24, జూన్ 2015, బుధవారం

పద్య రచన - 940

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. శివకేశవుల కభేదము
    భవితవ్యము తీర్చి దిద్దు భగవంతు డనన్
    దివినుంచి భువికి నేతగ
    భవబంధ ములను ద్రుంచి భక్తుల గాచున్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘భవబంధమ్ములను ద్రుంచి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. స్మరణముఁ జేయుచు నెపుడు సంగము వర్జనఁ జేయఁ
    దరణముఁ జేయ హరిహరధర్మము! నీదు యత్నమును
    మరణము పర్యంతమీవు మానరాదు నరవర! యిదె
    తరుణము! నీ యలసతను దైన్యమునిక వీడుమయ్య!

    రిప్లయితొలగించండి
  4. నెమలి పించ మిచట నెలవంక యచ్చట
    నగలు యిచట కాల నాగు లచట
    చూడ చక్రమిచట శూలమ్ము గననట
    గ్రద్ద యిచట బొల్లి యెద్దు అచట
    గట్టి వలువలిట గజచర్మ మచ్చట
    గంధమిచట బూది కాంతులచట
    నల్లరూపమిచట తెల్లని మేనట
    లచ్చి యిచట గన బిచ్చ మచట

    పైకి జూడనిట్లు బాగుగా భేదమ్మె
    లోతు దెలియుడయ్య రీతి దెలిసి
    హరిని హరుడు నిలచు హరు లోన హరియుండు
    హరుడె హరియు తెలియ హరియె హరుడు



    రిప్లయితొలగించండి
  5. హరి హరులకు బేధము లేదను శ్రీగోలి వారి పద్యాలు భళా!

    రిప్లయితొలగించండి
  6. చంద్ర రేఖను బూను సాంద్ర బర్హమ్మూను - హరియె హరుడొ లేక హరుడె హరియొ
    ఫణధరమ్మును దాల్చు పట్టు బట్టను దాల్చు - హరియె హరుడొ లేక హరుడె హరియొ
    త్రిశిఖమ్ము జేబూను శ్రీ చక్రమును బూను - హరియె హరుడొ లేక హరుడె హరియొ
    నంది వాహన మెక్కు నాగాశనంబెక్కు - హరియె హరుడొ లేక హరుడె హరియొ
    లయము సేయ సృష్టి చయమును పోషించు
    హరుడు తానె మరియు హరియు తానె
    వ్యక్త పరచె మనకు హరిహర తత్వమ్ము
    శంకరాభరణము సార్ధకమ్ము

    రిప్లయితొలగించండి
  7. భక్తుడు...

    ముక్కోటి దేవతలఁ దా
    మ్రొక్కగ నొక రాయి లోన రూపముఁ గనుచున్!
    ముక్కంటినిఁ గనలేడా?
    చక్కగ హరిలోన నిమడ సర్వేశ్వరునిన్!

    రిప్లయితొలగించండి
  8. చిత్ర మయ్యది జూడుము సీత ! నీవు
    హరుడు మఱియును గనిపించె హరియు కూడ
    భిన్న రూపాలు గలిగిన పెన్నిధు లిల
    వంద నంబులు సేతును వారి కిపుడు

    రిప్లయితొలగించండి
  9. చిత్ర మయ్యది జూడుము సీత ! నీవు
    హరుడు మఱియును గనిపించె హరియు కూడ
    భిన్న రూపాలు గలిగిన పెన్నిధు లిల
    వంద నంబులు సేతును వారి కిపుడు

    రిప్లయితొలగించండి
  10. కం:ఇలలో నాకవి తిక్కన
    కలలో కన్పించినట్టి కరుణామూర్తీ
    కొలిచెద ననవరతము నిను
    నలసింపక కావుమయ్య హరిహరనాథా.

    కం:గరళము మింగిన భవుడవు
    శిరమున కేకీకదాల్చు శ్రీహరి వీవం
    చెరుగక భ్రాంతిన్ బడుదురు
    అరయగ నిరువురునొక్కరె హరిహరనాథా.

    ఆ.వె:శిరముపైన గంగ శివశంకరునకు
    శిరమున నెమలీక శ్రీహరికిని
    ద్వందరూపు తోడ దరిసెన మొసగి మా
    చింత దీర్పుమయ్య చిద్విలాస.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాల బాగున్నది. అభినందనలు.
    ‘నగలు+ఇచట, ఎద్దు+అచట’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నగలేమొ యిట..., ...యెద్దది యట’ అందామా?
    *****
    విజయకుమార్ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కం:ఇలలో నాకవి తిక్కన
    కలలో కన్పించినట్టి కరుణామూర్తీ
    కొలిచెద ననవరతము నిను
    నలసింపక కావుమయ్య హరిహరనాథా.

