14, మార్చి 2016, సోమవారం

సమస్య – 1972 (బెండచెట్టుకుఁ గాచెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ.

44 కామెంట్‌లు:

  1. దండి గాపాతె గింజలు ధరను దొలిచి
    చిలక రించగ నీటిని మొలక లొచ్చె
    మేలు రకమని దెచ్చితి వీలు గాను
    బెండ చెట్టుకుఁ గాచెను బీర కాయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు. ‘మొలక లమరె’ అందామా?

      తొలగించండి


  2. జన్యు శాస్త్రపు ఫలితము జనులు చూడ
    మనిషి చేసెను మహిలోని మహిమ చిన్ని
    మార్పు, తరచి చూడ మధుర మయ్యె గదర
    బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కాయగూరల తోటలోఁ గంటి నేను
    స్నేహ హస్తముఁ జాచెడు చెలియ వలెను
    సాగి చుట్టుచు నొక బీరతీగ యెగసి
    బెండ చెట్టుకుఁ,గాచెను బీరకాయ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిమిత్రులు కూరగాయలు చక్కగా పండించారు

      తొలగించండి
    2. సహవాస సౌమనస్యము
      సహాను బెండయనుబీర సహనము గానన్
      సహనావవతు యనెడు వే
      ద హవనపు భరత గమనము ధన్యము సుమ్మీ !

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      చక్కని ఊహతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
      ****
      జిలేబీ గారూ,
      మంచి పద్యాన్ని చెప్పారు, కాని రెండవపాదం అర్థం కాలేదు.

      తొలగించండి
  4. 1.
    బెండ చెట్టుకు కాచెను బీరకాయ
    లంత పరిమాణ మందున న్నబ్బురముగ
    బెండకాయలు ఫలియింప వింత యేమి?
    ఘనత సంకరజాతి వంగడము దేను

    2.
    ఆధునిక శాస్త్ర వేత్తల యద్భుతమగు
    కృషి వలన వింత లెన్నియొ సృష్టి జరిగె
    గుమ్మడిపరిమాణమ్మున నిమ్మ మారు
    బెండ చెట్టుకు కాచెను బీర కాయ

    3.
    కూరగాయల బండించు కోర్కె తోడ
    పెరటిలోసాగు జేయంగ నరువ దేడు
    కాయలన్ ఫలి యింపగ గాంచితినొక
    బెండ చెట్టుకు, కాచెను బీరకాయ
    నొకటె నయ్యెనదియు కూడ నుడుత పాలె

    రిప్లయితొలగించండి
  5. నిన్నటి సమస్యకు పూరణ...

    మధుసూదను సన్నిధిలో
    విధివిధమున పూజజేసి వేకువ భక్తుల్
    అధినాయక సుధ గీతా
    మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్

    రిప్లయితొలగించండి
  6. బీరతీగెను చక్కగా పెరటిలోన
    నేల ప్రాకగ జేయక నేను గడితి
    పక్కనున్నట్టి బలమైన పచ్చనైన
    బెండ చెట్టుకుఁ,గాచెను బీరకాయ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      ‘భక్తుల్ అధినాయక’ అని విసంధిగా వ్రాశారు. ‘వేకువ జను లా| యధినాయక..’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. మెండుగ నెరువు నీరును మేదిని నిడి
      కండగల విత్తులను జల్లి కాల మెరిగి
      కలుపు తీయగ నేపుగఁ గాండమూని
      బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ.
      [బీర = పెద్ద]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  8. బెండకాయలువిరివిగాపెరటిలోన బెండచెట్టుకుగాచెను,బీరకాయ శివునియాకారముధరియించియిటమాపె
    రటన గాచెనుగనుటకురండిమీరు

    రిప్లయితొలగించండి
  9. కనులపండువగానిట కాయలెన్నొ
    బెండ చెట్టుకు గాచెను;బీరకాయ
    తీగ నల్లుకొని కాసెను తెరవులేక
    కూర గాయలు పండును కొరత లేక.

    2కూరగాయలు పెంచంగ కోర్కె కలుగ
    విత్తులన్నియు దెచ్చి తా పెరటిలోన
    వేసినంతనె కాయు వేలువేలు
    బెండ చెట్టుకు గాచెను బీరకాయ.

