17, ఆగస్టు 2016, బుధవారం

సమస్య - 2118 (భగణంబున గురువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భగణంబున గురువు నాస్తి పండితులారా"
(దూరదర్శన్ వారి సమస్య)
"భగణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్"

79 కామెంట్‌లు:

  1. నిగమం బులెన్ని వ్రాసిన
    సుగమముగా నుండి నంత సురలే మెచ్చున్
    అగణిత కవనముల విఱుపు
    భగణంబున గురువు నాస్తి పండితు లారా

    రిప్లయితొలగించండి


  2. జగణ సగణ యగణ రగణ
    భగణంబున గురువు, నాస్తి పండితులారా
    నగణము నందు గురువు , ఆ
    తగణ మగణమందు గూడ తప్పక గురువే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జగణ...భగణంబుల' అని బహువచనం రావాలసి ఉంటుంది కదా! 'గురువు ఆ' అని విసంధిగా వ్రాశారు. అక్కడ సంధి నిత్యం. మీ పద్యాన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో?

      జగణ సగణ యగణములలో
      భగణంబున గురువు; నాస్తి పండితులారా
      నగణము నందును గురు; వా
      తగణ మగణ రగణములను తప్పక గురువే!

      తొలగించండి
  3. గగనం బంటిన కావ్యముల్ మనకు నేగంధర్వ పుణ్యంబహో
    యుగమం తన్వెలు గొందుచుం డెనుమ హాయోగ్యం బటంచున్ ధరన్
    భగవంతున్ కృపనొంది పల్కిరక టాభాగ్యం బుగాదో చినన్
    భగణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్

    రిప్లయితొలగించండి
  4. అగుపించవు శుభవేళలు
    జగమున వైవాహికాది సత్కర్మలకున్
    గగనం బందున గాంచుడు
    భగణంబున గురువు నాస్తి పండితులారా!
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  5. సొగసుల నిడు నాది గురువు
    భగణంబున! గురువు నాస్తి పండితులారా
    నగణము నందున! నన్నియు
    ను గురువులైన మగణ మగును మదిని దలపన్!

    రిప్లయితొలగించండి

  6. మైలవరపు మురళీకృష్ణ... వెంకటగిరి

    నిగనిగల దేహముల భ..
    ద్ర గజమ్ములు గుంపుగా నరణ్యమునన్ బో..
    వగ గమనించితిరొ ! మదే..
    భగణమ్మున గురువు నాస్తి పండితులారా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      మదేభగణముతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  7. వగిరించు బట్టఁ గట్టగ!
    పొగలడె యెంగిలి విదల్చ! పూటకు తినగన్
    దిగులౌ!నవ్వఁ గొరత! లో
    భ గణమ్మున గురువు నాస్తి పండితులారా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      లోభ గణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. అగణితమౌ వ్రత విధముల
    సుగమంబుగ వరలుచుండిసూత్రంబగుచున్
    సొగియుచు ప్రపత్తి నలరు శు
    భ గణమ్మున గురువు నాస్తి పండితులారా!

    రిప్లయితొలగించండి
  9. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    (1)

    భగవద్గీత పఠి౦పక

    భగవ౦తుని కరుణ నాస్తి పామరు లారా !

    భగవతి దయ బాసిన క్షో

    భ గణ౦బున గురువు నాస్తి ప౦డితు లారా !

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ( 2 )


    మగణ , రగణ , భగణ౦బున ,

    తగణ౦బున కాది గురువు తగు | కాని , తుదిన్

    నగణ౦బున , జగణ౦బున ,

    భగణ౦బున గురువు నాస్తి , ప౦డితు లారా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. ద్విగుణీభూత మదాతిరేకమున నిర్భీతిన్ సరాగాలతో
      "జగమే తామ'ని సంభ్రమించి యట గాసారమ్మునందేనుగుల్
      దిగగా నక్రము విక్రమించె , కరి బంధించంగ గాంచన్ మదే
      భగణమ్మందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినన్ జెప్పితిన్ !!

      తొలగించండి
    2. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ద్విగుణీభూత మదాతిరేకమున నిర్భీతిన్ సరాగాలతో
      "జగమే తామ'ని సంభ్రమించి యట గాసారమ్మునందేనుగుల్
      దిగగా నక్రము విక్రమించె , కరి బంధించంగ గాంచన్ మదే
      భగణమ్మందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినన్ జెప్పితిన్ !!

