1, ఆగస్టు 2016, సోమవారం

సమస్య - 2103 (ధారాదత్తము సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

61 కామెంట్‌లు:


  1. ఈరీతిన్ షరతుల్ విధించ తగునే యింతీ మహా పాపమే
    ఘోరమ్మేయగునాస్తినంత లలనా కోరంగ నీపేరునన్
    మారామింతగ చేయుచున్న నినునేమార్చంగ లేనే చెలీ
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. సారంబేమియు లేని దుర్భరమునౌ సంసార వారాశిలో
    దారాపుత్రుల బాగుకై తననుతాన్ త్యాగమ్ముఁ గావించెనో!
    మారెన్ రోజులు బుద్ది వచ్చె మగువల్ మాటాడగా నమ్మునే
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్?

    రిప్లయితొలగించండి
  3. పారావారము వంటిలోక మునతా భార్యా విధేయంబునన్
    పేరాశన్ ధనధాన్య సంపదల నింపేయంగ గీమున్సదా
    వీరావే శమునందునన్ ప్రియముగా వేవేల రీతిన్ గనన్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్

    రిప్లయితొలగించండి
  4. శ్రీరాముం డలనాడు సీతకొరకై చేరెంగదా జింక నా
    నీరేజాక్షి కటంచు కృష్ణు డమరానీకంబునుం దాకె దా
    నీరీతింగన నాటినుండి భువిలో నేవేళ శౌర్యాదులన్
    “ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే” పూరుషుల్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. శ్రీగురుభ్యోనమః

    దశరథమహారాజు కైకేయితో

    "కోరన్ నీకిటు భావ్యమా తెలుపుమా కోపంబులన్ వీడుమా
    శ్రీరాముండటు కానలన్ దిరుగగా సిద్ధించునే సౌఖముల్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతా!దాసులే పూరుషుల్
    వారింపన్ తగు శక్తియుక్తులుడిగెన్ వార్ధక్య కాలంబునన్"

    అనుచు కైకకు బోధించి కనులలోన
    నీరు నిండగ దశరథనృపుడు తాను
    చేర బిలచుచు రాముడు చెంత జేర
    కుప్ప కూలెను దుఃఖము కప్పుకొనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సౌఖముల్ (సౌఖ్యముల్) టైపాటు...

      తొలగించండి
  6. ఔరా!యేమనవచ్చు!నీ కలిమహాత్మ్యమేమొ!శేషాద్రిపై
    పెరున్ గాంచిన వేంకటేశుడె సతిన్ ప్రేమించి పెండ్లాడగన్
    వేరొ౦డేదియు దారి లేక నిడడే వేలాది కోట్లన్ సిరుల్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే, పూరుషుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      'కలి మాహాత్మ్యమ్మేమొ..' అనండి. లేకుంటే గణదోషం. టైపు చేయడంలో దోష మనుకుంటాను.

      తొలగించండి
    2. గురుదేవుల సూచనమేరకు టైప్ దోషము సవరించిన పద్యము
      ఔరా!యేమనవచ్చు!నీ కలిమహాత్మ్యమ్మేమొ!శేషాద్రిపై
      పెరున్ గాంచిన వేంకటేశుడె సతిన్ ప్రేమించి పెండ్లాడగన్
      వేరొ౦డేదియు దారి లేక నిడడే వేలాది కోట్లన్ సిరుల్
      ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే, పూరుషుల్

      తొలగించండి
    3. తిమ్మాజీ రావు గారు నమస్సులు. చాలా బాగుంది మీ పూరణ. సాక్షాత్తు శ్రీమన్మహావిష్ణువునే కాంతాదాసుని జేశారు. అవునులెండి యాయన భక్తజన దాసుడే గదా! "పేరున్" ముద్రా రాక్షస మనుకుంటాను.