    కం:గరళము మింగిన భవుడవు
    శిరమున కేకీకదాల్చు శ్రీహరి వీవం
    చెరుగక భ్రాంతిన్ బడుదురు
    అరయగ నిరువురునొక్కరె హరిహరనాథా.

    ఆ.వె:శిరముపైన గంగ శివశంకరునకు
    శిరమున నెమలీక శ్రీహరికిని
    ద్వందరూపు తోడ దరిసెన మొసగి మా
    చింత దీర్పుమయ్య చిద్విలాస.

    రిప్లయితొలగించండి
  13. కం:ఇలలో నాకవి తిక్కన
    కలలో కన్పించినట్టి కరుణామూర్తీ
    కొలిచెద ననవరతము నిను
    నలసింపక కావుమయ్య హరిహరనాథా.

    కం:గరళము మింగిన భవుడవు
    శిరమున కేకీకదాల్చు శ్రీహరి వీవం
    చెరుగక భ్రాంతిన్ బడుదురు
    అరయగ నిరువురునొక్కరె హరిహరనాథా.

    ఆ.వె:శిరముపైన గంగ శివశంకరునకు
    శిరమున నెమలీక శ్రీహరికిని
    ద్వందరూపు తోడ దరిసెన మొసగి మా
    చింత దీర్పుమయ్య చిద్విలాస.

    రిప్లయితొలగించండి
  14. హరిహరుని రూపమందున నవని యందు
    దేవ దేవుడు కనుపించె దివ్యముగను
    తనకుతాను భక్తులఁబ్రోచు తలపుతోడ
    చూచి కొల్చిన వారికి శుభము గల్గు

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. రక్తిలేక హరియు శక్తి లేకశివుడు
    హరి,హరులును గూడి అంద మైన
    రూపు దాల్చ?”వారి రూపము గనుగొని
    తిక్క నార్యుడనెను నిక్కమనుచు|
    {తిక్కనసోమయాజికల}
    2బేధ మెక్క డుండె?వాదన లందునే
    సాధ నాన భక్తి సాగు జేయ?
    మోదమొసగు నట్టి మోహన రూపమే
    హరి హరుండు నిలచె హరి హరాన|
    {కర్నాటకయందలి హరిహరయందు అమరశిల్పి
    జక్కణచెక్కిన హరిహర శిల్పంగుర్తు జేసినకంది
    శంకరయ్యగారికిధన్యవాదాలు.}

    రిప్లయితొలగించండి
  17. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘కళాకృతి+ఎంచగా’ అన్నప్పుడు సంధి లేదు. ‘కళాకృతిన్ గనన్’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. గణ, యతి దోషాలున్నవి. ‘హరిగ నేలున హర్నిశల్ ముజ్జగమ్ములు’ అనండి. ‘బ్రహ్మజ్ఞాన’ మన్నప్పుడు ‘హ్మ’ గురువై గణదోషం. చివరిపాదంలో యతిదోషం. యడాగమ దోషాలున్నవి. ‘ధరుడు+ఎంచి, అంచితుండు+ఏకమేవ’

    రిప్లయితొలగించండి
  18. హరిహర బేధ మేమియును నంట దటన్న నిరూపణంబుకే
    శిరమున పించమున్ మరియు చేరిన చంద్ర కళా కృతిన్గనన్
    మరువరు భక్తు లెల్లరును మానసమందు సచిత్ర రూపమున్
    కరుణ కటాక్షమేమనకు కామిత సిద్దికి మూల హేతువౌ|

    రిప్లయితొలగించండి
  19. మురళీధర పరమేశ్వర
    సిరినాయక గౌరినాధ చిన్మయమూర్తీ!
    శరణంచును వేడుకొనెద
    హరిహర రూపాన వెలయు నంతర్యామిన్!!!

    రిప్లయితొలగించండి
  20. సీ.
    హరియంచు నేలున హర్నిశల్ జగముల
    హరడగు చునుదానె హర్త యగును
    గరుడునె క్కిజనుచు గారుడ ములసేయు
    నందివా హనుడుగ నటన జేయు
    శశిరేఖ, శూలమ్ము, చక్రమ్ము, శిఖిపింఛ
    ధారణ మ్మొనరించి దనరు చుండు
    కౌస్తుభ కౌమోద కములకు హరిగాగ
    నాగభూషలవిశ్వ నాథుడగును
    ఆ.వె
    అరయ నిర్వు రునొక టైనమూర్తిగ వెల్గ
    హరిహ రాద్వ యవపు షంబు దాల్చి
    కేశవ శివులనుట కేవలమజ్ఞత
    యనుచు దెల్ప నిటుల నవత రించె

