చిన్నా గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీరు గద్యరూపంలో వెలిబుచ్చిన భావానికి పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీలైతే రేపు ఉదయం పోస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.
రవి గారూ, మంచి సందర్భంతో పూరణ చేసారు. అభినందనలు. నాకు తెలిసినంత వరకు "అన్నులమిన్న" శబ్దాన్ని స్త్రీ పరంగా వాడతారు. మీ పద్యంలో మొదటి పాదాన్ని "పిన్నవాడ ననక వీరత్వముం జూపి" అని సవరిస్తే ఎలా ఉంటుంది?
నేదునూరి రాజేశ్వరి గారూ, పద్యం బాగుంది. అభినందనలుల్. మూడవ పాదంలో "వంచకుల పూజించి" అన్నచోట గణదోషం, విపరీతార్థం ఉన్నాయి. దానిని "వంచకుల త్యజించి" అంటే బాగుంటుందేమో!
పిన్న వాఁడ నీవుఁ యన్నుల మిన్నవు
రిప్లయితొలగించండిక్రూర రక్కసులను పోరు సల్పి
జంపి వైచి మఖము సలుపెఁడు గొప్ప తా
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!
srishti loni ea jeeviki nyunyata ledani
రిప్లయితొలగించండిelugetti chate mana sanskriti .yogyatha nanusarinchi;
paamu,nandi,kaalabhairava,mooshikambu,gajaaswambulu ,kesarityaadi pasula golchi mukthi badayumayya!
చిన్నా గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీరు గద్యరూపంలో వెలిబుచ్చిన భావానికి పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీలైతే రేపు ఉదయం పోస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.
రవి గారూ,
రిప్లయితొలగించండిమంచి సందర్భంతో పూరణ చేసారు. అభినందనలు.
నాకు తెలిసినంత వరకు "అన్నులమిన్న" శబ్దాన్ని స్త్రీ పరంగా వాడతారు. మీ పద్యంలో మొదటి పాదాన్ని
"పిన్నవాడ ననక వీరత్వముం జూపి" అని సవరిస్తే ఎలా ఉంటుంది?
మంచి యన్న నేమి మానవత్వ మొకింత
రిప్లయితొలగించండియెంచి చూడ జనుల కాంచ లేము.
కంచె చేను మేయ వంచకుల పూజించి
పసుల గొల్చి ముక్తి బడయు మయ్య
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలుల్. మూడవ పాదంలో "వంచకుల పూజించి" అన్నచోట గణదోషం, విపరీతార్థం ఉన్నాయి. దానిని "వంచకుల త్యజించి" అంటే బాగుంటుందేమో!
dhanya vaadamulu + august 15 SubhA kaamkshalu
రిప్లయితొలగించండిచిన్నా గారి వ్యాఖ్యకు పద్యరూపం ......
రిప్లయితొలగించండిసృష్టిలోని యెట్టి జీవికి న్యూనతఁ
గనని సంస్కృతి గల ఘనత మనది
పాము, నంది, కాలభైరవాశ్వాదుల
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!
నా పూరణ ......
రిప్లయితొలగించండిఈతిబాధ లంది యెటులొ యీ సంసార
జీవనమ్ముఁ గడిపి తీవు; జ్ఞాన
ధనులు, నీతిబోధ ఘనముగాఁ జేయు తా
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!
ఆల మందలన్న నవి దేశ భాగ్యమ్ము
రిప్లయితొలగించండిగోవు తల్లి వలెను గొప్ప గాదె !
మురళి లోలు డధిక ముచ్చట గాగాచు
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య !!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండినిరత తపము చేత, నిశ్చల భక్తితో,
రిప్లయితొలగించండిధ్యానమందు, నిత్య యాగమందు,
పరమపురుష నామ పఠనంబుజేయు తా
పసుల గొల్చి ముక్తి బడయుమయ్య.