2, ఆగస్టు 2016, మంగళవారం

సమస్య - 2104 (సమరశూరులు చీమల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

సమరశూరులు చీమలఁ జంపువారు.

78 కామెంట్‌లు:

  1. రణము నందున ప్రాణము పణము బెట్టి
    ఛాతి విరుచుకు నిలుతురు ఖ్యాతి కొఱకు
    సమరశూరులు,చీమలఁ జంపు వారు
    చిన్న తనమున పసివారి చేష్ట లనగ

    రిప్లయితొలగించండి
  2. యుద్ధరంగమ్మునెవ్వరు ముద్దులాడు
    మరి గమాక్సిను దేనిని మట్టు బెట్టు
    హంతకులనగ నెవ్వరు చింతఁ జేయ
    సమరశూరులు, చీమలఁ, జంపువారు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  3. అసురుల తుదముట్టింతురు అసలు సిసలు
    సమరశూరులు, చీమలఁ జంపువారు
    పిరికి వారలు, వాటిని పీకనొక్కి
    జంపి శూరుల మందురు చక్క గాను !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'ముట్టింతురు+అసలు' అన్నపుడు సంధి నిత్యం. 'ముట్టించెద రసలు సిసలు..' అనండి.

      తొలగించండి
  4. పామునైనను జంపెడి పట్టుగలవి
    కష్ట నష్టాల కోర్చెడి నిష్ట యున్న
    సమర శూరులు చీమలు|జంపువారు
    పామరులు,సోమరులు,పిల్ల,పాపలకట|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కత్తి నరచేత బట్టుచు కదన రంగ
      మందు యుద్ధము నొనరింతు రవని యందు
      సమరశూరులు;చీమల జంపు వారు
      పసిడి ప్రాయాన నున్నట్టి బాలురకట.

      తొలగించండి

  5. శ్రీగురుభ్యోనమః

    రెండు వర్గము లెంచగ నుండె నిచట
    విషపు పాముల కోరలు పెరకువారు
    సమరశూరులు, చీమలఁ జంపువారు
    భీతి నొందుచు బ్రతికెడు పిరికివారు.

    రిప్లయితొలగించండి
  6. నిన్నటి నా పూరణను చూడ గోరుతాను, ధన్యవాదములు.

    చేరన్ వచ్చిన యామె ప్రేమ యెదలో స్వీకారమున్నంద నా
    నారీ రత్నపు యావదాస్తికిని తా నాథుండయై యుండగా
    ఏ రీతిన్ సుగుణాల రాశి ప్రియమౌ! యేణాక్షియుం గూడుకన్
    ధారా దత్తము సేయ సంపదలు కాంతా దాసులే పూరుషుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      '..గూడుకన్'..?

      తొలగించండి
    2. గూ(కూ)డుకన్ = తో కూడా., అన్నట్లుగా వ్రాశాను. ఇలా కాకుండా , 'ఏణాక్షియుం గూడుకన్ ' బదులుగా 'ఏణాక్షికిన్ తోడుగా' అని మార్చితే బాగుంటుందా? తెలుప కోరుతాను. ధన్యవాదములు.

      తొలగించండి
    3. కూడుకన్ అన్న ప్రయోగం నాకు క్రొత్తగా (కొంత వింతగా) ఉంది. 'తోడుగా' అనడం బాగున్నది.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "కూడికన్" అని యనవచ్చునేమో?

      తొలగించండి
  7. యుద్ద రంగాణనిలబడి యుర్విలోన
    సమర మొనర్చివీరులచంపువారు
    సమర శూరులు, చీమల చంపువారు
    వీరులమనుచుబల్కుటవింత గాదె

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులు!

    [మున్ను తన తండ్రినిఁ జంపిన చలిచీమలపైఁ బగఁదీర్చుకొనుటకై సర్పవీరులనుఁ బంపుచు సర్పరాజు పలికిన మాటలు]

    "మున్ను మా తండ్రిఁ జలిచీమ లెన్నొ చంపి,
    నను ననాథగాఁ జేసెఁ గాన, నిఁక మీరు
    వానిఁ జంపంగఁ బోపొండు వడివడిగను!