      తొలగించండి
    4. శ్రీ కామేశ్వర రావుగారికి ఎంత వారలైనా కాంత దాసులే కదా.కలిలో వెలసినందుకు. .
      టైప్ దోషమును సవరించినపద్యము
      ఔరా!యేమనవచ్చు!నీ కలిమహాత్మ్యమ్మేమొ!శేషాద్రిపై
      పేరున్ గాంచిన వేంకటేశుడె సతిన్ ప్రేమించి పెండ్లాడగన్
      వేరొ౦డేదియు దారి లేక నిడడే వేలాది కోట్లన్ సిరుల్
      ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే, పూరుషుల్

      తొలగించండి
  7. ఆరత్నాకర మిద్ధరా కలిత వేలాయత్త మైనట్టులన్
    వీరాగ్రేసర ధీరచిత్త కదనోద్వేగప్రభా శీలురున్
    ధారాళస్ఫుట విత్త దర్పిత మహా తంత్రజ్ఞ మేధావులున్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్

    రిప్లయితొలగించండి
  8. ఆరారాజు కుతంత్రముంగనక ధర్మాత్ముండు పాంచాలినిన్
    వీరావేశముతోడనొడ్డి తన ప్రావీణ్యంబుజూపింపగా
    పోరాముల్ వరియించెగాదె!ఘనప్రభూత్తంసు,సత్యాత్మునిన్
    ధారాదత్తముసేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రభూత్తంసు..' అన్నచోట గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారు నమస్సులు. "ఘనునా పుణ్యాత్ము" అనిన నెట్లుండును? అయిన యుధిష్ఠిరుఁడు ద్యూతదాసుడేగాని కాంతాదాసుడుకాదు గదా!

      తొలగించండి
    3. పోరాముల్ వరియించెగాదెఘనమౌ భూపాలు,సత్యాత్మునిన్....మాన్యులు శంకరయ్య గారికి.నమస్సులు. ఇపుడు సరిపోయిందనుకుంటాను.

      తొలగించండి
    4. కామేశ్వరరావు గారు నమస్సులు.మీ సూచన బాగున్నది. ధన్యవాదములు. ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టకుండ ఉన్నంత వరకు ఏమి ఇబ్బంది లేదు. పెట్టి ఓడిన పిదప ఆమె పలుకులను విని ఎదురుచెప్పలేక
      ఉన్నాడని భావించి అలా వ్రాశాను. మారుమాటాడక పోవుట కాంతాదాసత్వమే కదా!

      తొలగించండి
  9. కారుణ్యం బొకయింత చూపక మహా కాఠిన్యతా పూర్ణయై
    యా రామున్ వనగామి జేసి విభుగా నస్మత్తనూజాతు నిం
    పారన్ జేయు మటంచు కైక యనగా నట్లే నృపుండాడె నౌ
    ధారాదత్తము సేయ సంపదలు కాంతా దాసులే పూరుషుల్.

    "చేరంబోవను నీదు సన్నిధి కికన్, శ్రేయంబులం గోరగా
    నేరం బోవ త్వదీయవైభవములన్ నిష్ఠన్ సమర్పింపకే
    యే రీతిన్ సుఖమందబోవు విభుడా"! యిట్లెందు స్త్రీలాడగా
    ధారాదత్తము సేయ సంపదలు కాంతా దాసులే పూరుషుల్?
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. ధీరాగ్రేసర సార్వభౌమ బిరుదున్ దిక్పాలురన్ గెల్చితిన్
    పారావారపరీత రత్నచయ సద్భాగ్యంబులంబొందితిన్
    మారామేలనె సీతటంచుబలికెన్ మత్తుండు లంకేశుడే
    ధారాదత్తముసేయసంపదలు కాంతాదాసులే పూరుషుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'ధీరాగ్రేసర...బిరుదున్' దీనికి అన్వయం? 'సీత+అటంచు=సీత యటంచు' అని యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. శంకరయ్య గారికి నమస్సులు. ధీరాగ్రేసర బిరుదు లంకేశ్వరునకన్వయము. సీత యంచు..అనిన సరిపోవును కదా!

      తొలగించండి
  11. ఆరాటమ్మున మానవుండతను నిద్రాహారముల్ మానుచున్
    బోరాటమ్మునుజేయు నష్టసిరులన్ బొందంగ తానెంతయో ,
    యే రీతిన్ మనసొప్పు భాగ్యము బరాధీనమ్ము నే జేయుచున్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్ ?

    చేరన్ రమ్మని పిల్చినంత నిలలో స్త్రీ లోలురౌ మానవుల్
    వారస్త్రీలను జేరు కాముకులు పాపంబంచు యోచింపకన్
    నేరాలెన్నియొ జేసి పొందిన సిరుల్ నిర్లజ్జగా వారికీన్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మానవుం డతడు..' అనండి. మూడవ పాదంలో యతిదోషం. సవరించండి.

