20, మార్చి 2016, ఆదివారం

సమస్య – 1978 (తులసీదళము మనకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

62 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు
    మీ ఆరోగ్యం యెలా వుంది? జాగ్రత్త పడగలరని నా విన్నపం

    అవసాన దశలో వున్న వృద్ధుడి నోట మనవడిచే తులసితీర్థం పోయించిన క్షణమే తుదిశ్వాసవదిలిన తాతని చూసి పసివాడి యభిప్రాయముగా

    తులసీ దళమును వేసిన
    జలమును ద్రావించినంత చచ్చెను గాదే
    తెలియక వేసిరి వీరలు
    తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. నడుమునొప్పి తగ్గినట్టే తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తున్నది. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. తెలిసీ తెలియక పలికెను
    తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా !
    తులసిని కొలిచిన వారికి
    వలసిన శిరులిచ్చునట్టి వరలక్ష్మి యనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      ‘తెలిసియు...సిరులిచ్చునట్టి వరలక్ష్మి యగున్’ అనండి.

      తొలగించండి
    2. తెలిసీ తెలియక పలికెను
      తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా !
      తులసిని కొలిచిన వారికి
      తెలిసియు సిరులిచ్చు నట్టి వరలక్ష్మి యగున్

      తొలగించండి
  3. తెలిసియు తెలియని రచయిత
    కలమున జనియుంచు క్షుద్ర కథనపు రచనల్
    తలచిన మూర్కులఁ బెంచును
    తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓహొహో!!!
      భలే పూరణ అందించారు, ధన్యవాదములండీ

      తొలగించండి
    2. జిగురు సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ****
      ఊకదంపుడు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  4. అలసిన మనసున నిచటకు
    సొలసియు వచ్చితి , వెడలెద సొమ్ములు పోనాయ్
    వలదు యిక సెటిలుమెంటును
    తులసీ, దళము మనకు విషతుల్యమ్ము గదా

    రిప్లయితొలగించండి

  5. అలనాటి యండమూరిది
    తులసీదళము! మనకు విషతుల్యమ్ము గదా
    యిలలో నవలలు రచనలు !
    తలపుల నైనను పొగడకు తలవకు వాటిన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      ‘సొమ్ములు పోనాయ్’ అని రావిశాస్త్రి గారిని గుర్తు చేశారు. కాని అది మాండలికం కదా! ‘సొమ్ములు పోయెన్’ అనండి. ‘వలదు+ఇక’ అన్నపుడు యడాగమం రాదు. ‘వల దింక’ అనండి. ఇక్కడ ‘దళము’ను ఏ అర్థంలో ప్రయోగించారు?

      తొలగించండి

    2. కంది వారు !

      నెనర్లు ! కులాసాయే నా !

      దళము దండు అన్న అర్థం లో వ్రాసాను ;

      జిలేబి

      తొలగించండి
  6. కలదొక గంజాయి వనము ,
    నిలిచెను యందొక తులసి ,నిరుపమ దైవం,
    కలహపు గంజాయి లనెను
    "తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా"
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధా కృష్ణ రావు గారు నమస్కారములు. మీ పూరణ చాలా బాగుంది. “ దైవం” వ్యావహారిక పదము. సరియైన పదము దైవము. ఈ పాదము లో గణ, యతి దోషములు కూడా యున్నవి.
      “నిలిచెను యందొక్క తులసి నిజదైవమిలన్” అనవచ్చును. [నిజ = శాశ్వతమైన] “గంజాయు లనెను” అనండి.