    సమర శూరులు చీమలఁ జంపువారు!!"

    రిప్లయితొలగించండి
  9. ప్రాణమెన్నగ తృణమను బంటులెవరు?
    వేని నాదర్శ మనిపల్కు విజ్ఞులెల్ల?
    కటిక వృత్తిని చేపట్టు కర్ములెవరు?
    సమరశూరులు,చీమల,జంపువారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. అమరులౌదురు చచ్చియు ననవరతము
    సమరశూరులు, చీమలఁజంపువారు
    తరుణుల కడకేగి వదరు పిరికి వారు
    దురమునందున తప్పుకు తిరుగు చుంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. సాహసోపేత విక్రమ బాహుబలులు
    సమరశూరులు,చీమలజంపువారు
    పాపపున్నెంబులెఱుగని పూపలైన
    చిన్మయాత్ములు,నిర్గుణ చిత్తులకట!

    రిప్లయితొలగించండి
  12. శాః సారమ్మౌ బ్రతుకున్ గొనంగ సతమున్ సంతోష పెట్టన్ వలెన్
    నారీరత్నము నిశ్చయమ్ముగను, భిన్నంబైన సంసారపున్
    పారావారము నీద సాధ్యమగునా? స్వాతమ్మునన్ శాంతికై
    ధారాదత్తము సేయ సంపదలు కాంతా! దాసులే పూరుషుల్

    రిప్లయితొలగించండి
  13. ధర్మపత్నిని బోషింప దానవీరు
    లోనమాలను నేర్చిన జ్ఞానధీరు
    లౌర! కలికాల మిద్దాని నరయు డిచట
    సమరశూరులు చీమల జంపువారు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  14. గండు చీమలబారులీ మండపమున
    నిండి యుండెను ధైర్యమే మండనముగ
    రండు యోచింపు డెట్టులో ఖండనంబు
    సమరశూరులు చీమల జంపువారు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. భీమ కాయులు నరిబలాభేద్య వరులు
    రాజ సన్మాన కీర్తి విరాజితులును
    సమరశూరులు చీ! మలఁ జంపువారు
    పాఱ భీతిలి సిగ్గిఁడి భావ్య మౌనె

    [మలఁ జంపువారు = కొండను సహితము నాశనము చేయగలవారు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. అర్జు నుండును భీముడు నరయ మిగుల
    సమర శూరులు, చీమల జంపు వారు
    నభము శుభమును దెలియని యాకతాయి
    పిల్లలు సరదా యనుచును నుల్లసిల్లు

    రిప్లయితొలగించండి
  17. భారతాహవమందున వాయుసూను
    డమిత బలశాలి,యర్జును డతిరథుండు
    కౌరవానుజులు పిపీలికము లనంగ
    సమరశూరులు చీమల జంపువారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. అక్రమంబుగ సరిహద్దు నాక్రమించి

    వచ్చు శత్రువు నెదిరించి పార ద్రోలు

    సమర శూరులు; చీమల జంపు వారు

    చిన్న తనమందు పిల్లలు చిలిపి గాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పూర్వార్ధంలో కొంత అన్వయలోపం.

      తొలగించండి
    2. శంకరయ్య గారూ !
      నమస్సులు.శత్రువును పార ద్రోలు వారు
      సమర శూరులు అనే అర్ధంలో వ్రాశాను.

      తొలగించండి
    3. శంకరయ్య గారూ !
      నమస్సులు.శత్రువును పార ద్రోలు వారు
      సమర శూరులు అనే అర్ధంలో వ్రాశాను.

      తొలగించండి
  19. మిన్ను విరిగి మీదబడిన చెన్నుతోడ
    వెన్ను జూపక రణమందు నున్నవారు
    సమరశూరులు ,చీమలజంపువారు
    వాతరాయణుల్ కాకున్న బాలురకట!!!

