18, ఆగస్టు 2010, బుధవారం

గళ్ళ నుడికట్టు - 0

శంకరాభరణం వీక్షకులకు ప్రణామాలు.
రెండు నెలలుగా నేను కొనసాగిస్తున్న "గళ్ళ నుడికట్టు" శీర్షికకు ప్రారంభంలో మంచి స్పందన వచ్చింది. మొదట్లో వారాని కొక గడి ఇవ్వాలనుకున్న నేను ఆ ప్రోత్సాహంతో రోజు కొక గడి ఇస్తూ వస్తున్నాను.
అయితే ఈ మధ్య రోజు రోజుకు గడిని పూరించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ నిన్నటికి సున్నాకు చేరింది. కారణం నాకు తెలియడం లేదు.
గడి పేలవంగా ఉంటున్నదా? కఠినంగా ఉంటున్నదా? గడి నిర్వహణలో ఏమైనా మార్పులు చేయాలా? మీ సలహాలు, సూచనలను కోరుతున్నాను. ఆ తరువాతే గడిని కొనసాగిస్తాను.
ఇన్ని రోజులుగా గడిని ఆదరించిన
కోడీహళ్ళి మురళీమోహన్,
భమిడిపాటి సూర్యలక్ష్మి,
నేదునూరి రాజేశ్వరి,
ప్రసీద,
విజయజ్యోతి,
రాకేశ్ తేలంగ్,
అజ్ఞాత (లలితా త్రిపుర సుందరి),
రాకేశ్,
వేణు
మొదలైన వారందరికీ ధన్యవాదాలు.

4 కామెంట్‌లు:

 1. మాస్టారూ,

  మేము గత నాలుగు రోజులుగా, చెన్నై వెళ్ళినందువలన గళ్ళనుడికట్టు పూర్తిచేసి పంపలేకపోయాను.మీరు మరీ ఇలా గళ్ళనుడికట్టు మానేస్తే, మాలాటివారు ఏమౌతారు చెప్పండి? మీరు పెట్టే గళ్ళనుడికట్టు వల్ల, మా భాషా పరిజ్ఞానం
  మరీ అంతకాకపోయినా, కొంతైనా పదును పెట్టుకుంటున్నాను. దయచేసి, ఆపకుండా, ప్రతీరోజూ ఇవ్వండి. తప్పో, ఒప్పో పూర్తిచేసి పంపిస్తాను.

  రిప్లయితొలగించండి
 2. శ్రీ శంకరయ్యగారికి నమస్కారం. నేను నిన్న ఒక ముఖ్యమైన మీటింగ్ కి వెళ్ళవలసి వచ్చి అసలు గడి పూర్తి చేసె సమయం దొర్కలేదు. రోజూ క్రమం తప్పకుండా గళ్ళ నుడికట్టు కూర్చడం ఎంతో శ్రమతో కూడిన పని. అయినా మీరు క్రమం తప్పకుండా ఎంతో ఓపికగా చేస్తున్నారు. సూర్యలక్ష్మి గారు చెప్పినట్టు, ఇది పూర్తి చెయ్యడం వల్ల మా అందరికీ భాషా జ్ఞానం పెరుగుతొంది. దయచేసి మీరు మానవద్దు. తప్పకుండా కొన్ని తప్పులున్నా సరే నేను పూర్తి చేసి పంపుతాను. మీకు రోజూ కూర్చడం ఎక్కువ పనిగా ఉంటే వారాని రెండు ఇవ్వండి.
  శుభాభినందనలతో
  సుభద్ర

  రిప్లయితొలగించండి
 3. శంకరయ్యగారూ మీ టపా ఇప్పుడే చూశాను. మీకు కొన్ని సూచనలివ్వదలిచాను. మీ గళ్ళనుడికట్టు మరీ కష్టంగా కాని, మరీ సులువుగా కానీ లేదు. ఇదే స్థాయిని కొనసాగించండి. మీ గడికి స్పందన రాలేదంటే దాని అర్థం అది పేలవంగా ఉందని అనుకోకండి. కొందరికి తీరుబాటు ఉండకపోవచ్చు. మరికొందరికి పూర్తిగా సమాధానాలు రాకపోయి పంపక పోవచ్చు. ఇక ఈ గళ్ళనుడికట్టును రోజూ కొనసాగించాలా లేక వారానికొకమారు ఇవ్వాలా అని నిర్ణయించుకోవలసింది మీరే. రోజూ కొనసాగించేటట్టయితే ఒక రోజు ఎవరూ స్పందించకపోతే దాని గడువును మరుసటి రోజుకు పెంచండి. అప్పటికీ ఎవరూ పూరించకపోతే అప్పుడు మీరు సమాధానాలివ్వండి. వారానికి రెండు సార్లు గళ్ళనుడి కట్టును ఇస్తే మూడురోజుల సమయం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పాల్గొనవచ్చు. ఎవరు స్పందించినా స్పందించకపోయినా మీ పని(రెగ్యులర్‌గా గళ్ళనుడికట్టును ఇవ్వడం) మీరు చేసుకుపోవడం ఉత్తమం :-))

  రిప్లయితొలగించండి
 4. నమస్కారములు శంకరయ్య గారు. ఈ రొజు గడి లేదను కుంటే బాధగా ఉంది. మీ గడి వల్ల తెలియనివి నిఘంటువు చుసి వెతికి తెలుసు కోవడం వలన ఎన్నొ పదాలకు అర్ధాలు తెలుస్తున్నాయి మీరు మానవద్దు. అసలు పజిల్ తయారు చేయడం చాలా కష్టం.గడి నెంబర్లు వేసి వ్యాఖ రాయడం ఇంకా కష్టం. ఒకప్పుడు నేను " విశ్వ రచన " అనే మాస పత్రికకి కొన్నాళ్ళు రాసి మానేసాను.ఇప్పుడు అన్ని మతి మరుపె.అసలు రొజు అనుకుంటాను తమరు ప్రతి రోజు ఇంత శ్రమ ఎలా పడుతున్నారని ? రొజు కాక పోయినా రోజు విడిచి రోజు ఇవ్వగలరని మనవి

  రిప్లయితొలగించండి