      తొలగించండి
  11. గగనము నందున తారలు
    అగణిత సంఖ్యన గలవని యాముని దెలుపన్;
    మగతన శిష్యులు వెదుకగ
    భగణంబున గురువు నాస్తి పండితులారా

    (భగణము =నక్షత్రముల యొక్క సమూహము)
    (జ్యోతిష శాస్త్ర రీత్యా గురువు ఓ శుభ గ్రహం. గురు గ్రహానికి 3 స్వనక్షత్రాలు ఉన్నాయి. అవి పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు - ముని మాటలు విని వేకువ ఝామున గురుగ్రహమూ, ప్రక్కన ఉన్న నక్షత్రాలకై వెదుకగా అని కనపడలేదు శిష్యులకు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. తగ నాది గురువె యుండును
    భగణంబున; గురువు నాస్తి పండితులారా
    నగణమున; సర్వగురువై
    మగణము విలసిల్లునండి మాన్యులు వింటే!

    రిప్లయితొలగించండి
  13. పిట్టా సత్యనారాయణ గారి పూరణ...

    సగ సగపు యువక పద్దెము
    లగుపించును శిశువునడక లట్టులె కావే
    పగవారి బోలు. పాఠక.
    భగణంబున గురువు నాస్తిపండితులారా.

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులారా,
    మూలిగే నక్కపై తాటిపండు పడ్డదన్నట్లు అసలే జ్వరం తగ్గక బాధపడుతుంటే పైడిపెల్లిలో మా పిన్ని మరణించిందన్న వార్త ఇప్పుడే తెలిసింది. అస్వస్థతతోనే ఆ ఊరికి బయలుదేరుతున్నాను. తప్పదు.. మళ్ళీ ఏ రాత్రికి వస్తానో? అప్పటిదాక మీ పద్యాలను సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  15. సొగసుం గూడుక యుండు నాది గురువే శోభాతిరేకంబిడున్
    భగణంబందున! నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్
    నగణంబందున! నన్నియున్ గురువులై నాట్యంబు లాడించగన్
    మగణంబందున తేనెలం జిలుకు నా మాధుర్యముల్ నీవగున్!

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. గగనాంతర సీమ వర శు
      భగగ్రహామర గురుప్రభాకాయ విలా
      స గమన వికాస మానుడు
      భగణంబున గురువు నాస్తి పండితులారా
      [ భగణము = నక్షత్ర సమూహము]

      తొలగించండి
    2. జగతిం గూర్చు మనోహరమ్ములగు సంజాతార్థ పద్యావళుల్
      విగతార్థంబని చెప్ప నొప్పదు గదా వేధింప రాదేరికిన్
      ఖగరాజేశ్వర గామి యాన "న" గణా ఖ్యాతం బహర్బాంధ వా
      భ గణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మొదటి పూరణలోని ఏకసమాసంగా మూడు పాదాలను వ్రాసిన శబ్దసంపత్తిని, రెండవ పూరణలో భగణాన్ని నగణంగా మార్చిన నైపుణ్యాన్ని ఏమని ప్రశంసించను? అద్భుతమైన పూరణలు. అభినందనలు.
      చిన్న సందేహం... అహర్బాంధవ+అభ గణంబు.. అని పదవిభాగం చూస్తే అభ మంటే అశుభమని అర్థం కదా! సూర్యగణం అశుభగణం ఎలా అవుతుంది?

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “అభ” కాదు “ఆభ” అని సదృశమను భావములో వాడితిని. “అహర్బాంధవ+ఆభ” = అహర్బాంధవాభ - తత్సమము. “ఆభా” సంస్కృత పదము. సూర్యునితో సమానమని ('న’ గణము సూర్య గణమేకద) నా భావము.

      తొలగించండి
    5. మీ ఏకసమాస పూరణలు మనోఙ్ఞంగా ఉంటాయి .. జోహార్లు

      తొలగించండి
  17. నిగనిగమని మెరయు సభను
    అగణిత యశమందు నటులు నతిరధులున్నన్
    నిగమము దెల్పగ నిట్టి శు
    భ గణంబున గురువు నాస్తి పండితులారా!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సభను అగణిత.. అని విసంధిగా వ్రాశారు. 'నిగనిగమనుచు మెరయు సభ। నగణిత...' అనండి.

      తొలగించండి
  18. జగమున లయకారుడునై
    నగరాడజపుత్రి మనమున నటరాజై వే
    నగవులదొరదౌ ప్రమథ వి
    భగణంబున గురువు నాస్తి పండితులారా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      నగరాట్+అజపుత్రి...? అలాగే విభగణము..?

      తొలగించండి
  19. భగణంబున గురువుండగ
    భగణంబున గురువు నాస్తి పండితు లారా !
    జగమును గృడ్డిగ జేతురె
    తగునా నిటు మాటలాడ తప్పుడు పలుకుల్

    రిప్లయితొలగించండి
  20. జగములతల్లియు స్మరుడును
    ఖగపతియును జలజభవుడు గంగానదియున్
    నగపతియును సరసిజనా
    భ గణంబున గురువు నాస్తి పండితులారా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      పెద్ద లిస్టే ఇచ్చారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ.
      మీ పిన్ని గారి కార్యక్రమాలు జరిపించి వచ్చారా.

      తొలగించండి
    3. అవునండీ... ఇంటికి చేరి గంట అయింది. పద్యాలను సమీక్షిస్తుంటే మధ్యలో ఇంటర్నెట్ ఆగిపోయి మళ్ళి ఇప్పుడే కలిసింది.

      తొలగించండి
  21. . సగణంబున మొదటిగురువు
    తగణంబున మధ్య లఘువు తరచియు జూడన్?
    నగుపడున? నంత్య మందున
    భగణంబునగురువు నాస్తి పండితులారా {పండితవిద్యార్టులతరగతి గదిలోగురువుగారికందము}
    2.తగదీ లగ్నము జేయగ
    భగణంబున గురువునాస్తి|పండితులారా
    అగుపించదు గురుబలమిట
    తెగతెంపుగ శాస్త్రవేత్త దేల్చియుదెలిపెన్.
    3.సిగలో పువ్వులనవ్వులున్ నడుమ శాసించంగ నాభర్తయే
    రగిలే కోర్కెలవెన్నెలే దగిలి సర్వశ్వంబు నర్పించితిన్
    సగమై సాగితి శోభనాన గనగా సంధేహమే నింగిలో
    భగణం బందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్{విద్వాంసులయిన సహమిత్రులతోవధువు వల్లించినశోభనవిషయము} {భగణం=నక్షత్రాల సమూహం}గురువు=ఒకనక్షత్రం





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'తరచి కనినచో। నగుపడున...' అనండి.
      మూడవ పూరణలో 'రగిలే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ 'రగిలెన్' అన్నా అన్వయం కుదురుతుందనుకుంటాను.

      తొలగించండి
  22. జగముల్ మెచ్చెడు లక్ష్మి పత్ని సరసీ సంజాత సంజాతుడున్
    తగ ఘోరాఘములన్ దహించెడు మరుత్కల్లోలినీ సంతులున్
    ఖగరాడ్వాహనమున్ భుజంగ శయమున్ సారంగడున్ పద్మ నా
    భ గణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...కల్లోలినీ సంతులున్' అనడం సమాస దోషమే.

      తొలగించండి
    2. సంతు అన్నది సంస్కృత పదంగా కనిపించిన్దండీ ఆంధ్రభారతి లో

      తొలగించండి
    3. అవును గురువుగారూ నేను పొరబడ్డాను. సంతతి అనే సంస్కృత పదం నుంచి సంతు అనే పదం వచ్చింది అని ఉంది.

      తొలగించండి
    4. సంతతుల్ అనవచ్చునా లేక కల్లోలినీ తో కలపడం దోషం అంటారా

      తొలగించండి
  23. 'జగము' నగురువే లేదులె
    'ఖగపతి'యన గురువుగనము గణ విభజనలో
    'మగడు' న లేదుగా 'ప్రతి
    భ' గణంబున గురువు నాస్తి పండితులారా.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ప్రతిభ.. నగణం కనుక గురువు లేదంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  24. 'న'గణంబు లఘు సమూహము
    'మ'గణంబున గురువులుండు మనకై తలలో
    నగులాటకు కాక నెచట
    'భ'గణంబున గురువు నాస్తి పండితులారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాక యెచట..' అనండి.

      తొలగించండి
  25. జగతిన్ సంఘము లెన్నియో గలవు నిస్వార్థాను కూలంబుగన్
    తగు సేవాచరణంబొనర్చప్రజకున్ ధర్మాను బద్ధంబుగన్,
    నిగమంబుల్ చదివించు సద్గురువు లీనేలన్ సమాజంపు లో
    భ గణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. కం; "న "గణం బన సూర్య గణము,
    "న" గణం బది దైవగణము నందుడు గురువౌ
    "న"గణంబను జయమొసగెడు శు
    భ గణంబున ,గురువు నాస్తి పండితులారా
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  27. 1.కం:జగతిని కుపండితు డనియె
    భగణమ్మున గురువులేదు పండితులారా
    భగణమున నన్ని లఘువులె
    సగణమున గురువు లన్ని ఛందము నమరున్ ..

    రిప్లయితొలగించండి

  28. 1.కం:జగతిని కుపండితు డనియె
    భగణమ్మున గురువులేదు పండితులారా
    భగణమున నన్ని లఘువులె
    సగణమున గురువు లన్ని ఛందము నమరున్ ..

    రిప్లయితొలగించండి
  29. గగనంబున విహరించే
    ఖగ చయమునకున్,అడవిని గమియించెడి జం
    తు గమికిమదమున దిరుగు ఇ
    భ గణంబున గురువు నాస్తి పండితు లారా
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు వారూ,
      మీ పూరణ బాగుంది.
      'విహరించే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. చయమునకున్ + అడవిని అని విసంధిగా వ్రాశారు. 'గగనంబున విహరించెడి। ఖగచయమునకును వనమున గమియించెడి...' అనండి.

      తొలగించండి