    వాతరాయణులు= పిచ్చివారు

    రిప్లయితొలగించండి
  20. భార్యకొక కోక గొన్నట్టి భర్త నెవడు
    దాత యనుచును పొగడరీ ధరణి యందు
    సమర శూరులు చీమల జంపు వారు
    కారు సింహాల బంధించు వారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వెన్నుజూపక దామరి వీరులకును
      సింహ స్వప్నమై ధైర్యమున్ జెలగు వారు
      సమరశూరులు, చీమల జంపువారు
      పంచదారనమ్ముకొనెడు వర్తకుండ్రు

      తొలగించండి
    3. విరించి గారూ,
      పంచదార వర్తకులమీద మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో 'దామరి'?

      తొలగించండి
    4. విరించి గారూ,
      మొదటి పద్యము చివరి పాదము చివరి గణము తగ్గినది

      తొలగించండి
  21. ఒక సాధారణ గృహిణి ఆవేదన:

    వంటకమ్ముల వంటింట పట్టి చుట్టి
    పాడు చీమలు విసిగించు పగలు రేయి
    దాచఁ గాదమ్మ నాచేతఁ దాళుటెట్లు?
    సమరశూరులు చీమలఁ జంపు వారు!

    రిప్లయితొలగించండి
  22. జాతి రక్షణ కొరకంచు శత్రువులను
    కదన రంగాన దునుమాడ గదలు వారు
    సమర శూరులు, చీమల జంపు వారు
    భార్య గొట్టెడు వారిలవ్యర్థు లంద్రు

    రిప్లయితొలగించండి
  23. నిన్నటి పూరణ:
    ధారాళమ్ముగ వ్రాతనేర్చె నుదుటన్ దద్ధాత వాణీశుఁడై
    సారగ్రీవుడు శక్తినందె లయకున్ శర్వాణి భాగ్యమ్మునన్
    పారావారమునన్ జనించి సిరి సర్వాధారుడౌశౌరికిన్
    దారాదత్తము సేయ సంపదల, కాంతాదాసులే పూరుషుల్!

    రిప్లయితొలగించండి
  24. హిట్టు, లక్ష్మణరేఖయు చుట్టు జల్లు
    నా గమాక్సిను లెవ్వార లబ్బి! చెప్పు
    మనిన గురువున కొకఛాత్రు డాడెనిట్లు
    సమరశూరులు, చీమల జంపువారు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { యుధ్ధవీరులను చ౦పు వారిని సమరవీరులు
    అని అ౦దురు ; మరి , దుడ్డు కర్ర దెబ్బలతో
    చీమలను చ౦పు వారిని ఏమ౦దురు ? ? }
    ………………………………………………………

    ఆయుధా ధర యోధాళి నాహవమున

    నిట్టె , సమయి౦పగల ధీరు లెవ్వ రనగ =

    సమర శూరులు || చీమల చ౦పు వార

    లదియు , ద౦డ ఘాతములతో నదిమి చ౦పు

    వారు = మూర్ఖులు , భీరకుల్ వసుధ లోన

    ……………………………………………………

    { సమయి౦పగల = చ౦ప గల ; ద౦డ ఘాతములతో = దుడ్డు కర్ర దెబ్బలతో ;
    భీరకులు = పిరికి వారు ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆయుధ ధర' అని కదా సమాసం. 'ఆయుధ ధరులు యోధాళి...' అందామా?

      తొలగించండి
  26. వెతల యందైన ధైర్యము వీడ బోరు
    సమర శూరులు! చీమల జంపు వారు
    యతిగ వగచెడు నవివేకు లగుదురిలను!
    పిఱికి తనమునకును మారు పేరు వీరె!
    సవరించిన నా నిన్నటి పూరణ. గురువు గారికి మరియు సుకవులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.
    చేరన్ వచ్చిన యామె ప్రేమ యెదలో స్వీకారమున్నంద నా
    నారీ రత్నపు యావదాస్తికిని తా నాథుండయై యుండగా
    ఏ రీతిన్ సుగుణాల రాశి ప్రియమౌ! యేణాక్షికిన్ తోడుగా
    ధారా దత్తము సేయ సంపదలు కాంతా దాసులే పూరుషుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ నేటి పూరణ బాగున్నది.
      'వారు+అతిగ' అన్నపుడు యడాగమం రాదు.'వార। లతిగ...' అనండి.
      ఇక నిన్నటి పూరణ బాగున్నది. అభినందనలు.
      'నాథుండునై యుండగా... ప్రియమౌ నేణాక్షికిన్...' అనండి.