      తొలగించండి
    2. కలదొక గంజాయి వనము
      నిలిచెను యందొక్క తులసి నిజ దైవమిలన్ ,
      కలహపు గంజాయు లనెను
      "తులసీ దళము మనకు విష తుల్యము గదా"
      కొరుప్రోలు రాధాకృష్ణ రావు
      శ్రీ పోచిరాజు గారికి నమస్కారములు

      తొలగించండి
    3. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కామేశ్వర రావు గారి సూచనల మేరకు సవరించినందుకు సంతోషం.
      ‘నిలిచెను+అందొక్క’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిలిచిన దందొక్క’ అనండి. అలాగే ‘గంజాయి యనెను’ అనండి.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. కలదొక గంజాయి వనము
      నిలిచిన దందొక్క తులసి నిజ దైవమిలన్ ,
      కలహపు గంజాయి య నెను
      "తులసీ దళము మనకు విష తుల్యము గదా"

      తొలగించండి
  7. అలపాలు గారుచున్నను
    తెలియక నే నోటనుంచి తినకుము, వినుమా !
    వలదిక త్రుంచకు జిల్లెడు
    తులసీ ! దళము మనకు విషతుల్యమ్ము గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఇప్పటివరకు చూసిన పూరణల్లో నాకు మీ పూరణ నచ్చిందండి. చక్కగా చేశారు. పూరణలను 1.పదాలను విరిచిగాని, లేక 2.ఇంకో అర్థాన్ని అన్వయిస్తూగానీ లేదా 3. సమాసాన్ని విడగొట్టిగాని చెబితేనే అందంగా ఉంటాయి. ఇక్కడ మీరు రెండు పనులూ[2 మరియు3] చేశారు. రెండు- తులసి అంటే వ్యక్తిపేరును తీసుకున్నారు.మూడు- దళమును తులసి నుండి వేరు చేసి జిల్లేడుకు అతికించి భలేగా పూరణ చేశారు. ధన్యవాదాలు.
      ఇట్లు
      డా. బోలుగద్దె అనిల్ కుమార్
      9502568218

      తొలగించండి
  8. (రోగ కారక క్రిముల స్వగతం)
    ఇలలో జనులకు జబ్బులు
    కలిగించు క్రిములము మనకు కంటకమగుచున్
    విలవిల లాడించెడి యీ
    తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఇలలో పుణ్యము నొసగును
    తులసీదళము మనకు;విషతుల్యమ్ము గదా!
    తులసి యనుమాటనృతము
    తులసిని కొలిచిన యొసగును తులలేని సిరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘తులసి యనుమాట యనృతము’ అనండి. అలాగే ‘కొలిచిన నొసగును’ అనండి.

      తొలగించండి
  10. నిన్నటి సమస్యకు పూరణ..

    ఆముదమును దెచ్చి యరచేత నిమురుచు
    సఖియ మర్దనమ్ము సరిగ జేయ
    నా ముదమును దలువ నాగిలిగింతల
    నడుము నొప్పి దెచ్చె గడు ముదమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. జలమిలఁ బ్రాణా ధారము
    ఫలవంతము నెంచ స్నాన పానాదులకున్
    సలలితము పూజ నీయము
    తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!
    [విషము = జలము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సలలితము అంటే ఏమని అర్థం తీసుకున్నారు సార్

      తొలగించండి
  13. చెలియా! పవిత్రమైనది
    తులసీ దళము , మనకు విషతుల్యమ్ము గదా
    యిలలో గన్నేరనుచును
    ఫలియించెడు కాయలు కడు భద్రము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  14. దళములఁ జల్ల రసాయన
    ముల చీడలు వీడి తలసి ముచ్చట గొలిపెన్
    జలమందు శుద్ధి జేయని
    తులసీ దళము మనకు విషతుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. తులసీదళమునునిట్లన
    తులసీదళముమనకువిషతుల్యమ్ముగదా
    కలలోనైననుభావ్యమె?
    తులసీదళముమనకమృతతుల్యమ్ముగాదె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. జలుబును దగ్గును మాపును
    తులసీదళము.మనకువిషతుల్యమ్ముగదా
    చిలుము కలంజము మత్తును
    కలిగించెడి నల్లమందు కల్లును త్రాగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. .తులసీ మొక్కను బెంచిన?
    ఫలితము లాయింటికబ్బు|భాగ్యముగని-“తా
    దలచెను దారిద్ర్యము-ఆ
    తులసీదళము మనకువిష తుల్యమ్ముగదా”.