    రిప్లయితొలగించండి
  21. గురువు గారూ
    రెండవ పంక్తిలో హరుడ బదులుగా హరడ అని టైప్‌ అయింది
    క్షమించండి

    రిప్లయితొలగించండి
  22. గురువు గారూ
    రెండవ పంక్తిలో హరుడ బదులుగా హరడ అని టైప్‌ అయింది
    క్షమించండి

    రిప్లయితొలగించండి
  23. పులితోలును గజచర్మము
    చలిమల కొలువును శ్మశానచరి శివుడనగా
    నెలవట పాలసముద్రము
    కలుములు హరి హరు లొసంగి కరుణి౦తు రిలన్
    సిరు లలలుగ భాసి౦చును
    మరలి౦పుడు మనసునుండి మమకారములన్
    స్మరియింపుడు మోక్షమంద
    హరిహరులన్ శరణు జొచ్చి అహముడుగంగా
    హరిహరులకభేద మనుచు
    పరమాత్మకు రూపు గుణము పరిమాణమ్మున్
    తరతమ భేదము లేదని
    ఎరుగుడనుచు తిక్కయాజి యేర్పడ గొలిచెన్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ అద్భుతంగా ఉంది మీ హరిహరవర్ణన.

    విజయకుమార్ గారు, ఈశ్వరప్ప గారు, మూర్తి వై యస్ ఎ ఎన్ గారు, నాగరాజు గారు వీరు కూడా హరిహరులను అందంగా వర్ణించారు.

    రిప్లయితొలగించండి


  26. విజయకుమార్ గారు,హనుమచ్చాస్త్రి గారు వ్రాసిన సీసపద్యాలు చాలా బాగున్నవి.మిగిలిన వారు వ్రాసిన పద్యాలు కూడా అన్నీ అలరిస్తున్నాయి.హరిహరుల అభేదత్వం సబ్జెక్టు గా ఇవ్వడం వలన మంచికవిత్వం వెలువడిందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  27. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    ‘భేదమును లేక’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థనారాయణ మూర్తి గారూ,
    సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ, ‘కమనీయం’ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. ​హరి హరు లొక్కటే ననుచు నందముగా బహు కౌశలమ్ముతో
    హరినొక వైపు నా హరుని యర్థ శరీరము మొక్క వైపునన్
    ​వరుసగ భూషణమ్ములను వారల శస్త్రములన్ని జూపుచున్
    ​మురిపెముగాను గీసితివి మ్రొక్కెద నోయి సుచిత్రకారుడా​!

    రిప్లయితొలగించండి
  29. మాస్టరు గారూ ..యడాగమంరాకుండా పూరించడానికి ప్రయత్నించాను..కానీ కుదరలేదు..చక్కని సవరణలను తెలిపారు..ధన్యవాదములు...బూది కాంతి బదులు..బూది కంఫు గా మార్చాను..బా గుందంటారా...
    కవిమిత్రులు సహదేవుడు గారికి, మిస్సన్న గారికి, కమనీయంగారికి ధన్యవాదములు...


    సవరణతో
    సీసము:
    నెమలి పించ మిచట నెలవంక యచ్చట
    నగలేమొ యిట కాల నాగు లచట
    చూడ చక్రమిచట శూలమ్ము గననట
    గ్రద్ద యిచట బొల్లి యెద్దదియట
    గట్టి వలువలిట గజచర్మ మచ్చట
    గంధమిచట బూది కంపులచట
    నల్లరూపమిచట తెల్లని మేనట
    లచ్చి యిచట గన బిచ్చ మచట

    ఆ.టవెలది: .
    పైకి జూడనిట్లు బాగుగా భేదమ్మె
    లోతు దెలియుడయ్య రీతి దెలిసి
    హరిని హరుడు నిలచు హరు లోన హరియుండు
    హరుడె హరియు తెలియ హరియె హరుడు

    రిప్లయితొలగించండి
  30. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఒక్కటే యనుచు... శరీరము నొక్కవైపునన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  31. గురుదేవులకు వందనములు. సవరణతో...

    ​హరి హరు లొక్కటే యనుచు నందముగా బహు కౌశలమ్ముతో
    హరినొక వైపు నా హరుని యర్థ శరీరము నొక్క వైపునన్
    ​వరుసగ భూషణమ్ములను వారల శస్త్రములన్ని జూపుచున్
    ​మురిపెముగాను గీసితివి మ్రొక్కెద నోయి సుచిత్రకారుడా​!

    రిప్లయితొలగించండి