కో యిల"జాగు,కట్టుడనెను
    విశ్వరూపంబు"కోడి"రి వింతనపుడె

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కృతులు.
    పనిమీద దిల్‍సుఖ్‍నగర్ వెళ్ళి ఇంతకుముందే తిరిగిరావడం వల్ల మీ పూరణలపై వెంటవెంటనే స్పందింపలేకపోయాను. మన్నించండి. అసలే ఇవాళ ‘దత్తపది’.. కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి.
    దిల్‍సుఖ్‍నగర్‍లో పోచిరాజు సుబ్బారావు గారు కలిసి వారింటికి తీసుకువెళ్ళారు. వారి ఆత్మీయ ఆతిథ్యం ఆనందాన్ని కలిగించింది. వారి సౌహార్దతకు ధన్యవాదాలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిశి నేకో..’ అర్థం కాలేదు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాకుంటే ‘మలిక’ అన్యదేశ్యం... అయినా ఫరవాలేదు!
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నీచతలపు, మలినమది’ రెండూ దుష్టసమాసాలే. ‘నీచబుద్ధి, మలినమనమున మంటఁ బాపు’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రాజ్యముకో’ అనకుండ ‘రాజ్యమునకో’ అనాలి. అక్కడ ‘అర్థస్థలమునకో...’ అందామా?
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    చివరిపూరణలో ‘రూపంబుకు’ అన్నారు. ‘రూపంబునకు’ సాధురూపం కదా!

    రిప్లయితొలగించండి
  14. రాయబారమున కేగిన కృష్ణుని దుష్టచతుష్టయము బంధింప జూచు నప్పుడు మాధవుని పల్కులుగా ఊహ

    నన్నేకాకిని జేసి మీరిచట దానన్ కట్ట యోచింతురే
    వన్నెల్ మాయగ? నెందుకో యిలనహో బంధింపంగ నో గొల్లనిన్
    యెన్నన్ నల్వురు ? న్యాయమౌనె ? మలినమ్మే కాద మీ కీర్తి ? మీ
    సన్నాహమ్మున కోడిపోయితి కటా ! జాగేల రారండికన్.

    రిప్లయితొలగించండి
  15. దరికి రాకోయి లయదప్పి​ తాకకోయి
    ​యబల నేకాకి ననుకొని హద్దు మీర
    ​​కోడి పోదువు నా ప​తి యొడలు విరువ
    తగునె మలిన పరచ నన్ను తప్పు కాదె!​

    రిప్లయితొలగించండి
  16. బొడ్డు శంకరయ్య గారూ,
    చక్కని పూరణ నందించారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారు,
    పండరీపుర దర్శనానికి వెళ్ళి వచ్చి ఇప్పుడే మీ సూచన గమనించాను.
    నేను ఒక చిన్న పొరబాటు చేశాను. అది పెద్ద దోషంగా రూపుదాల్చింది. నేను గమనించనే లేదు. ఏలో అని మనసులో ఉన్నదాన్ని ఏకో (కన్నడ ప్రభావంతో) వ్రాసేశాను.
    మన్నించండి.
    అందుకే మీ సూచనల కొఱకే వేచియుంటాను. ఏ తప్పులు వస్తున్నాయోనని. అనేక ధన్యవాదాలు.
    ******************
    సవరించిన పద్యం.

    స్వర్గానికి అతిథిగా వెళ్ళిన అర్జునుడు, ఒకనాటి వెన్నెల రాత్రిలో ఇలను, ఇలలో పున్నమిని, అందులో సుమసౌందర్యాన్ని, రమణీ రమణీయాన్నే గొప్పగా తలచుచూ...

    రాకా కిరణావృతమౌ
    సోకో, యిలపై! లతల కుసుమముల సొబగో,
    యా కువలయమునె! మలిపొ
    ద్దా కోడిగములొలికించునంగనలటనే!

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులతో...

    (నర్తనశాలకు రమ్మని పిలచిన కీచకునకు సైరంధ్రి సమాధానము)

    నన్ను నేకాకిగా నర్తనంపుశాల
    కడకు రమ్మన కోయి! లక్షణయుతలనుఁ
    బిల్వఁ దగునె? మలిన చరితు ల్వచింపఁ,
    గులసతుల్ వత్తురే వారి కోడి దరికి?

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారూ,
    ఆలస్యమైనా అద్భుతంగా, ఉత్తమంగా పూరించారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి