19, జూన్ 2015, శుక్రవారం

పద్య రచన - 936

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. వీణ వాయించు చున్నట్టి విఘ్న దేవ
    దృష్టి సారించి మామీద కృపను జూపి
    యెట్టి ఆటంకములు లేక యెల్లపనులు
    జరుగునట్లుగ దీవించు జనులకెల్ల

    రిప్లయితొలగించండి
  2. గజవద నునివీణా నాదము
    నజయము లేదంచు వినగ నలరించు మది
    న్నజములు పక్షులు శిశువుల
    విజయమ్మున కాట పట్టు వేలుపు తానై

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘గజముఖు వీణానాదము|న జయము...’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. వీణ చేత బట్టి విలువైన విద్యను
    నేర్వగలిగినట్టి నేర్పరులకు
    మనసునందు జేరి మహిమాన్వి తంబును
    పంచు విఘ్న రాజ వందనమ్ము.

    రిప్లయితొలగించండి
  5. భద్ర గజనిభాస్య భద్రవరదుడవు
    వీణ బట్టి తేల విఘ్న హంత్రి
    సామ గాన గతుల సాంబుని గొల్వనా
    గీర్జతులను మీట గిరిజ కొరక!

    రిప్లయితొలగించండి
  6. " మిక్కీ మౌస్ " గా మారుచు
    చక్కగ నా వాహనమ్ము చప్పట్లిడగా
    నిక్కడ వీణా నాదము
    పక్కా " ప్లే " జేసెడు గణపతికిని జే ! జే !

    రిప్లయితొలగించండి
  7. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. విద్యలు నేర్పెడు నొజ్జయె
    హృద్యమ్ముగ వీణ మీట నింపొనరించన్!
    యాద్యంతము తన్మయమై
    పద్యమ్ముల వ్రాయఁబూన వాణియె తోచెన్!

    రిప్లయితొలగించండి
  9. వీణచేతఁబట్టి విఘ్ననాయకుడు తా
    నందగించుచుండె నద్భుతముగ
    కామితమ్ములిచ్చి కాపాడు దైవముఁ
    జేరికొలుతు సతముఁ జిత్త మలర

    రిప్లయితొలగించండి
  10. వీణ వాయించు చుండెడి విఘ్న నాధ !
    కరుణ తోడన గాపాడు ధరణి జనుల
    బొజ్జ నిండను నుండ్రాళ్ళు పోయుదు రట
    కాదు కూడద నకనిక కనికరించు

    రిప్లయితొలగించండి
  11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఒనరించన్+ ఆద్యంత’ మన్నప్పుడు యడాగమం రాదు. ‘ఇంపొనరగ నే| నాద్యంతము...’ అందామా?
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కరుణతోడను’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

    విద్యలు నేర్పెడు నొజ్జయె
    హృద్యమ్ముగ వీణ మీట నింపొనరగ నే
    నాద్యంతము తన్మయమై
    పద్యమ్ముల వ్రాయఁబూన వాణియె తోచెన్!

    రిప్లయితొలగించండి
  13. పలుకని తీగలు పలికించ గలుగును
    ----విఘ్నేషు నండయే విరివి గాను|
    కలుషిత భావాలు కరిగించ గలుగును
    -----వీణ నాదమునందు విఘ్నరాజు|
    విద్య వివేకము విరివిగ నందించి
    ----నేర్పును బంచు గణేషు డెపుడు|
    ఆదిపూజనుగొను ఆరాధ్య దైవమే
    ----పార్వతి తనయుడు ప్రజల కెపుడు|
    వాణి వీణను గైకొని జాణలాగ
    గీత సంగీత మందించు నేతలాగ
    శక్తి నాసక్తి నొసగెడి యుక్తి లాగ
    లక్ష్మి లక్ష్యాలు గూర్చు?సలక్ష ణాన|

    రిప్లయితొలగించండి
  14. ఒక్కడే బొజ్జ గణపయ్య చక్కనైన
    తోటలోనను గూర్చొని మేటి వీణ
    జేకొని మధుర గానము జేయుచుండె
    సకల కళల వీణావాణి స్మరణ మాయె

    రిప్లయితొలగించండి
  15. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  16. 19.06.2015.పద్య రచన:వైణిక గణపతి
    సకల విద్యాదిపూజిత శంకరసుతు
    డాలపించె హంసధ్వని మేళవించి
    వల్లకీ తంత్రులన్ మీటి తల్లి దండ్రు
    లాదిదంపతుల్ పరవశమంది రపుడు

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. గుజ్జు వేలుపు వీణ మీటుచు కూనిరాగము దీయగన్
    ముజ్జగమ్ములు తన్మయమ్ముగ మోదమందుచు మెచ్చుచున్
    బొజ్జ నిండగ పిండి వంటలు బొజ్జ దేవర కీయగన్
    బుజ్జి మూషిక వాహనమ్మవి పూర్తి జేసెను హాయిగన్!!!



    వీణను మీటుచు దీయగ
    నేనుగు మొగమయ్య బాడ నిల సుధ కురియున్
    ప్రాణములు పులకరించగ
    నాణెముగా గొలుతు విఘ్న నాయక గనుమా!!!

    రిప్లయితొలగించండి
  19. వీణనుచేతబట్టిమనవిజ్ఞతబెంచగ నాదమోదమున్
    వాణియు కూర్పు నేర్పులు వివాదము లేకను చేతులల్లగా?
    శ్రేణులు లోకమంతట ను చింతలుబాపగ మానసంబు ని
    ద్రాణము బాపుటౌనుగద|దక్షత నింప గణేష వాద్యముల్

    రిప్లయితొలగించండి
  20. శైలజ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి