18, జూన్ 2015, గురువారం

పద్య రచన - 935

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. గొంగళి దశలను మార్చగ
    రంగుల రెక్కల చిలుకట రంజిల్ల మదిన్
    పొంగుచు మకరం దములకు
    భృంగము గాతిరుగు చుండు పూవుల పైనన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘చిలుక+అట’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘చిలుకగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. గొంగళీ పురుగును జూడగ
    కంగారుగ మేను లోన కంపము గలుగున్
    రంగా ! కొన్ని దినాలకు
    సింగారపు వన్నె నెగురు సీతాకోకై .

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి భావంతో చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
    చివరిపాదాన్ని ‘సింగారపు సీతకోకచిలుకై యెగురున్’ అంటే బాగుంటుందేమో?!

    రిప్లయితొలగించండి

  5. కం.దశలను మార్చెడి పురుగు ల
    నిశమును పైకెగిరిదిక్కుల నెల్లెడ దిరుగన్
    మిసమిస లాడెడి రంగుల
    కుసుమము పైవాలిన మది కుల్లాస మగున్.

    రిప్లయితొలగించండి
  6. గొంగళి పురుగును జూడుము
    కంగారుగ నెక్కు చుండె గనబడు కొమ్మన్
    రంగులు మారుచు చివరకు
    సింగారపు సీతకోక చిలుకగ మారున్

    రిప్లయితొలగించండి
  7. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో ‘దిక్కుల’ అన్నచోట గణదోషం.. అక్కడ ‘దిశల’ అంటే సరి!
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తీగ పైన సాగు తీరైన గొంగళి
    పలుకు సత్య మేది పంక జాక్ష!
    నిన్న రూపమేది నేడు లేదు!
    రేపు మారు నాదు రూపమనియె!

    రిప్లయితొలగించండి
  9. పుట్టుక నొకరూపు గిట్టుట వేరైన
    ------గొంగళపురుగెంత గొప్పదౌర|
    కురుల సైనికులచే కూర్పుల ధైర్యమే
    ------మందుల తూటాలు మరలిపోవు|
    వేల కాళ్ళను జూప?వేగిర మందున
    ------శాస్త్ర వేత్తల రైలు సాగుటాయె|
    ఆకుల షోకులు ఆరగించుట జూచి
    ------స్వార్థ పరుల నేర్పు వసుధ జేరె|
    తినుట కొరకు బుట్టి మనుగడ సాగించి
    మారు వేషమందు మరలివచ్చి
    రాజకీయ మందు రసమును బీల్చుమా
    సీత కోక చిలుక?నేతలాగ

    రిప్లయితొలగించండి
  10. శ్రీ ఈశ్వరప్పగారి పద్యం చమత్కారంగా వుంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవపాదంలో గణభంగం. ‘నిన్న రూప మేది నేడు చూడగ లేదు’ అందామా?
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గొంగళి పురుగును చూసిన
    నంగములన్నియు భయమున నదురుచు నుఁడున్
    భంగము నొందగ మలిదశ
    చెంగున యెగురుచునదికడు చెలువము నొప్పున్

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    నుఁడున్ -> నుండున్... టైపాటు.

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    తీగ పైన సాగు తీరైన గొంగళి
    పలుకు సత్య మేది పంక జాక్ష?
    నిన్న రూపమేది నేడు చూడగ లేదు!
    రేపు మారు నాదు రూపమనియె!

    రిప్లయితొలగించండి
  15. ఆకులు దిను గొంగళియే
    ప్రాకటమగు దశలు దాటి పలు వన్నెలతో
    వేకువనే పూవులపై
    శ్రీకరమగు సీతకోక చిలుకై వ్రాలున్!!!

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారూ,
    మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మాస్టరు గారూ ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో....


    గొంగళీ పురుగును జూడగ
    కంగారుగ మేను లోన కంపము గలుగున్
    రంగా ! కొన్ని దినాలకు
    సింగారపు సీతకోకచిలుకై యెగురున్

    రిప్లయితొలగించండి