3, మార్చి 2016, గురువారం

పద్యరచన - 1182

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

34 కామెంట్‌లు:

  1. పామును బట్టగ గృధ్రము
    వ్యోమము నందుండి వ్రాలె వోగిర మనుచున్
    సేమము లేదిక నీకని
    నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది.
      ‘వ్రాలె నోగిర మనుచున్’ అనండి. ‘వో’తో మొదలయ్యే పదాలు తెలుగులో లేవు.

      తొలగించండి
    2. పామును బట్టగ గృధ్రము
      వ్యోమము నందుండి వ్రాలె నోగిర మనుచున్
      సేమము లేదిక నీకని
      నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్

      తొలగించండి

  2. నీ నాథుడు లోకములే
    లే నాథుడుర ఖగరాజ ! లేమిన యుంటిన్
    నానా విధముల వేడెద
    నీ నాథుని వోలె కరుణ నీవును జూపన్

    రిప్లయితొలగించండి

  3. నా నాథుడు నీ నాథుడు
    మానగు దేవుళ్ళుగాదె! మరి నను యిటులన్
    నీ నఖముతో పొడిచి నీ
    వే నను జంపుట తగదుర ! వేడితి గానన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండవ పద్యం బాగున్నది.
      ‘మరి నన్నిటులన్’ అనండి. ‘నను+ఇటులన్’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  4. దండధర పాశ బంధన
    మండితము కఠోర ఘోర మరణాస్పదమున్
    భండన భీభత్సుండు
    ద్దండ ఖగేశ్వరుని పోరు ధరణిన్ ఫణికిన్

    రిప్లయితొలగించండి

  5. తనదుకాళ్లతోపామునునొనరబట్టి గద్దయక్కడతినుటకుసిధ్ధమయ్యె బ్రహ్మసృష్టియేయదిగదబలముగలుగు వారలుబలహీనులనిలబట్టితినుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈమధ్య మీరు పాద విభాగం చేయడం లేదు. డెస్కుటాపు కాకుండా ఫోను కాని, టాబ్లెట్ కాని వినియోగిస్తున్నారా?

      తొలగించండి
    2. నమస్కారములు.మీరు ఊహించినది నిజమే.ఫోను ద్వారా పంపుచున్నానండి

      తొలగించండి
  6. నీలకంఠుని సేవించు నిడుదవెన్ను
    జంపబూనుట న్యాయమా? శరణమంటి
    హరిని నమ్మిన వాడవే గరుడరాజ
    హరిని నేనైతి వదులుమా కరుణ తోడ

    హరియే గద నీదైవము
    హరుడను సేవించువాడ నాభరణమ్మై
    శరణము గోరితి యనఘా
    కరుణించుము పక్కిరాజ కాపాడుమురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. విరించి గారు శరణాగతముగ మీ కరుణారసపూరిత పద్యములు చాలా బాగున్నవి. రెండవ పద్యము లో “ గోరితి ననఘా” అంటే బాగుంటుంది.

      తొలగించండి
  7. మురియుచు నాగును బట్టుకు
    పరికించుచు యున్న గరుడ పక్షిని గనుచున్
    దొరికితినని వాపోవుచు
    కరుణను నను విడువు మనుచు ఖగమును వేడెన్!!!

    రిప్లయితొలగించండి

  8. .హరికి శయనమేను హరివాహనుడవీవు
    భావ్యమౌన యిటుల పరిభవింప
    కలసి మెలసి యున్న కలతయుండదుగదా
    కరుణజూపుమయ్య గరుడ రాజ.

    హరియెక్కును నీమూపున
    హరి పవళించును సుఖముగ ననిశము నాపై
    నరమరికలేల మనకిట
    గరుడా యనుచా యురగము కనలుచు యడిగెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘గరుడా యని యా యురగము...’ అనండి.

      తొలగించండి
  9. భూమిపైనను నడయాడు భోగిఁగాంచి
    మంచి యాహారము దొరికె నంచు నెంచి
    వాడి యగు కాళ్ళ తోడుత పట్ట గ్రద్ద
    తప్పుకొనలేక సర్పమ్ము తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  10. నాపై పరుండు దైవము
    నీపై పయనించువాడు నిర్మలమూర్తౌక
    ఆప ద్బాంధవు డాహరే
    ఆపన్నుని నన్ విడువుమ అంజలులిడుదున్ !

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      ‘మూర్తి+ఔ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మూడవపాదంలో గణదోషం. ‘హరే’ అన్నచోట ‘హరి’ అంటే సరి.

      తొలగించండి
  12. { పాముతోగ్రద్దపలికిన పలుకులు}
    3.3.16. గరళ కంఠుని వోలె-గరళము గలదని
    ------------పడగ పైకెత్తిన పట్టగలను
    హరునికంఠమునకు-ఆభరణము నేన
    ----------ని-అహము నెలకొన్న? నెగడలేవు
    పార్వతీశునిహరి –పలుకరించు నపుడు
    --------గర్వాన తలయెత్త గాంచినాను
    అండజములుదిని –ఆనందమొందకు
    -------వంశ వృద్దిని ద్రుంచు వైరిగాన?
    విషపు కోరల నణచు వేవేగ మందు
    కాలి గోళ్ళను కత్తులే చాలు-నిన్ను
    సంహరించగ గ్రద్ద నై సంచరించి
    తలకుపొగరున్న?తలదన్ను తలపు నాది

    రిప్లయితొలగించండి
  13. పడగెత్తి నిన్నెదుర్కొన
    నడవులలో పుట్టలందు నావాసముగా
    కుడిచెదను పవనములనే
    కడతేర్చకుమన్న గరుడ కరుణన్ గనుమా

    రిప్లయితొలగించండి
  14. నిదురించు పాన్పు నేనును!
    కదిలించెడు వాహమీవు కరివరదునకున్!
    వదలమని వేడుకొనియెద
    సుదర్శనము రాక మునుపె చూడుము దయగన్!

    హరిహరులిరువురి కడ నా
    పరపతి నీవెరుగవె? హరి వాహన ఖగమా!
    మొరవినగ వేడుకొనియెద
    పరాత్పరులు రాక మునుపె పట్టును విడుమా!

    రిప్లయితొలగించండి
  15. చిక్కెను పామను కొంటివొ
    నొక్కుచు ఖగపతి! ముదమున నోటిని గూర్చన్
    నిక్కముగా తెలియ గలవు
    చక్కని రబ్బరది బొమ్మ చైనీయులదౌ :)

    రిప్లయితొలగించండి