      తొలగించండి
    2. విరించి గారూ, "అష్టసిరులన్" సమాసము సాధువు కాదు. వేరే విశేషణమును వాడండి.

      తొలగించండి
  12. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఔరా ! సర్వజగద్విభు౦డు - హరి ,

    ............. భాగ్య౦ బెల్ల శ్రీ కిచ్చి తా

    వారాశిన్ భుజగమ్ము పైన శయని౦పన్ ,

    ............. మాన వు౦డె౦త నో !

    ధారాదత్తము సేయ స౦పదల కా౦తా దాసు లే

    ............. పూరుషుల్ ||

    " నారీ రత్నము లాధిపత్యమున కారాటి౦తు

    .................. రీ ధారుణిన్ "

    { ఆ రా టి ౦ చు = ఆ రా ట ప డు }

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. రారమ్మంచుఁ గిరీటిఁ గోరగ నపూర్వప్రేమ నా యూర్వశిం
      జేరంజాలను దల్లివంచుఁ ద్యజియించెన్వేగఁ బార్థుండటం
      గోరంజాలునె నన్ వరూథిని మహా ఘోరంబనెన్ విప్రుడున్
      ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్?

      తొలగించండి
    2. వేరే భావము నేర డాశుకుడు దా బింబోష్ఠులం జూచినన్
      రారమ్మాయని యూర్వశీసతియె కోరం గాదనెం బార్థుడే
      గోరంజాలునె నన్ వరూథిని మహా ఘోరంబనెన్ విప్రుడున్
      ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్?

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు (పద్యాలు వేరైనా భావం దాదాపు ఒక్కటే) ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అవునండి. ఒకటి వ్రాసిన తర్వాత మూడు పాదాలలో ముగ్గురుని యుదాహరించుదామని సవరణ తో రెండవది వ్రాసాను.

      తొలగించండి
  14. ప్రారబ్దంబటె? బిల్వ మంగళుని లోపంబౌన?చింతామణీ
    పేరాసన్ గురిజేయు భాగ్యములు,నావేశానగుర్తించకన్
    కారాగారమె|”నుంచుకొన్న దనుచున్సంకల్పాన నౌధార్యమున్
    ధారాదత్తముసేయు సంపదలు”|కాంతా దాసులే పూరుషుల్. {చింతామణి నాటకమునందున భావన}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగుంది.
      మూడవపాదమ్లో 'కారాగారమె యంచు' అనవలసి ఉంటుంది. ఆ పాదంలో గణదోషం. 'కారాగారమె యుంచుకొన్నదని సంకల్పాన నౌదార్యమున్' అంటే?

      తొలగించండి
  15. కారే రాజులు సంపదల్ కలుగవే కానిం డనెన్ దైత్యుడున్
    నీరైనన్ తనకంచు దాచుకొనడే నిర్లిప్తు డా రంతియున్
    మీరే దిక్కనగా దధీచి యిడడే మేనున్, పరబ్రహ్మకున్,
    ధారాదత్తము సేయ సంపదల కాంతా! దాసులే పూరుషుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారు నమస్సులు. చక్కటి పూరణ. దధీచి మహర్షి యింద్రున కిస్తాడు కాబట్టి "బలారాతికిన్" అంటే బాగుంటుందేమో!

      తొలగించండి
    2. మిస్సన్న గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
      కామేశ్వర రావు గారి సూచన స్వీకరింపదగినది.

      తొలగించండి
  16. ఈ రక్షస్సుడు నీకు నింత నలుసా యింతీ నినున్ గోరినన్
    లేరే కాంతలు నప్సరో గణములున్ లేమా ననున్ గూడగా
    చేరన్ రమ్మిక నన్ని వైభవములున్ సీతా త్వదీయార్థమే
    ధారాదత్తము సేయ సంపదల కాంతాదాసులే పూరుషుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇంత యలుసా..' అనండి.