    3బెండచెట్టుకు గాచెను బీరకాయ
    చూచు చుండగ నెంతయొ చోద్యమయ్యె
    కాలమహిమ యనుచు విస్తు కలుగ జనులు
    వరుస కట్టుచు చూడంగ వచ్చిరటకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణ మూడవపాదంలో, రెండవపూరణ మూడవపాదంలో గణదోషం.

      తొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఇద్దరుమిత్రులు చాలాఏళ్లతర్వాత కలసితమాషాగామాతలాడుకున్నసంభాషణ
    ముదురుబెండవు నీకొక ముద్దుకొడుకు
    బీర పీచుగ గనుపించు కోరికున్న?
    బెండచెట్టుకు గాచెను బీరకాయ
    అనుచు నవ్వెను మిత్రుండు హాస్యమందు. {తండ్రిముదురుబెండ=వయసుమీరినతర్వాతపెళ్లి|కొడుకుబీరపీచు=ఖర్చుజేయనివాడు}

    రిప్లయితొలగించండి
  12. బీరతీగలు సాగుచు బెండ చెట్టు
    చుట్టు నల్లుచు గాచెను సొంపు మీర
    జనులు గాంచుచు పల్కిరి గనుడు వింత
    బెండ చెట్టుకు గాచెను బీరకాయ

    రిప్లయితొలగించండి
  13. బెండ తోటను పెంచెను భీము డనెడు
    కర్షకు డొకడు పెరడున కష్ట పడుచు
    బీర విత్తన మందున చేరి యుంట
    బెండ చెట్టుకు కాచెను బీర కాయ .

    రిప్లయితొలగించండి
  14. పెంచ నేపుగా మొక్కల పెరటిలోన
    బీరతీగెలు పెనవేసె బెండతోడ
    బీరకాయలఁగాంచి యో పోరడనియె
    “బెండ చెట్టుకుఁగాచెను బీరకాయ”

    రిప్లయితొలగించండి
  15. విత్తనమ్ములు నాటగ బెండ , బీర
    దొండ , గుత్తులు గా వచ్చెదండి గాను
    బెండచెట్టుకుఁ , గాచెను బీరకాయ
    పాదు నిండుగ పందిరిన్ భారమయ్యె

    నిన్నటి సమస్యకు పూరణ

    మధు సూదన నామమునే
    కధలను కవితలను దలచి గళముల నెత్తన్
    మధుర తరంబను భక్తులు
    మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. తండ్రి పిసినారి చేయడు దానమెపుడు
    కొడుకు తండ్రిని కాదని కూర్మితోడ
    చేయు దానము నదిగని చెప్పు చుంద్రు
    బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. సవరించిన పద్యాలో సారి చూడండి అన్నయ్యగారూ
    కనులపండువగానిట కాయలెన్నొ
    బెండ చెట్టుకు గాచెను;బీరకాయ
    తీగ నల్లుకు కాసెను తెరవులేక
    కూర గాయలు పండును కొరత లేక.

    2కూరగాయలు పెంచంగ కోర్కె కలుగ
    విత్తులన్నియు దెచ్చి తా పెరటిలోన
    వేసినంతనె కాయును/కాసెను వేలువేలు
    బెండ చెట్టుకు గాచెను బీరకాయ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ సవరించిన పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. బెండ చెట్టుకు నల్లిన బీరతీగ
    కంటి కింపుగ నచ్చట గాయ గాసె
    చూపరులు జూసి బల్కిరి చోద్యముగను
    బెండ చెట్టుకు గాచెను బీరకాయ !!!

    రిప్లయితొలగించండి
  19. ఏడు కొండల కొలువైన ఎంకటేసు

    కరుణ యుప్పొంగి యొసగెను కలిమి యెల్ల;

    తానొకటి తల్చ. దలచెను దైవ మొకటి

    బెండ చెట్టుకు గాచెను బీర కాయ

    విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామముని రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ఉండ బట్టక పైలటు డొల్లగాను
    చండి వోలెడి కన్నియ చంకనిడగ
    రూప మపురూప మాయన రోమునందు
    బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ!

    రిప్లయితొలగించండి