      తొలగించండి
  27. పైన పోస్ట్ చేశాను.చూడలేదనుకొని మరల పోస్ట్ చేస్తున్నాను.
    కత్తి నరచేత బట్టుచు కదన రంగ
    మందు యుద్ధము నొనరింతు రవని యందు
    సమరశూరులు;చీమల జంపు వారు
    పసిడి ప్రాయాన నున్నట్టి బాలలకట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీరు ఈశ్వరప్ప గారి పూరణ క్రింద ప్రత్యుత్తరంలో మీ పూరణను పోస్ట్ చేశారు. అందువల్ల నేను చూడలేదు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. దుష్టులంబ్రతిఘటనలో దునుమువారు
    ప్రాణములనొడ్డి నీతిగాపాడు ఘనులు
    గాలిలో కత్తి ద్రిప్పెడి కల్లబొల్లి
    వీరవరులు ఉత్తరు సఖుల్ వివరమరయ
    సమరశూరులు;చీమల జంపు వారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీరవరులు+ఉత్తరు' అని విసంధిగా వ్రాయరాదు కదా! 'వీరవరులు నుత్తరసఖుల్..' అనండి.

      తొలగించండి
  29. ప్రాణములు లెక్కసేయక బవరమందు
    అరులనోడించి గెల్చెడి వీరులనగ
    సమరశూరులు; చీమల చంపు
    చిరుతప్రాయపు కూనలు చిన్నవారు

    రిప్లయితొలగించండి
  30. ఇంద్రగంటి మధు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'బవరమందు+అరుల' అని విసంధిగా వ్రాయరాదు. రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. 'బవరమందు। వైరుల నెదిర్చి గెల్చెడి...' అనండి.

    రిప్లయితొలగించండి
  31. గురువర్యా! వృత్తిరీత్యా నేను ఆంగ్ల ఉపాధ్యాయుడను. తెలుగుపద్యముపై మక్కువతో వ్రాస్తున్నాను. ఇలాగే మీరు నా పద్యములను పరిశీలించి సరియగు సలహాలను ఇవ్వవలసినదిగా కోరుకొనుచున్నాను. ధన్యవాదములతో..ఇంద్రగంటి మధు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధు గారూ,
      ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు మీకు బంధువా? వారి మనుమరాలు శైలజ గారు వరంగల్లులో సంస్కృత లెక్చరర్‍గా పనిచేసేవారు. తరువాత హైదరాబాదులో భవాన్స్ స్కూలులో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయారు.ఆ తరువాత వారి వివరాలు తెలియవు.

      తొలగించండి
  32. ప్రాణములు తృణమనుచునె పణమువెట్టి
    దుష్టులను జంప తృటిలోన దుముకు వారు
    సమరశూరులు ; చీమలఁ జంపువారు
    వెన్న , చక్కెర తిన దాచు కున్నవారు

    రిప్లయితొలగించండి
  33. లవుడు కుశులార, నాపేరు లక్ష్మణుండు
    హయము విడువుడు కోరనాహవము నిపుడు
    కారు సరిజోదులే నాకు, కారు మీరు
    సమరశూరులు, చీమల జంపు వారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లవుడు కుశులార' అనడమే బాగున్నట్టు లేదు. 'లవకుశాఖ్యులారా! నేను లక్ష్మణుడను' అందామా?

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.
      సవరణతో....

      లవకుశాఖ్యులారా! నేను లక్ష్మణుడను'
      హయము విడువుడు కోరనాహవము నిపుడు
      కారు సరిజోదులే నాకు, కారు మీరు
      సమరశూరులు, చీమల జంపు వారు.

      తొలగించండి
  34. శాంతి యుక్తమ్ముగ ప్రజలు సంతసమున
    పండుగందున గుమికూడి వరలు చుండ
    కాల్చ జలియను వాలను గర్వముగను...
    సమరశూరులు చీమలఁ జంపువారు

    రిప్లయితొలగించండి