    రిప్లయితొలగించండి
  18. ‘తులసీ’ యను దళమొక్కటి
    బలహీనుల దోచుకొనుచు బాధలు పెట్టన్!
    ఇలపై దాడులు జరిపెడి
    తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి
  19. ‘తులసీ’ యను దళమొక్కటి
    బలహీనుల దోచుకొనుచు బాధలు పెట్టన్!
    ఇలపై దాడులు జరిపెడి
    తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి
  20. పలు రుగ్మతలను బాపగ
    తులసీదళము ; మనకు విషతుల్యమ్ము గదా
    కలుషిత రసాయ నమ్ములు
    కలసిన శాకములు , పండ్లు , కనువిందైనన్

    రిప్లయితొలగించండి
  21. తులలేని సిరుల నొసగును
    తులసీదళము మనకు,విషతుల్యమ్ముగదా
    కలుషంబగునీరు కలువ
    మలినమ్ములను తొలగించి మంచిని కూర్చున్

    రిప్లయితొలగించండి
  22. తులలేని సిరుల నొసగును
    తులసీదళము మనకు,విషతుల్యమ్ముగదా
    కలుషంబగునీరు కలువ
    మలినమ్ములను తొలగించి మంచిని కూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [యుద్ధమున నోడిపోయి యరణ్యములందుఁ దలదాచుకొన్న యొక రాజు, తమకై వెదకెడు శత్రుమూకలఁ గని, తన యనుచరులతోఁ బలికిన సందర్భము]

    కలిమిఁ గొని, లేమి నిచ్చిన
    ఖలులౌ శత్రువులమూఁక ♦ కనఁబడె నదివో!
    నిలువెల్ల కంపన మ్మయె,
    తులసీ! "దళము" మనకు విష♦తుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణము:

      మిత్రులందఱకు నమస్సులు!

      [యుద్ధమున నోడిపోయి యరణ్యములందుఁ దలదాచుకొన్న యొక రాజు, తమకై వెదకెడు శత్రుమూఁకలఁ గని, తన భార్య తులసితోఁ బలికిన సందర్భము]

      కలిమిఁ గొని, లేమి నిచ్చిన
      ఖలులౌ శత్రువులమూఁక ♦ కనఁబడె నదివో!
      నిలువెల్ల కంపన మ్మయె,
      తులసీ! "దళము" మనకు విష♦తుల్యమ్ము గదా!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. k.s gurumurthiacharigari puranam
    ఇద్దరు ముస్లిం యువతలుఅనుకొన్నమాటలు
    పలికెను సలీమతో యిటు
    వలిభీ హిందులకు మనము వ్యతిరేకము-గో
    ఫలల మమృత భక్షణమగు
    తులసీదళము మనకు విష తుల్యమ్ముగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘వలిభీ హిందువులు మనకు వ్యతిరేకులు...’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. చాలా బాగుంది. చాలా చాలా చక్కని పూరణ

      తొలగించండి
  25. సలుపును మేలు నిజముగా
    తులసిదళము మనకు , విషతుల్యమ్ముగదా
    పలు గన్నేరుల కాయలు
    తెలుసుకొని చిరుతల కెప్డు తెలుపగ వలయున్ see

    రిప్లయితొలగించండి
  26. కలవర మౌచును మదిలో
    కలశములో నీరు జూచి కలవారింటన్
    కలరా క్రిమి యనియెనిటుల:
    "తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!"

    రిప్లయితొలగించండి
  27. తలనొప్పి కలిగి నంతనె
    వలవల విలపించి చనుచు వైద్యుని కడకున్
    బలుపగు సూదుల కలవడ
    తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!

    రిప్లయితొలగించండి