28, జూన్ 2015, ఆదివారం

పద్య రచన - 944

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. వ్యాసుని భారతమును మరి
    వాసిగ పోతన్న వ్రాత భాగవతమ్మున్
    ధ్యాసగ రామాయణమే
    మోసిన మా వ్యాసపీఠ మునకిడుదు నతుల్.

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మయ్యది చూసియు చెప్పు చుంటి
    వ్యాస భగవా ను డా దిగా వ్రాసి నట్టి
    పరమ పావన మైనట్టి ప్రతుల మోయు
    వ్యాస పీ ఠమునకు సేతు వంద నములు

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పొచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
    ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
    నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
    భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగ

    రిప్లయితొలగించండి
  5. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రసరమ్య భూయిష్ట రఘురామ చరితంబు
    .......... రామాయణంబుగా రహివహించె
    శ్రీకృష్ణదేవుండు ప్రేమాతిశయముచే
    .......... గీతార్థ సారంబు ఖ్యాతి నొందె
    భక్తాగ్రగణ్యుల పరమ పావన చరి
    .......... త్రంబెల్ల భాగవతంబులయ్యె
    శతకాఖ్య గ్రంధంబులతి పూజ్యతమములై
    .......... పండిత పామర వ్యాప్తి గనెను

    భవ్య సద్గ్రంథరాజము లవ్యయముగ
    నీదు పీఠమ్ముజేరి సందీప్తమయ్యె
    నిట్టి వర కార్య మొనరించ నెంత ఫలమొ
    వందనమ్ముల జేతునో వ్యాసపీఠి.

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
    ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
    నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
    భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగు

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
    ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
    నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
    భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగు

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
    ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
    నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
    భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగ

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
    ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
    నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
    భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగు

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
    ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
    నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
    భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగు

    రిప్లయితొలగించండి
  12. పుస్తకమును వడ్డించగా?విస్తరయ్యు
    షడ్రుచుల సాహితిని బంచు చదువరులకు|
    నీతి శాస్త్రాల పీఠమానెగడవేల?
    పాఠకాళికి సహనంబు పంచి ఫలమ?
    2.వ్యాస సంహిత కూర్పు వసతికి నిలచిన?
    -------వ్యాస పీఠమిపుడు-వ్యాప్తి లేదు|
    పౌరాణికాంశాల పఠనకుతోడ్పడు
    ------వ్యాస పీఠమిపుడు –వ్యాప్తి లేదు|
    దినచర్య చదువుకు ననువుగ మారేటి
    ------వ్యాసపీఠమిపుడు వ్యాప్తిలేదు|
    వయసు మీరిన వారి ప ఠణకురక్షణ
    ------వ్యాసపీఠ మిపుడు వ్యాప్తిలేదు|
    నేటి గ్రంధాల,బంధాల పోటి యేది?
    ల్యాపుటాపులు,సెల్ ఫోను లావరించ?
    మార్పు లందున మహిమచే మరుగు బడెన?
    వ్యాసపీఠము లెంచనివారు బెరుగ?

    రిప్లయితొలగించండి
  13. పూర్వకాలమందు పొత్తములఁజదువ
    వ్యాసపీఠము కడు వాసి కెక్కె
    నేటి కాలమందు మేటి కంప్యూటరు
    లందు చదువుట కడు యలకనయ్యె

    రిప్లయితొలగించండి
  14. భారత బాగవతాదులు
    నేరుగ పీఠమున బెట్టి నేర్పుగ బెద్దల్
    తీరుగ చదువుటకొరకై
    భూరిగ నీ వ్యాసపీఠము నుపకరింతుర్!!!

    రిప్లయితొలగించండి
  15. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    వ్యాసపీఠంపై మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    వ్యాసపీఠంయొక్క ఉనికిని గురించిన మీ పద్యాలు చాల బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    పద్యం చివర ‘చదువుట సునాయాస మయ్యె’ అంటే ఇంకా బాగుంటుందనుకుంటాను.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. తాళపత్రము లందున తనరు నట్టి
    గ్రంథ రాజములను దాల్చికరమునందు
    చదువ భారమ్ముగా నెంచి సహృదయమున
    వ్యాసపీఠములన్ దీర్చి రార్యులపుడు.

    పుస్తకమ్ములు చిన్నవై పుడమి నందు
    బల్ల పైనుంచియో చేతఁ బట్టి నేడు
    చదువు చుండగ జనులెల్ల వదలినారు
    వ్యాసపీఠమ్ములనువాటి ధ్యాసమరచి.



    రిప్లయితొలగించండి