      తొలగించండి

  17. తారా జువ్వల నాడి బోవగను ముద్దారన్ప్రియంబై యనెన్
    "ఓరాజా బిగి సేయ మాకు ! విను, పూబోణీపదంబుల్గనన్
    ధారాదత్తము సేయ సంపదల, కాంతాదాసులే పూరుషుల్,
    రారా రాజకుమార రమ్మిటన నారామంబుగావించ రా" !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      'సేయమాకు' అనడం గ్రామ్యం. రెండవ పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  18. ధారాళమ్ముగ వ్రాతనేర్చె నుదుటన్ దద్ధాత వాణీశుఁడై
    సారగ్రీవుడు శక్తినందె లయకున్ శర్వాణి భాగ్యమ్మునన్
    పారావారమునన్ జనించి సిరి సర్వాధారుడౌశౌరికిన్
    దారాదత్తము సేయ సంపదల, కాంతాదాసులే పూరుషుల్!

    రిప్లయితొలగించండి
  19. ఆరాటమ్మున మానవుండతడు నిద్రాహారముల్ మానుచున్
    బోరాటమ్మునుజేయు, భాగ్యములనే బొందంగ తానెంతయో ,
    యే రీతిన్ మనసొప్పునో సిరుల దానెవ్వారికోయిచ్చుచున్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్ ?

    చేరన్ రమ్మని పిల్చినంత నిలలో స్త్రీ లోలురౌ మానవుల్
    వారస్త్రీలను జేరు కాముకులు పాపంబంచు యోచింపకన్
    నేరాలెన్నియొ జేసి పొందిన సిరుల్ నిర్లజ్జగా వారికీన్
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్


    రిప్లయితొలగించండి
  20. నా నిన్నటిపూరణ కూడా గమనించ ప్రార్థన
    సారమ్మౌ బ్రతుకున్ గొనంగ సతమున్ సంతోష పెట్టన్ వలెన్
    నారీరత్నము నిశ్చయమ్ముగను, భిన్నంబైన సంసారపున్
    పారావారము నీద సాధ్యమగునా? స్వాతమ్మునన్ శాంతికై
    ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్

    రిప్లయితొలగించండి
  21. Paaraavaaramu chat beramunakai baaranga aangleyule
    Daaraa raajyamulella dochaganai naraakaaradhoorthaaliyai
    Poaraataala kahisamanthra magute poojyambayen bhaarathin
    Daaraa dattamu Seya sampadalu kaanthaa! Cassie poorushul?

    రిప్లయితొలగించండి
  22. Paaraavaaramu dati beramunakai baaranga aangleyule
    Daaraa raajyamulella dochaganai naraakaaradhoorthaaliyai
    Poaraataala kahisamanthra magute poojyambayen bhaarathin
    Daaraa dattamu Seya sampadalu kaanthaa! Raquel poorushul?

    రిప్లయితొలగించండి
  23. Paaraavaaramu dati beramunakai baaranga aangleyule
    Raaraa raajyamulella doachaga naraakaaradhoorthaaliyai
    Poaraataala kahisa mantra magute poojyambayen bhaarathin
    Daaraa dattamu Seya sampadalu kaanthaa! Daasulei poorushul?

    రిప్లయితొలగించండి
  24. Paaraavaaramu dati beramunakai baaranga aangleyule
    Raaraa raajyamulella dochaga naraakaaradhoorthaaliyai
    Poaraataala kahimsa mantra magute poojyambayen bhaarathin
    Daaraa dattamu Seya sampadalu kaanthaa! Daasulei poorushul?

    రిప్లయితొలగించండి
  25. పిట్టా సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'నరాకార ధూర్తాళియై' అన్నచోట గణదోషం. 'నారాకారంపు ధూర్తాళియై' అందామా?
    మీ పూరణ నాల్గు సార్లు ఎందుకు వచ్చింది?

    రిప్లయితొలగించండి
  26. ఆర్యా అది నా టాబ్ పెట్టిన చిక్కు అది పాత తప్పునే ప్రకటించడం వల్ల అలా జరిగిందండీ.నిజమే మీ సవరణకై కతజ్ఞతలు.Wisdom lies in council.

    రిప్లయితొలగించండి
  27. నరునకదృష్టము లేనిది
    కరమరుదుగ గలుగదెంత కష్టించిన యా
    వరసరస భాగ్యశాలికి
    మరుభూమిని దొరుకుగాదె మాణిక్యంబుల్

    రిప్లయితొలగించండి

  28. ఔరా! నీ విటువంటి తప్పునిట వ్రాయంగన్ మహాపాపమౌ:👇
    "ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్"...
    గారాబంబున కండ్లు మూసుకొనుచున్ కారుణ్య భావంబుతో
    దారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్ :)

    రిప్లయితొలగించండి