23, జూన్ 2015, మంగళవారం

పద్య రచన - 939

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. దారులు వేరే యైనను
    బారులు తీరుచును బోవ వాహన ములనన్
    నేరుగ వంతెన దాటగ
    చేరును గమ్యమ టంచు చెలువము తోడన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘గమ్య మటంచు’ అన్నచోట గణదోషం. ‘గమ్య మ్మటంచు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  3. మానవసృజన ధిషణకు మచ్చు తునక
    ఇన్ని వాహనములొకచో నేక రీతి
    సాధు సహచర గాములై జనుట వింత
    మనిషి మేధకసాధ్యంబు మహిని గలదె

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులతో...

    కారుముందు కారు! కారువెనుక కారు!
    కారు పార్శ్వములను గార్లె కార్లు!
    కార్లు నిండియున్న గమనవేగము మిన్న!
    కాని, యాక్సిడెంట్లు కానెకావు!!

    రిప్లయితొలగించండి
  5. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మీ పద్యాన్ని చదవగానే ‘మేరా నామ్ జోకర్’ సినిమాలోని ‘తీతర్ కే దో ఆగే తీతర్, తీతత్ కే దో పీఛే తీతర్, ఆగే తీతర్ పీఛే తీతర్... బోలో కిత్‍నే తీతర్’ పాటు గుర్తుకు వచ్చింది.

    రిప్లయితొలగించండి
  6. కారు కారు ముందు కారు కారే కారు
    కారు కారు వెనుక కారె కారు
    కారు మారె రారు కారులేక జనులు
    కారు బారు తీరు జోరు జోరు

    రిప్లయితొలగించండి
  7. నాకక్కడ ఇంకేమీ కనబడట్లేదు....కారుల బారు తప్ప...

    కారు కారు కారు కారు కారే కారు
    కారు కారు కారు కారు కారు
    కారు కారు కారు కారు కారే కారు
    కారు కారు కారు కారు కారు

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వృత్త్యనుప్రాసతో మీ పద్యాలు హృద్యంగా ఉన్నాయి. అభినందనలు.
    ద్రోణాచార్యుడి ముందు అర్జునుడిలా మీకు కారే కనిపించింది. ధర్మజాదుల్లా మేము కార్లతోపాటు రోడ్లు, ఫ్లైఓవర్, చెట్లు, భవనాలు అన్నీ చూస్తున్నాము!

    రిప్లయితొలగించండి
  9. రాత్రి ,పగలు కూడ రయ్యుమనుచు కార్లు
    బళ్ళు ,కాలి నడక వారు పోవు
    చుండ్రి చూడు మచట చోద్యము గాలేదె
    వారి వేగ మాప నేరి తరము ?

    రిప్లయితొలగించండి
  10. కారులు బారులు దీరుచు
    జోరుగ బోవంగ జూడ చోద్యము గాదే
    దారులు వేరుగ నున్నచొ
    చేరు నటుల వాహనములు సేమంబుగనే!!!

    రిప్లయితొలగించండి
  11. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఉన్నచొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘వేరుగ నున్నను’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
    దారు లందు రహిని రయము తోడ
    వాహనముల యందుబయనించ వచ్చును
    భయము లేక జనులు భద్రముగను.

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
    దారు లందు రహిని రయము తోడ
    వాహనముల యందుబయనించ వచ్చును
    భయము లేక జనులు భద్రముగను.

    రిప్లయితొలగించండి
  14. ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
    దారు లందు రహిని రయము తోడ
    వాహనముల యందుబయనించ వచ్చును
    భయము లేక జనులు భద్రముగను.

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
    దారు లందు రహిని రయము తోడ
    వాహనముల యందుబయనించ వచ్చును
    భయము లేక జనులు భద్రముగను.

    రిప్లయితొలగించండి
  16. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. జోరుగ లోహవిహంగము
    చేరిచె నను వేల మైళ్ళు శీఘ్రపు రీతిన్!
    బారులు దీరగ కారులు
    చేరెద నేనింటికెపుడు చెప్పగ దరమా?

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    అది ట్రాఫిక్ జామ్ అన్న విషయాన్ని మీరొక్కరే గ్రహించారు (ఇప్పటివరకు). ఆ చిత్రం చైనాలో ఒకానొక సందర్భంలో జరిగిన ప్రపంచంలో రికార్డ్ సృష్టించిన పెద్ద ట్రాఫిక్ జామ్‍కు సంబంధించినది(ట!).

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. జనుల జీవనమ్ము స్తంభించె నచ్చోట
    కారులమయమవ్వ దారులన్ని
    గాలి కలుషిత మవ గాఢమౌ పొగతోడ
    శబ్ద కాలుష్యమ్ము జటిలమయ్యె

    రిప్లయితొలగించండి
  21. కారులు బారులు తీరిన
    తీరును గని దారి తెన్ను దెలియనివారై
    కారణమేమియొ తెలియక
    నోరెళ్ళగబెట్టిరే వినోదము చూడన్.

    రిప్లయితొలగించండి
  22. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘పద్ధతి+ అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కాలుష్యమ్ము’ అన్నచోట గణదోషం. ‘శబ్దకల్మషమ్ము’ అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ఆకాశంబున చుక్కలు
    ఈకాలపు భూమి ఫైన నెంచగ కార్లే
    లోకములో లెక్కించుట?
    ఏకంప్యూటర్ల కగును?నెంచుటకిలలో|
    2.కారుపుకార్లు గాదట షికారులు బోవగ షావుకారులీ
    కారుల బారులన్నియు|-వికారము లేకను మార్గమందునే
    దారియు జూపుచున్ విధి విధానము లందున వెళ్లు చుండు|ఆ
    కారము లన్ని పారుట|సకాలము నందునజేరు టందుకే.
    3.క్రమ శిక్షణయే రక్షణ
    క్రమమే లేకున్న?భువిన కష్టము లెన్నొ
    అమరిక నద్భుతరీతిగ
    గుమిగూడిన కార్లుగనగ? గోప్యముగాదే|

    రిప్లయితొలగించండి